port
-
సీజ్ ద షిప్! అంతా తూచ్..!
-
చంద్రబాబు అబద్ధాలు, మోసాలు పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
-
మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు
-
అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?
చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్న రాజుల కాలం నాటి ఎన్నో ప్రసిద్ద కోటల గురించి కథకథలుగా విన్నాం. కొన్ని కోటలు మిస్టరీగా ఉండి లోనివి వెళ్లేందుకు భయంకరంగా ఉన్న వింత కట్టడాలను చూశాం. ఆనాటి ఇంజనీరింగ్ టెక్నాలజీని ఎంతో మెచ్చుకుని సంబరిపడ్డాం. అయితే వాటన్నింటిని తలదన్నేలా కోట మాదిరి ఓ ఆధునాతన కట్టడం మన ముందుక రానుంది. అయితే దీన్ని ఎక్కడ నిర్మిస్తున్నారో వింటే షాకవ్వుతారు. ఎక్కడంటే..?చుట్టూ కొలను, కొలను మధ్యలో కోట– చూడటానికి వింతగా ఉంది కదూ! పోలండ్‌లో ఉన్న ఈ రాతికోట పురాతన కట్టడమేమీ కాదు, అత్యంత అధునాతన కట్టడం. పశ్చిమ పోలండ్‌లో ఉన్న నాటెకా అడవి శివార్లలో ఉన్న కొలనులో కృత్రిమ దీవిని నిర్మించి, ఆ దీవిపై ఈ రాతికోట నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. ‘స్టోబ్నిసా క్యాజిల్’ పేరుతో చేపట్టిన ఈ కోట నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. దీని నిర్వాహకులు ప్రస్తుతం కోట పరిసరాలను తిలకించడానికి పర్యాటకులకు టికెట్లు అమ్ముతున్నారు. ఒక్కో టికెట్టు ధర 5.90 పౌండ్లు (రూ.650) మాత్రమే!(చదవండి: ఈ ఆకులను ఎప్పుడైనా చూశారా..? మసిపూసినంత నల్లగా..!) -
గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!
ఇజ్రాయెల్‌లోని హైఫా, శ్రీలంకలోని కొలంబో, టాంజానియా ఓడరేవు డార్ ఎస్ సలామ్ తర్వాత నాల్గవ అంతర్జాతీయ నౌకాశ్రయంగా కీర్తి గడిస్తున్న అదానీ పోర్ట్ కార్యకలాపాలు వియత్నాంలో కూడా ప్రారంభయ్యే అవకాశం ఉంది. దీనికోసం అదానీ గ్రూప్ వియత్నాంలో ఓడరేవును నిర్మించాలని యోచిస్తోంది.భారతదేశంలో ప్రముఖ ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎప్పటికప్పుడు విస్తరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని మరింతగా ఉపయోగించుకునేందుకు అంతర్జాతీయ ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తోంది. తద్వారా లాభాలను గడిస్తోంది.భారతదేశపు అతిపెద్ద పోర్ట్ ఆపరేటర్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ), వియత్నాంలోని డా నాంగ్‌లో ఓడరేవును అభివృద్ధి చేయడానికి వియత్నాం ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం పొందినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని, పెట్టుబడులకు సంబంధించిన మొత్తం ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు.గౌతమ్ ఆదానీ.. తన అదానీ పోర్ట్ విస్తరణను లక్ష్యంగా చేసుకుని అధిక ఉత్పత్తి లేదా అధిక జనాభా ఉన్న దేశాలలో ఓడరేవులను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. అదానీ పోర్ట్స్ ప్రస్తుతం మొత్తం వాణిజ్య పరిమాణంలో 5 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచి పొందుతోంది. ఇది 2030 నాటికి 10 శాతానికి చేరుకోవడానికి తగిన సన్నాహాలు చేస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి 'యూ ట్యూబ్'.. ఏటా కోట్లు సంపాదిస్తూ..అదానీ గ్రూప్ కేరళలోని విజింజం ఓడరేవును ప్రారంభించనుంది. ఇప్పటికే ఇక్కడ మొదటి దశ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని చెబుతున్నారు. ఈ పోర్ట్ 2028-29 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. దీనికోసం ఏకంగా రూ. 20000 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. -
టీడీపీ నేతలు చెప్పారు.. అధికారులు వేటేశారు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సంతబొమ్మాళి: అధికారమే అండగా టీడీపీ నేతలు బరితెగించారు. శ్రీకాకుళం జిల్లా సంత»ొమ్మాళి మండలం మూలపేట పోర్టులో పనిచేస్తున్న మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 17 మందిని టీడీపీ నేతల బెదిరింపులతో అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. ఉద్యోగులు వైఎస్సార్సీపీకి చెందినవారని.. వారిని తీసేసి టీడీపీ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు 17 మందిని ఉద్యోగాల నుంచి తప్పించడంతో బాధితులతోపాటు నిర్వాసితులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. స్థానిక సర్పంచ్ జీరు బాబూరావు ఆధ్వర్యంలో మూలపేట పోర్టులోకి ప్రవేశించి ఉద్యోగాల తొలగింపుపై అధికారులను నిలదీశారు. స్థానిక టీడీపీ నాయకులు తమను బెదిరించడం వల్లే 17 మందిని తొలగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పడంతో నిర్వాసితులు మండిపడ్డారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వని టీడీపీ నాయకుల పెత్తనం ఏమిటని ప్రశి్నంచారు. వారు దర్జాగా వారి భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారని, పోర్టుకు భూములిచ్చి తాము సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులో ఉద్యోగాలు చేసుకుంటున్న తమపై టీడీపీ నాయకులు రాజకీయ కక్ష సాధింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కాగా 10 రోజుల పాటు మూలపేట గ్రామస్తులకు పని ఆపుతున్నామని పోర్టు అధికారులు చెప్పారు. దీంతో తమతో పాటు మిగతా గ్రామస్తులకు పని ఆపాలని ఉద్యోగాలు కోల్పోయినవారు డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. నిర్వాసితులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే తమ అభిమతమని సర్పంచ్ బాబూరావు, గ్రామస్తులు రాంబాబు, శివ, దారపు అప్పలరెడ్డి, రోహిణి, మోహనరావు తదితరులు తెలిపారు. ఇదే విషయాన్ని పోర్టు డీజీఎం ఉమామహేశ్వరరెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ సంతో‹Ùలకు తెలియజేశామన్నారు. కాగా, ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి, నౌపడ ఎస్ఐ కిషోర్‌వర్మ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోర్టు అధికారులకు విన్నవించడానికి వెళ్లిన నిర్వాసితులను తొలుత సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో తర్వాత లోపలకు విడిచిపెట్టారు. మీడియా ప్రతినిధులను సైతం గేటు వద్దే ఆపేశారు.మూలపేటపై కాలకూట విషం.. వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మూలపేట పోర్టుపై పెత్తనం కోసం టీడీపీ నేతలు తెగ ఆరాటపడుతున్నారు. పోర్టుకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులు, ఉద్యోగాల కోసం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే బండ రాళ్లు, ఇసుక, గ్రావెల్ తరలిస్తున్న లారీలను నిలిపివేయించారు. తాజాగా అందులో మొదటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేలా అధికారులను బెదిరించారు. దీంతో అటు నిర్మాణానికి కీలకమైన బండ రాళ్లు, గ్రావెల్, ఇసుక రవాణా కాకపోవడంతో ప్రధాన పనులు నిలిచిపోయాయి. ఇప్పుడేమో ఉద్యోగులను కూడా తొలగించి టీడీపీ నేతలు పనులను కూడా అడ్డుకున్నారు. ఒక మంత్రితో కలిసి స్థానిక టీడీపీ నేతలు మూలపేట పోర్టును తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ పనులు శరవేగంగా జరిగాయి. పోర్టులో కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. పోర్టు పనులు పూర్తయితే 11 తీర ప్రాంత మండలాల మత్స్యకారులకు మత్స్య సంపద లభించడంతో పాటు జీడిపప్పు, గ్రానైట్, జూట్, ఇనుము ఉక్కు ఎగుమతులకు అవకాశం కలుగుతుంది. అయితే టీడీపీ నేతల దాషీ్టకాలతో పోర్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.చంపుతామని బెదిరిస్తున్నారు ప్రభుత్వం మారిన వెంటనే మమ్మల్ని చంపుతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగించాలని టీడీపీ నాయకులు అధికారులను భయపెట్టారు. నిర్వాసిత గ్రామస్తులందరికీ పోర్టులో పనికల్పించాలని అధికారులకు విన్నవించాం. – జీరు బాబూరావు, సర్పంచ్, మూలపే -
పోర్ట్ ఆఫ్ ఎంట్రీ.. ఒక విషమ పరీక్షే!
హైదరాబాద్ నుంచి బదిలీ అయి మహబూబ్ నగర్లో పని చేస్తున్నప్పుడు మా పిల్లల కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఆరు మాసాల సెలవు పెట్టి బయలుదేరాను. కుటుంబ సభ్యుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడమే తప్ప నేను వెళ్లడం మొదటి సారి కావడంతో కంగారు పడ్డాను. మా ఇంట్లోనేమో ‘ మీరు పోతున్నది అమెరికా మాత్రమే... చంద్రమండలానికి కాదు కదా ! ఇక్కడేదన్నా మరిచినా యూఎస్‌లో అన్నీ దొరుకుతాయి, మీకు కావలసిన పుస్తకాలు కూడా పుష్కలంగా ‘ అని జోక్ చేశారు. రాత్రి ఒంటి గంటకు ఎగిరే విమానం కోసం ఎందుకైనా మంచిదని మూడు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరి, అన్ని చెకింగ్ లు పూర్తి చేసుకొని మొత్తం మీద ఫ్లైట్ ఎక్కేశా. నా పక్క సీట్లోనే కూర్చున్న ఓ అమ్మాయి సెల్ ఫోన్ పట్టుకొని అచ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడడం చూసి నేనూ మాట కలిపా, ఆమెది వరంగల్, ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్తున్నట్లు చెప్పింది. అమ్మా నాకిది మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ, ప్రయాణంలో కాస్త గైడ్ చేస్తుండు అన్నాను మాట వరసకి , మధ్యలో ఫ్లైట్ మారడం గురించే నా వర్రీ అంతా. ‘అయ్యో అంకుల్ నేను విమానం ఎక్కడమే ఇది ఫస్ట్ టైమ్, మీరే నాకు చెప్పాలి ! ‘ అన్నది నవ్వుతూ ఆమె. వేళాపాల లేకుండా ఏదో ఒకటి ఇస్తున్నారు తినడానికి, తాగడానికి రుచిపచి లేని ఆహారం. ఏక దాటిగా దాదాపు 10 గంటలు సీట్లో కూర్చోలేక, హ్యాండ్ లగేజీ తీసుకోడానికో, కాలకృత్యాలు తీర్చుకోడానికో, నేను మధ్యమధ్య లేస్తుంటే, మరో పక్కనున్న శ్వేతమహిళ తాను కదలలేక విసుక్కోవడం నాకు నచ్చలేదు. ఎలాగైతేనేం ఫ్రాంక్ ఫర్ట్లో అడుగు పెట్టాక, అక్కడి నుండి ఎయిర్‌పోర్ట్‌లోని మరో టర్మినల్‌కు వెళ్ళడానికి బస్సు రెడీగా ఉండడం బాగుంది. బస్సు దిగగానే హ్యూస్టన్ వెళ్లాల్సిన ఫ్లైట్ టెర్మినల్‌కి ఎలా వెళ్లాలో ఒకటికి రెండుసార్లు చెప్పింది అక్కడున్న జర్మనీ అమ్మాయి. వాళ్ల మర్యాద బాగుందనిపించింది. అదే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ..మా ఫ్లైట్ జార్జ్ బుష్ ఇంటర్ కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి ఓ అరగంట ముందే మాకు కస్టమ్ ఫార్మ్స్ ఇచ్చారు పూర్తి చేయడానికి. దిగిన తర్వాత నేరుగా బయటకు వెళ్లొచ్చన్న మూడ్‌లో ఉన్నాను. అక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది. మనం విమానం దిగగానే.. అమెరికాలో అడుగుపెట్టినట్టు కాదన్న విషయం తెలిసింది. ఫ్లైట్ నుంచి లాండ్ అయిన ప్రతీ ఒక్కరు అక్కడి సెక్యూరిటీ నిఘాలోకి వెళ్తారు. వాళ్లు సూచించిన మార్గంలోనే /దారిలోనే నడవాలి. అది కాస్తా.. తీరిగ్గా చెక్ పాయింట్‌కు దారి తీస్తుంది. దాన్నే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటారు. ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీని అమెరికాలో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తోంది. అమెరికా దేశంలో ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వ్యవస్థను 1789లో ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్ విషయంలో మరిన్ని జాగ్రత్తలను పొందుపరిచారు. వీసా అక్కడ వరకే..యూఎస్ కాన్సులేట్ వాళ్లు వీసా ఇవ్వగానే.. అమెరికాలో వాలిపోవచ్చని అనుకుంటారు. ఇక్కడే పప్పులో కాలేస్తారు. ఏ దేశం నుంచి ఏ నగరంలోని కాన్సులేట్ వాళ్లు వీసా ఇచ్చినా.. దాని పరిధి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వరకే. ఇక్కడి అధికారులు వచ్చే వ్యక్తులను, వారి దగ్గరున్న డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అంటే హైదరాబాద్‌లో వీసా అధికారికి ఏ విషయమయితే చెప్పినామో.. దానికి మద్ధతుగా వెంట తెచ్చుకున్న ధృవపత్రాలను పరిశీలిస్తారు. అలాగే అనుబంధ ప్రశ్నలు అడుగుతారు. అనుమానం వస్తే అమెరికాలోకి అడుగుపెట్టకుండా తిరిగి వెనక్కి పంపిస్తారు. నాకు ఎదురయిన అనుభవం ఏంటంటే.. నేను విమానంలో ఇచ్చిన కస్టమ్ ఫాంలో ఒక ప్రశ్న ఉంది. యూఎస్‌లో ఎంత కాలం ఉంటారు అని అడిగినప్పుడు అనాలోచితంగా 4 నెలలు అని రాశా, అది తప్పయింది. నిజానికి మా వాళ్లు నాకు 6 నెలల తర్వాతకు రిటర్న్ టికెట్ తీసుకున్నారు. దీన్ని పసిగట్టారు అక్కడి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అధికారులు. ‘ మీ రిటర్న్ టికెట్ 6 నెలలకు ఉంది కదా ’ అని క్లియర్ చేయకుండా పై అధికారి దగ్గరకు పంపారు. నేనేదో అమెరికాలోనే ఉండిపోడానికి వచ్చినట్లు ఆయనగారు పదే పదే అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాను. నేను ఆనాటి ప్రభుత్వ సర్వీస్‌లోనే ఉన్న అధికారినని తెలుసుకున్నాక మాత్రం వదిలిపెట్టేశారు. మన వాళ్లు ఎదుర్కునే పరీక్ష ఏంటంటే.? పోర్ట్ ఆఫ్ ఎంట్రీ గురించి అవగాహన లేకుండా.. చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఉదాహరణకు తొలిసారి అమెరికా వెళ్లాల్సిన వారు, కాలిఫోర్నియాలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లాలని వీసా అధికారికి చెబుతారు. తీరా వెళ్లేప్పుడు మాత్రం న్యూయార్క్ సిటీ చూసి వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. న్యూయార్క్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇక్కడికెందుకు వచ్చారని అడిగితే ఖంగు తింటారు. అమెరికాకు ఏ పని మీద వెళ్తున్నాం.? ఆ పనికి సరిపోయేలా దగ్గరున్న నగరానికే వస్తున్నామా? లేక తింగరి వేషాలు వేస్తున్నామా అన్నది పసిగట్టేస్తారు ఇక్కడి అధికారులు. పైగా మన పాస్‌పోర్ట్‌లో వీరు వేసే స్టాంపింగ్ డేట్ మనకు కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తేదీకి మించి మనం అమెరికాలో ఉండడానికి వీల్లేదు. ఉదాహరణకు మీరు B1/B2 వీసా ఉండి అమెరికాలో జరగబోయే ఓ తెలుగు మహాసభలకు వస్తున్నారు. అదే పని మీద వీసా తీసుకున్నారు. కానీ మీ మనసులో దేశమంతా తిరిగితే బాగుంటుందన్న ఆలోచన ఉంది. అది దాచిపెట్టి సభల కోసం వచ్చామని చెబితే స్టాంపింగ్ కేవలం నెల మాత్రమే వేస్తాడు. పద్ధతిగా వివరిస్తే మాత్రం ఆరు నెలల స్టాంపింగ్ వేస్తాడు. విద్యార్థులు.. జాగ్రత్త పడాలి ఇక్కడికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇబ్బందులు పడతారు. అమెరికాకు సిద్ధం కాగానే.. మన స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే.. సీనియర్లు, అమెరికాలో అప్పటికే ఉంటోన్న స్టూడెంట్స్‌తో వాట్సాప్/ఫేస్బుక్ చాటింగ్ మొదలు పెడతారు. ఎక్కడ పార్ట్‌టైం ఉద్యోగాలు దొరుకుతాయి? డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చన్న ప్రశ్నలు వేస్తారు. ఆ చాట్ అలాగే ఫోన్లలో ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అధికారికి మీ మీద డౌట్ వస్తే.. మీ ఫోన్ తీసుకుంటారు. మొత్తం చెక్ చేస్తారు. విద్యార్థులు చదువుకోవడానికి రావాలి గానీ.. డబ్బుల కోసం వస్తారా? అని వెనక్కి పంపిస్తారు. మనం ఎంతగా వాదించినా వృధా ప్రయాసే. ఏ దేశానికి వెళ్తే అక్కడి నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అలా కోరుకుంటారు కూడా. వేముల ప్రభాకర్(చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
చాబహర్ పోర్ట్ నిర్వహణకు ఒప్పందం
చాబహర్ పోర్ట్ నిర్వహణకు భారత్ ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. 2016లో జరిగిన ఒప్పందాన్ని తిరిగి కొనసాగించేలా కీలకపత్రాలపై సంతకాలు చేసేందుకు షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం ఇరాన్‌కు వెళ్లనున్నారు. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.మీడియా సంస్థల కథనం ప్రకారం..2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్లో పర్యటించినపుడు చాబహర్ ఓడరేవుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజాగా ఈమేరకు తిరిగి ఒప్పందాన్ని కొనసాగించేలా కీలకపత్రాలపై సంతకాలు జరుపనున్నారు. విదేశాల్లో ఓడరేవు నిర్వహణ చేపట్టడం భారత్‌కు ఇదే తొలిసారి. ఈ ఒప్పందం రానున్న పదేళ్లకాలానికి వర్తిస్తుందని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి విదేశాలకు వెళ్తుండడం ప్రత్యేకత సంతరించుకుంది.చాబహర్ పోర్ట్ ప్రాముఖ్యతకామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్(సీఐఎస్) దేశాలను చేరుకోవడానికి ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ)లో చాబహర్ పోర్ట్‌ను కేంద్రంగా మార్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఐఎన్ఎస్టీసీ వల్ల భారత్-మధ్య ఆసియా కార్గో రవాణాకు ఎంతోమేలు జరుగుతుంది. చాబహర్ పోర్ట్ భారత్‌కు వాణిజ్య రవాణా కేంద్రంగా పని చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గతంలో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరో 10 ఏళ్లు కొనసాగించేలా తాజాగా పత్రాలపై సంతకాలు చేయనున్నారు. -
అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనే రావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, అభివృద్ధిని వేగవంతం చేశారని తెలిపారు. నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లను సీఎం జగన్ నిర్మిస్తున్నారని చెప్పారు. పోర్టులు పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తాయని, రామాయపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వివరించారు. సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు ఎందుకు పోర్టులు నిర్మించే ఆలోచన చేయలేదని నిలదీశారు. 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయని, వచ్చే ఏడాది మరో ఐదు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలుస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. గత 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. వైజాగ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అవుతుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగించే సీఎం జగన్ కావాలా, జన్మభూమి కమిటీలతో దోచుకున్న చంద్రబాబు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గత 59 నెలలుగా రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వలంటీర్ల వ్యవస్థ ద్వారా పథకాలను ఇంటి వద్దకే లబ్ధిదారులకు అందించారు. గత 59 నెలల పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో రూ.20 కోట్ల నుంచి రూ. 30 కోట్లు ప్రజలకు చేరాయి. సీఎం జగన్ 16 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75 వేలు అందించారు. వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు వ్యాపారాలు చేస్తూ సంపాదనను మెరుగుపర్చుకుంటున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల కోటికి పైగా కుటుంబాలు వాటి కాళ్లపై అవి నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. ఇప్పుడు 4.19 శాతానికి తగ్గింది. రాష్ట్రం అభివృద్ధి చెందిందనడానికి ఇదొక నిదర్శనం’ అని తెలిపారు. ‘చంద్రబాబు ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలు బాగా దెబ్బతిన్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా సంఘాల మహిళలు 2019 ఏప్రిల్ 11 నాటికి బకాయిపడిన రూ.25 వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యుల సంఖ్య 1.15 కోట్లకు పెరిగింది. ఇది ఆల్ ఇండియా రికార్డు. సీఎం జగన్ గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించారు. ఇంటి స్థలం లేని 31 లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు ఇంటి స్థలం ఇచ్చారు. వారి సొంతింటి కలను సాకారం చేస్తూ పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు’ అని వివరించారు.జీఎస్డీపీ 4.87 శాతానికి పెరుగుదలచంద్రబాబు హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) 4.47 శాతం ఉంటే.. వైఎస్ జగన్ హయాంలో జీఎస్డీపీ 4.87 శాతానికి పెరిగింది. దేశ జీడీపీలో అత్యధిక జీఎస్డీపీ వాటా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ది నాలుగో స్థానం. ఇది అభివృద్ధి కాదా? కోవిడ్ రెండేళ్లు ఉన్నా ఎలా సాధ్యమైంది? ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన పథకాలు సకాలంలో ఇవ్వడంతో ఎకానమీ యాక్టివిటి పెరగడంతో అభివృద్ధి జరిగింది. దాని వల్లే జీఎస్డీపీ పెరిగింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఎంఎస్ఎంఈలు 1.9 లక్షల నుంచి 7 లక్షలకు పెరిగాయి. భారీ పరిశ్రమలు వచ్చాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. దాంతో నిరుద్యోగం 5.2 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గింది. ఇది అభివృద్ధి కాదా? రాష్ట్ర అప్పులు జీఎస్డీపీలో టీడీపీ హయాంలో 7.5 శాతం ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో 5.5 శాతం మాత్రమే. కేంద్రం అప్పు జీడీపీలో 6.6 శాతంగా ఉంది. రాష్ట్రంలో మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్సె్పండిచర్) టీడీపీ హయాంలో రూ.12 వేల కోట్లు ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.15 వేల కోట్లకు పెరిగింది. ఇవన్నీ కేంద్రం చెప్పిన లెక్కలే. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చి అంతా కేంద్రమే ఇచ్చిందని అంటున్నారు. కానీ.. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి వచ్చే సాయం తగ్గింది. అయినా సరే రాష్ట్రాన్ని సీఎం జగన్ అభివృద్ధి పథంలో నిలపగలిగారు’ అని తెలిపారు. -
మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ
-
అదానీ చేతికి గోపాల్పూర్ పోర్టు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ఖాతాలోకి మరో పోర్టు వచ్చి చేరనుంది. గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థ (ఏపీసెజ్) తాజాగా ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టును (జీపీఎల్) దక్కించుకోనుంది. ఇందుకోసం జీపీఎల్లో షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్, ఒడిశా స్టీవ్డోర్స్ లిమిటెడ్ (ఓఎస్ఎల్) నుంచి 95 శాతం వాటాలను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేయనుంది. జీపీఎల్లో ఎస్పీ పోర్ట్ మెయింటెనెన్స్‌కి 56 శాతం, ఓఎస్ఎల్కి 44 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో ఎస్పీ గ్రూప్ వాటాలను పూర్తిగా, ఓఎస్ఎల్ నుంచి 39 శాతం వాటాలను ఏపీసెజ్ కొనుగోలు చేయనుంది. ఓఎస్ఎల్ 5 శాతం వాటాతో జాయింట్ వెంచర్ భాగస్వామిగా కొనసాగనుంది. రూ. 3,080 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువతో 95 శాతం వాటాను రూ. 1,349 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఏపీసెజ్ తెలిపింది. నిర్దిష్ట మైలురాళ్లను అధిగమించాకా 5.5 ఏళ్ల తర్వాత మరో రూ. 270 కోట్లు చెల్లించే ప్రాతిపదికన ఈ డీల్ ఉంటుందని పేర్కొంది. దీంతో ఎంటర్ప్రైజ్ విలువను రూ. 3,350 కోట్లుగా లెక్కగట్టినట్లవుతుంది. గోపాల్పూర్ పోర్టు కొనుగోలుతో తమ కస్టమర్లకు మరింతగా సమగ్రమైన సేవలు అందించేందుకు వీలవుతుందని ఏపీసెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు. దీనితో ఒడిశాలోని మైనింగ్ హబ్‌లు, పొరుగు రాష్ట్రాలు అందుబాటులోకి రాగలవని, తద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తమ లాజిస్టిక్స్ సేవలను విస్తరించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఏపీసెజ్‌కి ప్రస్తుతం తూర్పు, పశ్చిమ తీరాల్లో పద్నాలుగు పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి. 20 మిలియన్ టన్నుల సామర్థ్యం.. ఒరిస్సాలోని గంజాం జిల్లాలో 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో గోపాల్పూర్ పోర్టు పని చేస్తోంది. ఇనుప ఖనిజం, బొగ్గు, అల్యూమినా మొదలైన కార్గోను హ్యాండిల్ చేస్తోంది. ఇటీవలే ఇది ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెరి్మనల్‌ను నెలకొల్పేందుకు పెట్రోనెట్ ఎల్ఎన్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో జీపీఎల్ 11.3 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ద్వారా రూ. 520 కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని అంచనాలు ఉన్నాయి. అసెట్ మానిటైజేషన్‌పై ఎస్పీ దృష్టి.. రూ. 20,000 కోట్ల రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ఎస్పీ గ్రూప్ గత కొన్నాళ్లుగా అసెట్ మానిటైజేషన్ (ఆస్తులను విక్రయించడం లేదా, లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం)పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తార్ పోర్టును రూ. 710 కోట్ల విలువకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి విక్రయించింది. 2015లో దీన్ని కొనుగోలు చేసిన ఎస్పీ గ్రూప్.. ఆ తర్వాత కార్యకలాపాలను టర్న్అరౌండ్ చేయగలిగింది. వార్షిక సామర్థ్యాన్ని 1 ఎంటీపీఏ నుంచి 5 ఎంటీపీఏకి పెంచింది. ఇక గోపాల్పూర్ పోర్టు ఒప్పందం గత కొద్ది నెలల్లో రెండో డీల్. రెండు పోర్టులను గణనీయమైన విలువకు విక్రయించడమనేది అసెట్స్‌ను టర్న్అరౌండ్ చేయడంలోను, స్వల్పకాలంలోనే వాటాదారులకు మెరుగైన రాబడులు అందించడంలోనూ తమకు గల సామర్థ్యానికి నిదర్శనమని ఎస్పీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. -
రూ.3 వేలకోట్లతో మరో పోర్టును కొనుగోలు చేసిన అదానీ
భారత్‌లోని ప్రైవేట్ పోర్టులను ఒక్కొక్కటిగా అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తూ వస్తోంది. కొన్నింటిలో అధిక వాటాలను కలిగి ఉంది. తాజాగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్(ఏపీసెజ్) ఒడిషాలోని గోపాల్పూర్ పోర్టులో మేజర్‌వాటాను కొనుగోలు చేసినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మంగళవారం ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్ల విలువకు దీన్ని అదానీ గ్రూప్‌నకు విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తెలిపింది. ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్పీ గ్రూప్ 2017లో కొనుగోలు చేసింది. గోపాల్పూర్ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు. గ్రీన్‌ఫీల్డ్ ఎల్ఎన్జీ రీ గ్యాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు ఇటీవలే పెట్రోనెట్ ఎల్ఎన్జీతో ఈ రేవు ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని సమకూరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. గత కొన్ని నెలల్లో నౌకాశ్రయాల నుంచి ఎస్పీ గ్రూప్ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తర్ పోర్టును రూ.710 కోట్లకు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు విక్రయించింది. దీన్ని 2015లో కొనుగోలు చేసి వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్ టన్నుల నుంచి ఐదు మిలియన్ టన్నులకు పెంచింది. అప్పులను తగ్గించుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంలో ఈ పెట్టుబడుల ఉపసంహరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. తద్వారా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా తమ కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ గ్రూప్‌పై దాదాపు రూ.20 వేల కోట్ల రుణభారం ఉందని తెలిసింది. ఇప్పటికే ముంద్రాపోర్టు, కృష్ణపట్నం పోర్టు, కరైకల్ పోర్టు, హజిరా పోర్టు, ధామ్రా పోర్టు..వంటి ప్రధాన పోర్టుల్లో అదానీ గ్రూప్ గరిష్ఠ వాటాలు కలిగి ఉంది. ఇదీ చదవండి: మహిళలకు ప్రభుత్వ బ్యాంక్ ప్రత్యేక క్రెడిట్‌కార్డులు.. -
కులశేఖరపట్నం నుంచి నేడు ఇస్రో తొలి ప్రయోగం
సూళ్లూరుపేట: ఇస్రో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో మరో స్పేస్ పోర్టును సిద్ధం చేస్తోంది. అక్కడి పోర్టు నుంచి బుధవారం రోహిణి సౌండింగ్ రాకెట్–200ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్‌లో భారీ ప్రయోగాలు చేయనున్న ఇస్రో చిన్న ప్రయోగాలు, వాణిజ్యపరమైన ప్రయోగాలు, ఎస్ఎస్ఎల్వీలాంటి చిన్నతరహా రాకెట్లు, ప్రైవేట్ సంస్థలకు చెందిన రాకెట్లను ప్రయోగించేందుకు కులశేఖరపట్నంలో రాకెట్ కేంద్రాన్ని సిద్ధం చేస్తోంది. ఐదారేళ్ల క్రితమే తూర్పుతీర ప్రాంతంలో రెండో స్పేస్ పోర్టు నిర్మించాలనే ఉద్దేశంతో స్థలాన్వేషణ చేశారు. అదే సమయంలో కృష్ణా జిల్లా నాగాయలంకను పరిశీలించారు. అక్కడి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నం వద్ద భూములను పరిశీలించారు. వెంటనే స్థలసేకరణ జరిపారు. స్పేస్ పోర్టు ఏర్పాటు చేసేటపుడు ముందుగా సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు చేసి అక్కడ గ్రావిటీ పవర్, సముద్రపు వాతావరణం, భూమికి అతితక్కువ దూరంలో వాతావరణంలో తేమలాంటి అంశాలపై అధ్యయనం చేస్తారు. కులశేఖరపట్నం నుంచి రోహిణి సౌండింగ్–200 రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు సూళ్లూరుపేటలోని శ్రీహరికోట సెంటర్ నుంచి 40 మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు తరలి వెళ్లారు. -
అభివృద్ధికి కేరాఫ్ గా లంగరురేవు యాంకరేజ్ పోర్ట్
-
లండన్ థేమ్స్‌లా మూసీ అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయని.. హైదరాబాద్‌కు కూడా అటువంటి ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అటు మూసీ నది వెంబడి, హుస్సేన్‌సాగర్ చుట్టూ, ఉస్మాన్‌సాగర్ వంటి జలాశయాలు కేంద్రంగా హైదరాబాద్ అభి వృద్ధి చెందిందని చెప్పారు. మూసీకి పునర్వై భవం తీసుకొస్తే.. నది, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తివంతంగా తయారవుతుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపక ల్పనలో భాగంగా.. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ బృందం బ్రిటన్‌లోని లండన్‌లో పర్యటించింది. ఆ నగరంలోని థేమ్స్ నదిని పరిశీలించి.. దానిని నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు. తర్వాత థేమ్స్ నది పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు సమా వేశమై చర్చించారు. విజన్ 2050కి అనుగుణంగా మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నామని, దీనికి సహకరించాలని సీఎం రేవంత్ కోరారు. అభివృద్ధితోపాటు సంరక్షణకు ప్రాధాన్యం దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్కెహల్ లివీ తదితరులు సీఎం రేవంత్ బృందానికి వివరించారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, అనుసరించిన విధానాలను తెలిపారు. నదీ ఒడ్డున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నది సంరక్షణకు ప్రాధాన్యమి చ్చినట్టు స్పష్టం చేశారు. నదీ జలాలను సుస్థిరంగా ఉంచటంతోపాటు స్థానికులకు ఎక్కువ ప్రయోజన ముండే రెవెన్యూ మోడల్‌ను ఎంచుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు తాము పూర్తిగా సహకరిస్తా మని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఔట్ లైన్, వివిధ సంస్థల భాగ స్వామ్యంపై చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని నిర్ణయించారు. సమావేశంలో సీఎం రేవంత్‌పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత సంతతి బ్రిటన్ ఎంపీలతో రేవంత్ భేటీ దావోస్ పర్యటన ముగించుకుని లండన్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి భారత సంతతి ఎంపీలతో సమావేశమయ్యారు. ఓల్డ్ వెస్ట్ మినిస్టర్ పార్లమెంటు భవనంలో లేబర్ పార్టీకి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ ఆతిథ్యమిచ్చిన ఈ భేటీలో.. ఏడుగురు బ్రిటన్ ఎంపీలతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భారత్–బ్రిటన్ దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్యబంధం ఉందన్నారు. ఇరు దేశాలు మహాత్మాగాంధీ సందేశాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. -
ఆ ఊరిలో నాలుగొందలకుపైగా ఇళ్లు ఉన్నాయ్! కానీ సడెన్‌గా..
కొన్ని చూడటానికి చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతలా అంటే అప్పటిదాక మాములుగా ఉన్నది కూడా సడెన్‌గా వింతగా మారిపోతుంది. ఏంటన్నది కూడా తెలియదు. అచ్చం అలాంటిదే ఈ ఊరిలో జరిగింది. చుట్టూ జనసంచారం ఉన్నా అక్కడ జనం ఎవరూ ఎందుకు ఉండరో తెలియదు. పైగా అక్కడ వందలకు పైగా ఇళ్లు అన్ని వనరులు ఉండి ఉండకపోవడం ఏంటీ? అనిపిస్తోంది కదా. ఈ గమ్మతైన ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఆ ఊళ్లో నాలుగువందలకు పైగానే ఇళ్లు ఉన్నాయి. అయినా ఆ ఊళ్లో ఇప్పుడు ఉంటున్నది నలుగురు మనుషులు మాత్రమే! స్కాట్లండ్‌లో గ్లాస్గో నగరానికి చేరువలో ఉన్న ఈ ఊరి పేరు క్లూన్ పార్క్. నిజానికి ఇది ఒక టౌన్షిప్. రేవులో పనిచేసే కార్మికుల వసతి కోసం దీనిని 1918–20 కాలంలో నిర్మించారు. ప్రస్తుతం నిర్మానుష్యంగా మారిన ఈ ఊరు ‘స్కాట్లండ్ చెర్నోబిల్’గా పేరుమోసింది. అలాగని ఇక్కడేమీ అణు ప్రమాదమేదీ జరగలేదు. అప్పట్లో రేవు కార్మికుల కోసం ఇక్కడ 430 ఫ్లాట్లతో 45 అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించారు. వారి సౌకర్యం కోసం ఒక బడి, చర్చ్, షాపింగ్ కాంప్లెక్స్ వంటివి కూడా నిర్మించారు. స్టీవ్ రోనిన్, కైల్ ఉర్బెక్స్ అనే వ్లాగర్లు రెండేళ్ల కిందట ఈ విచిత్రమైన ఊరి గురించి వెలుగులోకి తెచ్చారు. ఈ ఫ్లాట్లలోంచి బయటకు చూస్తే మాత్రం సమీపంలోని రోడ్లపై వాహనాల సంచారం మామూలుగానే కనిపిస్తుంది. ఈ టౌన్షిప్ ప్రాంతంలోనే జనసంచారం కనిపించదు. ‘ప్రస్తుతం ఈ ఫ్లాట్లలో నలుగురం మాత్రమే మిగిలున్నాం. నేనైతే ఇక్కడి నుంచి వెళ్లాలనుకోవడం లేదు. ఇటీవలే ఒకరు తన ఫ్లాట్‌ను 7000 పౌండ్లకు (రూ. 7.39 లక్షలు) అమ్ముకుని వెళ్లిపోయారు’ అని ఇక్కడ చాలాకాలంగా ఉంటున్న మార్షల్ క్రేగ్ తెలిపాడు. చాలాకాలంగా ఈ ఫ్లాట్లు ఖాళీగా పడి ఉండటంతో భూతగృహాల్లా తయారయ్యాయి. కొందరు దుండగులు ఈ టౌన్‌షిప్‌లోని బడి, చర్చ్ వంటి ఉమ్మడి కట్టడాలకు నిప్పుపెట్టారు. క్లూన్పార్క్ టౌన్‌షిప్‌లోని పాతబడిన కట్టడాలను పూర్తిగా పడగొట్టి, ఇక్కడ కొత్త భవంతులను నిర్మించడానికి గ్లాస్గోకు చెందిన ఇన్వర్సైకిల్ కౌన్సిల్ 2011లో ప్రతిపాదనలను సిద్ధం చేసినా, ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. (చదవండి: బొటానికల్ వండర్! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?) -
శ్రీకాకుళం భాగ్యరేఖ.. మూలపేట పోర్టు
సాక్షి, అమరావతి: వెనుకబడ్డ ఉత్తరాంధ్ర తలరాతను మార్చే మరో పోర్టు వేగంగా రూపుదిద్దుకుంటోంది. వలస జిల్లా పేరు నుంచి ఉపాధి కల్పించే జిల్లాగా శ్రీకాకుళం పేరును మార్చే మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాకు రెండు వేల కోట్ల రూపాయలకు మించి పెట్టుబడులు రాలేదు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా మూలపేట పోర్టు, మంచినీళ్లపేట, బుడగల్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి రూ. 5,000 కోట్లు పైనే వ్యయం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల్లో ఒకటైన మూలపేట మన రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాల నుంచి ఎగుమతులు దిగుమతులకు అనువుగా ఉంటుందని.. ఇలాంటి కీలకమైన ప్రదేశంలో మూలపేట ఉందని ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పోర్టు ద్వారా ఐదు రాష్ట్రాల్లోని పరిశ్రమలు తమకు అవసరమైన ముడి సరుకులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్, ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మూలపేట పోర్టు పనులను ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అన్ని అనుమతుల తర్వాత అన్ని అనుమతుల తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించడంతో పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. పోర్టులో కీలకమైన సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 19.40 లక్షల టన్నులు, నార్త్ బ్రేక్ వాటర్ నిర్మాణానికి 2.71 లక్షల టన్నుల బండరాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా ఇప్పటికే 8.3 లక్షల టన్నుల బండరాళ్లను తరలించారు. ఇదే సమయంలో జనరల్ బెర్త్ నిర్మాణ పనులు, తీర ప్రాంతం పటిష్టం చేయడం, ఎన్‌హెచ్ 16ను అనుసంధానం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో నాలుగు బెర్తులు పోర్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,361.91 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును విశ్వసముద్ర కన్సార్టియం చేపట్టింది. రూ. 2,949.70 కోట్ల వ్యయంతో తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనను విశ్వసముద్ర అభివృద్ధి చేయనుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా తొలిదశలో నాలుగు బెర్తుల నిర్మాణంతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. మొత్తం నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూలపేట పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణరూపంలో సమీకరిస్తున్నారు. 596 కుటుంబాల తరలింపు పోర్టు నిర్మాణం కోసం విష్ణుచక్రం, మూలపేట గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరిని ఒక కుటుంబంగా పరిగణించి వారికి కస్త నౌపాడ వద్ద పునరావాస గ్రామం అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ. 149 కోట్లు్ల వ్యయం చేస్తోంది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద అక్కడ 13 రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి విద్యుత్, తాగునీరు కనెక్షన్లను ఏర్పాటు చేయడం పూర్తయింది. త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్‌ను కేటాయించి ఇంటి నిర్మాణాలను ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మూలపేట పోర్టు స్వరూపం ప్రాజెక్టు వ్యయంరూ.4,361.91 కోట్లు తొలి దశ పోర్టు:23.5 ఎంటీపీఏ తుది దశ పోర్టు:83.3 ఎంటీపీఏ తొలి దశలో బెర్తుల సంఖ్య 4 నౌక పరిమాణం:1,20,000 డీడబ్ల్యూటీ అవసరమైన భూమి:1,254.72 ఎకరాలు దక్షిణ బ్రేక్ వాటర్:2,455 మీటర్లు ఉత్తర బ్రేక్ వాటర్: 580 మీటర్లు తీరం రక్షణ:1,000 మీటర్లు డ్రెడ్జింగ్: 15.85 మిలియన్ క్యూబిక్ మీటర్లు అప్రోచ్ చానల్:3.3 కి.మీ నీరు: గొట్టా బ్యారేజీ నుంచి 0.5 ఎంఎల్డీ నీటి సరఫరా రైల్: 10.6 కి.మీ రైల్వే లైన్ నిర్మాణం రహదారి: ఎన్‌హెచ్16ను అనుసంధానం చేస్తూ 13.8 కి.మీ. నాలుగులేన్ల రహదారి నిర్మాణం కార్యకలాపాలు ప్రారంభం: అక్టోబర్, 2025 శ్రీకాకుళం ఇక సిరుల జిల్లా ఇంతకాలం శ్రీకాకుళం అంటే వలసలు గుర్తుకు వచ్చేవి. కానీ మూలపేట పోర్టు రాకతో స్థానికులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేగాక వేరే ప్రాంతం వారికి కూడా ఇక్కడ ఉపాధి కల్పించే సిరుల జిల్లాగా రూపాంతరం చెందుతుంది. కేవలం పోర్టులే కాకుండా వాటిపక్కనే పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రమోట్ చేస్తున్నాం. కొత్తగా వస్తున్న నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లతో రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలతో పోటీ పడుతుంది. రెండు లక్షల టన్నుల బరువు ఉండే భారీ ఓడలను తీసుకువచ్చే విధంగా ఈపోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. – కాయల వెంకటరెడ్డి, చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డు 6 నెలలు ముందుగానే అందుబాటులోకి పోర్టు శంకుస్థాపన జరిగిన 8 నెలల్లో రికార్డు స్థాయిలో పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే నార్త్ బ్రేక్ వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సౌత్ బ్రేక్ వాటర్ పనులు 50 శాతంపైగా పూర్తయ్యాయి. వాస్తవంగా ఈ ప్రాజెక్టును అక్టోబర్ 2025 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా సీఎం ఆదేశాలు మేరకు ఆరు నెలలు ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆ మేరకు ప్రణాళికలను సిద్ధం చేశాం. డ్రెడ్జింగ్ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 350 కోట్లతో చైనా నుంచి డ్రెడ్జింగ్ మిషన్ కొనుగోలు చేశాం. త్వరలోనే డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించనున్నాం. –చావల బాబురావు, ఎండీ, మూలపేట పోర్టు భావితరాలకు మేలు చేకూరుతుంది భావితరాలకు మేలు చేకూరుతుందని మూలపేట పోర్టుకు మాభూములు, ఇళ్లు, గ్రామాన్ని ఇచ్చాము. జిల్లా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు గర్వంగా ఉంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడే పని దొరుకుతుంది. – గిన్ని భైరాగి, విష్ణుచక్రం గ్రామం పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది మూలపేట పోర్టు రావడం వల్ల మరికొన్ని అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వస్తాయి. దీంతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. యువకులకు ఉద్యోగ, ఉపాధి కలిగి వలసనివారణ జరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాము. – కనిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నౌపడ పోర్టుతో భూముల ధరలు పెరిగాయి మూలపేట పోర్టుతో ఈ ప్రాంత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. సెంటు భూమి రూ. 1.50లక్షల నుంచి రూ. 2లక్షలు వరకు పెరిగింది. పోర్టు పూర్తి అయితే ఈ ప్రాంతం అంతా పారిశ్రామిక వాడగా మారుతుంది. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. – కర్రి కాంతారావు, రైతు, నౌపడ -
జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ
భారతదేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో తయారైన వస్తువుల ఎగుమతులు రెట్టింపవుతున్నాయి. దాంతోపాటు దేశీయ అవసరాలకు విదేశాల నుంచి వస్తున్న దిగుమతులు హెచ్చవుతున్నాయి. ఈ వస్తురవాణా వివిధ మార్గాల్లో జరుగుతోంది. దేశంలో అధికంగా తీరప్రాంతం ఉంది. కాబట్టి ఎక్కువ వస్తువులు జలమార్గంలో పోర్ట్‌ల ద్వారా రవాణా చేస్తున్నారు. తాజాగా ముంద్రాలోని అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నవంబర్ నెలకుగాను గరిష్ఠంగా 3,00,000 కంటైనర్లను సరఫరా చేశారు. అదానీ పోర్ట్ సెజ్(ఏపీ సెజ్) టెర్మినల్ నవంబర్ 2023లో 97 నౌకల్లో 3,00,431 ట్వెంటీ ఫుట్ ఈక్వాలెంట్ యునిట్(టీఈయూ)లను సరఫరా చేసి జాతీయ రికార్డును సృష్టించింది. మార్చి 2021లో ప్రతిరోజూ దాదాపు 10,000 చొప్పున 2,98,634 టీఈయూలను నెలలో సరఫరా చేసి రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం తన రికార్డును తాజాగా 3 లక్షల కంటైనర్ల సరఫరాతో తనే బద్దలుకొట్టింది. అంతేకాకుండా, ఏపీ సెజ్‌కు చెందిన ధమ్రా, ఎన్నూర్ పోర్ట్‌లు కూడా అత్యధిక నెలవారీ వాల్యూమ్లను నమోదు చేశాయి. వరుసగా 3.96 ఎంఎంటీ, 65,658 టీఈయూలను సరఫరా చేశాయి. ఏపీ సెజ్ కార్గో వాల్యూమ్లలో 36 ఎంఎంటీతో 42 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇదీ చదవండి: టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే.. ఏపీ సెజ్ ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎనిమిది నెలల్లో 275 ఎంఎంటీ కార్గోను నిర్వహించాయి. అదానీ పోర్ట్స్ షేర్లు ఈరోజు ప్రారంభంలో 4.45 శాతం పెరిగి రూ.864.40 వద్ద ట్రేడవుతున్నాయి. సెప్టెంబర్ 2023 నాటికి, అదానీ గ్రూప్ సంస్థలో ప్రమోటర్లు 65.53 శాతం వాటాను కలిగి ఉన్నారు. -
పోర్టుల చుట్టూ పారిశ్రామిక ప్రగతి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని వెలకట్టలేని సంపదగా భావిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి అనుకూలతగా మార్చుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు ఆ పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని వెదచల్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. కొత్తగా ఏర్పాటుచేస్తున్న పోర్టుల పక్కన పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేయడంపై దృష్టిసారించింది. ముందుగా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసి కొత్త సంవత్సరంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలో పోర్టు అందుబాటులోకి రానుండటంతో రామాయపట్నం పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కును ఏపీమారిటైమ్ బోర్డు అభివృద్ధి చేస్తోంది. పోర్టు ఆథారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టిసారించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకోసం భూ సేకరణ ప్రక్రియ మొదలు పెట్టినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు ఎండీ, సీఈవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరు గ్రామంలో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. రూ.3,736 కోట్లతో 850.79 ఎకరాల వీస్తీర్ణంలో ఏడాదికి 34.04 మిలియన్ టన్నుల సామర్థ్యంతో రామాయపట్నం తొలి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. రూ.2,634.65 కోట్ల విలువైన పోర్టు నిర్మాణ కాంట్రాక్ట్‌ను నవయుగ–అరబిందో భాగస్వామ్య కంపెనీ చేపట్టింది. జూన్, 2022లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ సంస్థ ఈ ఏడాది చివరినాటికి బల్క్ కార్గో బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం 4 బెర్తులు నిర్మిస్తుండగా అందులో 2 మల్టీపర్పస్ బెర్తులు జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా, ఒక మల్టీపర్పస్ బెర్తు ఇండోసోల్ క్యాపిటివ్ (సొంత) అవసరాలకు ప్రభుత్వం కేటాయించింది. బల్క్ కార్గో బెర్త్‌ను ఏపీ మారిటైమ్ బోర్డు నిర్వహించనుంది. పోర్టు పక్కనే కార్గో ఎయిర్ పోర్ట్ కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆథారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టిసారించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన సమీక్షలో అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో కార్గో ఆధారిత ఎయిర్‌పోర్టు నిర్మాణంపైన కూడా ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా గతంలో ప్రతిపాదించిన దగదర్తి స్థానంలో కార్గో ఆధారిత విమానాశ్రయాన్ని రామాయపట్నం పోర్టుకు సమీపంలోని తెట్టు వద్ద అభివృద్ధి చేయనున్నారు. జాతీయ రహదారి ఎన్‌హెచ్ 16కి తూర్పువైపు పోర్టు ఉంటే, పడమర వైపు ఎయిర్‌పోర్టు ఉండే విధంగా డిజైన్ చేశారు. -
పోర్టు పరిసరాల్లో కాలుష్యానికి చెక్
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా విశాఖపట్నం పోర్టు అథారిటీ, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. పోర్టు చైర్మన్ డా.అంగముత్తు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ రాజశేఖర్‌రెడ్డి ఈ ఒప్పంద పత్రాలపై శనివారం సంతకాలు చేశారు. విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవడంతో పాటు పోర్టు పరిసర ప్రాంతాలలో గాలి కాలుష్యాన్ని తగ్గించటం, కార్బన్ ఉద్గారాలను నిలువరించడమే ఈ ఎంవోయూ ముఖ్య ఉద్దేశమని చైర్మన్ డా.అంగముత్తు తెలిపారు. ఒప్పందంలో భాగంగా విశాఖపట్నం పోర్టు పరిసరాలలో గ్రీన్ బెల్ట్‌ను అభివృద్ధి చేయడం, పోర్టుకు వెళ్లే ప్రధాన జంక్షన్లలో రోడ్డు డివైడర్ల వద్ద పచ్చదనాన్ని పెంపొందించడం, పోర్టు కార్యాలయాలలో అవసరమైన మేరకు ల్యాండ్ స్కేపింగ్ చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తదితర పనులను ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చేస్తుందని ఎండీ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దూబే, చీఫ్ ఇంజినీర్ వేణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ
దొండపర్తి(విశాఖ దక్షిణ): దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటని నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం అన్నారు. అందుకే నీతి ఆయోగ్ పైలట్ నగరాల జాబితాలో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖకు స్థానం కల్పించినట్లు చెప్పారు. మంగళవారం విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పరిశ్రమల శాఖ అధికారులతో వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడి సహజవనరులతో పాటు రైల్వే, పోర్టు కనెక్టవిటీలు, విమానాశ్రయం విశాఖపట్నం అభివృద్ధికి మరింత దోహదపడుతాయన్నారు. విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నగర అభివృద్ధి కోసం ఆర్థిక ప్రణాళికలు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విశాఖ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. నగర ప్రణాళిక, పర్యాటకం, విద్య, ప్రజారోగ్యం, ఈ–గవర్నెన్స్ తదితర అంశాలపై సాధించిన ప్రగతిని తెలియజేశారు.బీఆర్టీఎస్ నెట్వర్క్, నగరవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థ వివరాలను వివరించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా బీచ్ రోడ్డులో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే పరిశ్రమలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల పరిస్థితులను తెలియజేశారు. విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు మాట్లాడుతూ.. ఒడిశా, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన పలు ఎగుమతులు, దిగుమతులు కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు పార్థసారధి, పరిశ్రమల శాఖ జీఎం సి.హెచ్.గణపతి, టూరిజం ఆర్డీ శ్రీనివాసరావు, సీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రూ.1.23 లక్షల కోట్లతో పోర్టు కార్యకలాపాలు జరుగుతున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖల మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. వీటితో 113 ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. ఇందులో ఇప్పటివరకు 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. విశాఖ పోర్టు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను సోమవారం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విశాఖ పోర్టును సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని, ఆధునికీకరణ, యాంత్రీకరణతో మెరుగు పరుస్తున్నామని వివరించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. -
మచిలీపట్నంలో శరవేగంగా జరుగుతున్న పోర్టు నిర్మాణపనులు
-
సీఎం జగన్‌ను కలిసిన విశాఖపోర్ట్ అథారిటీ నూతన చైర్మన్
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నూతన చైర్మన్ ఎం. అంగమత్తు(ఐఏఎస్) సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిశారు. ఇటీవలే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నూతన చైర్మన్‌గా అంగమత్తు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను అంగమత్తు మర్యాద పూర్వకంగా కలిశారు. దీనిలో భాగంగా అంగమత్తును పూల బొకేతో ఆహ్వానించిన సీఎం జగన్.. ఆపై విశాఖపట్నం పోర్ట్ ప్రతిమను అందజేశారు. -
పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి
-
బందరు పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
అఖిల్ బాబు కామెడీ అయ్య బాబోయ్..
-
కాకినాడలో ఏజెంట్ చిత్రబృందం సందడి (ఫొటోలు)
-
నికోబార్ వద్ద భారీ ట్రాన్స్షిప్మెంట్ కార్గో ప్రాజెక్ట్
న్యూఢిల్లీ: గ్రేట్ నికోరాబ్ ఐలాండ్ వద్ద బంగాళాఖాతంలో ‘ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్రాజెక్ట్’కు కేంద్ర షిప్పింగ్ శాఖ ఆసక్తి వ్యక్తీకరణలను (ఈవోఐ) ఆహ్వానించింది. పీపీపీ కాంట్రాక్ట్ సంస్థ, ప్రభుత్వ పెట్టుబడులు కలసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.41,000 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదిత పోర్ట్ ప్రాజెక్ట్ వార్షికంగా 16 మిలియన్ కంటెయినర్ల నిర్వహణ సామర్థ్యంతో ఉంటుందని తెలిపింది. మొదటి దశ రూ.18,000 కోట్లతో 2028 నాటికి పూర్తవుతుందని, 4 మిలియన్ టన్నులకు పైగా కంటెయినర్లను ఇది నిర్వహించగలదని వివరించింది. ఈ రవాణా పోర్ట్‌కు అనుబంధంగా ఎయిర్పోర్ట్, టౌన్షిప్, పవర్ ప్లాంట్ కూడా నిర్మించాలనేది ప్రణాళికగా షిప్పింగ్ శాఖ తెలిపింది. అంతర్జాతీయ జల రవాణా మార్గంలో ఈ పోర్ట్ ఏర్పాటు కానుందని, ఇదే మార్గంలో ప్రస్తుతం సింగపూర్, క్లాంగ్, కొలంబో పోర్ట్‌లు ఉన్నట్టు పేర్కొంది. -
ముంబై, గుజరాత్ తీరాల్లో రూ.852 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై/అహ్మదాబాద్: వేర్వేరు తీరప్రాంతాల్లో రూ.852 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. మహారాష్ట్రలోని నవీ ముంబై పొరుగున ఉండే నహావా షెవా నౌకాశ్రయంలో ఆపిల్ పండ్ల కంటైనర్‌లో యాభై కేజీల అత్యంత నాణ్యమైన కొకైన్ మాదకద్రవ్యాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇటుకల్లా ఒక్కోటి కేజీ బరువుండేలా ప్యాక్చేసిన డ్రగ్స్‌ను గ్రీన్ ఆపిల్స్ మధ్యలో అధికారులు కనుగొన్నారు. సముద్రమార్గ కంటైనర్లలో ఇంతటి భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి స్మగ్లర్లు భారత్‌కు తరలించారు. మొత్తంగా 50.23 కేజీల బరువున్న ఈ డ్రగ్స్ అంతర్జాతీయ విపణిలో ఏకంగా రూ.502 కోట్ల ధర పలుకుతాయని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. వశీలో ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బత్తాయి పండ్ల మాటున 198 కేజీల మెథ్, 9 కేజీల కొకైన్‌ను కంటైనర్‌లో తెప్పించిన దిగుమతిదారు వీటినీ తెప్పించాడు. గత వారం నమోదైన కేసులో ఇప్పటికే ఇతడిని పోలీసులు అరెస్ట్చేయడం తెల్సిందే. గుజరాత్లో మరో 50 కేజీలు పాకిస్తాన్ నుంచి వస్తూ గుజరాత్ తీరానికి దూరంగా సముద్రజలాల్లో అడ్డగించిన ఒక పడవలో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం, ఉగ్ర వ్యతిరేక దళాలు స్వాధీనంచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వేళ ఈ ఆపరేషన్ నిర్వహించారు. అల్ సకర్ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్తానీయులను అరెస్ట్‌చేసి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరభారతం, పంజాబ్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే పాకిస్తాన్ డ్రగ్ మాఫియా ఈ సరకును పంపించాడని తెలుస్తోంది. -
ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు దక్కింది. పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచింది. నీతి ఆయోగ్ సలహాదారు సుదేందు జె. సిన్హా నేతృత్వంలోని జ్యూరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవార్డుకి ఎంపిక చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకోనున్నారు. చదవండి: (లోన్‌యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్) -
భారత్ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్’
కొలంబో: చైనాకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధక నౌక శ్రీలంకలోని హంబన్‌తోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది. స్పై షిప్ రాకపై భారత్ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే పోర్టుకు చేరుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వాంగ్ యాంగ్ 5 నౌక శ్రీలంక పోర్టుకు చేరుకున్నట్లు హర్బర్ మాస్టర్ కెప్టెన్ నిర్మల్ డీ సిల్వా తెలిపారు. పొరుగు దేశంలో చైనా నౌక ఉండటంపై భారత్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో షిప్ రాకను వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించింది శ్రీలంక. అయితే, చైనా ఒత్తిడికి తలొగ్గి గత శనివారం అనుమతులు జారీ చేసింది. ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ‘చైనాకు చెందిన వాంగ్ యాంగ్ 5 నౌక నిర్వహణలో పొరుగు దేశం భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందరి ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.’ అని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. అంతకు ముందు భారత్, అమెరికాల ఆందోళనలను తప్పుపట్టింది చైనా. శ్రీలంకపై ఒత్తిడి పెంచేందుకు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తటం పూర్తిగా అసంబద్ధమని పేర్కొంది. చైనా సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్ధమైన కోణంలో చూడాలని, చైనా, శ్రీలంక మధ్య సహకారానికి అంతరాయం కలిగించకుండా ఆపాలని సంబంధిత పక్షాలను కోరుతున్నామని చెలిపారు డ్రాగన్ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. ఇదీ చదవండి: భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి -
శ్రీలంక పోర్టుకు చైనా షిప్.. స్పందించిన భారత్!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతోంది శ్రీలంక. కొలంబో సంక్షోభానికి చైనా కుట్రపూరిత రుణాలేనని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే.. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో మళ్లీ తన లీలలు మొదలు పెట్టింది చైనా. తన అధీనంలో ఉన్న శ్రీలంక దక్షిణ ప్రాంతంలోని హమ్‌బన్‌తోటా పోర్టుకు పరిశోధన, సర్వే నౌకను పంపిస్తోంది. అది ఆగస్టు 11న శ్రీలంక నౌకాశ్రయానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో స్పందించింది భారత్. పరిస్థితులను ఎప్పటికప్పుడు సునిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. చైనా నౌక సోమవారం పోర్టుకు వచ్చే అంశంపై కేబినెట్ చర్చించినట్లు శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధి బందులా గుణవర్ధెన పేర్కొన్నారు. ‘తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో భారత్, చైనాలు మాకు సాయం అందించాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. చైనా వల్లే దేశంలో పరిస్థితులు దిగజారాయనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిరసన క్యాంపులను ఖాళీ చేసేందుకు ససేమిరా.. శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్ష భవనం సమీపంలోని గాలే ఫేస్ నిరసన క్యాంప్‌ను శుక్రవారం సాయంత్రానికి ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే.. వాటిని తిరస్కరించారు నిరసనకారులు. నిరసనలు కొనసాగుతాయని, క్యాంపులను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఖాళీ చేయించేందుకు పోలీసుల వద్ద కోర్టు ఆదేశాలు లేవని పేర్కొన్నారు. గతంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ ప్రాంతాన్ని నిరసనలు చేసుకునేందుకు అనుమతించారని గుర్తు చేశారు. ఇదీ చదవండి: Raghuram Rajan: అందుకే భారత్‌కు శ్రీలంక పరిస్థితి రాలేదు -
AP: పోర్టుల ఖిల్లాగా సింహపురి
చరిత్ర గడ్డగా మిగిలిపోయిన సింహపురి పోర్టుల ఖిల్లాగా మారనుంది. ఆ నాడు కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఈ రోజు రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్ పోర్టు, క్రిస్ సిటీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింహపురిని ప్రపంచ పటంలో చేర్చారు. సీ, ఎయిర్‌పోర్టులతో జిల్లా పారిశ్రామికంగా, వ్యాపారపరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టులతో కావలి కనకపట్నంగా మారనుంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విశాలమైన సాగర తీరం.. మెండుగా ఉన్న భూములు సింహపురి చరిత్ర గతిని మార్చేసింది. ఓ వైపు కృష్ణపట్నం పోర్టు, సెజ్లతో సింహపురి కీర్తి ప్రపంచస్థాయికి చేరింది. తాజాగా రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రానుండడంతో పారిశ్రామికాభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోడ్డు జల, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సరికొత్త హంగులతో కనెక్టివిటీ పెరగడంతో పారిశ్రామికవేత్తలు ఇటు వైపు చూస్తున్నారు. భవిష్యత్‌లో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. జిల్లాకే తలమానికంగా సోమశిల, కండలేరు జలాశయాలు, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. మరో వైపు రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్‌పోర్టులు రానున్నాయి. 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,736 కోట్లతో మొదటి దశ నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేపట్టనున్నారు. రూ.10,640 కోట్ల వ్యయంతో 3,437 ఎకరాల్లో 19 బెర్త్‌లతో రామాయపట్నం పోర్టు తుది రూపు దిద్దుకోనుంది. 36 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి ఓడరేవు ప్రయోజనాలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా, గ్రానైట్, పొగాకు, ఐరన్ ఓర్ అనేక ముడి ఖనిజాలు ఎగుమతులకు ఈ పోర్టు కీలకంగా మారనుంది. నాడు కృష్ణపట్నం– నేడు రామాయపట్నం నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణపట్నం పోర్టు నిర్మించగా, నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నారు. తండ్రి, తనయులు ఇద్దరు ఇటు ప్రజల మదిలో, అటు చరిత్రలో నిలిచేపోయేలా నౌకశ్రాయాలు ఏర్పాటు చేశారు. కందుకూరు, కావలి నియోజక వర్గాల సరిహద్దులోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గుడ్లూరు మండలంలోని మొండివారిపాళెం, ఆవులపాళెం, కర్లపాళెం, సాలిపేట, రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో మొదటి దశలో 850 ఎకరాల భూసేకరణను అధికారులు పూర్తి చేశారు. కనకపట్నంగా కావలి రామాయపట్నంపోర్టుతో ప్రధానంగా కావలి పట్టణం మరింతగా అభివృద్ధి చెందనుంది. రామాయపట్నం పోర్టు కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ కావలికి మరింత దగ్గరగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. కావలి తీరంలో దక్షిణం వైపు జువ్వలదిన్నె హార్బర్, ఉత్తరం వైపు రామాయపట్నం పోర్టులు నిర్మింతమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్ట్‌లకు అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయి. త్వరలోనే దగదర్తి ఎయిర్‌పోర్టు కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కావలి ప్రధాన పట్టణం కానుంది. భవిష్యత్‌లో కావలి కనక పట్నంగా మారుతుందని ఆ నాడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారని, అది త్వరలోనే రుజువు కాబోతుందని గుర్తు చేస్తున్నారు. -
అదానీ గ్రూప్ చేతికి ఇజ్రాయెల్ పోర్టు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని పోర్ట్ ఆఫ్ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సారి్టయం దక్కించుకుంది. దీనితో పోర్ట్ ఆఫ్ హైఫాను నిర్వహించే హైఫా పోర్ట్ కంపెనీలో 100 శాతం వాటాల కొనుగోలు హక్కులు కన్సార్షియంకు లభిస్తాయి. ఏపీసెజ్ ప్రకటన ప్రకారం ఇందులో అదానీ పోర్ట్స్‌కు 70 శాతం, గాడోట్ గ్రూప్‌నకు 30 శాతం వాటాలు ఉంటాయి. డీల్ విలువ 1.18 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,422 కోట్లు). ఏపీసెజ్‌ను అంతర్జాతీయంగా లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ కార్యకలాపాలతో పాటు రవాణా దిగ్గజంగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమైన అడుగని కంపెనీ సీఈవో కరణ్ అదానీ పేర్కొన్నారు. భారత్‌కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్య దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌లోనూ, అలాగే యూరప్‌లోని పోర్టుల రంగంలోనూ తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఇది తోడ్పడగలదని వివరించారు. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఏపీసెజ్‌తో భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడగలదని గాడోట్ సీఈవో ఓఫర్ లించెవ్‌స్కీ పేర్కొన్నారు. కార్గో హ్యాండ్లింగ్‌లో తమకు, పోర్టు కార్యకలాపాల నిర్వహణలో అదానీ గ్రూప్‌నకు అపార అనుభవాలు ఉండటం .. హైఫా పోర్టును మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయో గపడుతుందన్నారు. ఇజ్రాయెల్‌లో మూడో అతి పెద్ద నగరమైన హైఫాకి దగ్గర్లో పోర్ట్ ఆఫ్ హైఫా ఉంది. 2021లో ఇక్కడ 1.46 మిలియన్ల టీఈయూ (ట్వెంటీ ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్లు) కంటైనర్లను, 2.56 మిలియన్ టన్నుల కార్గోనూ హ్యాండిల్ చేశారు. మరోవైపు, అదానీ గ్రూప్‌లో రవాణా వ్యాపార విభాగంగా ఏపీసెజ్ కొనసాగుతోంది. -
అదానీ పోర్టు సరికొత్త రికార్డులు..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టుగా
దొండపర్తి (విశాఖ దక్షిణ): అదానీ పోర్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. కార్గో రవాణాలో 300 మిలియన్ మెట్రిక్ టన్నుల మైలురాయిని అధిగమించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీసెజ్)గా దేశ నౌకాశ్రయాల్లో రెండు దశాబ్దాల క్రితం కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలతో కార్గో రవాణాలో వృద్ధిని నమోదు చేస్తుండడం అదానీ పోర్ట్స్ సామర్థ్యానికి నిదర్శనమని ఏపీసెజ్ సీఈఓ అండ్ హోల్‌టైమ్ డైరెక్టర్ కరణ్ అదానీ పేర్కొన్నారు. ఏటా 100 మిలియన్ మెట్రిక్ టన్నులు(పోర్ట్‌ఫోలియోలో 5 పోర్టులతో) సరకు రవాణా సాధించడానికి 14 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. ఏపీసెజ్ తరువాత ఐదేళ్లలో దానిని రెట్టింపు చేసి ఏటా 200 మిలియన్ మెట్రిక్ టన్నులు (పోర్ట్‌ఫోలియోలో 9 పోర్టులతో) కార్గోను రవాణా చేసినట్లు తెలిపారు. ఇపుడు ఏపీసెజ్ పోర్ట్‌ఫోలియోలో 12 పోర్టులతో మూడేళ్లలోనే ఏటా 300 మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించిందని వివరించారు. కరోనా సమయంలోను, ప్రపంచ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. భారత తీరప్రాంతంలోని పోర్టుల నెట్‌వర్క్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపుతో పాటు సాంకేతికతతో కూడిన డిజిటలైజ్డ్ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. 2025 నాటికి 500 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యానికి చేరుకుంటామన్నారు. అలాగే 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టు కంపెనీగా ఎదుగుతుందని చెప్పారు. అదానీ పవర్ పునర్వ్యవస్థీకరణ న్యూఢిల్లీ: పూర్తి అనుబంధ సంస్థలు ఆరింటిని విలీనం చేసుకునే పథకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు అదానీ పవర్ తాజాగా వెల్లడించింది. కంపెనీకి చెందిన విభిన్నతరహా సొంత అనుబంధ సంస్థలను విలీనం చేసుకోనున్నట్లు తెలియజేసింది. విలీనం చేసుకోనున్న సంస్థల జాబితాలో అదానీ పవర్ మహారాష్ట్ర, అదానీ పవర్ రాజస్తాన్, అదానీ పవర్ ముంద్రా, ఉడు పి పవర్ కార్పొరేషన్, రాయ్‌పూర్ ఎనర్జెన్, రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్ ఉన్నట్లు పేర్కొంది. ఈ పథకం అమలుకు 2021 అక్టోబర్ 1ను ఖరారు చేయగా.. ఆరు సంస్థల ఆస్తులు, అప్పులు అదానీ పవర్‌కు బదిలీకానున్నట్లు వివరించింది. -
Union Budget 2022: విశాఖ ఉక్కుకు రూ.910 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు )కు కేంద్రం బడ్జెట్లో రూ.910 కోట్లు కేటాయించింది. వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు. విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, వైజాగ్ పోర్టు ట్రస్టుకు రూ.207 కోట్లు కేటాయించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గత బడ్జెట్‌తో పోలిస్తే పెరిగింది. గత బడ్జెట్లో రూ.30,356.31 కోట్లు వస్తే.. ఈ సారి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు రానుంది. దీంట్లో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.33.18 కోట్లు. చదవండిః చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం -
అమ్మకానికి ఒంటరి మేడ.. ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే..
ఎక్కడో దూరంగా కొండకోనల్లో ఉన్న గ్రామంలో ఉంటున్నారా? అయినా కూడా ఏకాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదా! అయితే ఈ సముద్రం మధ్యలోని బిల్డింగ్ మీకోసమే. పేరు స్పిట్బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్‌లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి. ఇందులో 9 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక వేడి టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్లు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! -
వొడాఫోన్-ఐడియాపై రిలయన్స్ జియో ఫిర్యాదు
టెలికాం కంపెనీలన్నీ ఈ మధ్య వరుసబెట్టి టారిఫ్ రేట్లు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే రకరకాల బాదుడులతో నలిగిపోతున్న సామాన్యులకు.. ఈ పెంపుతో మరో పిడుగు పడినట్లయ్యింది. అయితే ఇందులో ఇప్పుడు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వొడాఫోన్-ఐడియా(VIL) మీద రిలయన్స్ జియో ఏకంగా ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది తాజాగా.. వొడాఫోన్ ఐడియా తాజాగా 18-25 శాతం రేట్లను పెంచేసిన విషయం తెలిసిందే. అయితే తాజా టారిఫ్ ప్యాకేజీలో ఎంట్రీ లెవల్ కస్టమర్లను తమకు నచ్చిన నెట్‌వర్క్‌కు పోర్ట్ ద్వారా మారేందుకు వీలులేకుండా చేసిందనేది జియో ఆరోపణ. సాధారణంగా ఒక కస్టమర్ తన నెంబర్ నుంచి పోర్ట్ కావాలంటే పోర్ట్ రిక్వెస్ట్ ఎస్సెమ్మెస్ పంపించాలనే విషయం తెలిసిందే కదా. అయితే వొడాఫోన్‌లో ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ప్యాక్‌లో ఎస్సెమ్మెస్ పంపే వీలు లేకుండా పోయింది తాజా టారిఫ్‌లో. రూ.75 నుంచి 99రూ.కి 28 రోజుల వాలిడిటీ ప్యాక్ రేటును పెంచిన VIL.. అందులో ఎస్సెమ్మెస్ ఆఫర్ లేకుండా చేసింది. ఇక మెసేజ్‌లు పంపుకోవాలంటే రూ.179, అంతకంటే ఎక్కువ ప్యాకేజ్‌తో రీఛార్జ్ చేయాల్సిందే. సో.. పోర్ట్ మెసేజ్ పంపాలన్నా వొడాఫోన్ ఐడియా కస్టమర్లు కచ్చితంగా 179రూ.తో ముందు రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఇలా అత్యధిక ప్యాకేజీ రీఛార్జ్‌తో వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, కన్జూమర్ని తనకు నచ్చిన నెట్‌వర్క్‌కు పోర్ట్ కాకుండా అడ్డుకుంటోందని జియో తన ఫిర్యాదులో పేర్కొంది. జియో కంటే ముందు స్వచ్ఛంద సంస్థ ‘టెలికాం వాచ్డాగ్’ కూడా ట్రాయ్ Telecom Regulatory Authority of India కు ఇదే విషయమై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కన్జూమర్ హక్కుల్ని పరిరక్షించాల్సిన ట్రాయ్ ..ఈ విషయాన్ని ఎలా పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావట్లేదంటూ ఫిర్యాదులో పేర్కొంది కూడా. చదవండి: ‘ట్రాయ్ నిద్రపోతోందా?’.. జనాగ్రహం ఎంతలా ఉందంటే.. -
దుబాయ్‌లో భారీ పేలుడు; 35 కిమీ దూరం వినపడేలా
అబుదాబి: దుబాయ్‌లో బుధవారం అర్థరాత్రి దాటాకా భారీ పేలుడు సంభవించింది. జెబెల్ అలీ పోర్టులో ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలుడు సంభవించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒక్కటైన దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోర్టులోని ఓ కంటైనర్ షిప్‌కు మంటలు అంటుకోవడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పేలుడు సంభవించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాణిజ్య కేంద్రంలో ప్రకంపనలు సృష్టించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేరాలేదు. ఈ భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద శబ్దాలు వెలువడినట్లు పోర్టుకు దగ్గరలోని స్థానికులు తెలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా భారీ శబ్ధాలతో హడలెత్తినపోయారంటే పేలుడు తీవ్రత ఏం రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. #ÚLTIMAHORA Se produjo una gran explosión en el puerto de Dubai, Emiratos Árabes. Aún desconocen las causas. pic.twitter.com/OxROQzvTmP — EL IMPARCIAL (@elimparcialcom) July 7, 2021 #BREAKING: Another Video: - Huge Damage - Major explosion and fire at Jebel Ali Port, Dubai, UAE. Reports it was on an oil tanker. #BREAKINGNEWS #UAE #Dubai #SaudiArabia #MiddleEast #Israel #Iran #Iraq pic.twitter.com/W34gXzGfh5 — International Leaks (@Internl_Leaks) July 7, 2021 -
రూ. 2,000 కోట్ల హెరాయిన్ పట్టివేత
ముంబై: ఇరాన్ నుంచి సముద్రం ద్వారా ముంబైలోకి అక్రమంగా రవాణా చేస్తున్న 293.81 కిలోలు, అంతర్జాతీయ మార్కెట్లో రూ. 2,000 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకును నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుంచి రహదారి ద్వారా పంజాబ్‌కు రవాణా చేయాల్సి ఉంది, ఈ క్రమంలో అక్కడ అధికారులు దీనిని అడ్డుకుని ఆరు గన్నీ సంచుల్లో ఉన్న హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ ప్రకారం.. జప్తు చేసిన హెరాయిన్‌ను టాల్కమ్ రాళ్లతో రెండు కంటైనర్లలో దాచినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పంజాబ్‌లోని తరన్ టార్న్ ప్రాంతానికి చెందిన ప్రభుజిత్ సింగ్ అనే సరఫరాదారుని మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గత వారం జూన్ 28న ఢిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరుల నుంచి రూ.126 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.అంతే కాకుండా గత ఆరు నెలల్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి అధికారులు సోమవారం వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో ముంబై కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్‌లోని కార్గో కంటైనర్ నుంచి రూ.1,000 కోట్ల విలువైన 191 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సరుకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్త చేసిన సంగతి తెలిసిందే. -
ఆ బిల్లును అడ్డుకుందాం.. సీఎం జగన్‌కు లేఖ రాసిన స్టాలిన్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2021 ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని కోరుతూ 8 తీరప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తాజాగా లేఖ రాశారు. చిన్నతరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు(ఎంఎస్డీసీ) కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్‌వేస్ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్డీసీ ఈ నెల 24న సమావేశాన్ని తలపెట్టిందని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్ పోర్ట్స్ యాక్ట్–1908 ప్రకారం.. మైనర్‌పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి అధికారాలను ఎంఎస్డీసీకి బదిలీ చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోంది’’ అని స్టాలిన్ వెల్లడించారు. రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో సహా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే చిన్నతరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యమైన పాత్ర ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లును కలిసికట్టుగా అడ్డుకుందామని తీరప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ నెల 24న జరిగే ఎంఎస్డీసీ సమావేశంలో మన గళం వినిపిద్దామన్నారు. -
కరైకల్ పోర్టుపై అదానీ కన్ను..!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తాజాగా పుదుచ్చేరిలోని కరైకల్ పోర్టుపై కన్నేసినట్లు తెలుస్తోంది. కరైకల్ పోర్టు విలువను రూ. 1,500–2,000 కోట్లుగా పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే డీల్ కుదుర్చుకోవడం అంత సులభమేమీకాదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు యాజమాన్య వాటాలు, రుణాలు అడ్డంకికావచ్చని తెలియజేశాయి. కరైకల్ పోర్టు ప్రయివేట్(కేపీపీఎల్)కు మార్గ్ లిమిటెడ్ ప్రమోటర్కాగా.. 45 శాతం వాటాను కలిగి ఉంది. నాలుగు పీఈ సంస్థలు అసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్, జాకబ్ బాల్స్ క్యాపిటల్, అఫిర్మా క్యాపిటల్, జీఐపీ ఇండియా సంయుక్తంగా పీపీఎల్లో 44 శాతం వాటాను పొందాయి. మిగిలిన 11 శాతం వాటా ఎడిల్వీజ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ చేతిలో ఉంది. రుణాల్లో 97 శాతం కేపీపీఎల్ రుణ భారం రూ. 2,000 కోట్లు కాగా.. దీనిలో 97 శాతం ఎడిల్వీజ్ ఏఆర్సీ పీఎస్‌యూ బ్యాంకుల కన్సార్షియం నుంచి బదిలీ చేసుకుంది. దీంతో కేపీపీఎల్‌ను కొనుగోలు చేయాలంటే కంపెనీ విలువకు సంబంధించి ప్రమోటర్లు, పెట్టుబడిదారులు, రుణదాతల మధ్య అవగాహన కుదరవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి కేపీపీఎల్‌ను సొంతం చేసుకునే అంశం సంక్లిష్టమైనదిగా వ్యాఖ్యానించాయి. అవకాశాలిలా.. కేపీపీఎల్‌ను అదానీ పోర్ట్స్ కొనుగోలు చేసేందుకు రెండు అవకాశాలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటిలో తొలుత కంపెనీకున్న రుణ భార చెల్లింపునకు ఎడిల్‌వీజ్‌తో చర్చలు జరపడంతోపాటు.. వాటాదారులకు నగదు చెల్లింపు ద్వారా వాటాలను సొంతం చేసుకోవడం. అయితే ఇది వ్యయభరితమని తెలియజేశాయి. బలహీన ఆర్థికాంశాల రీత్యా కంపెనీ విలువ రూ. 1,500 కోట్లుగా అంచనా. రుణ భారం రూ. 2,000 కోట్లవరకూ ఉంది. ఈ డీల్ ప్రకారం చూస్తే అదానీ పోర్ట్స్ ఇటీవల కొనుగోలు చేసిన కృష్ణపట్నం, గంగవరం పోర్టులకంటే ఖరీదైన వ్యవహారంగా మిగలనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
covid-19: విశాఖ పోర్టుకు చేరిన సింగపూర్ సాయం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో మిత్ర దేశాల నుంచి భారత్‌కు అత్యవసర సేవలు అందుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్ తదితర మిత్ర దేశాలు సముద్ర సేతు పేరుతో అత్యవసర మందులు, వైద్య పరికరాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా ఐఎన్ఎస్ జలస్వ నౌక 18 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో ఆదివారం విశాఖలోని తూర్పు నౌకాదళ కేంద్రానికి చేరింది. వీటితో పాటు కోవిడ్ మందులు కూడా మిత్ర దేశాలు అందించాయి. సముద్ర సేతు 2లో భాగంగా ఈ సేవలు భారత్‌కు చేరాయి. చదవండి: మాకు కరోనా లేదు... పరీక్షలు చేయొద్దు -
‘హైదరాబాద్ చేరుకున్న అమ్మోనియం నైట్రేట్’
సాక్షి, హైదరాబాద్ : కట్టుదిట్టమైన భద్రత మధ్య చెన్నై పోర్టునుంచి అమ్మోనియం నైట్రేట్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. మొత్తం ఎనిమిది కంటైనర్లలో వచ్చిన అమ్మోనియం నైట్రేట్‌ను కీసరగుట్టలో సాల్వో ఎక్స్‌ప్లోజివ్ కంపెనీ నిల్వ చేసింది. అమ్మోనియం నైట్రేట్‌ను సాల్వో కంపెనీ రీప్రాసెస్ చేయనుంది. ఈ ప్రక్రియ తర్వాత కోల్ ఇండియా, సింగరేణి, నీటి పారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయనున్నారు. రెండో రోజుల్లో రీప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తవుతుందని సాల్వో కంపెనీ పేర్కొంది. (హైదరాబాద్‌కు ‘అమ్మో’నియం నైట్రేట్) అయితే ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్లో పేలుళ్ల తర్వాత అమ్మోనియం నైట్రేట్ నిల్వలపై భారత్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి. బీరుట్ పేలుళ్ల అనంతరం భద్రతా చర్యల్లో భాగంగా చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించారు. లెబనాన్ పేలుళ్లతో చెన్నై పోర్టు నుంచి హైదరాబాద్ తరలించినట్లు సాల్వో కంపెనీ పేర్కొంది. కాగా అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు తరలింపుపై సోమవారం ట్విట్టర్లో గవర్నర్ స్పందించిన విషయం తెలిసిందే. 'ఆదివారం రాత్రి అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలియడంతో ప్రజల భద్రత గురించి ఆందోళనకు గురయ్యాను. పరిస్థితిని అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడాను.' అని ట్విట్టర్లో తమిళిసై పేర్కొన్నారు. -
కలల ప్రాజెక్ట్.. నిర్లక్ష్యం ఎఫెక్ట్
గణనీయంగా తగ్గిపోయింది. పోర్ట్ కార ణంగా మత్స్య సంపద తగ్గిపోవడం, మత్స్యకారులకు ఉపాధి దొరక్కపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రకటించడంతో మత్స్యకారుల్లో మళ్లీ ఆశలు మొదలయ్యాయి. 2014 నుంచి అధికా రులు దశల వారీగా పలు సర్వేలు నిర్వహించి ప్రాజెక్ట్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ చట్టం అనుమతులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. సు మారు రూ.242 కోట్లతో చేపట్టనున్న ఈ ఫిషింగ్ హార్బర్‌కు సాగరమాల పథకం కింద కేంద్రం రూ.121 కోట్లు, రాష్ట్రం వాటా కింద రూ.121 కోట్లు కేటాయిం చాల్సి ఉంది. బడ్జెట్లో రాష్ట్రం తన వాటా కేటాయిస్తే కేంద్రం వెంటనే తన వాటా కూడా మంజూరు చేస్తుంది. బడ్జెట్లో రాష్ట్రం ఒక్కపైసా కూడా కేటాయించకపోవడంతో కేంద్రం కూడా జాప్యం చేస్తుంది. వేట సాగక..పూటగడవక.. జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం పెద్దపట్టపుపాళెం నుంచి తడ వరకు 12 మండలాల్లో 118 గ్రామాలను కలుపుతూ 169 కిలో మీటర్ల మేర తీర ప్రాంతం ఉంది. సుమారు 2 లక్షల మంది మత్స్యకారులు సముద్రం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏటా వేట విరామ సమయంతో పాటు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలతో వేట సరి గా సాగదు. తీవ్ర ప్రతికూల పరిస్థితులు మధ్య కూడా మత్స్యకారులు కడలిపైనే ఆధారపడి బతుకీడుస్తున్నారు. 60 శాతం మత్స్య సంపద దళారుల పాలు జిల్లా తీరంలో ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నా కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతుంది. సరైన వసతులు, స్టోరేజ్ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతుంది. మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలు సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఉన్న 1.05 లక్షల టన్నుల ఉత్పత్తి రెట్టింపవుతంది. మినీ హార్బర్ కారణంగా పెద్దబోట్లు సంఖ్య పెరిగి ఏడాదికి 2 లక్షల టన్నుల ఉత్పత్తి బయటకు వస్తుంది అంచనా. ఎగుమతులు కూడా 40 నుంచి 80 శాతానికి పెరుగుతాయి. ఎగుమతులతో ప్రస్తుతం వస్తున్న రూ.200 కోట్లకు అదనంగా మరో రూ.200 కోట్లు కలిపి ఏడాదికి జిల్లా కు రూ.400 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వచ్చే అవకాశం ఉంది. మినీ హార్బర్లో స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు ఉండటంతో దళా రుల ఆగడాలు తగ్గి ప్రాణాలు పణంగా పెట్టి వేట సాగించిన మత్స్యకారులకు కనీస గిట్టుబాటు ధర లభిస్తుంది. సా.. గుతున్న ప్రతిపాదనలు జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్ హా ర్బర్ నిర్మాణానికి సంబంధించి 2014 లోనే బీజం పడింది. సాగరమాల పథకం కింద మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సర్వే ప్రారంభించిన అధికారులు జువ్వలదిన్నె సమీపంలో చిప్పలేరు వద్ద ఉన్న సముద్ర ముఖ ద్వార ప్రాంతం అనుకూలంగా ఉం టుందని గుర్తించారు. పలు దఫాలుగా సర్వే చేసిన అధికారులు స్థల సేకరణ కూడా పూర్తిచేసి సాంకేతిక పరమైన సర్వేలు ప్రారంభించారు. వ్యాప్కోస్ సంస్థ తీరంలో వాతావరణం, మట్టి స్వభావం, సోషియో ఎకనమికల్ సర్వేలు, జియాలజికల్ సర్వేలు, ఇలా మూడున్నరేళ్ల పాటు పలు రకాల సర్వేలన్నీ పూర్తి చేసిన తర్వాత 242.22 కోట్ల అంచనాతో డీపీఆర్ కూడా సిద్ధం చేసింది. సాగరమాల కింద రాష్ట్రం 50 శాతం వాటా కేటాయిస్తే కేంద్రం కూడా తన వాటా జమచేసి టెండర్లు పిలవాల్సి ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించిన తర్వాత మూడేళ్లకు కానీ నిర్మాణం పూర్తికాదు. మినీ ఫిషింగ్ హార్బర్‌తో పాటు ఐస్ ఫ్యాక్టరీ, వలలు, పడవల మరమ్మతులు, చేపలు ఆరబెట్టుకునే ఫ్లాట్‌ఫాంలు, చేపల ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుతో మత్స్యకారలు జీవితాల్లో వెలుగులు నిండుతాయి. పబ్బం గడుపుకునేందుకే.. జిల్లాలో 2 లక్షల మంది మత్స్యకారల జీవితాలు ఆధారపడిన మినీఫిషింగ్ హార్బర్‌పై అధికార పార్టీ నాయకుల్లో చిత్తశుద్ధి కనబడటంతో లేదు. కడలి తీరా న్ని కబ్జాచేసి కాసుల తీరంగా మార్చుకున్న అధికార పార్టీ నాయకులు మత్స్యకారుల బతులకును ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారనే ఆరో పణలు లేకపోలేదు. మత్స్యకార గ్రా మాల్లో ‘దురా యి’ సంస్కృతిని అడ్డం పెట్టుకుని ఇ న్నాళ్లు అధికార పార్టీ నేతలు తమ ప బ్బం గడుపుకుంటున్నారు. మత్స్యకారుల్లో చైతన్యం వచ్చినా, ఆర్థికంగా బలపడినా తమ పునాదులు కదులుతాయనే భయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బడ్జెట్లో నిధులు మంజూరు చేయించకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్ విషయంలో నోరుమెదపడటం లేదు. ఉత్పత్తి రెట్టింపు అవుతుంది జువ్వలదిన్నె వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి రెట్టింపవుతుంది. ఎగుమతులు పెరగడంతో పాటు మత్స్యకారులకు లాభం చేకూరుతుంది. ప్రస్తుతం సీఆర్‌జెడ్ చట్టం అనుమతుల పరిశీలనలో ఉంది. నిధులు మంజూరైన తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పీ ప్రసాద్,మత్స్యశాఖ అధికారి, కావలి -
పోర్టు కోసం పోరు
కావలి: జిల్లాలో వెనుకబడిన కావలి, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు ప్రకాశం జిల్లా ప్రజలను ఊరిస్తున్న పోర్టు కమ్ షిప్ యార్డు సాధనకు కావలి కేంద్రంగా పోరాటాలకు రంగం సిద్ధమవుతోంది. పోర్టు కమ్ షిప్ యార్డు ఏర్పాటుకు రామాయపట్నం ప్రాంతం అనుకూలమని నిపుణుల కమిటీ తేల్చింది. అయితే, 2011 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీరువల్ల పోర్టు నిర్మాణం నేటికీ కార్యరూపం దాల్చ లేదు. ఇక్కడ పోర్టు నెలకొల్ప డానికి గల అవకాశాలు, వనరులపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైట్స్ సంస్థ ప్రతి నిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నెల్లూరు–ప్రకాశం జిల్లాల నడుమ కావలి తీరానికి అతి సమీపంలో గల రామాయపట్నం అన్నివిధాలా అనుకూలంగా ఉన్నట్టు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో పోర్టు సాధన దిశగా పోరుబాట పట్టేం దుకు కార్యచరణ సిద్ధమవుతోంది. ప్రతిపాదనలు ఇలా.. దేశంలోని తూర్పు సముద్ర తీరప్రాంతంలో రెండు భారీ ఓడరేవులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం 2001లో విధాన నిర్ణయం తీసుకుంది. వస్తువుల ఎగుమతి, దిగుమతులతోపాటు ఓడల తయారీ, మరమ్మతులకు అనువుగా పశ్చిమ బెంగాల్లో ఒకటి, మన రాష్ట్రంలో ఒకటి చొప్పున పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మించేందుకు తలపెట్టింంది. పశ్చిమ బెంగాల్ మాత్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సాగర్ తీరం ఇందుకు అనువుగా ఉంటుందని వెనువెంటనే సిఫార్సులు పంపించింది. అదే సంవత్సరంలో భారీ ఓడరేవు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రానికి వస్తే విశాఖపట్నం జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయట్నం, నెల్లూరు జిల్లా దుగరాజపట్నం తీర ప్రాంతాల్లో దీనిని ఏర్పాటు చేయాలంటూ ఆయా ప్రాంతాల నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో భారీ ఓడరేవు నిర్మాణానికి ప్రదేశం ఎంపిక విషయంలో వివాదం తలెత్తింది. దీనిపై నిపుణులు కమిటీ వివిధ ప్రాంతాలను పరిశీలించి రామాయపట్నం తీరం దీనికి అనుకూలంగా ఉందని తేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో 2012 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఎంపీ మెలికతో.. అప్పట్లో తిరుపతి ఎంపీగా ఉన్న చింతా మోహన్ దుగరాజుపట్నంలో ఓడరేవు నిర్మించాలంటూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ సమర్పించారు. ఉత్తర భారతానికి చెందిన కొందరు ఎంపీలతో సంతకాలు చేయించి మరీ అర్జీ ఇవ్వడంతోపాటు తనకు గల పరిచయాలతో లాబీయింగ్ చేయించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దుగరాజుపట్నంలో భారీ ఓడరేవు నిర్మిస్తామని 2013 మే నెలలో ప్రకటించింది. రామాయపట్నంలో నిర్మించాలని సూచిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమర్పించిన లేఖను బుట్టదాఖలు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రామాయపట్నంలో పోర్టు నిర్మాణ ప్రతిపాదన అటకెక్కింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మొత్తానికి పోర్టు నిర్మాణ ప్రతిపాదన మరుగున పడింది. 2015 జూలైలో కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ భారీ పోర్టుకు రూ.17,615 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించారు. తొలి విడతలో రూ.6,091 కోట్లు వెచ్చించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవని, అందువల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోతున్నామని స్పష్టంగా ప్రకటించారు. రామాయపట్నం ప్రత్యేకతలివీ జాతీయ రహదారి, రైల్వేట్రాక్‌లకు కేవలం ఐదు కిలోమీ టర్ల సమీపంలోనే రామాయపట్నం ఉంది. సాగరమాల పథకం కింద అభివృద్ధి చేస్తున్న బకింగ్‌హాం కెనాల్ కూ డా దీనికి అందుబాటులో ఉంది. రామాయటపట్నంకు సమీపంలో కావలి పట్టణం ఉండటం కలిసొచ్చే అంశం. ఎంపీ మేకపాటి ప్రస్తావనతో.. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ పోర్టు సాధన కోసం వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పోర్టులు, ట్రాన్స్‌పోర్టు స్టాండింగ్ కమిటీలో ఆయన సభ్యులుగా ఉండటంతో మూడేళ్లుగా తన నియోజకవర్గ పరిధిలో ఉన్న రామాయపట్నంలోనూ పోర్టు నిర్మించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర, ప్రత్యుత్తరాలు లేకపోయినా నేరుగా కేంద్ర ప్రభుత్వమే దీనిపై ఒక స్పష్టత వచ్చేందుకు తన మార్గాన తాను చేసుకోవాల్సిన పనిని చక్కబెట్టుకునేలా చేస్తున్నారు. పోరాటాలకు కార్యాచరణ ప్రణాళిక పోర్టును సాధిస్తేనే కావలి, ఉదయగిరి నియోజకవర్గాలతోపాటు కావలిని ఆనుకుని ఉన్న ప్రకాశం జిల్లాలోని ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పోర్టు ఏర్పాటే శరణ్యమనే ఆలో చన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పోరుబాట పట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ఈ అంశంపై చాలా పట్టుదలగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డితో కలిసి పోరాటాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. -
చైనాకు శ్రీలంక షాక్.. భారత్ కోరిక తీరింది
-
చైనాకు శ్రీలంక షాక్.. భారత్ కోరిక తీరింది
కొలంబో: ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె నేతృత్వంలోని శ్రీలంక కేబినేట్ చైనాకు షాకిచ్చింది. శ్రీలంకలోని హంబన్‌తోటలో చైనా ఓడరేవును నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. హిందూ మహాసముద్రంలో జలరవాణా జరిగే అత్యంత కీలకమైన ప్రదేశంలో చైనా ఓడరేవును నిర్మించడానికి సిద్ధపడటంతో భారత్, జపాన్, అమెరికాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి. తమకు భద్రతాపరమైన సవాళ్లు ఉంటాయని చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని మరోమారు పరిశీలించుకోవాలని ఒత్తిడి తెచ్చాయి. మరోవైపు స్ధానిక ప్రజల నుంచి కూడా చైనా విషయంలో శ్రీలంక ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. దీంతో ఓడరేవు ఒప్పందాన్ని రివ్యూ చేసిన శ్రీలంక కేబినేట్.. ఓడరేవుపై చైనాకు ఉండబోయే విస్తృతమైన అధికారాలకు కత్తెర వేసింది. దీంతో భారత్‌కు పొంచి ఉన్న పెను భద్రతా ముప్పు తప్పినట్లయింది. హంబన్‌తోట ఓడరేవు అంతర్జాతీయ జల మార్గాల దృష్ట్యా అత్యంత కీలకమైనది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ పోర్టును నిర్మించేందుకు చైనా ముందుకు వచ్చింది. నిర్మాణానికి భారీ మొత్తంలో వెచ్చిస్తుండటంతో రేవులో 80 శాతం వాటా చైనాకు ఇచ్చేందుకు శ్రీలంక ఓకే చెప్పింది. ఇరు దేశాలు ఒప్పందపత్రాలపై సంతకాలు కూడా చేశాయి. ప్రజలు, సామాజిక కార్యకర్తల ఆందోళనలకు తలొగ్గిన శ్రీలంక కేబినేట్.. భద్రతా కారణాల దృష్ట్యా వాణిజ్యానికి సంబంధించి పోర్టులో జరిగే కార్యక్రమాల్లో చైనా అధికారాల పరిధిని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా హంబన్‌తోటలో మిలటరీ సంబంధిత కార్యక్రమాలను నిర్వహించడానికి వీలుపడదు. 2014లో హంబన్‌తోట ఓడరేవులో చైనా తన సబ్‌మెరైన్‌ను ఉంచిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ విషయంపై భారత్, శ్రీలంకతో చర్చలు జరిపింది. ఈ ఏడాది మేలో మరోమారు సబ్‌మెరైన్‌ను ఓడరేవులో ఉంచుతామన్న చైనా ప్రతిపాదనను శ్రీలంక తిరస్కరించింది. శ్రీలంక కేబినేట్ ఆమోదించిన ప్రతిపాదన ఈ వారంలో ఆ దేశ పార్లమెంటు ముందుకు రానున్నట్లు కేబినేట్ అధికార ప్రతినిధి దయాసిరి జయశేఖర తెలిపారు. అయితే, ప్రతిపాదనలోని అంశాలను ఆయన వెల్లడించలేదు. శ్రీలంక కేబినేట్ నిర్ణయంపై చైనా అధికార ప్రతినిధిని ప్రశ్నించగా.. ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే, రహస్య సమాచారం ప్రకారం.. శ్రీలంక నిర్ణయానికి చైనా ఓకే చెప్పినట్లు తెలిసింది. -
పోర్టు కోసం పోరాడండి
► అధికార పార్టీ నేతలూ కళ్లు తెరవండి ► దుగరాజపట్నానికి కేంద్రం చెక్ ► అనుకూలతలు లేవన్న నీతిఆయోగ్ ► ఇదే అభిప్రాయంలో పలు సర్వేలు ► రామాయపట్నంకు అనుకూలతలు ► చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి ► రామాయపట్నం కోసం కేంద్రానికి ప్రతిపాదన ► ఇప్పటికే వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆందోళనలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అనుకున్నట్లే జరిగింది! నెల్లూరు జిల్లాలో కేంద్రం ప్రభుత్వం నిధులతో నిర్మించతలపెట్టిన దుగరాజపట్నం పోర్టు నిర్మాణ ప్రతిపాదన నిలిచిపోయింది. ఆ ప్రాజెక్టుకు అనుకూలతల్లేవని, లాభదాయకం కాదని నౌకాశ్రయ రంగంతో పాటు పలు సంస్థల సర్వేలు అధ్యయనంలో తేల్చి చెప్పాయి. దీంతో దుగరాజుపట్నం ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. దుగరాజపట్నం వద్ద భారీ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.5,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలతల్లేవని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయించింది. తొలుత రైట్స్ సంస్థ ప్రాథమిక సర్వే జరపగా, ఆ తర్వాత ఈ అండ్ వై సంస్థ పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మేకింగ్సె, ఏఈకామ్ అనే సలహా సంస్థలతో దీనిపై అధ్యయనం చేయించింది. అక్క్డన్నీ ప్రతికూలతలే... దుగరాజపట్నం పోర్టు నిర్మించినా ఉపయోగం లేదని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. ప్రతిపాదిత పోర్టు స్థలం పక్కనే ప్రఖ్యాత పులికాట్ సరస్సు ఉండటంతో పరిసరాల్లో వేరే పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. పర్యావరణ అనుమతులు లభించడం కష్టమే. మరోవైపు శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది. పోర్టు కార్యకలాపాలు నిరంతరాయంగా నిర్వహించడానికి ఇది అడ్డంకిగా మారుతోంది. ఇక దుగరాజుపట్నం పోర్టుకు 30 కి.మీ. దూరంలోనే కృష్ణపట్నం పోర్టు ఉంది. ఇక దుగరాజుపట్నం పోర్టుకు రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న 40 కి.మీ. దూరం ఉంది. జాతీయ రహదారితో అనుసంధానించాలన్న భారీ వ్యయంతో కూడుకున్న పనే. ఇన్నీ ప్రతికూలతల మధ్య రూ.5,500 కోట్లు ఖర్చు చేసిన దుగరాజుపట్నం పోర్టు లబ్ధి అంతంతమాత్రమే. ఈ కారణాలతో పోర్టు నిర్మాణం సాధ్యం కాదని నీతిఆయోగ్ ఉన్నతాధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో అంతే విలువైన మరో నౌకాశ్రయాన్ని ఎంపిక చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించేందుకు కేంద్రం సిద్ధమైంది. రామాయపట్నం పోర్టుకు అనుకూలతలు: దుగరాజుపట్నం పోర్టు నిర్మాణానికి అనుకూలతలు లేకపోవడంతో ప్రకాశం జిల్లా నేతలు గట్టిగా కోరితే రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఇదే అదునుగా జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలి. ఆ తర్వాత నేతలందరూ మూకుమ్మడిగా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు కృషి చేయాలి. ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు రామాయపట్నం పోర్టు కోసం ఉద్యమం కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాలరెడ్డి కావలి నుండి రామాయపట్నం వరకు పాదయాత్ర సైతం నిర్వహించారు. ఇక వామపక్షాలు రామాయపట్నం కోసం ఉద్యమాన్ని చేపట్టాయి. అందరూ కలిసికట్టుగా పోరాడితే జిల్లాకు పోర్టు రావడం ఖాయం. రామాయపట్నం పోర్టు నిర్మిస్తే కరువు, మెట్ట ప్రాంతమైన ప్రకాశంతో పాటు పరిశ్రమలకు అనువైన సంపద ఉన్న నెల్లూరు, రాయలసీమ జిల్లాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తద్వారా పోర్టు సైతం అభివృద్ధి చెందుతుంది. పోర్టుతో ప్రయోజనాలెన్నో... రామాయపట్నంలో పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మించాలన్న ప్రతిపాదన ఆది నుంచి ఉంది. 2012లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రామాయపట్నంలో పోర్టును నిర్మించాలని సిఫార్సు చేసింది. ఇదే గనుక జరిగితే పారిశ్రామికవేత్తలు ఇక్కడకు పెద్ద ఎత్తున తరలివస్తారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పే అవకాశం ఉంది. లక్ష కోట్ల పెట్టుబడులతో భారీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ స్థాపనకు దుబాయ్ కంపెనీ సిద్ధంగా ఉంది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు రానున్నాయి. లక్షలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వాటికి అనుబంధంగా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ఈ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధిని సాధిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రకాశం జిల్లా నేతలు పార్టీలకతీతంగా రామాయపట్నం పోర్టు కోసం పోరుబాట సాగించాల్సి ఉంది. -
ఎందుకు బాబూ.. బందరు పైపు ?
-
ఎందుకు బాబూ.. బందరు పైపు?
భవిష్యత్తులో మచిలీపట్నంలో నిర్మించబోయే ఓడరేవుకు అనుబంధంగా ఏర్పడబోయే పరిశ్రమల కోసం ఇప్పుడే పైప్‌లైన్!! ⇒ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మచిలీపట్నం వరకు ఏర్పాటు ⇒ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. రూ.600 కోట్ల అంచనా.. కోట్లలో కమీషన్లకు వ్యూహం! ⇒ ప్రకాశం బ్యారేజీలో కృష్ణా డెల్టా సాగు, తాగునీటి అవసరాలకే నీళ్లులేని పరిస్థితి ⇒ తమిళనాడులా సముద్రపు నీరు శుద్ధిచేసే ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం సాక్షి, అమరావతి: భవిష్యత్తులో ఎప్పుడో నిర్మించబోయే ఓడరేవుకు అనుబంధంగా ఏర్పడబోయే పారిశ్రామికవాడకు నీళ్లివ్వడానికి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్‌లైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రకాశం బ్యారేజీలో 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితే లేదు. కృష్ణా డెల్టా పరిధిలో 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే నీళ్లులేని కారణంగా ఈ ఏడాది రబీకే అవసరమైన సాగునీటిని అందించలేకపోవడంతో పంటలు ఎండిపోయిన పరిస్థితి. మరోవైపు మచిలీపట్నానికి అత్యంత చేరువలో ఉన్న సముద్రంలోని ఉప్పునీటిని శుద్ధి చేసి ఆ నీటిని అక్కడ ఏర్పడబోయే పరిశ్రమలకు వాడుకునే ప్రత్యామ్నాయ అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు అక్కడి తీర ప్రాంతాల్లోని పారిశ్రామిక నీటి అవసరాలను, తాగునీటి సమస్యను ఈ విధంగా పరిష్కరిస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్‌లైన్ వేసేందుకు హడావుడిగా టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు పైప్‌లైన్ పనులు అప్పగించి, కమీషన్లు దండుకునేందుకే ప్రభుత్వం పైప్‌లైన్ నిర్మాణానికి పూనుకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నివేదిక రెడీ.. టెండర్లకు సిద్ధం మచిలీపట్నంలో బందరు ఓడరేవు, దానికి అనుబం ధంగా వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం మచిలీప ట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ (మడ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓడరేవు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు జరిగే అవకాశం ఉందని, అప్పుడు నీటి కొరత ఏర్పడుతుందని పేర్కొంటూ నీటిపారుదల శాఖ ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. ప్రస్తుతం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. 64 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రహదారికి సమాంతరంగా భారీ పైపులైన్ ఏర్పాటు చేసేలా ఈ నివేదిక రూపుదిద్దుకుంది. నివేదిక అందినదే తడవుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్లు పిలిచేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో నీళ్లేవీ..? ప్రకాశం బ్యారేజీ ఎడమ కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు, కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరు వెళుతుంది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు, ఇతర మునిసిపాలిటీలతో పాటు డెల్టా కాలవల పరిధిలోని చెరువులను నింపడం ద్వారా సుమారు యాభై లక్షలకు పైగా ప్రజలకు తాగునీరు ఇక్కడినుంచే అందుతుంది. ఒక్క విజయవాడ నగరానికే రోజుకు 165 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)ల నీటి సరఫరా జరుగుతుంది. గుంటూరు నగరానికి 90 ఎంఎల్డీలు సరఫరా అవుతున్నాయి. అయితే ఇప్పటికే సాగు, తాగునీటికి కొరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బందరులో పారిశ్రామిక అవసరాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని ఎలా తరలిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉప్పునీటి శుద్ధి ప్రత్యామ్నాయం ఉందిగా.. మచిలీపట్నంలో పరిశ్రమలు ఏర్పాటైతే సముద్రంలోని ఉప్పునీటిని శుద్ధి చేసి ఆ నీటిని పరిశ్రమలకు తరలించేందుకు అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వం ఉత్తర చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం 2013 లోనే కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపంలోని నెమ్మెలీలో సముద్రపు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను ప్రారంభించింది. అక్కడ ప్రతిరోజూ పదికోట్ల లీటర్ల శుద్ధీకరణ జరుగుతోంది. రామనాథపురం జిల్లా కడలాడి ప్లాంట్, తిరువళ్లూరు జిల్లా మీంజూరు సమీప ఐవీఆర్సీఎల్ ప్లాంట్లు ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నాయి. మచిలీపట్నంలో ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుచేస్తే సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటిని పరిశ్రమలకు తరలించాల్సిన పని ఉండదని సాగు నీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కమీషన్లు దండుకునేందుకే.. ఎప్పుడో రాబోయే బందరు పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం ఇప్పుడు హడావుడిగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వెనుక అసలు కారణం వేరే ఉందని సాగునీటిశాఖ ఇంజనీర్లే అంటున్నారు. గతంలో పలు ప్రాజెక్టులు దక్కించుకుని భారీగా కమీషన్లు ముట్టజెప్పిన కాంట్రాక్టు సంస్థకే ఈ టెండరును కూడా కట్టబెడితే మళ్లీ కోట్ల మొత్తంలో కమీషన్లు దండుకోవచ్చనేది ప్రభుత్వ వ్యూహమని చెబుతున్నారు. ఆ పనులు పొందిన సంస్థ పైపులైన్ నిర్మాణంలో అనుభవం కలిగి ఉండటంతో ఆ సంస్థకే టెండరు దక్కే విధంగా నిబంధనలు రూపొందించే పనిలో అధికారులున్నట్టు సమాచారం. -
డీపీ వరల్డ్ గ్రూప్ వంద కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: డీపీ వరల్డ్ గ్రూప్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. పోర్ట్, లాజిస్టిక్స్ రంగంలో దశలవారీగా వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయేమ్ పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటికే 120 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టామని, భారత కంటైనర్ వ్యాపారంలో 30 శాతం వ్యాపారానికి తోడ్పాటునందిస్తున్నామని వివరించారు. వృద్ధి చెందుతున్న దేశాల్లో బలమైన దేశాల్లో ఒకటైన భారత్‌లో నౌకా వ్యాపారంలో భారీగా అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని సుల్తాన్ అహ్మద్ బిన్ అహ్మదాబాద్‌లో కలిశారని డీపీ వరల్డ్ గ్రూప్ పేర్కొంది. భారత్‌లో 5 అంతర్జాతీయ గేట్‌వే పోర్ట్స్ అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెట్టామని వివరించింది. -
గూడ్సు రైల్లో మృత శిశువు
ముత్తుకూరు : ఒంగోలు నుంచి కష్ణపట్నం పోర్టుకు గ్రానైట్‌రాళ్ల లోడుతో మంగళవారం వచ్చిన గూడ్సు రైలులో ఒక మత శిశువు దర్శనమివ్వడంతో పోర్టు సెక్యూరిటీ వర్గాలు నివ్వెరపోయాయి. పోర్టు సమీపంలో రైలులో కార్మికులు వ్యాగన్లను పరిశీలిస్తుండగా గ్రానైట్ రాళ్ల మధ్య ఓ ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ కనిపించింది. అందులో నెలలు నిండని ఓ మతశిశువు ఉంది. దీంతో కార్మికులు వెంటనే పోర్టు సెక్యూరిటీకి సమాచారం అందించారు. వెంటనే పోర్టు సెక్యూరిటీ అధికారులు, కష్ణపట్నం పోలీసులు గూడ్సు రైలు వద్దకు చేరి, మతశిశువును పరిశీలించారు. గర్భంలోనే మతిచెందిన శిశువునుగానీ, లేదా అబార్షన్ చేయించుకున్న మహిళ శిశువునుగానీ గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ సంచిలో ఉంచి, గూడ్సు రైలులో పడవేసివుంటారని భావిస్తున్నారు. -
బందరుపై పూలింగ్ పంజా
-
'పేదరికం పోవాలంటే పోర్టు నిర్మాణం జరగాల్సిందే'
శ్రీకాకుళం: భావనపాడు పోర్టు నిర్మాణం పై ప్రభుత్వ వైఖరిని ఆంధ్రరప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. భావనపాడు ప్రాంతంలో పేదరికం పోవాలంటే పోర్టు నిర్మాణం జరగాల్సిందే అని ఆయన అన్నారు. భావన పాడు, కళింగపట్నం పోర్టుల ద్వారా ఉపాధి అవకాశాలతో పాటూ భూముల విలువ పెరుగుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల కోసం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న అంశం పరిశీలనలో ఉందని చంద్రబాబు అన్నారు. ఉద్యానవన కాలేజీ, రైస్ రిసెర్చ్ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్పు చేస్తామన్నారు. -
పోర్టు పేరుతో భూములు లాక్కొంటున్నారు
-
తిరగబడ్డ తీరబిడ్డ
భూ సేకరణపై అవగాహన సమావేశంలో ఉద్రిక్తత మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్లకు చేదు అనుభవం భూములు ఇవ్వబోమంటూ తరిమిన కోన గ్రామస్తులు పలాయనం చిత్తగించిన ప్రజాప్రతినిధులు మంత్రి పీఏకు గాయాలు బందరు మండలం కోన గ్రామంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. పోర్టు కోసం భూసేకరణ అంశంపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సు ఉద్రిక్తతకు దారితీసింది. భూములు ఇచ్చేది లేదని నినాదాలు చేసిన గ్రామస్తులు మంత్రి, ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకోవడమే కాకుండా వారు కారు ఎక్కి తిరుగుముఖం పట్టే వరకూ తరిమికొట్టారు. దీంతో కోన గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మచిలీపట్నం : బందరు మండలం కోన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం రాత్రి భూసేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు పాల్గొని భూసేకరణ విషయంపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇంతలో ‘మా జీవనాధారమైన భూములను ఇచ్చేది లేదు. గ్రామాన్ని మేమెందుకు ఖాళీ చేయాలి. ఎక్కడికి వెళ్లి ఉండాలి.’ అంటూ గ్రామస్తులు వారిని ప్రశ్నించారు. మంత్రి కొల్లు రవీంద్ర వారికి సర్దిచెప్పేందుకు మైక్ తీసుకోగా, ‘మా భూములు ఇవ్వం. మీరు వెంటనే గ్రామాన్ని విడిచి వెళ్లండి.’ అంటూ గ్రామస్తులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మంత్రి, ఎంపీకి రక్షణగా నిలిచారు. మంత్రి రవీంద్ర మైక్‌లో బిగ్గరగా మాట్లాడటంతో ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద వేసిన షామియానాను పడగొట్టారు. విద్యుత్ కనెక్షన్‌ను తొలగించారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు గ్రామస్తులను నెట్టివేశారు. ఇద్దరు, ముగ్గురు యువకులపై దాడి చేయటంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా పోలీసులతో తోపులాటకు దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది. తరిమితరిమి కొట్టారు పరిస్థితి అదుపు తప్పడంతో మంత్రి, ఎంపీలను వారి గన్మెన్లు సమావేశం నుంచి కారు వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు వారి వెనకే పరుగు పెట్టారు. మంత్రి, ఎంపీని సురక్షితంగా కారులో ఎక్కించినప్పటికీ గ్రామస్తులు కార్లతో పాటే పరుగులు పెట్టారు. ఈ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర పీఏ హరినాథబాబు తలకు స్వల్ప గాయమైంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విడతలవారీగా పోలీసుల రాక శనివారం రాత్రి 7 నుంచి 7.10 గంటల మధ్య కోన గ్రామంలో కార్యక్రమం జరగ్గా, 4 గంటల నుంచి పోలీసుల రాక ప్రారంభమైంది. 4 గంటలకు ఒక జీపు, 4.30 గంటలకు మరో జీపు, 5 గంటలకు మరో జీపు.. ఇలా వరుస క్రమంలో పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి, ఎంపీ కాన్వాయి వెంట ప్రత్యేక బలగాలు ఓ వ్యాన్‌లో వచ్చాయి. వచ్చిన పోలీసులు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తారా, లేదా.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రికి, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో ప్రత్యేక పోలీసు బలగాలు పరుగెత్తుకు రావటం, పోలీసులు తమపైకి దాడి చేయడానికి వస్తున్నారని గ్రామస్తులు భావించటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అతికష్టం మీద కోన గ్రామం నుంచి బయటపడిన మంత్రి, ఎంపీ అక్కడి నుంచి సమీపంలోని పల్లెతుమ్మలపాలెం గ్రామానికి వెళ్లారు. పల్లెతుమ్మలపాలెం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మంత్రి, ఎంపీని నిలదీసేందుకు గ్రామస్తులు కోన - పల్లెతుమ్మలపాలెం రోడ్డుపై బైఠాయించారు. డీఎస్పీ డీఎస్ శ్రావణ్‌కుమార్ కోన గ్రామానికి వచ్చారు. రోడ్డుపై ఉన్న గ్రామస్తులకు నచ్చజెప్పి ఆగ్రహానికి గురి కావద్దని సర్దిచెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. కోన గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి దారి తీయటంతో మచిలీపట్నం నుంచి ప్రత్యేక బలగాలను రప్పించారు. -
శ్రీకాకుళం తీరంలో పోర్టు చిచ్చు
-
ఒంగోలే మిగిలింది
♦ రాజధాని కారిడార్‌లో దక్కని చోటు ♦ వాడరేవు, మార్టూరులు మ్యాప్‌లో ఉన్నా ప్రస్తావించని ప్రభుత్వం ♦ పారిశ్రామిక కారిడార్‌పైనా అనుమానాలే ♦ గుంటూరు, కృష్ణాలకే అభివృద్ధి పరిమితం ♦ పక్కనే ఉన్న ప్రకాశంను పట్టించుకోకపోవడంపై సొంత పార్టీలోనే విమర్శలు ప్రత్యేక సరుకు రవాణా మార్గాల విషయానికి వస్తే వాడరేవు పోర్టు నుంచి బాపట్ల - తెనాలి ఉండగా, జాతీయ జల మార్గాల విషయానికి వస్తే విజయవాడ- తెనాలి- బాపట్ల- వాడరేవు-బకింగ్‌హామ్ కాల్వ ఉన్నాయి. అయితే వీటి ప్రస్తావన కూడా చేయలేదు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసినా వాడరేవు పోర్టు అభివృద్ధయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు సంబంధించి ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదు. ఇటీవల కాలంలో కేంద్రం మొత్తం 13 జాతీయ స్థాయి విద్యాసంస్థలు కేటాయిస్తే ఒక్కటి కూడా జిల్లాకు దక్కలేదు. రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా ఉండి, దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నా కేంద్రం నుంచి కూడా నిధులు తేలేకపోయారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాపై చంద్రబాబు నాయుడు మరోసారి చిన్నచూపు చూశారు. సింగపూర్ అందించిన మాస్టర్‌ప్లాన్‌లో మార్టూరు, వాడరేవుల ప్రస్తావన ఉన్నా రాష్ట్ర క్యాబినెట్లోనూ, అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కూడా ఎక్కడా జిల్లా కోసం ప్రస్తావించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ప్రకటించిన కారిడార్లన్నీ గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఉండటం, పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాకు ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా ప్రకటించకపోవడం పట్ల తెలుగుదేశం నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘నిజాంపట్నంతోపాటు వాడరేవును కూడా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేస్తున్నట్లు సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌లో ఉన్నా చంద్రబాబునాయుడు మాత్రం నిజాంపట్నం పోర్టును మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించారు. అభివృద్ధి కారిడార్లలో మార్టూరు - చిలకలూరిపేట - గుంటూరు - మంగళగిరి రోడ్డు ఉంది. మార్టూరు ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉంది. దాన్ని కూడా ప్రస్తావించలేదు. దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ ఆ దిశగా ఇప్పటి వరకూ చర్యలు లేవు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ కోసం 50 వేల ఎకరాలు, పామూరులో 20 వేల ఎకరాలు, సీఎస్‌పురంలో 10 వేల ఎకరాలు భూ బ్యాంకుగా గుర్తించారు. రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి ఆరు వేల ఎకరాలను గుర్తించారు. అయితే ఇప్పటికీ పారిశ్రామిక వాడగాని, కనిగిరి ప్రాంతంలో నిర్మించదలిచిన నిమ్జ్ కూడా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ది కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు కూడా కనీసం ఐదు వందల కోట్ల రూపాయల వరకూ కేటాయిస్తేగాని మొదటిదశ పూర్తయ్యే అవకాశం లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.75 కోట్లు, ఈ ఏడాది రూ.153 కోట్లు మాత్రమే కేటాయించింది. తక్కువ మొత్తం కేటాయించడం వల్ల ఆ మొత్తం పాత బకాయిలకు, సిబ్బంది వేతనాలకు మాత్రమే సరిపోయే పరిస్థితి ఉంది. -
పీపీపీ విధానంలో పోర్టుల అభివృద్ధి
మంత్రి బాబురావ్చించన్సూర్ సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామం (పీపీపీ) పద్దతిన రాష్ట్రంలో ఆరు పోర్టులను అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర పోర్టులు, జౌళీశాఖ మంత్రి బాబురావ్ చించన్సూర్ వెల్లడించారు. బెంగళూరులో మీడియాతో ఆయన సోమవారం మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 12 పోర్టులు ఉండగా అందులో బెలికెరే, తదడితో సహా ఆరు పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వేల కోట్ల రుపాయాల నిధులు కావాల్సి ఉంటుందన్నారు. ఇంత మొత్తాన్ని ప్రభుత్వం ఒక్కటే భరించడానికి వీలు కాదన్నారు. అందువల్ల ప్రైవేటు కంపెనీల సహకారం వీటిని అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. 30 ఏళ్ల లీజు ప్రతిపాదికన పోర్టుల అభివృద్ధి, నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టనున్నామని తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి బాబురావ్ తెలిపారు. మంగళూరు పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని అందువల్ల దీన్ని ప్రైవేటు సంస్థలకుకాని, వ్యక్తులకుగాని లీజుకు ఇవ్వడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. నూతన పాలసీ ప్రకారం జిల్లాకొక జౌళిపార్కును ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. -
పంజా విసురుతున్న హుదూద్
-
అక్టోబర్ టైర్రర్
కష్టాల తీరంలో సిక్కోలు విలవిల * ప్రతి ఏటా తుపాన్ల దాడి.. తీవ్ర నష్టం * ప్రస్తుత హుదూద్ దిశ మారితే జిల్లాకు కష్టమే * ఇప్పటికే అల్లకల్లోలంగా సముద్రం * ఎగిసిపడుతున్న అలలు * ముందుకు చొచ్చుకొస్తున్న సాగరం * కంటిమీద కునుకు కరువైన తీరగ్రామాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తుపాన్ల ధాటికి శ్రీకాకుళం జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. దాదాపు ప్రతి ఏటా పంటలు చేతికొచ్చే సమయంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు పంటలను, ఆస్తులను ఊడ్చేస్తున్నాయి. ఫలితంగా జిల్లా ఆర్థికంగా చితికిపోతోంది. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్‌లో పెను విలయం సృష్టించిన పై-లీన్ తుపాను తొలుత కళింగపట్నం వద్దే తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే అది దిశ మార్చుకుని ఒడిశాలోని గోపాల్పూర్ వైపు మళ్లింది. అదే విధంగా ప్రస్తుతం కమ్ముకొస్తున్న హుదూద్ తుపాను విశాఖ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నా తీరం దాటే సమయంలో దిశ మార్చుకునే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. వాస్తవానికి కోస్తా తీరంలో ఇప్పటివరకు 43 తుపాన్లు సంభవించినట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తీరం దాటే సమయంలో ఇవి విధ్వంసం సృష్టిస్తుంటాయి. జిల్లాలోనూ పలు మార్లు తుపాన్లు తీరం దాటాయి. వాస్తవానికి అక్టోబర్‌లో వచ్చే తుపాన్లు నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్ల కంటే బలహీనమైనవిగా వాతావరణశాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్యం వచ్చే క్రమంలో తుపాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మరో రెండు రోజుల్లో తీరం దాటనున్న హుదూద్ తుపాన్ ప్రభావం ఎలా ఉంటుందోనన్న సిక్కోలు వాసులు గజగజలాడిపోతున్నారు. తరుముకొస్తున్న హుదూద్ విశాఖ సమీపానికి అతివేగంగా దూసుకొస్తున్న తీవ్ర పెనుతుపాను శనివారం నుంచి జిల్లాపై ప్రభావం చూపనుంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతోఆపటు గంటకు 130 నుంచి 150 కి.మీ వేగంతో భీకర గాలులు వీచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన సముద్రం మరింత భీకర రూపం దాల్చి ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. ఇప్పటికే కళింగపట్నం పోర్టులో మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హుదూద్ ప్రభావం మరింత తీవ్రమైతే సమాచార వ్యవ స్థ కుప్పకూలడం ఖాయమని, పక్కా ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు పడిపోతాయని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వెళ్లినవారు వెనక్కు తిరిగి వచ్చేయాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు, తీరం ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈనెల 11, 12 తేదీల్లో జరగనున్న జన్మభూమి సభలను రద్దు చేయడంతోపాటు విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను సిద్ధం చేయడంతోపాటు వాటిలో ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. 70 గ్రామాల నుంచి సుమారు లక్ష మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు అవసరమైన వాహనాలు కూడా సిద్ధం చేస్తున్నారు. రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఒక ఆర్మ్డ్ ఫోర్సు బృందం ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. నేటి నుంచి భారీ వర్షాలకు అవకాశం పెను తుపాను తీరం వైపు దూసుకొస్తుండటంతో శనివారం నుంచి భీకర గాలులతోపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. కాగా శుక్రవారమే జిల్లాలో ఆకాశం మబ్బుపట్టింది. స్వల్పంగా గాలులు మొదలయ్యాయి. కళింగపట్నం సహా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. -
తరుముకొస్తోంది
కోస్తా ప్రాంతాలపై పంజా విసురుతున్న హుదూద్ పెను తుపానుగా రూపాంతరం విశాఖకు 460 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతం సిద్ధంగా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ దళాలు 4 యుద్ధ నౌకలు, 6 విమానాలు, 6 హెలికాప్టర్లు, గజ ఈతగాళ్లు రెడీ ఆహారం, టెంట్లు, మందులు, ఇతరత్రా సామగ్రి సిద్ధం నేడు పాఠశాలలకు సెలవు.. పరిశ్రమలు రాత్రి షిఫ్టు రద్దు చేయాలని ఆదేశాలు విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, ఒడిశా కోస్తా ప్రాంతాలపై పెను ఉప్పెన పంజా విసురుతోంది. తీవ్రరూపం దాల్చిన హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశాలను హడలెత్తిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో పోర్ట్‌బ్లెయిర్ వద్ద మొదలైన హుదూద్ తుపాను శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు తీవ్ర తుపానుగా రూపుదాల్చింది. విశాఖపట్నంకు 460 కి.మీ. దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు పశ్చిమ ఉత్తర దిశలో 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది. రానున్న 12 గంటల్లో తుపాను తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం సమీపంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. రానున్న 24 గంటల్లో హుదూద్ తుపాను గమనం ఏమాత్రమైనా మారితే విశాఖపట్నంకు తూర్పు ఉత్తర దిశగా 30 కి.మీ. నుంచి 60 కి.మీ. దూరంలో తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, దీనిపై ఇప్పుడే అధికారికంగా ఏమీ చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే విశాఖపట్నం సమీపంలోనే తీరాన్ని తాకే అవకాశాలున్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ రాంచంద్రావు తెలిపారు. తుపాను నష్టం తీవ్రంగా ఉండే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను తీరాన్ని దాటే ప్రాంతంలో కొండలు ఉన్నందువల్ల హుదూద్ తీవ్రత కొంతవరకు తగ్గే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తీవ్ర విధ్వంసం తప్పదా!? హుదూద్ తుపాను ఇదే తీవ్రతతో ఉంటే తీరాన్ని దాటే సమయంలో పెను ఉప్పెనతో విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం కొన్నిచోట్ల ముందుకు వచ్చింది. గాలుల తీవ్రత పెరిగింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో అత్యంత భారీ వర్షాలు, పెను గాలులతో బీభత్సాన్ని సృష్టించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి తుపాను తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచి సాధరణ స్థాయిలో వర్షాలు మొదలై, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, దక్షిణ ఒడిశాలలో 12.50 సెం.మీ. నుంచి 24.40 సెం.మీ. వరకు అతి భారీ వర్షపాతం నమోదు కావచ్చు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా సాధారణ నుంచి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం తీరం దాటే సమయంలో గంటకు 130 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఆ ప్రాంతాలకు రాకపోకలను వాయిదా వేసుకోవాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. రాష్ట్రంలో కృష్ణపట్నం తప్ప మిగిలిన అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం హుదూద్ తుపాను ప్రళయ భీకరంగా విరుచుకుపడుతుందన్న సంకేతాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, రక్షణ శాఖ బలగాలు సహాయ, పునరావాస చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. విశాఖపట్నం జిల్లాకు 6 బెటాలియన్లు, విజయనగరం జిల్లాకు ఒక బెటాలియన్, శ్రీకాకుళం జిల్లాకు రెండు బెటాలియన్ల ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపించారు. ఒక్కో బెటాలియన్‌లో 40 మంది ఉంటారు. నేవీ అధికారులు కూడా 30 రెస్క్యూ టీంలను విశాఖపట్నంలో సిద్ధంగా ఉంచారు. అవసరాన్ని బట్టి ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు ఇవి పూర్తి పరికరాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సహాయక చర్యల కోసం 4 యుద్ధ నౌకలు, 6 ఎయిర్ క్రాఫ్ట్‌లను తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంచింది. నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన 6 హెలికాప్టర్లను సిద్ధం చేశారు. రెండు ఆర్మీ బెటాలియన్లు కూడా శనివారం ఉదయానికి విశాఖపట్నం చేరుకోనున్నాయి. ఆర్మీ బలగాల తరలింపు కోసం 36 వాహనాలను సిద్ధం చేశారు. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తూర్పు నావికా దళం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యా సంస్థలకు సెలవు తుపాను దృష్ట్యా అధికారులు విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. తీరప్రాంతాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలు శనివారం రాత్రి షిఫ్ట్‌లను రద్దు చేయాలని ఆదేశించారు. -
ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా
- జిల్లాలో పడవుల రేవుల ఆదాయం రూ. 1.24 కోట్లు - వాటి అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చుచేయని అధికారులు - ప్రమాద భరితంగా పడవ ప్రయాణం పాతగుంటూరు : జిల్లాలో బల్లకట్టు, పడవల రేవుల నుంచి జిల్లా పరిషత్‌కు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ రేవుల్లో అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పడవల రేవుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే నిర్వహిస్తుండడంతో రేవుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రేట్లను భారీగా పెంచేస్తున్నారు. అధికారుల కన్నుసన్నల్లోనే బల్లకట్టు, పడవల్లో చార్జీలు పెంచినట్లు ఆరోపణలున్నాయి. రేవుల నుంచి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ ర్యాంపులు, రోడ్లు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా వైపు నుంచి కృష్ణా, నల్గొండ జిల్లాలకు కృష్ణానది గుండా ప్రజలు పడవలు, బల్లకట్టు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో 2014-15 సంవత్సరానికి జిల్లాలో బల్లకట్లు, పడవల రేవులకు మార్చిలో వేలం నిర్వహించారు. జిల్లాలో మూడు బల్లకట్టులు, 12 పడవల రేవులకు వేలం నిర్వహించగా, రూ. కోటీ 24 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఇప్పటికీ రేవుల అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల బల్లకట్టుపై పరిమితికి మించి వాహనాలను ఎక్కిస్తున్నారని, చార్జీలు కూడా పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలు బేఖాతరు... నదిలో బల్లకట్టు, పడవలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నడపాలనే నిబంధన ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలనే తీసుకోవాలి. అయినప్పటికీ పడవల నిర్వాహకులు అధిక చార్జీలు తీసుకుంటూ రాత్రి సమయాల్లో కూడా పడవలు నడుతున్నారు. మాచవరం మండలం గోవిందాపురం, దాచేపల్లి మండలం రామయగుండం, అచ్చంపేట మండలం మాదిపాడులలో బల్లకట్టు రేవులున్నాయి. అచ్చంపేట మండలం గింజుపల్లి, మాదిపాడు, తాడువాయి, చామర్రు, చింతపల్లి, కొల్లిపర మండలం వల్లభాపురం, వెల్దుర్తి మండలం పుట్టపల్లి, గురజాల మండలం గొట్టిముక్కలలో పడవల రేవులున్నాయి. బెల్లంకొండ మండలం కోళ్ళూరు, చిట్యాల, బోధనంలలో పడవల రేవులను పులిచింతల ముంపు గ్రామాలు కావడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం... పడవల రేవుల పర్యవేక్షణ నిర్వహిస్తున్నాం. అధిక ధరలు తీసుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. రేవుల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఎప్పటికప్పుడు రేవులను ఎంపీడీవోలు పరిశీలించి నివేదికలు ఇస్తున్నారు. నిఘా పెట్టి.. ధరలు పెంచినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - సుబ్బారావు, జెడ్పీ సీఈవో -
వెలుగు.. వెలవెల
150 ఏళ్లనాటి దీపస్తంభం పదేళ్ల క్రితం చోరీతో అస్తవ్యస్తం ఎన్ని మరమ్మతులు చేసినా కాంతిహీనం మత్స్యకారులకు తీవ్ర అసౌకర్యం తెల్లదొరలు ఏర్పాటు చేసిన ఆ లైట్‌హౌస్ అలనాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అంతే కాదు.. ఇప్పటికీ సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు దిక్సూచిగా ఉపయోగపడుతోంది. అయితే పదేళ్ల క్రితం చోరులు విలువైన పరికరాలను దొంగిలించుకుపోవడంతో ఆ దీపస్తంభం వెలుగు తగ్గింది. అప్పటి నుంచి ఎన్ని మరమ్మతులు చేసినా అది వెలవెలపోతోంది. దాంతో చేపలవేటకు వెళ్తున్న మత్స్యకారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. భీమునిపట్నం, న్యూస్‌లైన్: సముద్రంలో దారి తెలియని నౌకలకు దిక్సూచిగా నిలిచే ఆ దీపస్తంభానికి ఎంతో చరిత్ర ఉంది. ప్రాచీన పట్టణమైన భీమిలిలో బ్రిటిష్ వారు దానిని ఏర్పాటు చేసి నూట ఏభై ఏళ్లకు పైగానే అయింది. అప్పటి నుంచి నిరాఘాటంగా వెలుగులు విరజిమ్ముతున్న లైట్‌హౌస్ కాంతిహీనం కావడంతో మత్స్యకారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 1854ప్రాంతంలో బ్రిటిష్ వారు ఇక్కడ పోర్టు ఏర్పాటు చేసి ఓడల ద్వారా ఎగుమతులు, దిగుమతులు నిర్వహించేవారు. ఆ నౌకల కోసం ఇక్కడ బీచ్ సమీపంలో లైట్‌హౌస్‌ను ఏర్పాటు చేశారు. అరుదైన బ్రిటిష్ పరిజ్ఞానంతో దీన్ని ఏర్పాటు చేయడంతో దీని కాంతి ఎంతో ప్రకాశవంతంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని నిర్వహణ కాకినాడ పోర్టు ఆధీనంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి లైట్‌హౌస్ నిర్వహణ బాధ్యతను వారే చేపట్టారు. భీమిలి తీరప్రాంతంలో నిత్యం నాటుపడవలు, తెప్పల ద్వారా చేపలవేట సాగించే మత్స్యకారులకు లైట్‌హౌస్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. వారిలో చాలామంది వేకువనే సముద్రంలోకి వెళ్లి మధ్యాహ్నం తీరానికి వస్తారు. మరికొందరు సాయంత్రం వెళ్లి అర్ధరాత్రి ప్రాంతంలో తీరానికి వస్తారు. వీరందరికీ ఈలైట్హౌస్ వెలుగే ఆధారం. పదేళ్ల క్రితం ఈ లైట్‌హౌస్‌లో దొంగలు పడి ఇందులోని యంత్రాల సామగ్రిని పట్టుకుపోయారు. కాకినాడ పోర్టు సిబ్బంది దీనికి మరమ్మతులు నిర్వహించినా మునుపటంత వెలుగివ్వడం లేదని మత్స్యకారులు అంటున్నారు. రాను రాను ఇది మరింత కాంతిహీనం కావడంతో మత్స్యకారులకు మరింత కష్టంగా మారుతోంది. ఇక్కడ తీరప్రాంతంలో రాళ్లు ఎక్కువగా ఉండడంతో దారి సక్రమంగా తెలియక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్య గురించి అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందని మత్స్యకారులు అంటున్నారు. పాత లైట్‌హౌస్ పరిస్థితి ఇలా ఉంటే, గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి చెందిన లైట్‌హౌస్ విభాగం అధికారులు ఇక్కడకు వచ్చి వందఅడుగుల ఎత్తులో సరికొత్త లైట్‌హౌస్‌ను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం చేరువలో స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. కానీ తర్వాత ఎవరూ ఇటువైపు దృష్టి మరల్చలేదు. ఈలోగా పాత లైట్హౌస్కు రెండు నెలల క్రితం కొన్ని మరమ్మతులు చేసి రంగులు వేశారు. దాంతో ఇది చూడడానికి అందంగా ఉన్నా పనితీరు అలాగే ఉంది. మరింత వెలుగిచ్చేట్టు దీనిని తీర్చిదిద్దాలని మత్స్యకారులు కోరుతున్నారు. కష్టంగా ఉంది.. లైట్‌హౌస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల భీమిలి తీరంలో వేటాడే మత్స్యకారులకు కష్టంగా ఉంది. కాంతి తగ్గడంతో తీరానికి చేరుకోవడం సమస్యగా ఉంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. -బుంగ అప్పారావు, మత్స్యకారుడు. నిర్లక్ష్యం వల్లే దుస్థితి.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికైనా లైట్ హౌస్ మరమ్మతులపై దృష్టి పెట్టాలి. -వాడమొదల సత్యారావు, మత్స్యకారుడు. -
నిజాలు దాచి.. వైఎస్‌పై శివాలు