
ఎక్కడో దూరంగా కొండకోనల్లో ఉన్న గ్రామంలో ఉంటున్నారా? అయినా కూడా ఏకాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదా! అయితే ఈ సముద్రం మధ్యలోని బిల్డింగ్ మీకోసమే. పేరు స్పిట్‌బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్‌లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి.
ఇందులో 9 బెడ్రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక వేడి టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్లు.
చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment