గుట్టకు చేరిన జనచైతన్య యాత్ర | comming to janachaithanya yaathra in gutta | Sakshi
Sakshi News home page

గుట్టకు చేరిన జనచైతన్య యాత్ర

Published Thu, Sep 8 2016 2:37 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

గుట్టకు చేరిన జనచైతన్య యాత్ర

గుట్టకు చేరిన జనచైతన్య యాత్ర

యాదగిరిగుట్ట : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లాని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరాభిమాని డి.మహేష్‌ గత నెల 20న ప్రభుత్వ పథకాలపై చేపట్టిన జన చైతన్య యాత్ర బుధవారం యాదగిరిగుట్ట పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఆయనకు ప్రభుత్వ విప్‌ మద్దతు ప్రకటించి మాట్లాడారు. మహేష్‌కు ఒకచేయి లేకున్నా.. ఎడమ చేతితో బైక్‌ నడుపుకుంటూ పథకాలను ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. జన చైతన్య యాత్ర కన్వీనర్‌ మహేష్‌ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో 10 జిల్లాలు బైక్‌పై యాత్ర చేశానని,  ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను వివరించడానికి యాత్ర ప్రారంభించానని, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలు పర్యటించి యాదగిరిగుట్టకు వచ్చినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement