వైఎస్‌ యాత్ర మొదలు | Mammootty to play YSR in his biopic | Sakshi
Sakshi News home page

వైఎస్‌ యాత్ర మొదలు

Published Thu, Mar 22 2018 12:13 AM | Last Updated on Sat, Jul 7 2018 3:00 PM

Mammootty to play YSR in his biopic - Sakshi

మమ్ముట్టి

మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాన్ని సిల్వర్‌ స్క్రీన్‌పై చూడబోతున్నాం. జనరంజక పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత జీవిత విశేషాలను ఆవిష్కరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఏంగా ప్రజలకు వైఎస్సార్‌ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. అభిమానుల గుండెల్లో ‘రాజన్న’గా నిలిచిపోయిన ఆ మహానేత జీవితాన్ని మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించనున్నారు.

‘పాఠశాల’ వంటి కాలేజ్‌ లవ్‌స్టోరీ తర్వాత రీసెంట్‌గా ‘ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మహీ వి.రాఘవ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ‘యాత్ర’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో వైఎస్‌ పాత్రలో మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి నటించనున్నారు.  ‘‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఎమోషనల్‌ కంటెంట్‌గా ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం’’ అని విజయ్‌ చిల్లా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement