ఒమన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్ వైపు వెళుతున్న చమురు నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఒమన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చమురు నౌక పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్.
ప్రమాదం జరిగిన సమయంలో దీనిలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైనవారిలో 13 మంది భారతీయ పౌరులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని సమాచారం. ఈ చమురు నౌకకు తూర్పు ఆఫ్రికా దేశమైన కొమొరోస్ జెండా ఉంది. ఈ చమురు నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక డుక్మ్ పోర్ట్ సమీపంలో మునిగిపోయింది.
ఈ ట్యాంకర్ షిప్ యెమెన్ వైపు వెళ్తుండగా దుక్మ్ పోర్ట్ సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తోంది. కొమొరోస్ ఫ్లాగ్ ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ రాస్ మదారకాకు ఆగ్నేయంగా 25 నాటికన్ మైళ్ల దూరంలో మునిగిపోయిందని మారిటైమ్ సేఫ్టీ సెంటర్ ఒక ట్వీట్‌లో తెలిపింది.
A Comoros flagged oil tanker capsized 25 NM southeast of Ras Madrakah. SAR Ops initiated with the relevant authorities. #MaritimeSecurityCentre
— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 15, 2024
Comments
Please login to add a commentAdd a comment