coast
-
కేరళ,తమిళనాడుకు ‘కల్లక్కడల్’ ముప్పు..!
తిరువనంతపురం: కేరళ,తమిళనాడు(Tamilnadu) తీరాలకు ‘కల్లక్కడల్’ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ఇన్కాయిస్’ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. బుధవారం(జనవరి 15)న రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన రాకాసి అలలు తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.బుధవారం రాత్రి 11.30 గంటల వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో అర మీటరు నుంచి ఒక మీటరు మేర అలల తాకిడి ఉంటుందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (Incois) హెచ్చరించింది.ఇన్కాయిస్ హెచ్చరిక నేపథ్యంలో కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ అప్రమత్తమైంది.తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది.ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు పడవలు వేసుకొని సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.మత్స్యకారులు ముందుగానే పడవలను సురక్షిత ప్రదేశానికి చేర్చుకోవాలని ప్రకటించింది. పర్యాటకులు బీచ్‌లలో విహారానికి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.కల్లక్కడల్ అంటే ఏంటి..?కల్లక్కడల్ అనేది మళయాలం పదం. కల్లక్కడల్ అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్ని సార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా ఉప్పొంగడానికి కారణమని Incois వెల్లడించింది.ఎలాంటి సూచన,హెచ్చరిక లేకుండానే ఆ గాలులు వీస్తుంటాయని పేర్కొంది.అందుకే దీనిని స్థానికంగా ‘కల్లక్కడల్’ అని పిలుస్తారు. -
సాగర వీరుల విన్యాసాలు.. నేవీ డే స్పెషల్ (ఫొటోలు)
-
తీరం తరుక్కుపోతోంది..
సాక్షి, అమలాపురం/ అల్లవరం: కోస్తా తీరం భారీగా కోతకు గురవుతోంది. వాయుగుండాలు, అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడిన సమయంలో కోత అధికంగా ఉంటోంది. తాజాగా ఫెంగల్ తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తీరం పొడవునా కోత అధికమైంది. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 140 కిలోమీటర్ల మేర ఉంది.కోనసీమ జిల్లాలో అంతర్వేది సముద్ర సంగమ ప్రాంతం నుంచి ఐ.పోలవరం మండలం బైరుపాలెం వరకూ 90 కిలోమీటర్లు కాగా, తాళ్లరేవు మండలం గాడిమొగ నుంచి తుని మండలం వరకూ సుమారు 50 కిలోమీటర్ల మేర తీరం ఉంది. పచ్చని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయల కోత వల్ల ఇప్పటికే వందలాది ఎకరాల కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో తీరం పొడవునా సముద్ర కోత కూడా అధికంగా ఉంటోంది. కోనసీమ జిల్లాలో ఓడలరేవు, కేశనపల్లి, అంతర్వేది, కొమరగిరిపట్నంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూములు, సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. గడచిన పదేళ్లలో కోత తీవ్రత రెట్టింపు అయ్యింది. ఓడలరేవులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తీరాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన ఓఎన్జీసీ చమురు బావులు ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి.ఎనిమిదేళ్ల కిందట ఓడలరేవు బీచ్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం వరకూ సముద్రం చొచ్చుకువచ్చి భూమి కోతకు గురవుతోంది. అంతర్వేది బీచ్‌లో అలల ఉధృతి స్థానికంగా ఉన్న రిసార్ట్స్ వరకూ వస్తోంది. స్థానికంగా ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి సైతం అలలు అప్పుడప్పుడు వచ్చి ఇళ్లను ముంచెత్తుతున్నాయి. కేశవదాసుపాలెం తూర్పులంక వంటి గ్రామాల్లోకి ఉప్పు నీరు ముంచెత్తడంతో కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయి. కాలుష్యాన్ని కలిపేస్తూ.. అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం అత్యంత ప్రమాదకరం. దేశంలో చాలా వరకూ నదులన్నీ దీనిలోనే కలుస్తాయి. ఉత్తరాదిన గంగా, బ్రహ్మపుత్ర, మధ్యభాగంలో మహానది, దిగువన గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వంశధార, నాగావళి వంటి నదుల సంగమం బంగాళాఖాతంలోనే. దేశంలో చాలా వరకూ కాలుష్యాన్ని మోసుకువస్తున్న ఈ నదులు దానిని బంగాళాఖాతంలో కలిపేస్తున్నాయి. ఫలితంగా బంగాళాఖాతం త్వరగా వేడెక్కుతోంది. దీనివల్ల తరచూ తుపాన్లు ఏర్పడుతున్నాయి. అందుకే అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే తుపాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు అధికం. వీటి ప్రభావంతో అలలు ఎగసిపడి కోత ఉధృతి పెరుగుతోంది. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ భూభాగ నైసర్గిక స్వరూపం సముద్రంలోకి చొచ్చుకు వచ్చినట్టు ఉంటుంది. దక్షిణాయన కాలంలో అంటే జూలై 16 నుంచి జనవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు వస్తాయి. ఫలితంగా అప కేంద్ర బలాలతో తీరం పొడవునా కోత తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. అలలు ఎగసిపడి.. కాకినాడ జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరం కోతకు తరుక్కుపోతుంది. కాకినాడ తీరం సమీపంలో హోప్ ఐలెండ్ ఉండడం, డీప్ వాటర్ పోర్టు కోసం సముద్రంలో ఇసుక తవ్వకాల ప్రభావం సమీపంలోని “ఉప్పాడ’ గ్రామంపై పడుతోంది. సముద్రంలో తవ్వకాలు చేసిన ప్రాంతాల్లో తిరిగి ఇసుక పూడుకునేటప్పుడు ఏర్పడుతున్న ఒత్తిడితో ఉప్పాడ వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. హోప్ ఐలెండ్ వద్ద తీరం పెరుగుతుండగా, ఉప్పాడ వద్ద కోత పెరుగుతోంది. కోత ఇలా కొనసాగితే కొద్ది సంవత్సరాల్లో ఉప్పాడ గ్రామం కనుమరుగు కానుంది. భూములను కలిపేసుకుని.. ప్రకృతి ప్రకోపానికి ఓడలరేవు నదీ సంగమం నుంచి రిసార్ట్స్ వరకూ వందలాది ఎకరాల జిరాయితీ, డీపట్టా భూములు సముద్రంలో కలసిపోయాయి. 25 ఏళ్లుగా సముద్రం 500 మీటర్లకు పైగా ముందుకు వచ్చింది. ఇటీవల నెల రోజుల్లో రెండు పర్యాయాలుగా సముద్రం ముందుకు వచ్చి 936, 937 సర్వే నంబర్ గల జిరాయితీ, డీ పట్టా భూములు సుమారు 17 ఎకరాలను సముద్రం తనలో కలిపేసుకుంది. దీంతో ఓడలరేవులో సీతారామస్వామి దేవస్థానానికి చెందిన 11 ఎకరాలు, పెమ్మాడి సూర్యనారాయణ, ఇల్లింగి కాసులమ్మ, తదితరులకు చెందిన మరో ఆరు ఎకరాలు భూమి కోతకు గురైంది. –పాల వర్మ, ఓడలరేవు, అల్లవరం మండలం ప్రమాదంలో ఓఎన్జీసీ టెర్మినల్ కోనసీమ జిల్లా పరిధిలోని ఓడలరేవు ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్‌లోకి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో ఉద్యోగులు, స్థానికులు ఆందోళన చెందారు. సముద్ర అలల తాకిడికి ఈ టెరి్మనల్ ప్రధాన గోడ వరకూ భూమి కోతకు గురైంది. ఇప్పుడున్న టెరి్మనల్ గోడకు సముద్ర తీరం సుమారు కిలోమీటరు దూరంలో ఉండేది. నెమ్మది నెమ్మదిగా సముద్రం చొచ్చుకొస్తూ గోడ వరకు వచ్చింది. కోత నివారణకు జియోట్యూబ్ పద్ధతిలో రాళ్లు వేసినా కోత ఆగడం లేదు. తాజాగా తుపాన్లతో అలల ఉధృతికి కోత తీవ్రత మరింత పెరిగింది. భారీ రక్షణ గోడ ఏర్పాటు చేస్తే తప్ప ఇక్కడ కోత ఆగే పరిస్థితి లేదు. మానవ తప్పిదాలే కారణం ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కన్నా మానవ తప్పిదాల కారణంగానే సముద్రాలు గతి తప్పుతున్నాయి. సముద్ర ఉషో్టగ్రతలు పెరిగి తుపాన్లకు దారి తీస్తున్నాయి. తీరానికి రక్షణగా ఉండే మడ అడవులు, సరుగుడు తోటలను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు, ఆక్వా చెరువులతో కూడా తీరం కోతకు గురవుతోంది. ఇటీవల కాలంలో చంద్రుడు, భూమికి మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతోందని, ఫలితంగా అలల ఉధృతి పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. -
పడవలో కుళ్లిన 30 మృతదేహాలు.. సెనెగల్‌లో కలకలం
డాకర్ (సెనెగల్): పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌లో ఒళ్లు జలదరించే దృశ్యం కనిపించింది. సెనెగల్ సాగర తీరంలో తేలియాడుతున్న పడవలో 30 కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు లభ్యమయ్యాయి. రాజధాని డాకర్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ పడవ కనిపించింది. నేవీ సిబ్బంది ఈ చెక్క పడవను ఓడరేవుకు చేర్చారు.మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటి గుర్తింపు కష్టంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే ఇవి ఎవరివనేది గుర్తించేందుకు ఉన్న మార్గాల గురించి అధికారులు అన్వేషిస్తున్నారు. ఇటీవలికాలంలో సెనెగల్ నుండి స్పెయిన్ కానరీ దీవులకు వలసలు భారీగా పెరిగాయి. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 1,500 కిలోమీటర్లకు మించిన దూరాన్ని దాటి వలస సాగిస్తున్నారు.ప్రాథమికంగా ఈ మృతదేహాలు వలసదారులవై ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చాలా రోజులుగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ పడవ ఉండివుంటుందని అధికారులు చెబుతున్నారు. గత ఆగస్ట్‌లో డొమినికన్ రిపబ్లిక్ తీరంలో ఒక పడవలో 14 మృతదేహాలు లభ్యంకాగా, అవి సెనెగల్ జాతీయులవై ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా అక్రమ వలసలను అరికట్టడానికి సెనెగల్ 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది. నిరుద్యోగం, పేదరికం, అంతర్గత సంఘర్షణలతో విసిగిపోయిన యువకులు అట్లాంటిక్ మహాసముద్రంలో ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటూ కానరీ దీవులకు వలస వెళుతున్నారు. ఇది కూడా చదవండి: యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం -
తిమింగలానికి కోపమొస్తే.. చుక్కలే! ఈ వైరల్ వీడియో చూడండి!
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ హార్బర్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భారీ తిమింగలం చిన్న బోటు మీదికి ఉన్నట్టుండి లంఘించింది. దీంతో నడి సముద్రంలో బోటు దాదాపు బోల్తా కొట్టడంతో అందులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చివరికి ఏమైంది? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.కోలిన్, వ్యాట్ యాగర్ అనే ఇద్దరు సోదరులకు తమ తొలి ఫిషింగ్ ట్రిప్‌లోనే భయకరమైన అనుభవం ఎదురైంది. వీరు మంగళవారం ఉదయం న్యూ హాంప్‌షైర్ తీరంలో 23 అడుగు పొడవున్న ఓ బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. తీరా బోటు సముద్రంలోకి వెళ్లాక వారికి సమీపంలో ఒక భారీ తిమింగలం దర్శనమిచ్చింది. అది బోటు దగ్గరకు వచ్చీ రావడంతోనే బోట్‌పై ఎటాక్ చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించింది. దీంతో నడి సంద్రంలో బోటు అతలాకుతలమై పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరూ సముద్రంలోకి దూకేశారు. సముద్రంలో చుట్టు పక్కల బోట్లలో ఉన్నవారు వారిని కాపాడారు.Whale lands on boat 😮😱 pic.twitter.com/eIJPIsB8YO— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 24, 2024 ఉత్తర న్యూ ఇంగ్లండ్ కమాండ్ సెంటర్‌కు రెండుసార్లు మేడే సిగ్నల్ అందిందని యుఎస్ కోస్ట్ గార్డ్‌లోని ఒక అధికారి చెప్పారు. న్యూహంప్షైర్ కోస్ట్లోభారీ తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయనీ, కానీ ఇలా ఎపుడూ దాడికి దిగలేదని అన్నారు. తిమింగలానికి సైతం ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ఆ బోటుకు సమీపంలో ఉన్న మరో బోటు నుంచి ఎలియట్, మైనే సోదరులు దీనికి సంబంధించిన వీడియో తీశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
చమురు నౌక మునక: ఎనిమిది మంది భారతీయులు సురక్షితం
ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిని ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ట్యాగ్ సురక్షింతగా బయటకు తీసుకువచ్చింది. ఈ చమురు నౌక సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులు. ఈ ప్రమాదంలో మునిగిన ఒక శ్రీలంక పౌరుడిని కూడా ఇండియన్ నేవీ రక్షించింది. మరో శ్రీలంక పౌరుని మృతదేహాన్ని వెలికితీసింది.ఒమన్ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్‌ను గుర్తించడానికి భారత్‌కు చెందిన యుద్ధనౌక ఐఎస్ఎస్ టెగ్ను రెస్క్యూ ఆపరేషన్‌కు పంపారు. ఒమన్‌లోని రాస్ మద్రాక్కు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో జులై 15న ఈ నౌక మునిగిపోయింది. ఒమన్ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ అనే కార్గో నౌకలో 13 మంది భారతీయులు,ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమన్ మారిటైమ్ సేఫ్టీ సెంటర్ (ఎంఎస్సీ)పేర్కొంది. -
Oman: చమురు నౌక మునక.. 13 మంది భారతీయులతో సహా 16 మంది గల్లంతు
ఒమన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యెమెన్ వైపు వెళుతున్న చమురు నౌక ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఒమన్‌కు చెందిన మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ చమురు నౌక పేరు ప్రెస్టీజ్ ఫాల్కన్.ప్రమాదం జరిగిన సమయంలో దీనిలో 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరి జాడ ఇంకా తెలియరాలేదు. గల్లంతైనవారిలో 13 మంది భారతీయ పౌరులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని సమాచారం. ఈ చమురు నౌకకు తూర్పు ఆఫ్రికా దేశమైన కొమొరోస్ జెండా ఉంది. ఈ చమురు నౌక ఒమన్ ప్రధాన పారిశ్రామిక డుక్మ్ పోర్ట్ సమీపంలో మునిగిపోయింది.ఈ ట్యాంకర్ షిప్ యెమెన్ వైపు వెళ్తుండగా దుక్మ్ పోర్ట్ సమీపంలో బోల్తా పడింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మునిగిపోయిన చమురు నౌక 117 మీటర్ల పొడవు ఉంది. దీనిని 2017లో నిర్మించారని తెలుస్తోంది. కొమొరోస్ ఫ్లాగ్ ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ షిప్ రాస్ మదారకాకు ఆగ్నేయంగా 25 నాటికన్ మైళ్ల దూరంలో మునిగిపోయిందని మారిటైమ్ సేఫ్టీ సెంటర్ ఒక ట్వీట్లో తెలిపింది. A Comoros flagged oil tanker capsized 25 NM southeast of Ras Madrakah. SAR Ops initiated with the relevant authorities. #MaritimeSecurityCentre— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 15, 2024 -
తీరం దాటిన తుఫాన్
-
తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్‌డీ హెచ్చరిక
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. డిసెంబర్ 1 నుంచి 4 మధ్య తమిళనాడు తీరప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. చెన్నైతోపాటు తమిళనాడులోని మరో ఐదు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెంగల్పట్టు, తిరువళ్లూరు, నాగపట్నం, రామనాథపురం, కాంచీపురం వర్ష ప్రభావిత జోన్లో ఉన్నట్లు పేర్కొంది. గత కొద్ది రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గురువారం కూడా చెన్నై చుట్టుపక్కల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటించారు. చెంబరంబాక్కం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో కాంచీపురం జిల్లాలోని అడయార్ నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సందర్శించారు. చెన్నైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాట్లను సమీక్షించారు. అత్యవసర సేవల కోసం చెన్నై కార్పొరేషన్ ఎమర్జెన్సీ నెంబర్ 1913 నెంబర్‌కు సమాచారం అందించాలి కోరారు. ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా పరిష్కరించడానికి శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఏర్పర్చుకోవాలని కోరారు. ఇదీ చదవండి: AIIMS Rishikesh: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే..
ఈజిప్టు: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పర్యాటకుల పడవకు అగ్ని ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈజిప్టు, ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు దగ్గరలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం పడవలో 29 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 15 మంది బ్రిటీష్ పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే..సొర చేపలు, డాల్ఫిన్స్ ఉండే అందమైన ప్రదేశానికి పడవ బయలుదేరింది. ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు చేరగానే ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్ల సహాయంతో సిబ్బంది పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ముగ్గురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిపారు. حريق مركب سفاري بطول ٤٠ متر اسمها hurricane في جنوب البحر الأحمر و بالتحديد منطقة Elphinstone و انقاذ معظم السياح فيما عدا ٣ لا يزالوا مفقودين و يعتقد ان جنسيتهم انجليز، نتمني السلامه للجميع و ربنا ينجي المفقودين. المصدر: شهود عيان pic.twitter.com/hRg1YlzNb7 — RedSea_Anglers ⚓ 🚢 🇪🇬🇱🇧🇬🇷 (@HanySadekk) June 11, 2023 షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! -
ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి భారీ పరిమాణంలోని వింత చేప ఒకటి కొట్టుకు వచ్చింది. దీనిని కేత్ రాంప్టన్, టామ్ రాంప్టన్ అనే దంపతులు తొలుత గుర్తించారు. చేప దాదాపు రెండు మీటర్ల పొడవు ఉంది. వీరిద్దరూ వెటర్నరీ డాక్టర్లే అయినా, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చేపను వారు చూసి ఉండలేదు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప అప్పటికే మరణించి ఉంది. రాంప్టన్ దంపతులు ఈ చేప ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు దీని గురించి కొంత అధ్యయనం చేయడంతో ఆసక్తికరమైన విశేషాలు బయటపడ్డాయి. ఇది ‘ఓషన్ సన్‌ఫిష్’ అని తేలింది. ‘ఓషన్ సన్‌ఫిష్’ జాతికి చెందిన చేపలు సైజులో భారీవే అయినా, సముద్రాల్లో వీటి సంఖ్య చాలా తక్కువ. అరుదైన చేపలు కావడంతో వీటి గురించి చాలామందికి తెలీదు. ఇవి పూర్తిగా ఎదిగితే, నాలుగు మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పు వరకు పెరుగుతాయని, దాదాపు రెండున్నర వేల కిలోల బరువు ఉంటాయని మెరైన్ బయాలజిస్టులు చెబుతున్నారు. ఇవి ఉష్ణమండల తీరాల వద్ద అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని వారు అంటున్నారు. చదవండి: చెరువులో వింత జీవి.. ఒకటి, రెండు కాదు ఏకంగా ఇరవైనాలుగు కళ్లు! -
కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి సర్కార్ బ్రేక్.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: విలాసవంతమైన నౌక కార్డీలియా క్రూయిజ్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పుదుచ్చేరిలో హాల్ట్‌కి నిరాకరించింది. క్రూయిజ్‌లో కేసీనో, గ్యాంబ్లింగ్ ఉండటంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. తెల్లవారు జామున 4 గంటల నుంచి షిప్ ఆగిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో క్రూయిజ్ ఆపరేట్లు చర్చలు జరుపుతున్నారు. పాండిచ్చేరి అనుమతించకపోతే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని కడులూరు పోర్ట్‌లో నౌకను ఆపేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: మాములుగా లేదు మరి.. షిప్ లోపల ఓ లుక్కేయండి.. -
అమ్మకానికి ఒంటరి మేడ.. ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే..
ఎక్కడో దూరంగా కొండకోనల్లో ఉన్న గ్రామంలో ఉంటున్నారా? అయినా కూడా ఏకాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదా! అయితే ఈ సముద్రం మధ్యలోని బిల్డింగ్ మీకోసమే. పేరు స్పిట్బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్‌లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి. ఇందులో 9 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక వేడి టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్లు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! -
కొత్తపట్నం తీరప్రాంతంలో ఫిష్షింగ్ హార్బర్
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని పది మండలాల పరిధిలో 102 కిలో మీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి 75 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల మత్స్యకారులు సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తంగా 88 వేల మంది సముద్ర తీరం వెంబడి జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో 39 మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు 2,200, తెప్పలు 620 వరకు ఉన్నాయి. నెరవేరనున్న మత్స్యకారుల కల జిల్లా మత్స్యకారుల ఏళ్లనాటి కల వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నెరవేరనుంది. అందుకు జిల్లా కేంద్రం ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న కొత్తపట్నం సముద్ర తీరం వేదిక కానుంది. మత్స్యకారుల సంప్రదాయ వృత్తి సముద్రపు వేటకు అనువైన వసతులు లేక జిల్లా మత్స్యకారులు నానా అవస్థలు పడుతున్నారు. మత్స్య పారిశ్రామికవేత్తలు, మత్స్యకార సంఘాల నేతలు ఎప్పటి నుంచో ఆశిస్తున్న కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫిష్షింగ్ హార్బర్లలో జిల్లాలోని కొత్తపట్నంలో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. నిజాంపట్నం వెళ్తున్న మత్స్య పారిశ్రామికవేత్తలు జిల్లాలోని సముద్ర తీరంలో మెకనైజ్డ్ బోట్లు (మర పడవలు) నిలుపుకునేందుకు హార్బర్ లేకపోవడంతో జిల్లాలోని మత్స్య పారిశ్రామిక వేత్తలు పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని ఫిష్షింగ్ హార్బర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. సముద్రంలో మూడు రకాల పడవలతో మత్స్య సంపద కోసం వేట సాగిస్తారు. వాటిలో ఒకటి తెరచాపలు, తెడ్ల సాయంతో సంప్రదాయ కొయ్య తెప్పల (కంట్రీ బోట్లు)తో వేట సాగిస్తారు. రెండోది ఆ కొయ్య తెప్పలకే మోటారు అమర్చి వేగంగా సముద్రంలోకి వెళ్లి వేట సాగించటం. ఈ రెండు రకాల బోట్లలో తెల్లవారు జామున వేటకు వెళ్తే మధ్యాహ్నానికో, సాయంత్రానికో తిరిగి ఇంటికి చేరుకోవాల్సిందే. అంతకు మించి సముద్రంలో ఉంటే మత్స్యకారులకు అన్నపానీయాలు ఉండవు. ఇక మూడో రకం మెకనైజ్డ్ బోట్లు. ఈ బోట్లలో రెండు, మూడు నెలలపాటు సముద్రంలో వేట కొనసాగించే విధంగా అన్నీ సమకూర్చుకొని సముద్రంలోకి వెళ్లవచ్చు. ఆ బోటులోనే ఉండేందుకు, పట్టిన మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇలాంటి ఒక్కో బోటులో ఏడు నుంచి పది మంది వరకు మత్స్యకారులు వేట సాగించేందుకు వీలుంటుంది. అలాంటి మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేందుకు జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ లేక ఓడరేవు నుంచి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో నిలుపుకొంటున్నారు. సముద్రంలో వేటకు వెళ్లాలంటే మన జిల్లా నుంచి మత్స్యకారులు నిజాంపట్నం వెళ్లి అక్కడి నుంచి బోటులో సముద్రంలోకి వెళ్తారు. సముద్ర నియంత్రణ చట్టం ప్రకారం తీరం నుంచి ఆరు కిలో మీటర్లు అవతలే ఈ బోట్లు వేట సాగించాలి. ఉపాధి మెరుగుపడే అవకాశం జిల్లాలో ఫిష్షింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునే అవకాశం ఉంటే మత్స్య పారిశ్రామికవేత్తలు అలాంటి బోట్లు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారు. జిల్లాలో ఆ అవకాశం లేకపోవడంతో కేవలం 39 మెకనైజ్డ్ బోట్లు మాత్రమే ఉన్నాయి. అదే ఇక్కడైతే వందల సంఖ్యలో బోట్లు కొనేందుకు అనేక మంది ముందుకొస్తారు. ఫలితంగా వేలాది మంది మత్స్యకార్మికులకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో 26 వేల మంది సముద్రంలో వేటకు వెళ్తారు. అందులో కూడా దాదాపు 10 వేల మంది పక్క జిల్లాలు, చెన్నై, ఒడిశా, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటారు. ఇక్కడే హార్బర్ ఏర్పాటు చేస్తే వలసలు వెళ్లాల్సిన పని ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతం వేటకు వెళ్లే వారి సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఉపాధి: కొత్తపట్నం సముద్ర తీరంలో హార్బర్ ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు పూర్తి స్థాయిలో ఉపాధి దొరుకుతుంది. పక్క జిల్లాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఉన్న మత్స్య పారిశ్రామికవేత్తల కంటే ఇంకా ఎక్కువ మంది మెకనైజ్డ్ బోట్లలో వేట సాగించేందుకు ఆసక్తి చూపుతారు. దీనిద్వారా అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పడతాయి. మత్స్యకార యువత, మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మత్స్య సంపద ఉత్పత్తి కూడా ఐదు నుంచి పదిరెట్లు పెరిగే అవకాశం ఉంది. – ఆవుల చంద్రశేఖరరెడ్డి, జేడీ, మత్స్య శాఖ -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెల్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ముంబై తీరానికి ఆత్మీయ అతిథి!
సాక్షి, ముంబై: ఒక విశిష్ట అతిథి రాక రాక వచ్చింది. దేశదేశాలు దాటుకుంటూ, అలుపుసొలుపు లేకుండా సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ వచ్చింది. ముంబై తీరంలో సందడిని, పర్యావరణవేత్తల్లో సంబరాన్ని ఒకేసారి మోసుకువచ్చింది. ఆ ఆత్మీయ అతిథి కోసం పర్యావరణవేత్తలు 20 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఆ అరుదైన జాతిని ముంబై బీచ్‌లలో చూడగలమో లేదోనని కొన్నాళ్లు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. అత్యంత అరుదైన జాతికి చెందిన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ముంబై వెర్సోవా బీచ్‌లో మెరిశాయి. మొత్తం 80 గుడ్లు ఈ తీరంలో మార్నింగ్ వాకర్లకి, బీచ్‌ని శుభ్రం చేసే కార్మికులకు కనిపించాయి. అయితే అవి నిజంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్ల గుడ్లేనా అన్న అనుమానాలను కొందరు పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు వ్యక్తం చేశారు. సంతానాభివృద్ధి కోసం ఈ అరుదైన జాతి ముంబై తీరానికి వచ్చిందో లేదో నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. వారి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారి ప్రశాంత్ దేశ్‌ముఖ్ నేతృత్వంలోని ఒక బృందం వెర్సోవా బీచ్‌ను సందర్శించింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తమకు సురక్షితమని భావించే సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుకను తవ్వి ఆ గోతుల్లో గుడ్లను పెడతాయి. అలాంటి గోతులు, వాటిల్లో కొన్ని విరిగిపోయిన గుడ్లు వెర్సోవా బీచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం బృందానికి కనిపించాయి. కొన్ని గుడ్ల నుంచి మృతి చెందిన తాబేలు పిల్లలు కూడా కనిపించాయి. వాటిని పరీక్షించగా అవి అరుదైన ఆలివ్ రిడ్లీ జాతికి చెందినవేనని తేలింది. ‘ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇది నిజంగా శుభవార్త. వెర్సోవా బీచ్ కూడా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పొదగడానికి అనువైన ప్రాంతంగా మారింది. జీవవైవిధ్యాన్ని కోరుకునేవారిలో స్ఫూర్తిని నింపే పరిణామం ఇది. ఇదే బీచ్‌లో మరిన్ని ఎగ్ షెల్స్ ఉండే అవకాశం ఉంది. ‘ అని అటవీ సంరక్షణ శాఖ అధికారి వాసుదేవన్ చెప్పారు. అరుదైన తాబేళ్లు కనిపించగానే సంబరాలు చేసుకోనక్కర్లేదు. ఇప్పుడు వాటిని కాపాడుకోవమే చాలా ప్రయాసతో కూడుకున్న పని. కుక్కలు, మత్స్యకారుల మరబోట్లు, బీచ్ సందర్శకుల నుంచి వాటికి ముప్పు పొంచి ఉంది. తాబేళ్ల గుడ్లను సంరక్షించి అరుదైన జాతిని కాపాడుకోవడమే అటవీ శాఖ అధికారుల ముందున్న పెద్ద సవాల్ అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
రుషికొండ తీరంలో బ్లూ రింగ్ యాంగిల్ ఫిష్
సాగర్‌నగర్(విశాఖ తూర్పు) : ప్రకృతి సహజ అందాలకు నిలయమైన రుషికొండ సముద్ర తీరంలో శనివారం అరుదై న, అందమైన బ్లూ రింగ్ యాంగిల్ ఫిష్ మత్స్యకారులకు చి క్కింది. సాధారణంగా విదేశీ సముద్ర తీరాల్లో సముద్ర మట్టానికి వంద మీటర్లు లోతులో నాచురాళ్లు మధ్య విహరిం చే అందమైన ఈ చేప వాడపాలెం వాడబలిచి మత్స్యకారుల వలకు చిక్కింది. వారి వేటలో భాగంగా పడిన చేపల్లో బ్లూరింగ్ యాంగిల్ ఫిష్ ఆకర్షణీయంగా కన్పించడంతో స్థానిక మత్స్యకారులు, పర్యాటకులు వింతగా తిలకించారు. సాధారణంగా ఇక్కడి రేవులకు ఈ తరహా చేపలు రావు. చేప శరీరమంతా తాబేలు ఆకారంలో ఉంది. దీని తోక తెల్లగా అందంగా కన్పిస్తోంది. శరీరంపై బ్లూ కలర్ చారలతో ఆకర్షణీయంగా, వింతగా కనిపిస్తోంది. పెద్ద కళ్లు కలిగిన చేప వలకు చిక్కిన వెంటనే చనిపోయిందని మత్స్యకారులు తెలిపారు. ఈ తరహా చేపలు విశాఖ తీరానికి రావడం చాలా అరుదని, ఎక్కువగా విదేశీ రేవుల్లో లభిస్తాయని మత్స్యకార శాఖ అధికారిణి విజయ తెలిపారు. -
అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను
-
తీవ్రవిషాదాన్ని నింపిన వాయుగుండం
-
ప్లాస్టిక్‌తో సముద్రానికి ముప్పు
ప్లాస్టిక్ వ్యర్థాలవల్ల సముద్రానికి తీరని నష్టం వాటిల్లుతోందని కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్‌గార్డ్స్ కమాండెంట్ వేణు మాధవ్ తెలిపారు. శనివారం కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా కృష్ణపట్నం రేవులోని సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు. -
విశాఖ తీరంలో మళ్లీ ‘అల’జడి
విశాఖ బీచ్‌లో కోతకు గురైన రిటైనింగ్ వాల్ సాక్షి, విశాఖపట్నం: అలల ప్రకోపానికి విశాఖ బీచ్‌లో తీరం మళ్లీ కోతకు గురైంది. కురుసుర సబ్ మెరైన్ మ్యూజియంకు ముందు ఆక్వాస్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎదురుగా శనివారం ఉదయం ఉవ్వెత్తున ఎగసిపడిన అలల ఉధృతికి సుమారు 18 మీటర్ల మేర రక్షణ గోడ (రిటైనింగ్ వాల్) కోతకు గురైంది. దీంతో తీరంలో మళ్లీ అలజడి మొదలైంది. ఏక్షణాన ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియక నగర వాసులు భీతిల్లుతున్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి రుషికొండ మధ్య సముద్ర తీరప్రాంతంలో 4.5 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకకొరత ఉండడం వలనే తీరం కోతకు గురవుతోందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.