చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న రాజుల కాలం నాటి ఎన్నో ప్రసిద్ద కోటల గురించి కథకథలుగా విన్నాం. కొన్ని కోటలు మిస్టరీగా ఉండి లోనివి వెళ్లేందుకు భయంకరంగా ఉన్న వింత కట్టడాలను చూశాం. ఆనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీని ఎంతో మెచ్చుకుని సంబరిపడ్డాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా కోట మాదిరి ఓ ఆధునాతన కట్టడం మన ముందుక రానుంది. అయితే దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో వింటే షాకవ్వుతారు. ఎక్కడంటే..?
చుట్టూ కొలను, కొలను మధ్యలో కోట– చూడటానికి వింతగా ఉంది కదూ! పోలండ్‌లో ఉన్న ఈ రాతికోట పురాతన కట్టడమేమీ కాదు, అత్యంత అధునాతన కట్టడం. పశ్చిమ పోలండ్‌లో ఉన్న నాటెకా అడవి శివార్లలో ఉన్న కొలనులో కృత్రిమ దీవిని నిర్మించి, ఆ దీవిపై ఈ రాతికోట నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు.
‘స్టోబ్నిసా క్యాజిల్’ పేరుతో చేపట్టిన ఈ కోట నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. దీని నిర్వాహకులు ప్రస్తుతం కోట పరిసరాలను తిలకించడానికి పర్యాటకులకు టికెట్లు అమ్ముతున్నారు. ఒక్కో టికెట్టు ధర 5.90 పౌండ్లు (రూ.650) మాత్రమే!
(చదవండి: ఈ ఆకులను ఎప్పుడైనా చూశారా..? మసిపూసినంత నల్లగా..!)
Comments
Please login to add a commentAdd a comment