లోకం చుట్టిన వీరులు...118 కోట్లు
పర్యాటకం ఎందరికో ఓ అనుభూతి. అవకాశం చిక్కాలే గానీ ఓ ట్రిప్ వేసేద్దాం గురూ..అంటూ కొందరు పిల్లా,జల్లను వెంటేసుకు దేశాలు తిరిగితే..ఇంకొందరు అధ్యయనమే మహాభాగ్యమంటూ కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతుంటారు. విశేషాలను ప్రోదిచేసుకొని ట్రావలోకంలో విహరిస్తారు. కొత్తకొత్త విశేషాలను తెలుసుకొని ఆహో ప్రపంచమెంత అద్భుతం అంటూ మురిసి పోతుంటారు. ఈ సరదా అన్ని దేశాల్లోనూ సహజమే అయినా అమెరికన్లకు, యూరప్ ,తదితర దేశాల వారికి టూరిజం అంటే భలే మోజట.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టురాయుళ్ల లెక్కలను యునెటైడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నిగ్గుతేల్చింది. దేశాల్ని చుట్టే పర్యాటకుల సంఖ్య 2014తో పోలిస్తే 2015లో 4.4శాతం పెరిగిందట. ఇలా గతేడాది అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 118 కోట్లుగా నమోదైందట.