సాక్షి, హైదరాబాద్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెల్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment