ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిని ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ ట్యాగ్ సురక్షింతగా బయటకు తీసుకువచ్చింది. ఈ చమురు నౌక సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులు. ఈ ప్రమాదంలో మునిగిన ఒక శ్రీలంక పౌరుడిని కూడా ఇండియన్ నేవీ రక్షించింది. మరో శ్రీలంక పౌరుని మృతదేహాన్ని వెలికితీసింది.
ఒమన్ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్‌ను గుర్తించడానికి భారత్‌కు చెందిన యుద్ధనౌక ఐఎస్‌ఎస్ టెగ్‌ను రెస్క్యూ ఆపరేషన్‌కు పంపారు. ఒమన్‌లోని రాస్ మద్రాక్‌కు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో జులై 15న ఈ నౌక మునిగిపోయింది. ఒమన్ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ అనే కార్గో నౌకలో 13 మంది భారతీయులు,ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమన్ మారిటైమ్ సేఫ్టీ సెంటర్ (ఎంఎస్‌సీ)పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment