కోటను చూడ్డానికివచ్చి... | Couple fall to their death while having sex at a French castle | Sakshi
Sakshi News home page

కోటను చూడ్డానికివచ్చి...

Published Sun, Aug 23 2015 3:46 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

Couple fall to their death while having sex at a French castle

ఫ్రాన్స్: ఫ్రాన్స్లోని చారిత్రాత్మక కోట ను చూడ్డానికి వచ్చిన ఓ జంట దుర్మరణం చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్ లో ప్రసిద్ధి చెందిన వాబెన్  కోటను చూడటానికి ఓ జంట అక్కడికి వచ్చింది.  కోటను చూసే క్రమంలో వారు నాలుగో అంతస్తుకు వెళ్లారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ మరునాడు ఉదయం ఇద్దరి శవాలునీటిలో తేలాయి.   సుమారు నలభై అడుగుల ఎత్తుమీదినుంచి పక్కనే ఉన్న కొలనులో పడి ఉండటంతోనే వారు మరణించి ఉండవచ్చనే అనుమానిస్తున్నారు.

దీనితో ఆ జంటకు సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరికీ ముప్పయి  సంవత్సరాల లోపు వయసుంటుదని భావిస్తున్నారు.ఆంగ్లేయుల దాడినుంచి రక్షించుకునేందుకు వీలుగా 1866లో నెపోలియన్ -3  ఈ కోటను నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement