తిరువనంతపురం: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. గత బుధవారమే విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరింది. ఈ విజయం తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్.. కేరళ, తిరువనంతపురంలోని పౌర్ణమికవు-భద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్ని అమ్మవారికి ప్రార్థనలు చేశారు.
#WATCH | Kerala: ISRO chief S Somanath offers prayers at Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram. pic.twitter.com/8MjqllHeYb
— ANI (@ANI) August 27, 2023
'చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించగల సామర్థ్యాన్ని మనకు ఉంది. అంతరిక్ష రంగం ఇంకా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందాలి.. అదే మా లక్ష్యం. ప్రధాని మోదీ అందించిన దార్శనికతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం' అని సోమనాథ్ అన్నారు.
బుదవారం భారతదేశ అంతరిక్షయాన చరిత్రలో లిఖించతగ్గ రోజుగా మారింది. చంద్రునిపై కాలుమోపిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా రికార్డ్ సృష్టించాం. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై కాలు మోపిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్‌గా కూడా పేరుపెట్టారు ప్రధాని మోదీ.
చంద్రయాన్–3 విజయవంతం కావడంతో జోరుమీదున్న భారత అంతరిక్ష అధ్యయన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. సౌర వాతావరణం అధ్యయనానికి ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని మరో వారం రోజుల్లో పంపడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment