castle
-
అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?
చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న రాజుల కాలం నాటి ఎన్నో ప్రసిద్ద కోటల గురించి కథకథలుగా విన్నాం. కొన్ని కోటలు మిస్టరీగా ఉండి లోనివి వెళ్లేందుకు భయంకరంగా ఉన్న వింత కట్టడాలను చూశాం. ఆనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీని ఎంతో మెచ్చుకుని సంబరిపడ్డాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా కోట మాదిరి ఓ ఆధునాతన కట్టడం మన ముందుక రానుంది. అయితే దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో వింటే షాకవ్వుతారు. ఎక్కడంటే..?చుట్టూ కొలను, కొలను మధ్యలో కోట– చూడటానికి వింతగా ఉంది కదూ! పోలండ్‌లో ఉన్న ఈ రాతికోట పురాతన కట్టడమేమీ కాదు, అత్యంత అధునాతన కట్టడం. పశ్చిమ పోలండ్‌లో ఉన్న నాటెకా అడవి శివార్లలో ఉన్న కొలనులో కృత్రిమ దీవిని నిర్మించి, ఆ దీవిపై ఈ రాతికోట నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. ‘స్టోబ్నిసా క్యాజిల్’ పేరుతో చేపట్టిన ఈ కోట నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. దీని నిర్వాహకులు ప్రస్తుతం కోట పరిసరాలను తిలకించడానికి పర్యాటకులకు టికెట్లు అమ్ముతున్నారు. ఒక్కో టికెట్టు ధర 5.90 పౌండ్లు (రూ.650) మాత్రమే!(చదవండి: ఈ ఆకులను ఎప్పుడైనా చూశారా..? మసిపూసినంత నల్లగా..!) -
మా ఆయన బంగారం! విడాకులిస్తాడనుకుంటే.. రూ. 5 కోట్ల విలువైన కోటను గిఫ్ట్‌గా ఇచ్చాడు!
Woman thought husband wanted a divorce: మన జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించకుండానే హఠాత్తుగా జరిగిపోతుంటాయి. అంతేగాదు అవి ఒక్కోసారి మనకు మంచి ఆనందాన్నిఇస్తే మరికొన్ని సంఘటనలు చేదు అనుభవాన్ని మిగులుస్తాయి. ఐతే మన అనుకున్న వాళ్లు చిన్న మాట అనగానే అపార్థం చేసుకుని అభద్రత భావానికి గురవుతాం. కానీ వాళ్లు మన మంచికోరే వాళ్లని చాలా ఆలస్యంగా తెలుసుకుంటాం. అచ్చం అలానే స్పెయిన్‌కి చెందిన ఒక మహిళతో తన భర్త హఠాత్తుగా ఒక విషయం గురించి సీరియస్‌గా మాట్లాడాల్సి ఉందనంగానే ఆమె దారుణంగా ఊహించుకుని భయపడింది. భర్త ఊహించని సర్ఫ్రైజ్ ఇవ్వడంతో ఒక్కసారిగా కళ్లు తిరిగినంతపనైంది. (చదవండి: అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!!) అసలు విషయంలోకెళ్తే...స్పెయిన్‌కి చెందిన టెర్రీ ఎడ్గెల్ అతని భార్య జూడ్ తాము సెలవుల్లో హాయిగా గడిపేందుకు ఒక మంచి ఇల్లు కోసం వెతుకుతున్నారు. ఐతే టెర్రీ ఎడ్గెల్ తన భార్య జూడ్కి కౌబ్రిడ్జ్ వేల్ ఆఫ్ గ్లామోర్గాన్ సమీపంలోని 200 ఏళ్ల పెన్లిన్ కోటలో నివశించాలనేది చిన్ననాటి కల. అందుకోసం ఆమెకు తెలియకుండా వేలంలో రూ. 5 కోట్లకు ఆ కోటను కొన్నాడు. అంతేకాదు ఆమెను ఆ కోటకు తీసుకువెళ్లి సర్ఫ్రైజ్ చేయాలనుకున్నాడు. ఈ మేరకు టెర్రీ ఎడ్గెల్ ఒకరోజు తన భార్యను పిలిచి నీతో చాలా సీరియస్ ఒక విషయం గురించి మాట్లాడాలని చెబుతాడు. దీంతో భర్త తనను వదిలించేసుకోవాలనుకుంటున్నాడు, బహుశా విడాకులు ఇచ్చేస్తాడేమో! అందుకోసమే ఇలా అంటున్నాడని భయపడుతుంది. ఐతే ఆమెకు ఇష్టమైన కోట దగ్గరికి తీసుకువెళ్లి జరిగిన విషయమంతా చెబుతాడు. అంతే! ఒక్కసారిగా ఆమె షాక్‌కి గురై ఎగిరిగంతేసింది. ఈ మేరకు జూడ్ తాను చాలా భయపడ్డానని, కళ్లు తిరిగినంత పనయ్యిందని అంటోంది. ప్రస్తుతం తనకు చాలా ఆనందంగా ఉందని. పైగా తనకు 25 ఏళ్లు ఉన్నప్పుడూ ఇలాంటి ఇల్లు కావాలని అనుకున్నట్లు మీడియాకు చెప్పుకొచ్చింది. అయితే ఫారెస్ట్ గ్రూప్ సీఈవో అయిన టెర్రీ చాలా బిజీగా ఉండటంతో ఆ కోట పునరుద్ధరణ పనులన్నీ జూడ్ దగ్గరుండి చూసుకుంటుంది. అంతేకాదు ఆమె సైట్ మేనేజర్, స్పెషలిస్ట్ కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్, ఆర్కియాలజిస్ట్, హెరిటేజ్ స్పెషలిస్టులు, ఇంజనీర్‌తో సహా స్పెషలిస్ట్ ట్రేడ్ వర్కర్ల బృందాన్ని ఏర్పాటు చేసి ఆ కోటను సరికొత్త హంగులతో తీర్చి దిద్దేందుకు సమయాత్తవుతోంది జూడ్. ఈ మేరకు ఆ కోటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మూడేళ్లు పడుతుందని, 2024 కల్లా ఆ కోటలోకి ప్రవేశించాలని ఎదురుచూస్తున్నట్టు ఆ జంట చెబుతోంది. (చదవండి: డేటింగ్ యాప్‌లో పరిచయం.. మత్తిచ్చి చంపి తినేశాడు!) -
యుద్దం సమయంలో వారిని అక్కడే దాచారు
విజయనగరం : మెంటాడ మండలంలోని ఆండ్ర గ్రామం వద్ద ఉన్న కోట చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. బొబ్బిలి రాజ్యానికి సమీపంలో ఉన్న సంస్థానం ఆండ్ర రాజ్యం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆండ్రకోట ఇప్పుడు సందర్శనీయ స్థలంగా మారింది. మెంటాడ, పాచిపెంట, విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలాలకు చెందిన సుమారు 28 గ్రామాలకు ఆండ్ర కోట సంస్థానంగా ఉండేది. ఇక్కడి కోటను 308 ఏళ్ల కిందట 1713వ సంవత్సరం జనవరి 18న నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆండ్ర సంస్థానాదీశులు విజయనగరం రాజులకు విధేయులుగా ఉండేవారు. విజయనగరం యుద్ధం జరిగిన సమయంలో విజయనగరం రాజులు వారసులను ఆండ్ర సంస్థానంలో దాచి ఉంచారట. ఆండ్ర తొలి సంస్థానాధీశుడిగా గుమ్మిడి పెదరామందొర ఉండేవారు. కాలక్రమేణా గారం దొర, గార ప్రతాప్‌రాజు, రామప్రతాప్రాజు, బహుదూర్ హరహర ప్రతాపరాజులు కొనసాగారు. ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్న ఆండ్ర బాబా వారసులుగా ఉన్నట్లు సమాచారం. కోట గత వైభవాన్ని కోల్పోతోందని, పురావస్తుశాఖ దృష్టి సారించి కోటకు పూర్వవైభవాన్ని తీసుకురావాలని సందర్శకులు కోరుతన్నారు. -
‘ఆ కోట కింద రూ. 11,617 కోట్ల సంపద’
సాక్షి, న్యూఢిల్లీ : రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా యూరప్ వ్యాప్తంగా నాజీలు దోచుకున్న 28 టన్నుల బంగారం, ఇతర సంపదను 16వ శతాబ్ధానికి చెందిన జర్మన్ కోటలో పాతిపెట్టినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ నిధి విలువ 1.25 బిలియన్ యుకె పౌండ్ల(రూ.11,617 కోట్లకు పైగా)ని అంచనా వేశారు. నాజీ ఆర్మీ అధికారి ఎస్ఎస్ స్టాండార్టెన్‌ఫ్యూరర్ ఎగాన్ ఒల్లెన్‌హౌర్ డైరీలో పేర్కొన్న 11 ప్రదేశాలలో ఆధునిక పోలాండ్‌లో ఉన్న హోచ్బర్గ్ ప్యాలెస్ ఈ నిక్షేపాలను దాచిన వాటిలో కీలకమని వెల్లడైంది. ఈ డైరీని గత ఏడాదే పరిశోధకులు గుర్తించినట్టు స్పుత్నిక్ న్యూస్ వెల్లడించింది. జర్మన్ నగరం బ్రెలూ నుంచి కొల్లగొట్టిన రూ. 7,000 కోట్లకు పైగా విలువైన రిచెస్‌బ్యాంక్ గోల్డ్ బార్లు, ఇతర సంపదను ఈ కోట కింద దాచిఉంచవచ్చని ఈ డైరీని స్వాధీనం చేసుకున్న సిలెసియన్ బ్రిడ్జి ఫౌండేషన్ పేర్కొంది. కాగా ఈ డైరీని గత ఏడాది పోలాండ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అందచేశామని, ప్రభుత్వం ఇంకా దాన్ని పరిశీలించలేదని ఫౌండేషన్ చీఫ్ రోమన్ ఫర్మనియక్ వెల్లడించారు. నిధుల వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో ఈ అంశాలను ఫౌండేషన్ ప్రజల ముందుంచుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నిధి కోసం తవ్వకాలు చేపట్టడం, వెలికితీత సాధ్యమయ్యే పనికాదు. ఈ కోట ప్రస్తుత యజమాని నిధుల వెలికితీతకు అనుమతించారని, దోపిడీ దొంగల కన్నుపడకుండా కోట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాలను అమర్చారని ఫౌండేషన్ వెల్లడించింది. నిధుల్లో బంగారమే కాకుండా మత చిహ్నాలు, పోలండ్, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్, బెల్జియం దేశాల నుంచి నాజీలు లూటీ చేసిన విలువైన వస్తువులను దాదాపు 11 ప్రాంతాల్లో దాచినట్టు ఈ డైరీలో వెల్లడైంది. చదవండి : సంక్షోభంలోనూ పెట్టుబడులకు చాన్స్ -
ప్రేమ గాయం చేసింది.. అతను మాత్రం..
ప్రేమ తన మనసుకు గాయం చేసినా.. అతను మాత్రం ప్రేమే ఊపిరిగా బ్రతికాడు. తనను కాదన్న ప్రియురాలి మీద పగ పెంచుకోకుండా.. తన ప్రేమ ఎంత గొప్పదో ఆమెకే కాదు.. మొత్తం ప్రపంచానికే చాటి చెప్పాడు. తను ఒక్కడే కొన్ని సుదీర్ఘమైన సంవత్సరాలు.. రాత్రి,పగలు అని తేడా లేకుండా ఎంతో ఇష్టంతో ప్రేమ కోటను నిర్మించాడు. ఆ ప్రేమ చిహ్నమే ‘‘కోరల్ కాసిల్’’. కోరల్ కాసిల్ వద్ద ఎడ్వర్డ్ లీడ్స్ స్కెల్నిన్(ఫైల్) ప్రేమకు గుర్తుగా 28 సంవత్సరాలు.. యూరప్‌లోని లాట్వియాన్కు చెందిన ఎడ్వర్డ్ లీడ్స్ స్కెల్నిన్కు ఆగ్నెస్ స్కఫ్ అనే యువతితో తన 26 ఏట పెళ్లి నిశ్చయమైంది. ఇక అప్పటినుంచి ఆగ్నెస్ అంటే ఎడ్వర్డ్‌కు చెప్పలేని ప్రేమ మొదలైంది. ఆమెను తన దాన్ని చేసుకునే రోజు కోసం వెయ్యికళ్లతో ఎదురుచూడటం మొదలుపెట్టాడు. పెళ్లికి ఒక రోజు మాత్రమే ఉందనగా ఓ విషాదమైన వార్త అతడి చెవినపడింది. ఆగ్నెస్ కంటే తను వయసులో చాలా పెద్దవాడైన కారణంగా ఆమె పెళ్లి వద్దనుకుందని తెలిసి తల్లడిల్లిపోయాడు. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి తనని కాదనే సరికి తట్టుకోలేకపోయాడు. ఆమెను ఊహల్లోనుంచి చెరిపేయలేకపోయాడు. కోరల్ కాసిల్ నిర్మాణం కోసం రాళ్లు తరలిస్తున్న ఎడ్వర్డ్(ఫైల్) ఆ తర్వాత కొద్దిరోజులకు యూరప్ వదిలి అమెరికాలోని ఫ్లోరిడాకు వచ్చి స్థిరపడ్డాడు. నెలలు గడుస్తున్నా ఆమెను మర్చిపోలేకపోయాడు. తన ప్రేమకు గుర్తుగా ఏదైనా చేద్దామనుకున్నాడు. అప్పుడే ప్రేమ కోటను నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. 1923 సంవత్సరంలో కోట పనులను ప్రారంభించి దాదాపు 28 సంవత్సరాలు కష్టపడ్డాడు. అన్ని సంవత్సరాల కష్టానికి ప్రతిఫలంగా ఓ అందమైన కోట రూపుదిద్దుకుంది. ఎడ్వర్డ్.. టన్నుల బరువైన సున్నపురాయిని అవసరమైన రీతిలో చెక్కుతూ ఈ కోటను నిర్మించాడు. రాళ్లతోటే కుర్చీలు, పాన్పులు, సింహాసనాలు, బాత్‌టబ్, అర్థ చంద్రకార ఆకృతుల వంటి వాటిని కూడా తయారుచేశాడు. కిడ్నీలు పాడవటంతో ఎడ్వర్డ్ 1951లో 64ఏళ్ల వయస్సులో మరణించాడు. రహస్యాల ‘కోరల్ కాసిల్’ కోరల్ కాసిల్ నిర్మాణంపై, ఎడ్వర్డ్ లీడ్స్ స్కెల్నిన్పై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎడ్వర్డ్‌కు అతీత శక్తులు ఉన్నాయని, ఆ అద్భుత శక్తుల కారణంగానే కేవలం 5 అడుగుల ఎడ్వర్డ్ టన్నుల బరువైన రాళ్లను సుదూర తీరాలనుంచి తెచ్చి కోటను నిర్మించాడని కొంతమంది నమ్మకం. అతడు ఒంటరిగా రాత్రిళ్లు మాత్రమే కోట పనులు చేసేవాడని, తన అద్భుత శక్తులు బయటి ప్రపంచానికి తెలియకూడదన్న కారణంగానే అతడు రాత్రిని ఎన్నుకొన్నాడని, కోట నిర్మాణం సమయంలో అతడిని తప్ప వేరే వ్యక్తిని అక్కడ తాము చూడలేదని ముసలివాళ్లైన స్థానికులు చెబుతున్నారు. -
నిధుల కోసం కోటలో తవ్వకాలు పునఃప్రారంభం
చెన్నంపల్లి(తుగ్గలి) : గుప్త నిధుల కోసం తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలు రెండు నెలల విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పురాతన కోటలో విశేషంగా గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారంతో గతేడాది డిసెంబర్ 13న అధికారులు తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు తవ్వకాలు చేస్తూ జీఐఎస్ ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో వివిధ సర్వేలు నిర్వహించారు. తవ్వకాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 16న సీతారామ లక్ష్మణుడు పంచ లోహ విగ్రహాలు, పూజా సామగ్రి లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. లభ్యమైన విగ్రహాలను అదే రోజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, తహసీల్దార్ గోపాలరావు సమక్షంలో కర్నూలుకు తరలించారు. ఆ తర్వాత రెండు రోజులు డ్రిల్లింగ్ చేసి తవ్వకాలు ఆపేశారు. గతంలో తవ్వకాలకు ప్రయత్నించిన వారి సూచనల మేరకు ప్రారంభంలో తవ్వకాలు చేసినా ఎటువంటి ఆనవాలు లభ్యం కాకపోవడంతో కోటలో పురోహితులతో ప్రత్యేక పూజలు, మాంత్రికులతో తాంత్రిక పూజలు నిర్వహించారు. చివరకు జీఎస్ఐ అధికారులతో సర్వేలు నిర్వహించిన తర్వాత వారి సూచనల మేరకు తవ్వకాల పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో తిరిగి శుక్రవారం కోటలో కొద్దిసేపు మట్టి తవ్వకాలు చేశారు. శనివారం మొదట్లో తవ్వకాలు చేసిన ప్రాంతం సమీపంలో ఉన్న బావిలాంటి గుంతలో వేసిన మట్టిని తిరిగి తొలగిస్తున్నారు. తవ్వకాలను ఆర్ఐ మధుసూదనరావు, వీఆర్ఓ కాశీరంగస్వామి పర్యవేక్షించారు. -
అనుమానాలెన్నో?
చెన్నంపల్లి కోట.. ఇప్పుడు అందరి నోటా నానుతున్న మాట. ఇక్కడ కొనసాగు తున్న తవ్వకాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ అధికారులే నిధుల కోసం వేట సాగించడం చర్చ నీయాంశమైంది. ఇక్కడికి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు కనిపించకపోవడం.. అధికారులు ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన కీలక నేత ఆదేశాల మేరకు నిధిని కొల్లగొట్టడానికి తవ్వకాలుజరుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కర్నూలు, తుగ్గలి : కొన్నేళ్లుగా చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. ఏజెన్సీ ద్వారా తవ్వకాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా దాని పేరు ఏమిటో ఇంత వరకు బయటపెట్టకపోవడం గమనార్హం. దీంతో ఇక్కడి ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా అనుమతులు లేకున్నా టీడీపీ ముఖ్య నేత ఆదేశాలతో నిధుల వేట మొదలు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, పోలీసు అధికారుల సమక్షంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఐదో రోజు ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డోన్ డీఎస్పీ బాబా పకృద్దీన్ తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించారు. వీరే కాక పత్తికొండ, బనగానపల్లె, డోన్ సీఐలు విక్రమసింహ, శ్రీనివాసులు, శ్రీనివాస్, ఏడుగురు ఎస్ఐలు, మహిళా సీఐ ఆదిలక్ష్మి, 150 మంది దాకా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తవ్వకాలపై గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రకరకాలుగా ప్రచారం... ఐదు రోజులుగా దాదాపు 20 మందికి పైగా కూలీలు రాళ్లను పగులగొట్టి పక్కకు తొలగిస్తున్నారు. నిధి ఉన్నట్లు చెబుతున్న ప్రాంతం ఇరుకుగా ఉండడంతో పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. 607 సర్వే నంబరులో 102.54ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉంది. దాదాపు 300 అడుగులకు పైగా ఎత్తులో ఉండడంతో యంత్రాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోతోంది. దీంతో ఎన్ని రోజులైనా కూలీలే తవ్వకాలు చేయాల్సి వస్తోంది. ఈ కోటలో విశేషంగా వజ్ర, వైఢూర్యాలు, బంగారం లాంటి సంపద ఉందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. గతంలో అనంతపురానికి చెందిన ఓ స్వామీజీతో పాటు, పలు ముఠాల సభ్యులు అనేకమార్లు కోటపై అధునాతన పరికరాలతో పరీక్షించి విశేషంగా సంపద ఉందని గుర్తించారు. చాలా సార్లు గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారు. అయితే ప్రతిసారీ విషయం బయటకు పొక్కు తుండడంతో విఫలమవుతూ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ప్రభుత్వ అనుమతులపై స్పష్టత ఇవ్వకుండా అధికారులే రంగంలోకి దిగడంతో చర్చనీయాంశమైంది. నిధులు లేనప్పుడు ఇంత భారీ స్థాయిలో ఎందుకు తవ్వకాలు చేపడుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. తవ్వకాల్లో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల హస్తం లేకపోతే అధికారులు అనుమతులపై ఎవరికీ చెప్పకుండా ఇంత బహిరంగంగా తవ్వకాలు జరిపే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అనుమతులపై మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. అంతటా ఉత్కంఠ కోటలో నిధి కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం తవ్వకాల్లో కొన్ని టెంకంలాంటి ముక్కలు, ఓ ఎముక బయటపడింది. ఇక నిధి వస్తుందేమోనని అందరూ ఆత్రుతతో ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. అయితే ప్రచారం జరుగుతున్నట్లు.. పక్కనే ఉన్న బండరాయికి వేసిన సీసం టెంకం స్పష్టంగా కనబడలేదు. పని చేసే చోట రాళ్లు, మట్టి వేగవంతంగా తొలగించేందుకు వీలుకావడం లేదు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నిధి బయట పడుతుందని భావిస్తున్నారు. -
ఆగని వేట, తవ్వకాల్లో పెద్దల హస్తం?
కర్నూలు, తుగ్గలి: తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. బుధవారం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తుల అనుమానాలను నివృత్తి చేస్తామంటూ అధికారులు గురువారం గ్రామసభ నిర్వహించారు. ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ, తుగ్గలి, పత్తికొండ ఎస్ఐలు, భారీగా పోలీసులు వచ్చారు. ఈ సభ గందరగోళంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ గ్రామసభలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు మాట్లాడుతూ 607 సర్వే నంబరులో 102.54 ఎకరాలున్న చెన్నంపల్లి కోట విజయనగర రాజుల కాలం నాటిదని చెప్పారు. ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని కొన్నేళ్లుగా సాగుతున్న ప్రచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తవ్వకాలు ప్రారంభినట్లు తెలిపారు. అయితే రాత్రి గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారని, వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామసభ ఏర్పాటు చేశామని వివరించారు. ట్రెజరీ చట్టం 2–88 ప్రకారం భూమిలో ఉన్న సంపద ప్రభుత్వానికి చెందుతుందన్నారు. కోటలో సంపద ఉందని, దాన్ని వెలికి తీస్తామని ఓ ఏజెన్సీ ప్రభుత్వ అనుమతులు కోసం సీఎం పేషీని కోరిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తవ్వకాలు జరుపుతున్నామే తప్ప..మీరు అనుమానిస్తున్నట్లు ఇది ఎవరి కోసమో కాదన్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, మైనింగ్ అధికారులు, గ్రామస్తులతో కమిటీ ఏర్పాటు చేసి.. వారి సమక్షంలో తవ్వకాలు జరుపుతామని చెప్పారు. దీన్నంతటినీ వీడియో తీస్తామన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తెలపాలని కోరడంతో సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నబీరసూల్ గ్రామస్తుల తరఫున మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు ఉంటే గ్రామ ప్రజలకు, మీడియాకు చూపించకుండా దొంగ దారిలో తవ్వకాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆర్డర్ చూపాలని కోరితే అలాంటి రూల్ లేదని ఆర్డీఓ చెప్పడం సరైందికాదన్నారు. చట్టాలు తమకూ తెలుసని, ప్రజలెవరూ అమాయకంగా లేరని అన్నారు. భూమిలో ఉన్న సంపదను తీయాల్సి వస్తే చట్టం ప్రకారం ఆ సంపదలో చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి 33 శాతం కేటాయించాలన్నారు. కోటలో సంపద ఉంటే దాంట్లో కొంత పంచాయతీ అభివృద్ధికి కూడా కేటాయించేలా అధికారులు గ్రామసభ తీర్మానం ద్వారా కలెక్టర్‌కు పంపాలన్నారు. అలా కుదరదని ఆర్డీఓ చెప్పడంతో తవ్వకాలు కూడా జరపనిచ్చే ప్రసక్తే లేదని నబీరసూల్ తేల్చి చెప్పారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అధికారులతో వాదించారు. ప్రభుత్వ అనుమతులు చూపకుండా తవ్వకాలు ఎలా చేస్తారని నిలదీశారు. ఆర్డర్ చూపుతానని ఆర్డీఓ చెప్పగానే.. టీడీపీ నాయకులు జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎంపీపీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రంగమ్మ తనయుడు వెంకటపతి, వారి అనుచరులు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఇది తమ గ్రామ సమస్య అని, మీకేం సంబంధం అంటూ గందరగోళం సృష్టించారు. ఇదే అదనుగా అధికారులు గ్రామసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగైదు గంటల తర్వాత మళ్లీ కొంత మంది గ్రామస్తులతో కమిటీ వేసినట్లు చెబుతూ తవ్వకాలు కొనసాగించారు. అధికారులే తవ్వకాలకు పూనుకోవడంతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోట పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎంత మంది ఉన్నారో తెలియడం లేదని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. తవ్వకాలు జరిపే వారిలో కొందరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. కోట విశిష్టత.. చెన్నంపల్లి గ్రామం వెనుక ఉన్న కొండపై పురాతన కోట ఉంది. ఈ కోటలో ఇప్పటికీ చెక్కు చెదరని బురుజులు కనిపిస్తాయి. విజయనగర రాజులు, మౌర్యవంశీయులు, గుత్తి పాలకులకు ఈ కోటతో సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కొండపై గోడలు, ద్వారాలు, బురుజులు, కోనేర్లు, ఊరువాకిలి ఉన్నాయి. ప్రస్తుతం ఊరువాకిలి పూర్తిగా శిథిలావçస్థకు చేరుకుంది. ఈ కోట నుంచి గుత్తి కోటకు సొరంగ మార్గం ఉందని ప్రజలు చెబుతుంటారు. అంతేకాక కోట ప్రారంభంలో ఉన్న రాతి బండపై నిరంతరం నీళ్లు ఉండటం ఓ ప్రత్యేకత. కోటకు ఏడు కిలోమీటర్ల దూరంలోని జొన్నగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఇలాంటి పురాతనమైన చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. పదేళ్ల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్వామీజీ ఈ కోటలో విశేషంగా బంగారం ఉందని, దాన్ని బయటకు తీసేందుకు సహకరిస్తే ప్రతి ఇంటికీ పిడికెడు బంగారం ఇవ్వొచ్చని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వామీజీ సూచనను అనుసరించి కోటపై ఉన్న ఓ రాతి బండ వద్ద నిధి ఉందంటూ రాత్రి సమయాల్లో తరచూ తవ్వకాలు చేసేవారు. చివరకు అప్పటి కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందడంతో తవ్వకాలు జరిపిన చోట పోలీసులు పెద్దబండరాయి వేయించారు. అయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎలాగైనా గుప్త నిధులు తీయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. మాట్లాడుతున్న బీవైరామయ్య, చిత్రంలో పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి దోచుకోవడమే చంద్రబాబు పని– వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య దొరికినంత దోచుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు పని అని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని తెలుసుకున్న వారు గురువారం చెన్నంపల్లికి వచ్చి అధికారులను నిలదీశారు. అనంతరం సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నబీరసూల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాజుల కోటలో గుప్త నిధులున్నాయని, ఎవరికీ సమాధానం ఇవ్వకుండా అక్రమ తవ్వకాలు జరపడం అన్యాయమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచభూతాలను సైతం వదిలిపెట్టలేదన్నారు. మట్టి, నీరు ఇలా వేటినీ వదలడం లేదని విమర్శించారు. చెన్నంపల్లి కోటలో ప్రభుత్వ అనుమతులు చూపకుండా.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అధికారులు తవ్వకాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వ అనుమతులు ఉంటే వాటిని మీడియాకు, ప్రజలకు ఎందుకు చూపలేదని నిలదీశారు. అమాయక ప్రజలపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గుప్త నిధులు కొల్లగొట్టేందుకే టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఈ పన్నాగం పన్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సొంత నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండానే అధికారులు తవ్వకాలు జరుపుతారా అని అన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మాదిరిగా గుప్త నిధులను తీయాలని సూచించారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఆలయంలోని నిధులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక్కడ కూడా అలాగే చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం వచ్చినా ఇలాంటి ఆటలు సాగనివ్వబోమని వారు హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నాగేష్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గోపాలరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు హనుమంతు, ఎంపీటీసీ సభ్యులు రామాంజినేయులు, రంగనాథరెడ్డి, మధుయాదవ్ పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
-
కోటలో వేటగాడు!
► డబ్బున్నోళ్ల ఆట.. రిసార్ట్ ముసుగులో వేట.. ► సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అడవుల్లో వన్యప్రాణుల వేట ♦ రిసార్ట్ పేరుతో విచ్చలవిడి వ్యవహారం ♦ అడవి జంతువులను వధించి వాటి మాంసంతో విందులు ♦ ధనవంతులు, బడా వ్యాపారులు, వారి పిల్లల ఆటవిక క్రీడ ♦ అడవిని ఆనుకుని రిసార్ట్.. సాయంత్రమైతే చొరబాటు ♦ ‘షికారు’ పేరిట ఈవెంట్‌గా వేట ♦ దుప్పులు, కొండ గొర్రెలు, నెమళ్లు మాయం ♦ విషయం తెలిసీ పట్టించుకోని అటవీ శాఖ అధికారులు ♦ మామూళ్ల మత్తులో పోలీసు అధికారులు అదో అటవీ ప్రాంతం.. దుప్పులు, కొండ గొర్రెలు, నెమళ్లు వంటి ఎన్నో వన్యప్రాణులకు నిలయం.. అలాంటి అడవిలోకి ఓ రిసార్ట్ చొరబడింది.. గండికోటలా అన్ని విలాసాలతో ధనవంతులు, బడా వ్యాపారులు, వారి పిల్లల ఆటవిక క్రీడలకు నిలయంగా మారింది. డబ్బులు కడితే చాలు అక్రమంగా అడవిలోకి ప్రవేశించి.. ఇష్టమొచ్చినట్లుగా వన్యప్రాణులను వేటాడవచ్చు! వాటి మాంసంతో విందులూ ఆరగించవచ్చు.. సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అటవీ ప్రాంతంలో రిసార్ట్ ముసుగులో జరుగుతున్న వ్యవహారమిది. విషయం తెలిసినా పోలీసులు, అటవీ అధికారులు మామూళ్ల మత్తులో పట్టించుకోకపోవడంతో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగిపోతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గిరాయిపల్లి అటవీ ప్రాంతంలో ఆధునిక హంగులతో ఓ రిసార్ట్ కట్టారు. దాదాపు 170 ఎకరాల విస్తీర్ణంలో అడవికి ఆనుకుని ఏర్పాటు చేశారు. అడవిలో కలసిపోయి ఉండటంతో నెమళ్ల గుంపులు, వన్యప్రాణులూ ఇందులోకి వస్తుంటాయి. ఈ రిసార్ట్‌లో రాచరిక కాలం నాటి తరహాలో ఆకర్షించే భవనాలు, పట్టుపాన్పులు, పంచభక్ష్య పరమాన్నాలు, చెలికత్తెలు, సేవకులు.. ఇలా అన్నీ సిద్ధం. కాస్త ఖర్చుపెడితే రోజంతా రాజుల్లా గడపొచ్చు. మరి రాజు అన్నాక వేట కూడా ఉంటుంది కదా!.. అందుకే అన్నట్లుగా పేజ్‌త్రీ పర్యాటకులను ఆకర్షించడం కోసం వేటను ‘షికారు’ పేరిట ఒక ఈవెంట్‌గా పెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రిసార్టుకు వచ్చేవారు దానికి ఆనుకుని ఉన్న అడవిలోకి వెళ్లి జంతువులను వేటాడుతున్నారని.. అలా వేటాడి తెచ్చిన వాటిని వండి వడ్డిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల పిల్లలను ఆకర్షించడం కోసం ఈ వేటకు బాటలు వేసినట్టు తెలుస్తోంది. స్థానిక రైతులు ఈ వేట వివరాలను ‘సాక్షి’ప్రతినిధికి వెల్లడించారు. సాయంత్రం ఆరు నుంచి మొదలు సాధారణంగా అడవి జంతువులు సాయంత్రం వేళలో వాటి ఆవాసాల నుంచి బయటికి వచ్చి సంచరిస్తుంటాయి. దీంతో రిసార్ట్ యాజమాన్యం షికారు పేరుతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేట నిర్వహిస్తోంది. వేట కోసం ప్రత్యేకంగా కుక్కలను పెంచుతున్నారు. రిసార్టు సిబ్బంది, పర్యాటకులు ఆ వేట కుక్కలను పట్టుకుని అడవిలోకి వెళతారు. అక్కడక్కడా ఎంచుకున్న చోట్ల ఇనుప కంచెల బోనులు ఏర్పాటు చేస్తారు. తర్వాత కాస్త ముందుకు వెళ్లి వన్యప్రాణులను కర్రలతో వెంటాడి ఆ బోనుల వైపు వచ్చేలా తరుముతారు. బోనుల్లో చిక్కుకున్న వన్యప్రాణులను రిసార్టుకు పట్టుకువచ్చి వధిస్తున్నారు. వాటి మాంసంతో వంటకాలు తయారుచేసుకుని తింటున్నారు. ఇక అడవిలోంచి రిసార్టులోకి వస్తున్న నెమళ్ల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకమే. కొండ గొర్రెలు, దుప్పులను వేటాడి.. కొంత కాలంగా గుట్టుగా సాగుతున్న వన్యప్రాణుల వేట వ్యవహారం ఇటీవలే బయటకు పొక్కింది. మే నెల మూడో వారంలో రిసార్టు సిబ్బంది, పర్యాటకులు కలసి మూడు కొండ గొర్రెలు, ఒకదుప్పిని వేటాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వాటిలో దుప్పిని, ఒక కొండ గొర్రెను అదే రోజున వధించి.. వాటి మాంసంతో విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మిగతా రెండు కొండ గొర్రెలను రిసార్టు ఇనుప కంచెలో ఉంచగా.. కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారని తెలిసింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి.. ఆ రోజున సిబ్బందితో కలసి రిసార్టుకు వెళ్లారని, కానీ కేసు నమోదు చేయకుండానే వెనుదిరిగారని సమాచారం. అప్పటిదాకా ఇలాంటి రిసార్టు ఒకటి ఉందనే విషయం స్థానికంగా కూడా పెద్దగా తెలియకపోవడం గమనార్హం. అయితే ఆలస్యంగా సమాచారం అందుకున్న సిద్దిపేట ఫారెస్టు రేంజర్ శ్యాంసుందర్‌రావు తన సిబ్బందితో కలసి ఆ రిసార్టుపై దాడి చేశారు. రెండు కొండ గొర్రెలను స్వాధీనం చేసుకుని, రిసార్టు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కేసులు పెట్టి వదిలేశారు అటవీ అధికారులు రిసార్టుపై దాడి చేసిన వెంటనే రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి కేసులు పెట్టకుండా నిందితులను వదిలేయాలంటూ వారు అధికారులపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. దానికి తలొగ్గిన అధికారులు సాధారణ సెక్షన్ల కింద కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు. దర్యాప్తును గాలికొదిలేశారు. స్వాధీనం చేసుకున్న కొండ గొర్రెలను నర్సాపూర్ కోర్టు న్యాయమూర్తికి చూపించి.. నర్సాపూర్ అడవుల్లోనే వదిలేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మళ్లీ రిసార్టు ముసుగులో వేట కొనసాగుతున్నట్లు తెలిసింది. మరోవైపు రిసార్టు కేసు వివరాల కోసం ‘సాక్షి’ప్రతినిధి సిద్దిపేట డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, రేంజర్ శ్యాంసుందర్రావులకు విజ్ఞప్తి చేసినా, వారం రోజుల పాటు తిరిగినా.. వారు వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అయితే రిసార్టులో కొండ గొర్రెలను బంధించిన మాట నిజమేనని, వాటిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామని శ్యాంసుందర్‌రావు చెప్పారు. -
కోటను చూడ్డానికివచ్చి...
ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లోని చారిత్రాత్మక కోట ను చూడ్డానికి వచ్చిన ఓ జంట దుర్మరణం చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్ లో ప్రసిద్ధి చెందిన వాబెన్ కోటను చూడటానికి ఓ జంట అక్కడికి వచ్చింది. కోటను చూసే క్రమంలో వారు నాలుగో అంతస్తుకు వెళ్లారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ మరునాడు ఉదయం ఇద్దరి శవాలునీటిలో తేలాయి. సుమారు నలభై అడుగుల ఎత్తుమీదినుంచి పక్కనే ఉన్న కొలనులో పడి ఉండటంతోనే వారు మరణించి ఉండవచ్చనే అనుమానిస్తున్నారు. దీనితో ఆ జంటకు సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరికీ ముప్పయి సంవత్సరాల లోపు వయసుంటుదని భావిస్తున్నారు.ఆంగ్లేయుల దాడినుంచి రక్షించుకునేందుకు వీలుగా 1866లో నెపోలియన్ -3 ఈ కోటను నిర్మించారు.