
ఆరునెలలుగా దాదాపు ఇంటికి పరిమితమైన సెలబ్రిటీలందరూ ఇప్పుడిప్పుడే కాలు బయటపెడుతున్నారు. కొంతమంది షూటింగ్స్‌లో పాల్గొంటుండగా మరికొందరు విహార యాత్రలకు వెళుతున్నారు. హీరోయిన్ తాప్సీ మాల్దీవులు వెళ్లిన విషయం తెలిసిందే. తన చెల్లెలు షగున్, వేరే స్నేహితులతో కలసి వెళ్లారామె. అయితే ఇంకో ముఖ్యమైన వ్యక్తి కూడా వెళ్లారని తాప్సీ షేర్ చేసిన ఫొటోలు స్పష్టం చేశాయి. ఆ వ్యక్తి మతియాస్ బో. డెన్మార్క్‌కి చెందిన ఈ బ్యాడ్‌మింటన్ క్రీడాకారుడితో తాప్సీ ప్రేమలో ఉన్నారనే వార్తలు కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. సో.. ఇది తాప్సీకి స్పెషల్ ట్రిప్ అని చెప్పొచ్చు. అయితే మతియాస్‌తో తన రిలేషన్ గురించి తాప్సీ పెదవి విప్పడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment