life story movie
-
నేతాజీ జీవిత రహస్యాలతో...
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించి మీరు ఎప్పుడూ వినని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. అందుకే మొదటి టీజర్‌ని నేతాజీ విగ్రహం వద్ద విడుదల చేయాలనుకున్నాం. ఇక్కడ టీజర్‌ను విడుదల చేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నాం. నేతాజీ జీవితంపై సాగే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం ఇది’’ అన్నారు నిఖిల్. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితంలోని రహస్యాల ఆధారంగా రూపొందిన చిత్రం ‘స్పై’. నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర రిలీజ్ చేశారు. నేతాజీ మరణం తాలూకు మిస్టరీని ఛేదించే స్పై పాత్రలో నిఖిల్ కనిపిస్తారు. ఐశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలుగా, ప్రత్యేక పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించనున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్. -
వినాయకుడి గెటప్లోని ఈ నటుడెవరో మీకు తెలుసా?
Sri Vinayaka Vijayam Movie: కొన్ని సినిమాలు ఎప్పటికీ వన్నెతరగవు. అందుకే బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రజెంట్ చేసినా వ్యూయర్స్ ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పండుగల లాంటి టైంలో వీటి ప్రత్యేకత ఏంటో జనాలకు తెలిసి వస్తుంది కూడా. అలాంటి సినిమాల్లో ‘శ్రీ వినాయక విజయం’ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది మళ్లీ టెలికాస్ట్ ప్రొమో రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పూర్తి స్థాయిలో గణేషుడి కథను చూపిస్తూ తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘శ్రీ వినాయక విజయం’(1979). ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వినాయకుని జన్మ వృత్తాంతం చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ‘ఎవరవయ్యా.. ఎవరవయ్యా’ అంటూ సాగే గానం.. దేవులపల్లి రచన, సాలూరి స్వరాలు, సుశీలమ్మ పాడిన పాట ఇప్పటికీ పండపూట టీవీల్లో మారుమోగుతుంటుంది. అయితే ఆ వినాయకుడి గెటప్‌లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరంటూ? గూగుల్‌ను ఆశ్రయించడంతో సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. శ్రీ వినాయక విజయం చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో బాల గణేషుడిగా కనిపించింది బేబీ లక్ష్మి సుధా. ఆ తర్వాత ఏనుగు తల గెటప్‌తోనూ కాసేపు ఈ చిన్నారి అలరించింది. ఇక పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో నటించింది ఎంజీవీ మదన్‌గోపాల్ అనే ఆర్టిస్ట్. ఈయన గురించి పూర్తి సమాచారం, ఫొటో గురించి .. వెతకాలని ప్రయత్నిస్తున్నారు చాలామంది. కానీ, ఎలాంటి సమాచారం దొరకడం లేదు. అలా చాలా మంది వెతకడం వల్ల వినాయక విజయం మూవీ గూగుల్ ద్వారా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. చదవండి: ‘తండ్రి ఎవరు?’.. ఫైర్ అయిన హీరోయిన్ -
‘పీఎం మోదీ’పై స్టేకు నో
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ’సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండానే విడుదలపై స్టే ఇవ్వాలని కోరడం తగదంది. ఇక ఈ సినిమా విడుదల విషయంలో ఎలక్షన్ కమిషన్‌ను ఆశ్రయించమని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. ఒకవేళ ఈ సినిమాలో బీజేపీకి అనుకూలించే అంశాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ బయోపిక్ విడుదలను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్త పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ జరుపుతున్న క్రమంలో మోదీ బయోపిక్‌లో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. సదరు సన్నివేశాల వీడియో క్లిప్పింగులను తమ ముందుంచాలని కోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. ఈ వీడియోలను ప్రవేశపెట్టడంలో పిటిషనర్ విఫలమయ్యారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేవలం రెండు నిమిషాల ట్రైలర్‌ను చూసి సినిమా విడుదలను నిలిపివేయాలని కోరడం తగదని వ్యాఖ్యానించింది. -
వైఎస్ యాత్ర మొదలు
-
వైఎస్ యాత్ర మొదలు
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం. జనరంజక పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత జీవిత విశేషాలను ఆవిష్కరించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఏంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి. అభిమానుల గుండెల్లో ‘రాజన్న’గా నిలిచిపోయిన ఆ మహానేత జీవితాన్ని మహీ వి. రాఘవ్ తెరకెక్కించనున్నారు. ‘పాఠశాల’ వంటి కాలేజ్ లవ్‌స్టోరీ తర్వాత రీసెంట్గా ‘ఆనందో బ్రహ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ‘యాత్ర’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించనున్నారు. ‘‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ చిత్రాల తర్వాత మా బ్యానర్లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యాత్ర’. వైఎస్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఎమోషనల్ కంటెంట్‌గా ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం’’ అని విజయ్ చిల్లా తెలిపారు. -
మలాల జీవిత కథ సినిమా
గుల్ మకయ్ 1997లో ఏ ముహూర్తాన మలాల జన్మించినదో కాని ఆమె జీవిత కథ ఎన్నో మలుపులు తిరిగి ప్రపంచానికి ఆసక్తి గొలుపుతూనే ఉంది. పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రాంతానికి చెందిన, అఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న స్వాత్ లోయలో పుట్టి పెరిగిన ‘మలాల యూసఫ్‌జాయ్’ తన తండ్రి జియావుద్దీన్ అధ్యాపకుడైన కారణంగా చదువు మీద ఆసక్తి పెంచుకుంది. ఆడపిల్లలు చదువుకోవాలి అని భావించిన జియావుద్దీన్ మలాల చదువును ప్రోత్సహించాడు. అయితే మలాలాకు పద్నాలుగు పదిహేనేళ్ల వయసు ప్రాంతంలో అంటే 2010– 2012 కాలంలో స్వాత్ లోయ తాలిబన్ల ఆధిక్యం కిందకు వచ్చింది. తాలిబన్లు స్త్రీల విద్యను నిరసించారు. నిషేధించారు. గర్ల్స్ హైస్కూల్స్‌ను బాంబులతో పేల్చి భీతావహ పరిస్థితులు సృష్టించారు. అయినప్పటికీ మలాల బాలికల చదువు కోసం గొంతెత్తింది. తాలిబన్ తూటాలకు ఎదురు నిలిచి పోరాడింది. అంతకు ముందే ఆమె బి.బి.సి వారు ఉర్దూ బ్లాగ్‌లో స్వాత్ లోయలో బాలికల పరిస్థితుల పై ‘గుల్ మకయ్’ అనే కలం పేరుతో ఎన్నో వ్యాసాలు వెలువరించింది. ఆ తర్వాత ఆమె మీద డాక్యుమెంటరీ వచ్చింది. ‘ఇక్కడ చదవడానికి పుస్తకాలు లేకపోవడం నాకు విసుగు పుట్టిస్తోంది’ అనే వ్యాఖ్య ఆ డాక్యుమెంటరీలో ఆమె చేసింది. మలాల, ఆమె తండ్రి జియావుద్దీన్ తాలిబన్ల దృష్టిలో పడ్డారు. కొంతకాలం పెషావర్‌కు వెళ్లి శరణు పొంది పాక్ మిలటరీ పై చేయి సాధించిందనుకున్నాక స్వాత్ లోయకు తిరిగి వచ్చారు. అప్పటికీ మలాల పై తాలిబన్ల కోపం తీరలేదు. 2012 అక్టోబర్ 9న స్కూల్ నుంచి తిరిగి వస్తున్న ఆమె బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ మలాల తలలో దూసుకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె బతికి బయట పడి ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో బాలికల విద్య కోసం ప్రపంచ దేశాలలో ఎలా పని చేస్తున్నదో అందరికీ తెలుసు. నోబెల్ శాంతి పురస్కారం వంటి సర్వోన్నత పురస్కారం పొందడం అంత చిన్న వయసులో మలాల సాధించిన ఘనత. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న మలాల జీవిత కథ ఇంత వరకూ వెండి తెర మీదకు రాలేదు. ఆ ప్రయత్నాన్ని బాలీవుడ్ సాఫల్యం చేస్తోంది. ‘గుల్ మకయ్’ పేరుతో మలాల జీవిత కథను వెండితెరకెక్కించింది. ఇండియన్ బుల్లితెర మీద గుర్తింపు పొందిన నటి ‘రీమ్ షేక్’ మలాల పాత్రను పోషిస్తోంది. పారలల్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు పొందిన అంజాద్ ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే సగం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమాలో దివంగత నటుడు ఓంపురి ఒక పాట కూడా పాడారు. నటి దివ్యాదత్తా మలాలకు తల్లిగా ఈ సినిమాలో కనిపిస్తారు. మొత్తం మీద ఈ సినిమా భారతీయులనే కాక ప్రపంచ ప్రేక్షకులను కూడా కుతూహలపరిచే అవకాశం ఉంది. -
తెరపైకి రోజా బయోగ్రఫీ?
ప్రముఖ నటి, ఆంధ్రప్రదేశ్, నగిరి శాసన సభ్యురాలు రోజా జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే బదులు సినీవర్గాల నుంచి వస్తుండడం విశేషం. రోజా నట జీవితం కానీవ్వండి, రాజకీయ జీవితం కానీవ్వండి సంచలనాల మయం. ఈ రెండింటిలోనూ రోజా అంచలంచెలుగా కాదు వేగంగానే ఎదిగారు. అందుకు పడిన శ్రమ, చేసిన పోరాటాలు చాలానే. రోజా ప్రముఖ కథానాయకిగా తమిళం, తెలుగు భాషల్లో అనేక విజయాలను సాధించారు. అగ్రకథానాయకిగా వెలుగొందుతుండగానే రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ రంగంలోనూ ప్రజాసమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రముఖ నాయకురాలుగా ఎదిగారు. ప్రస్తుతం వైఎస్ఆర్ పార్టీ నేతగా నగరి ఎంఎల్ఏగా ప్రజావాణిని శాసనసభలో వినిపిస్తున్నారు. అలాంటి రోజా వ్యక్తిగత జీవితం ఆసక్తికరమే. చంబరుతి చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోనూ, ప్రేమతపస్సు చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోనూ నాయకిగా అడుగు పెట్టి ప్రేమ ఇతివృత్తంగా రూపొందిన ఈ రెండు చిత్రాల్లోనూ తనదైన శైలిలో నటనను ప్రదర్శించి విమర్శకులు సైతం మెప్పించారు. తన తొలి తమిళ చిత్ర దర్శకుడు ఆర్కే.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా అన్ని కోణాల్లోనూ తనదైన ముద్ర వేసుకుని విజయాలను సొంతం చేసుకున్న రోజా జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుందనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది.అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన లేదన్నది గమనార్హం.