gutta
-
ఆ వృత్తం.. ఓ వి‘చిత్రం’!
అది ఏడున్నర మీటర్ల వ్యాసంతో ఉన్న భారీ వృత్తం.. ఎక్కడా వంకరటింకరగా లేకుండా వృత్తలేఖినితో గీసినట్టు కచ్చితమైన రూపం.. పెద్ద బండరాయి మీద 30 అంగుళాల మందంతో చెక్కటంతో అది ఏర్పడింది.. కానీ అది ఇప్పటిది కాదు, దాదాపు 3 వేల ఏళ్ల నాటిది కావడం విశేషం. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర శివారు ప్రాంతాల్లో కొన్ని గుట్టల్లో ఆదిమానవులు గీసిన రంగుల చిత్రాలు నేటికీ కనిపిస్తాయి. కానీ వాటికి భిన్నంగా ఇప్పుడు గుట్ట పరుపుబండ మీద ఆదిమానవులు చెక్కిన పెద్ద వృత్తం (జియోగ్లిఫ్) చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది. మేడ్చల్ సమీపంలోని మూడు చింతలపల్లి శివారులోని గుట్ట మీద ఇది వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు కె.గోపాల్, మహ్మద్ నజీరుద్దీన్, అన్వర్ బాష, అహోబిలం కరుణాకర్‌లు ఇచ్చిన సమాచారం మేరకు చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆ బృందంతో కలసి దాన్ని పరిశీలించారు. ‘తక్కువ ఎత్తున్న గుట్ట పరుపుబండపై ఈ వృత్తం చెక్కి ఉంది. ఏడున్నర మీటర్ల వ్యాసంతో భారీగా ఉన్న ఈ వృత్తం మధ్యలో రెండు త్రిభుజాకార రేఖా చిత్రాలను కూడా చెక్కారు. అంత పెద్దగా ఉన్నప్పటీకీ వంకరటింకరలు లేకుండా ఉండటం విశేషం. దీనికి సమీపంలో కొత్త రాతియుగం రాతి గొడ్డళ్లు నూరిన గాడులు (గ్రూవ్స్) ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ తరహా చెక్కిన రేఖా చిత్రం వెలుగుచూడకపోవటంతో దీనిపై మరింతగా పరిశోధించాల్సి ఉంది’అని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. సమాధి నమూనా అయ్యుండొచ్చు.. ఈ చిత్రం ఇనుప యుగానికి చెందిందిగా భావిస్తున్నాం. అప్పట్లో మానవుల సమాధుల చుట్టూ వృత్తాకారంలో పెద్ద రాళ్ల వరుసను ఏర్పాటు చేసేవారు. ఆ సమాధి నిర్మాణానికి నమూనాగా ఈ వృత్తాన్ని గీసి ఉంటారన్నది మా ప్రాథమిక అంచనా. గతంలో కర్ణాటకలో ఇలాంటి చిత్రం కనపించింది. దాని మధ్యలో చనిపోయిన మనిషి ఉన్నట్లు చిత్రించి ఉంది. ఈ చిత్రాన్ని మరింత పరిశోధిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. – రవి కొరిశెట్టార్, పురావస్తు నిపుణుడు -
జ్వాల సెకండ్ ఇన్నింగ్స్
భారత డబుల్స్ కోచ్ బాధ్యతలు న్యూఢిల్లీ: దేశంలో బ్యాడ్మింటన్ క్రీడను మరింతగా అభివృద్ధి చేసేందుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కొత్త అడుగు వేసింది. సీనియర్, జూనియర్ విభాగాలతో పాటు సింగిల్స్, డబుల్స్ కేటగిరీలకూ ప్రత్యేకంగా కోచ్‌లను నియమించింది. సీనియర్ స్థాయిలో పురుషుల సింగిల్స్‌కు దేశంలోని వివిధ జోన్ల నుంచి కొత్తగా 19మంది కోచ్‌లను ఎంపిక చేసిన ‘బాయ్’... డబుల్స్ విభాగంలో 12 మందిని నియమించింది. వీరితో పాటు మహిళల డబుల్స్‌కూ నలుగురు కోచ్‌లను ప్రకటించింది. వీరంతా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో పనిచేస్తారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో మహిళల డబుల్స్ విభాగంలో ఎన్నో ఘనతలను సాధించిన హైదరాబాద్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మహిళల డబుల్స్ కోచ్‌గా ఎంపికయ్యారు. జ్వాలతో పాటు మధుమిత బిస్త్, ప్రద్యా్న గాద్రె, ఓలి డెకా మహిళా డబుల్స్ షట్లర్లకు శిక్షణనిస్తారు. కొత్తగా కోచ్ పదవి దక్కించుకున్న వారిలో భారత మాజీ క్రీడాకారులు అరవింద్, అనూప్ శ్రీధర్, చేతన్ ఆనంద్, దీపాంకర్ భట్టాచార్జి పురుషుల సింగిల్స్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. డబుల్స్ విభాగంలో అక్షయ్ దివాల్కర్, అరుణ్ విష్ణు, థామస్, రూపేశ్ కుమార్‌లతో పాటు విజయ్‌దీప్ సింగ్, ఉదయ్ పవార్ కోచ్‌లుగా ఉంటారు. కోచ్‌లతో పాటు ‘బాయ్’ ఏర్పాటు చేసిన సలహాదారుల బృందంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్ఎం ఆరిఫ్‌కు చోటు దక్కింది. ఆరిఫ్‌తో పాటు ఈ బృందలో సంజీవ్ సచ్దేవ్, రోషన్ లాల్ నహర్, గంగూలీ ప్రసాద్ ఉంటారు. జూనియర్ స్థాయిలోనూ ‘బాయ్’ 21 మంది పురుషులు, 10మంది మహిళా కోచ్‌లను నియమించింది. ఇందులో హైదరాబా ద్‌కు చెందిన గోవర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ ఆటగాడు జేబీఎస్ విద్యాధర్ కూడా ఉన్నారు. -
గుట్టకు చేరిన జనచైతన్య యాత్ర
యాదగిరిగుట్ట : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను యువత ప్రజల్లోకి తీసుకెళ్లాని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని డి.మహేష్ గత నెల 20న ప్రభుత్వ పథకాలపై చేపట్టిన జన చైతన్య యాత్ర బుధవారం యాదగిరిగుట్ట పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఆయనకు ప్రభుత్వ విప్ మద్దతు ప్రకటించి మాట్లాడారు. మహేష్‌కు ఒకచేయి లేకున్నా.. ఎడమ చేతితో బైక్ నడుపుకుంటూ పథకాలను ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. జన చైతన్య యాత్ర కన్వీనర్ మహేష్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో 10 జిల్లాలు బైక్‌పై యాత్ర చేశానని, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను వివరించడానికి యాత్ర ప్రారంభించానని, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలు పర్యటించి యాదగిరిగుట్టకు వచ్చినట్లు తెలిపారు. -
'బీజేపీకి ఓటేస్తే మురిగిపోయినట్టే'
-
సెప్టెంబర్ 7న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు జ్వాలా గుత్తా (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి) మమ్ముట్టి (నటుడు), రాధికా ఆప్టే (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య. పుట్టిన తేదీ 7. ఇది కేతుసంఖ్య. వీరిపై వచ్చే బర్త్‌డే వరకు శుక్ర, కేతు గ్రహాల ప్రభావం ఉంటుంది. వీరికి మంచి వాక్చాతుర్యం ఉండటం వల్ల వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. విదేశాలలో చదువు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి, రచయితలకు, బోధన రంగంలో ఉన్న వారికి, విలాస వస్తువుల విక్రయ వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేయాలన్న కోరిక తీరుతుంది. సంతాన వృద్ధి కలుగుతుంది. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి జీతాలలో వృద్ధి, ఉద్యోగరీత్యా ఫారిన్ ఛాన్స్ ఉంటుంది. పిల్లల విద్యా వివాహాల సందర్భంగా ఆడంబరాలకు పోయి అధికంగా ఖర్చు పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు పరిమితి పాటించడం అవ సరం. కుటుంబ బాధ్యతలు మీదపడతాయి. లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, బ్లూ, క్రీమ్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మానసా దేవిని ఆరాధించడం, శక్తి ఉన్న వారు భృగు పాశుపత హోమం చేయించుకోవడం, అనాథ బాలికలకు ఆర్థిక సహాయం చేయటం, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
కూర్మావతారంగా ‘గుట్ట’
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రూపురేఖలు మరో రెండు మూడేళ్లలో పూర్తిగా మారిపోనున్నాయి. దీనికి సంబంధించిన ఊహాచిత్రాన్ని ఆలయం అధికారులు విడుదల చేశారు. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో కొండ గుట్టను చదును చేసి నాలుగు అంత్రాలు(వరుసలు)గా ఏర్పాటు చేయనున్నారు. ఒక అంత్రంలో కార్యాలయాలు, మరో అంత్రంలో భక్తుల వసతి గదులు, మూడో అంత్రంలో పూర్తిగా గర్భాలయం, నాలుగో అంత్రంలో గ్రీనరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్కిటెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక గుట్ట చుట్టూ నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. కొండపైన గర్భాలయం చుట్టూ ప్రాకారం ఉండి 4 మాడ వీధులు 4 రాజ గోపురాలతో అలరారేలా అధికారులు, స్థపతులు మోడల్ తయారు చేస్తున్నారు. ఆలయాన్ని సైతం విస్తీర్ణం పెంచి స్వామివారి నిత్యకల్యాణంలో సుమారు వెయ్యిమంది కూర్చునే విధంగా తయారుచేయాలని సీఎం ఆదేశించారు. లోపల ఉన్న గర్భాలయాన్ని ముట్టుకోకుండా స్వయంభూవు మూర్తులకు పైన ఉన్న విమాన గోపురాన్ని తీయకుండా విస్తీర్ణం చేసే దిశగా ఆలయ స్థపతులు సుందర్రాజన్ కృషి చేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే గుట్ట వ్యూ పూర్తిగా కూర్మావతారంగా (తాబేలు) మాదిరిగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ పనులు మరో రెండు నెలల్లో ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. కొండపైన గల దుకాణాలన్నీ ఒకే సముదాయంలోకి వచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ అభివృద్ధికి సుమారు 2000 ఎకరాలు అవసరం ఉన్నప్పటికీ దేవస్థానం పరిధిలో 1000 ఎకరాలు మాత్రమే ఉందని, మిగతా స్థలం సేకరణ మాత్రం 22 లోగా పూర్తిగా చేసి త్వరలో మాస్టర్‌ప్లాన్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాలని సీఎం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని సమాచారం. ‘గుట్ట’ భూసేకరణకు కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: యాదగిరి గుట్ట ఆలయాభివృద్ధికి భూములను సేకరించేందుకు నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఓ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భువనగిరి ఆర్డీవో, స్థానిక తహశీల్దార్‌ను సభ్యులుగా నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.జి గోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.