bangalakatham
-
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో 4 వారాల్లోగా చెప్పండి.. : రాష్ట్ర హైకోర్టు ఆదేశం
-
బెజవాడను ముంచేసిన బుడమేరు! ముంపులోనే పలు కాలనీలు.. ఇంకా ఇతర అప్డేట్స్..
-
Rain Alert: తీవ్ర అల్పపీడన ప్రభావం.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల శనివారం భారీ వర్షాలు కురిశాయి. చాలాచోట్ల ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లా టేక్మాల్‌లో 16.3 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. దీంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధమైంది. కాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఈ రెండు రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. కాగా.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపా కకు చెందిన చందా రమ (47) పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి మృతి చెందింది. ఇదీ చదవండి: కదలని నేతలు అవుట్.. టీపీసీసీ ప్రక్షాళనపై హైకమాండ్ దృష్టి! -
బంగాళాఖాతంలో అల్పపీడనం
-
మరో ఐదురోజుల్లో రుతుపవనాలు ఏపీలో ప్రవేశించే అవకాశం
-
బంగాళాఖాతంలో భూకంపం..చెన్నైలో భూప్రకంపనలు
సాక్షి,చెన్నై: బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో చెన్నైలోని పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని రాష్ట్ర విపత్తులశాఖ తెలిపింది. చదవండి:మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’ Earthquake of Magnitude:5.1, Occurred on 24-08-2021, 12:35:50 IST, Lat: 14.40 & Long: 82.91, Depth: 10 Km ,Location: 296km SSE of kakinada, Andhra Pradesh, India for more information download the BhooKamp App https://t.co/6qwi4D40KO @ndmaindia @Indiametdept pic.twitter.com/dLB55CDm36 — National Center for Seismology (@NCS_Earthquake) August 24, 2021 -
తుఫానుగా బలపడనున్న వాయుగుండం
సాక్షి, విజయవాడ: నైరుతి, దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం 24 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. దాని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. రైతాంగం వ్యవసాయ పనుల యందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కె. కన్నబాబు తెలిపారు. చదవండి: పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు! -
కొనసాగుతున్న అల్పపీడనం..భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం : నైఋతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది నైఋతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరో 24 గంటలలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తుపాను వాయువ్య దిశగా పయనించి తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్ - మహాబలిపురంల మధ్య ఈ నెల 25న తీరం దాటే అశకాశం ఉంది. రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : ఉత్తర కోస్తాంధ్ర: ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర : ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. సోమవారం దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : సోమవారం రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాయలసీమలో ఉరుములు మెరుపులు తోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
శాంతించవమ్మా.. గంగమ్మా
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరిస్తోంది. ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ బలపడి వాయుగుండంగా మారనుంది. ఒడిశా-బెంగాల్ తీరంలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం తెలిపింది. దాని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూసీకి పూజలు: పురానాపూల్ వద్ద మూసీకి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం శాంతి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ తల్లికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు. శాంతి పూజలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం దర్గాలో మేయర్, మంత్రులు చాదర్ సమర్పించనున్నారు. లాలాపేటలో మంత్రి కేటీఆర్ భాగ్యనగరంలో గత కొన్ని రోజలుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి, లోతట్టు పాంత్రాలో ఉన్న కాలనీలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ లాలాపేటలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆయన బాధితులకు రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. -
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం
సాక్షి, హైదరబాద్: నగరంలో మంగళవారం తెల్లవారుజామునుంచి పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కోటి, నాంపల్లిలో వాన పడుతోంది. చార్మినార్, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్టలో మోస్తరు వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, బడంగ్పేట్, మీర్పేట్లో వర్షం పడడంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ముంపు నుంచి పలు శివారు కాలనీలు ముంపు నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పటికే కురిచిన భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. పలు కాలనీలు, ఇంకా బురదమయంగానే ఉన్నాయి. మరోవైపు తూర్పు పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మంగళవారం మధ్యాహ్నం తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీర ప్రాంతంలో 45 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్లు వేగంతో ఈదురుగాలులు విస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
విశాఖపట్నంలో భారీ వర్షం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు సమాచారం. విశాఖకు ఆగ్నేయంగా 310 కిలో మీటర్ల, కాకినాడకు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం కానున్నది. విశాఖ-నరసాపురం మధ్య ఇవాళ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తీరం వెంబడి 45-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేందం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి: జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. కోనసీమలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రతీరానికి సందర్శకులు రావద్దని సూచించారు. కాకినాడ, రాజమండ్రి అమలాపురం, రామచంద్రపురం ఆర్టీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కంట్రోల్‌రూమ్‌ల వివరాలు: వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల నంబర్ల వివరాలు.. 1. కలెక్టరేట్ (కాకినాడ)- 18004253077 2. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం- 08832442344 3. సబ్ కలెక్టర్ కార్యాలయం, ఎటపాక- 08748285279 4. ఐటీడీఏ పీవో కార్యాలయం, రంపచోడవరం-18004252123 5. ఆర్డీవో కార్యాలయం, అమలాపురం-08856233100 6. ఆర్డీవో కార్యాలయం, కాకినాడ-08832368100 7. ఆర్డీవో కార్యాలయం, రామచంద్రాపురం-08857-245166 విశాఖపట్నం: జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పరవాడలో 18 సెం.మీ, గాజువాకలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. విశాఖ సిటీ, భీమిలిలో 16 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, జిల్లా అధికారులను కలెక్టర్ వినయ్ చంద్ అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాయుగుండం నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నెంబర్లు: 0891-2590102, 0891-2590100. పశ్చిమ గోదావరి: పోలవరంలో భారీ వర్షం కారణంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పర్యటన రద్దు అయింది. నేటి ఉదయం11గంటలకు పోలవరం చేరుకోవల్సిది. భారీ వర్షం, వాయుగుండం నేపథ్యంలో మంత్రి పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. విజయనగరం: జిల్లాలోని ఏజెన్సీ కురపాం ప్రాంతంలో వర్షం కురుస్తోంది. అదే విధంగా జిల్లాలోని పలు చోట్ల అర్థరాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెల్లవారు జాము నుంచి వర్షపు చినుకులు కురుస్తున్నాయి. వాయుగుండం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైఎస్ఆర్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపాగ్ని నదికి భారీగా వరద నీరు చేరుతోంది. వేంపల్లి ఎద్దుల కొండ వృషబచలేశ్వర స్వామి కొండ పైకి వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అలిరెడ్డి పల్లె, తూపల్లె గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. చక్రాయపేట మండలంలో నదికి ఆనుకొని వేసిన వరి పంటలునీట మునిగాయి. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారంనాటికి ఈ అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సోమ, మంగళవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాజధానిలో కుండపోత నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు హైదరాబాద్ నగరం జలమయమైంది. ఆదివారం పలు ప్రాంతాల్లో 5–7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో వరద పోటెత్తింది. జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వర్షపునీటిని బయటికి తోడిపోశాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరి న వర్షపునీటితో పలు బస్తీల వాసులు అవస్థలు పడుతున్నారు. ఇటు వికారాబాద్ జిల్లా లోనూ భారీ వర్షం కురిసింది. పెద్దేముల్ మం డలంలోని గాజీపూర్, కందనెల్లి, ఇందూరు వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. -
అలర్ట్: పెను తుపానుగా ‘అంఫన్’
సాక్షి, చెన్నై : తమిళనాడుపై అంఫన్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను కారణంగా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సేలం, ఈరోడ్, ధర్మపురి, కోయంబత్తూర్, క్రిష్ణగిరి జిల్లాలో భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలకు పడుతున్నాయి. కొన్ని చోట్ల హోర్డింగ్‌లు, చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డ. బంగాళాఖాతంలో పెను తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలోని హార్బర్లలో మూడో ప్రమాద హెచ్చరిక సూచి ఎగుర వేశారు. రామేశ్వరం నుంచి చెన్నై ఎన్నూర్ హార్బర్ వరకు ఈ హెచ్చరిక జారీ అయింది. సముద్ర తీరంలో గాలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో జాలర్లు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఆదివారం రాత్రి సాయంత్రం తీవ్ర తుపాన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. (అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’). సోమవారం నాటికి పెను తుపానుగా మారిన అంఫన్.. సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారనుంది. ప్రస్తుతం ఇది ఉత్తర వాయువ్య దిశగా బంగాళాఖాతం మీదుగా పయనిస్తోంది. దిఘా, బంగ్లాదేశ్ హటియా దీవుల మద్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో 155-185 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది తదుపరి ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్- బంగాదేశ్ తీరాల వద్ద డిగా, హతియా దీవులు(బాంగ్లాదేశ్) మధ్య మే 20 వ తేదీ మధ్యాహ్నం సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అంఫాన్ వల్ల ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తాజా హెచ్చరికలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సముద్ర తీరంలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాల మధ్య తుపాను కొనసాగుతోంది. ఉత్తర దిశగా ప్రయాణించి మరింత తీవ్రమై ఈరోజు (మే 18వ తేదీన) ఉదయం 05.30 గంటలకు అత్యంత తీవ్ర తుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో పారదీప్ (ఒరిస్సా)కు దక్షిణ దిశగా 790 కిమీ, డిగా (పశ్చిమ బెంగాల్)కు దక్షిణ నైఋతి దిశగా 940 కిమీ, ఖేపుపర (బంగ్లాదేశ్)కు దక్షిణ నైఋతి దిశగా 1060కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. -
ఆరంజ్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో 16 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణకేంద్రం హెచ్చరించింది. చెన్నైలో మోస్తరుగా వర్షం పడవచ్చు. ఈ వర్షాలకు అధికార వర్గాలను అప్రమత్తం చేస్తూ ఆరంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక కొద్ది రోజులుగా జ్వరాలు మరింత స్వైరవిహారం చేస్తుండడంతో ఆస్పత్రుల్లో ఐదు వేల మంది చికిత్స పొందుతున్నారు. డెంగీ బారినపడ్డ వారిలో ఆదివారం నలుగురు పిల్లలు మరణించారు. సాక్షి, చెన్నై: ముందుగానే రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన విషయం తెలి సిందే. ఈ ప్రభావంతో నాలుగు రోజులుగా అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక జలాశయాల్లోకి నీటి రాక పెరిగింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బయలు దేరడంతో పాటుగా, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఆరంజ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే ముందు జాగ్రత్తలతో సర్వం సిద్ధం చేసి ఉన్న అధికార వర్గాలు, ఈ అలర్ట్‌తో మరింత అప్రమత్తమయ్యారు. నాలుగు రోజులు వర్షం.. దీపావళికి ముందుగా వర్షం పడడం సహజం. అయితే, ఈ సారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణకేంద్రం ప్రకటించింది. శ్రీలంకకు సమీపంలో బంగాళా ఖాతంలో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రభావం ఈశాన్య రుతు పవనాలు, అరేబియా సముద్రంలో వీస్తున్న సుడిగాలుల రూపంలో తమిళనాడులోని 16 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఆదివారం ప్రకటించింది. తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, రామనాథపురం, శివగంగై, పుదుకోట్టై, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి, కోయంబత్తూరు, తేని, దిండుగల్, మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువేనని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికార వర్గాలు అప్రమత్తంగా వ్యవహరించే పనిలోపడ్డాయి. చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, కొన్ని చోట్ల మోస్తరుగా వర్షం తెరపించి తెరపించి పడుతుందని, రాత్రుల్లో మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకావం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో కన్యాకుమారి జిల్లా దేవాలంలో 13 సె.మీ, శివలోకంలో 12 సె.మీ, వేడచందూరు, కుమార పాళయం, సత్యమంగళం, మేట్టుపాళయంలో ఏడు నుంచి తొమ్మిది సె.మీ మేరకు వర్షం పడింది. ఈ శాన్య రుతు పవనాల రాకతో ఇప్పటి వరకు అత్యధికంగా కన్యాకుమారి, తిరునల్వేలి, నీలగిరి జిల్లాల్లో వర్షం పడింది. ఇక్కడి జలపాతాలు, వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో పాటు జలాశయాలు శరవేగంగా నిండుతున్నాయి. జ్వరాల స్వైరవిహారం.. వర్షాలకు తోడుగా సీజన్ జ్వరాలు కొద్ది రోజులుగా రాష్ట్రంలో స్వైరవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్న జిల్లాల్లో ప్రస్తుతం ఈ జ్వరాల తీవ్రత పెరిగింది. తిరుచ్చి, తిరువారూర్, తంజావూరు, నాగపట్నం, కరూర్, అరియలూరు, పెరంబలూరు, తేని, చెన్నై జిల్లాల్లో జ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగి ఉన్నది. ఆదివారం ఒక్క రోజు ఐదువేల మంది చికిత్స నిమిత్తం ఆస్పత్రుల్లో చేరారు. ఇక, డెంగీ నిర్ధారణ కావడంతో చెన్నై చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన పుళల్‌కు చెందిన గుణశేఖరన్ పెద్దకుమారుడు అరవింద్ మరణించాడు. ఆయన చిన్న కుమారుడు అరుణాచలంకు సైతం డెంగీ నిర్ధారణతో చికిత్సలు అందిస్తున్నారు. అలాగే, పెరియమేడుకు చెందిన ఆనంద్ కుమార్తె అక్షర సైతం చికిత్స పొందుతూ మృతి చెందింది. కరూర్‌లో వైష్ణవి అనే నాలుగో తరగతి విద్యార్థినితో పాటుమరొకరు డెంగీతో బాధ పడుతూ తిరుచ్చి ఆస్పత్రిలో మృతిచెందారు. మృతుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన మొదలయ్యాయి. -
నేటి నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తర్వాత రెండు రోజులకు అది వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆదివారం నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. రుతుపవనాలు మొదలయ్యాక అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ మరింత ఆశాజనకంగా ఉంటుం దని వ్యవసాయ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమురం భీం జిల్లా బెజ్జూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. సారంగాపూర్, బజర్హతనూర్‌ల్లో 7 సెం.మీ., దిల్వార్పూర్, వంకడి, ఖానాపూర్‌ల్లో 6 సెం.మీ., కమ్మర్పల్లి, ఆర్మూర్, నందిపేట, భూపాలపల్లి, మోర్తాడ్, బోథ్, మంథని, నవీపేట్‌ల్లో 5 సెం.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
విశాఖకు ఉప్పుద్రవం!
నగరానికి ప్రకృతి అమర్చిన నగలా భాసిల్లుతోంది అతి పొడవైన సాగరతీరం. విశాఖ ఎదుగుదలకు పారిశ్రామికంగా, పర్యాటకంగా దోహదం చేస్తోంది. కానీ ఇదే సాగర తీరం భవిష్యత్తులో నగరానికి పెను ఉపద్రవంగా పరిణమించనుందా?.. ఈ ప్రశ్నకు నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.అదేమిటీ.. సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న విశాఖ సునామీలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి కూడా సురక్షితంగా ఉంటుందని కదా ఇప్పటి వరకు ధైర్యంగా ఉంటున్నాం.. అని అంటారా!..అది కరెక్టే గానీ.. భవిష్యత్తులో కమ్ముకొచ్చే ముప్పు మరో రూపంలో ఉంటుందన్నది నిపుణుల హెచ్చరిక.. సాగర జలాలు చాపకింద నీరులా నగర పరిధిలోని భూగర్భంలోకి చొచ్చుకొచ్చి పాతాళగంగను ఉప్పుతో నింపేస్తున్నాయి. దీని వల్ల మరికొన్నేళ్లలో నగరం తీవ్రమైన తాగునీటి ఎద్దడితో తల్లడిల్లిపోనుందని అంటున్నారు. అదెలా అంటే.. భూగర్భ జలమట్టాలు పుష్కలంగా ఉంటే నగరానికి ఆనుకొని ఉన్న సాగర జలాలను రాకుండా అడ్డుకుంటాయి. కానీ గత కొన్నేళ్లుగా అరకొర వర్షాలు, నగర పరిధిలోని భూమిలో సుద్ద మట్టి వల్ల నీరు భూమిలోకి ఇంకకపోవడం వంటి పరిస్థితులతో భూగర్భం వట్టిపోతోంది. ఆ ఖాళీ స్థలాల్లోకి సాగరజలాలు చొచ్చుకొస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాల్లో ఉప్పు నీరు కలిసిపోతోంది. మొత్తం భూగర్భ నీటివనరులను ఉప్పుమయం చేసేస్తోంది. ఇప్పటికే సాగరతీరాన్ని ఆనుకొని ఉన్న పలు ప్రాం తాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. భూగర్భాన్ని రీచార్జ్ చేసే చర్యలను ముమ్మరం చేయకపోతే భవిష్యత్తులో నగరం మొత్తం ఉప్పునీటి కయ్యగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఉప్పునీటి కయ్యగా విశాఖ నగరం ► అక్షరాలా మనిషి స్వయంకృతం ► ఆందోళన కలిగిస్తున్న పరిణామం ► రాబోయే కాలంలో నీరు పూర్తిగా నిరుపయోగం ► ఇంకుడుగుంతలే పరిష్కారం ముప్పులు ఎన్నో విధాలు.. వాటిలో ఉప్పు ముప్పు విశాఖను భయపెడుతోంది. చాపకింద నీరన్నది అక్షరాలా విశాఖను ఉప‘ద్రవం’లా కలవరపెడుతోంది. దీనిని ఉప్పుద్రవం అనాలేమో. ఎందుకంటే నగరంలో భూగర్భ జలాల పరిమాణం తగ్గిపోతూ ఉంటే.. ఆ స్థానాన్ని సముద్రం నుంచి లవణ జలాలు ఆక్రమిస్తూ ఉండడంతో నగరం ఉప్పునీటి కయ్యగా మారిపోయే ప్రమాదం వెంటాడుతోంది. సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖనగరం.. నవ్యాంధ్రకు ఆర్థిక రాజధాని...ఉత్తరాంధ్ర ముఖద్వారం....23 లక్షలకు పైగా జనాభా కలిగి.. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా ప్రతిరోజు నాలుగైదులక్షల ఫ్లోటింగ్ జనాభాతో నిత్యం కిటికట లాడే పారిశ్రామిక రాజధాని.. ఉక్కునగరంగా... సాగరనగరంగా.. స్మార్ట్ సిటీగా ఎన్నో విశిష్టతలు కల్గిన ఈ మహానగరానికి పెనుముప్పు పొంచి ఉంది.భవిష్యత్తులో విశాఖ నగరాన్నే ఖాళీ చేయాల్సిన పరిస్థితులు దాపురించబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖ నగరం..బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న సాగరనగరం.ఇప్పుడు ఆ సాగరమే విశాఖకు శాపంగా మారనుంది. ఈ నగరానికి ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ స్థాయిలో నీటి ఇక్కట్లు ఎదురవలేదు. కారణం ఈ నగరం సముద్రం కంటే ఎత్తులో ఉండడమే. సాధారణంగా సాగరం పక్కనే ఉండే నగరాలు, ప్రాంతాల్లోని ఉప్పునీటి శాతం ఎక్కువగా ఉండడం వలన ఆ ప్రాంతాల్లోని భూగర్భ జలాలు వాడేందుకు ఏమాత్రం ఉపయోగపడవు. కానీ విశాఖనగరం సముద్రం కంటే ఎత్తులో ఉండడం.. సముద్ర నీరు నగర భూగర్భపొరల్లోకి చొచ్చుకొచ్చేపరిస్థితులు లేకపోవడం వలన ఇన్నాళ్లు గ్రౌండ్ వాటర్ కోసం పెద్దగా ఇబ్బందిపడిన దాఖలాలు లేవనే చెప్పాలి. వేసవిలో 15–20 రోజులు కాస్త భూగర్భ జలాలు అడుగంటినా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. కానీ సమీప భవిష్యత్తులో విశాఖ నగరం మహాముప్పును ఎదుర్కోబో తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంజరు భూముల్లా రిజర్వాయర్లు నగర దాహాన్ని తీర్చే ఒయాసిస్సులా ఉండే ముడసర్లోవ, మేహాద్రిగెడ్డ, తాటిపూడి రిజర్వాయర్లు వేసవి ప్రారంభంలోనే ఎండిపోయి బంజరు భూములను తలపిస్తున్నాయి. రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలు అక్రమ కట్టడాలు, ఆక్రమణలతో నిండిపోయాయి. మిగిలిన రిజర్వాయర్లు సైతం ఏళ్లతరబడి పేరుకుపోయిన సిల్ట్ వల్ల వాటి 60 శాతానికి పైగా నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయి నగరానికి తీవ్ర నీటి ఎద్దడి తప్పదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి ఇలా కొనసాగిస్తే మరో పదేళ్లలో చుక్కనీరు దొరకని పరిస్థితి నెలకొంది.రాబోయే గడ్డు పరిస్థితి నుంచి విశాఖ బయటపడాలంటే నగరంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన జీవనశైలిని అవలంబించాలని నిపుణులు అంటున్నారు. ఉపరితల నీటి వనరులతో పాటు భూగర్భ నీటి సమతుల్యత, శాస్త్రీయ పర్యవేక్షణ, నీటి యాజమాన్యం ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం ఎప్పటికప్పుడు శాస్త్రీయమైన నీటి యాజమాన్య విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు. రిజర్వాయర్లలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించడం... క్యాచ్మెంట్ ఏరియాల్లో ఆక్రమణలు తొలగించడం.యుద్ధ ప్రాతిపదికన పెద్దఎత్తున ఇంకుడు గుంతలు నిర్మించడం.. నీటిని పొదుపుగా వాడుకోవడమే మన ముందున్న మార్గాలని స్పష్టం చేస్తున్నారు. చొచ్చుకొస్తున్న సముద్రపునీరు విశాఖలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా మాయమై..చాపకింద నీరులా సముద్రపు ఉప్పనీరు చొచ్చుకొస్తుండడమే అసలు సమస్య. ఇప్పటికే ఎంవీపీ కాలనీ, పాండురంగాపురం, అప్పూగర్, కురుపాం టూంబ్స్, సాగర్‌నగర్ భీమిలిలలోని పలు ప్రాంతాల్లో భూగర్భ అంతర్భాగంలోకి సముద్రపునీరు ఊహ కందని రీతిలో చొచ్చుకొచ్చినట్టు పరిశోధనల్లో తేలిందని నిపుణులు అంటున్నారు. నగరంలో లెక్కాపత్రం లేకుండా ఇష్టమొచ్చినట్టుగా బోర్లు వేయడం.. మోతాదుకు మించి భూగర్భ జలాలు విపరీతంగా వాడేస్తూ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు అడ్డూ అదుపూ లేకుండా లక్షల గ్యాలెన్ల నీటిని తోడేస్తున్నారు. ఇలా తోడేసిన నీటిని రీచార్జ్ చేసేందుకు వీలుగా ఆ స్థాయిలో తగినంత వర్షపాతం లేకపోవడం ఈ పరిస్థితికి కారణమవుతోంది.ఒకవేళ వర్షం కురిసిన ప్పటికీ నగరమంతా కాంక్రీట్ జంగిల్ కావడంతో నీరుభూమిలోకి ఇంకకుండా నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. నగరంలో చాలా ప్రాంతం ఎత్తయిన కొండలపైనే ఉంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా నగరమంతా మడతభూములపైనే ఉంది. నగర విస్తీర్ణంలో చాలా వరకు సుద్దరాయి కావడంతో వర్షపునీరు భూమి పొరల్లోకి వెళ్లకుండా సముద్రంలోకి పంపించేస్తుంది. తగ్గుతున్న భూసారం నగర భూమిపొరల్లో మంచినీరు పుష్కలంగా ఉన్నంత కాలం సముద్రపు నీరుని నగరంవైపు రానీయ కుండా వెనక్కి నెడుతుంది.భూగర్భ జలాలు ఏమాత్రం అడుగంటినా భూమి పొరల్లోకి ఖాళీ ప్రదేశంలోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తుంది. ఒక్కసారి సముద్రపు నీరు చొచ్చుకొస్తే ఆ తర్వాత ఆ ప్రాంతం పూర్తిగా ఉప్పునీటితోనే నిండిపోతుంది. భూ అంతర్భాగంలో ఉప్పునీరు చేరడం వలన ఆ నేల సారాన్ని కోల్పోతుంది. ఆ ప్రాంతంలోని భవనాలు, కట్టడాలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 23లక్షల నగర జనాభాతో పాటు ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం ఉత్తరాంధ్ర, ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి వచ్చే మరో నాలుగైదు లక్షల మంది అవసరాలు తీర్చే స్థాయిలో తాగునీటి వనరుల్లేవు. దీంతో అన్ని అవసరాలకు భూగర్భ జలాలపై ఆధార పడాల్సిన పరిస్థితి. భారీ అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ సముదాయాలు పెరిగి పోవడంతో ఒకే ప్రాంతంలో లెక్కకు మించి బోర్లు తవ్వి నిరంతరాయంగా భూగర్భ జలాలు తోడేస్తుండడంతో చుట్టుప్రక్కల కిలోమీటర్ల మేర చుక్కనీరు దొరకని దుస్థితి కన్పిస్తోంది. వర్షపు నీరు ఇంకే ప్రాంతాల గుర్తింపు.. ఉద్దానం కిడ్నీ వ్యాధి మూలకారణాలపై ఆరేళ్లుగా పరిశోధన చేసి ప్రభుత్వానికి పరిష్కారమార్గాలను చూపిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోజ్ నలనాగుల ‘ఉప్పుద్రవ’ సమస్యపై లోతైన పరిశోధన చేశారు. మొట్టమొదటిసారిగా కాంటూర్ మ్యాపింగ్ విశ్లేషణలతో నగరంలో 200కు పైగా వర్షపునీరు ఇంకే ప్రాంతాలను గుర్తించారు. ఈ పరిజ్ఞానంతో వర్షం నీరు ఎక్కడ నుంచి ఎక్కడకు, ఎం త ప్రవహిస్తోందో స్పష్టంగా తెలుసు కోవచ్చు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. నీరు ఒక ద గ్గరకు చేరే గృహసముదాయ ప్రాంతాలను గుర్తించి.. భూగర్భ నీటి యాజమాన్య పద్ధతుల్ని చేపటొ ్టచ్చు. నగరంలో ఇలా కాంటూర్ మ్యాపింగ్ ద్వారా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ వలన నగర నీటి భద్రతను పెంచగలమని ప్రొఫెసర్ మనోజ్ చెబుతున్నారు.అవసరమైతే రోడ్డు కూడలిలో.. రోడ్డు మధ్యలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించుకోవచ్చంటున్నారు. ఏడాది పొడవునా ఇంకుడు గుంతల నిర్వహణ, పర్యవేక్షణను జీవీఎంసీ చేపట్టాలని సూచిస్తున్నారు. కఠిన నిబంధనలు అవసరం నగరంలో లెక్కకు మించి వేస్తున్న బోర్లను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో బోర్లు ఎన్ని ఉన్నాయో.. వాటి ద్వారా రోజూ ఎంత పరిమాణంలో భూగర్భ జలాలను తోడుతున్నారో.. గణాంకాలు సేకరించి వాటి వినియోగంపై నియంత్రణ విధించాలి. నగరంలో ఎన్ని బోర్లు ఉన్నాయో జీవీఎంసీ దగ్గర కూడా పూర్తి లెక్కలు లేవు. కనీస సమాచారం కూడా లేకుండా రిగ్‌లు వేసేస్తున్నారు. ఈ పరిస్థితి లేకుండా బోర్ల తవ్వకాలపై కచ్చితమైన నియమ నిబంధనలు విధించాలి. సిటీ పరిధిలో బోర్లున్న ప్రతి ఒక్కరూ వర్షపునీటిని సంరక్షించి భూగర్భ జలాలు రీచార్జి చేసేట్టు నిబంధనలు విధించాలి. ఇందుకు ఎన్నో సులువైన పద్ధతులున్నాయి. డాబా పైన పడే వర్షపు నీటికి కిందకు తెచ్చే గొట్టాల మధ్య మామూలు ఫిల్టర్లను అమర్చుకుంటే.. ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగించకోవచ్చు. మిగిలిన నీటిని బోరు కనెక్షన్‌కు ఇస్తే అది నేరుగా భూగర్భంలోకి వెళ్తుంది. – కేఎస్ శాస్త్రి, డెప్యుటీ డైరెక్టర్, భూగర్భ జలవనరుల శాఖ మినీ రిజర్వాయర్లు ముఖ్యం నగరంలో ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది. ఏయూ, రైల్వే, పోర్టు ఏరియాల్లో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయి. వీటిలో చిన్న చిన్న చెరువులు మాదిరిగా మినీ రిజర్వాయర్లు నిర్మించాలి. వర్షపు నీటిని దాంట్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు చేయాలి. తద్వారా ఆ నీటిని నగర వాసులు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా భూగర్భపొరల్లోకి చేరి భూగర్భ జలాలు పెరిగేందుకు కూడా ఈ రిజర్వాయర్లు దోహదపడతాయి. – శీలబోయిన సత్యనారాయణ, రిటైర్డ్ సీఈ, నీటిపారుదల శాఖ -
పెథాయ్ కలవరం..!
బంగాళా ఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను తీరానికి చేరే వేళ అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. సముద్రం నీరు పలు చోట్ల 30 నుంచి 50 మీటర్ల మేర ముందుకొచ్చింది.తీరం భారీగా కోతకు గురైంది. మత్స్యకార గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.భారీ వర్ష సూచనతో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు వేయడంతో రైతులు అప్రమత్తమయ్యారు. కోసిన చేనును కుప్పలుగా చేర్చారు. కొన్నిచోట్ల యంత్రాల సాయంతో నూర్పిడి చేశారు.అధిక శాతం వరి పంట పొలాల్లో చిన్నచిన్న కుప్పలుగానే ఉంది. పొలాల్లో నీరు చేరేలా వర్షం కురిస్తే వరి కుప్పలు తడిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను హెచ్చరికలతో జిల్లా వాసులు ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. దీంతో బస్, రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. వ్యాపారాలు మందగించాయి. తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు పూర్తిచేసింది. తుపాను ప్రభావిత తీర గ్రామాలకు సరుకులు సరఫరా చేసింది. విజయనగరం గంటస్తంభం/పూసపాటిరేగ: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ఉగ్రరూపం దాల్చింది. జిల్లాపై తీవ్ర ప్రభావం ఉంటుం దన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా వాసులు కలవరపడుతున్నారు. రైతులు భయాందోళన చెందుతున్నారు. మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తుపాను తూర్పు, ఆగ్నేయదిశలో కాకినాడ, మచిలీపట్నం తీరానికి దగ్గర్లో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుం దని విశాఖపట్నం వాతావరణశాఖ అధికారులు తెలి పారు. సోమవారం తుపాను తీరం దాటుతుందని వెల్లడిం చారు. తీరందాటే సమయంలో 70 నుంచి 80 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. దక్షిణ కోస్తాకు తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని,ఉత్తరాంధ్రాలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఇదిలాఉంటే కాకినాడకు సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నా తుపాను సముద్రంలో సుడులు తిరుగుతూ ఎప్పటికప్పుడు దిశ మారుస్తోంది. దీంతో అక్కడే తీరందాటుతుందా? వేరే వైపు వెళుతుందా? అన్న సందేహం కూడా తలెత్తుతోంది. ముందుకొచ్చిన సముద్రం పెథాయ్ తుపాను ప్రభావం జిల్లాపై ఆదివారం స్పష్టంగా కనిపించింది. భోగాపురం మండలం ముక్కాం వద్ద సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. పూసపాటిరేగ మండలంలోని తిప్పలవలస, చింతపల్లి తదితర తీరప్రాంతంలో కూడా 30 నుంచి 40 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. దీంతో మత్స్సకారులు ఆందోళన చెందుతున్నా రు. బోట్లును సురక్షితంగా ఉంచేందుకు ఒడ్డుకు చేర్చారు. అప్రమత్తం చేసిన అధికారులు తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉంటుందన్న సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేశారు. ఇన్చార్జి కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిస్థితిని పర్యవేక్షించారు. రెవెన్యూ, మత్స్య, విద్యుత్, పంచాయతీ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులను మరింత అప్రమత్తం చేశా రు. డీఆర్వో జె.వెంకటరావు ఆదివారమైనా కలెక్టరేట్లో ఉండి అధికారులకు సూచనలిచ్చారు. పూసపాటిరేగ మండలంలో భారీగా వర్షాలు పడతాయని ఆర్టీజీఎస్ అధికారులు హెచ్చరించడంతో అధికారులు ఆ మండలంపై దృష్టి పెట్టారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్చార్జి కలెక్టర్ సెలవు ప్రకటించారు. మండల కేంద్రంలో జిల్లా అధికారులు మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో ఉండి ప్రజలను అ ప్రమత్తం చేశారు. పూసపాటిరేగతోపాటు భోగాపురం తీరప్రాంతంలో సముద్రం వైపు ఎవరూ వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే జనాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తుపాను షెల్టర్లు సిద్ధం చేశారు. వారికి ఆహారం సరఫరా చేసేం దుకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచారు. ఈదురుగాలులు వీస్తే చెట్లు విరిగే ప్రమాదం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని, సెలవులు పెట్టరాదని ఇన్చార్జి కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. చింతపల్లి గ్రామంలో పర్యటించి మత్స్యకారులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. తిరిగి ప్రకటించే వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరప్రాంత గ్రామాలులో ఎప్పటికప్పుడు పరిస్థితిని తహసీల్దార్ జి.సూర్యలక్ష్మి అధికారులకు చేరవేస్తున్నారు. తీరప్రాంత గ్రామాలు రేషనుషాపులలో నిత్యవసర సరుకులను అందుబాటులో ఉంచారు. కొన్ని గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తర లించారు. గ్రీవెన్స్‌సెల్ రద్దు చేశారు. -
తీవ్రంగా మారనున్న ‘గజ’ తుఫాన్
సాక్షి, చెన్నై: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల గజ తుఫాన్ 759 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది. కావునా సముద్రంలోకి చేపల వేటగాళ్లు, జాలర్లు ఎవరు వేటకు వెళ్లకుడదని తీరంవెంబడి ఈదురుగాలులు వీచి అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడలురు రేవులలో మూడో నెంబర్ హెచ్చరికలు జారి చేసింది. -
బలపడనున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్నా ఒకటి, రెండు రోజుల్లో కోస్తాలోని కొన్ని ప్రాంతల్లో వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో రేపు ఎల్లుండి మరీంత బలపడనున్న అల్పపీడనం. కోస్తా ప్రాంతల్లో ఈ రోజు నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. విశాఖతీరం వెంబడి గంటకు 45 నుంచి, 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుగాలులు బలంగా విచే అవకాశం ఉందని దీంతో మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ కేంద్ర తూఫాను హెచ్చరికలు జారీ చేసింది. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు వేటకు వెల్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
జిల్లాలో 13 మండలాల్లో ఓ మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన నాడా తుపాను వల్ల జిల్లాలో రెండు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్నాయి. జిల్లాలోని 13 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సరాసరి 6.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రైల్వేకోడూరులో అత్యధికంగా 51.2 మిల్లీ మీటర్లు, ఓబులవారిపల్లెలో 32.2, పుల్లంపేటలో 41.8, చిట్వేలులో 42.2, రాజంపేట 21.2,రాయచోటి 15.6, చిన్నమండెం 14.0, సంబేపల్లెలో 14.4, వీరబల్లిలో 8.4, టి సుండుపల్లిలో 19.4, లక్కిరెడ్డిపల్లెలో 11.8, ఒంటిమిట్టలో 7.2, మైదుకూరులో 7.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -
కోత.. వాత
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎండలు తారస్థాయికి చేరాయి. భగ్గుమంటున్న సూర్యుని ప్రతాపంతో ప్రజానీకం తల్లడిల్లుతోంది. జిల్లాలో సరాసరి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. జిల్లాలో అడపాదడపా అక్కడడక్కడా వర్షాలు కురుస్తున్నా.. అదే స్థాయిలో వారం రోజులుగా ఎండలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. బుక్కరాయసముద్రం వాతావరణ కేంద్రం తెలిపిన సమాచారం మేరకు మూడురోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే మే 28న 41.2 డిగ్రీలు, 29న 41.1, 30న 40.3, 31న 41.5 డిగ్రీలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షపు జల్లులు కురుస్తున్నా అవి తాత్కాలిక ఉపశమనాన్నే కల్గిస్తున్నాయి. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పరిసరాలు, ఇళ్లగోడలు, పైకప్పూ వేడెక్కి రాత్రిళ్లూ అదే ఉష్ణాన్ని వెలువరిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే ప్రజలు రోడ్లమీదకు రావటానికి భయపడిపోతున్నారు. చిన్నారులు,వ ృద్ధులు సాయంత్రం 7 గంటల తరువాత పార్కులకు చేరి సేద తీరుతున్నారు. విద్యుత్ కోతలు పవర్గ్రిడ్లలో ఉత్పత్తి తగ్గిన కారణంగా జిల్లాలో విద్యుత్ అధికారులు ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నా అధికారులు ఏమాత్రం కనికరం చూపడం లేదు. ఫ్యాన్లు తిరుగుతుంటేనే గాలి ఆడక ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. చెప్పాపెట్టకుండా విధించే విద్యుత్ కోతలతో ప్రజలు ఉడికిపోతున్నారు. మొన్నటి వరకు పగటి పూటకే పరిమితమైన కోతలు ఇప్పుడు రాత్రిళ్లూ కొనసాగుతున్నాయి. అధికారిక కరెంటు కోతల మేరకు కార్పొరేషన్లో ఉదయం 8 నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలో రోజుకు ఆరుగంటలు కోతలు ఉన్నాయి. ఉదయం 9 నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి ఆరు గంటల వరకు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలు అధికారిక కోతలు ఉన్నాయి. అనధికారిక కోతలకు లెక్కలేదు. గ్రామాల్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ఇక వ్యవసాయానికి ఏడు గంటలు నిరంత కరెంటు ఇవ్వాల్సి ఉన్నా రోజుకు మూడు గంటల పాటు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి. ఈ విషయమై ట్రాన్స్‌కో ఎస్ఈని సంప్రదించగా.. విద్యుత్ ఉత్పాదనలో ఏర్పడిన కొరత వల్ల జిల్లాలో కోతలు తప్పడం లేదన్నారు. జిల్లాకు రోజుకు 14 మిలియన్ యూనిట్లు కరెంటు అవసరం ఉండగా.. 11 మిలియన్ యూనిట్లు మాత్రమే కేటాయింపులు ఇస్తున్నారన్నారు. మూడు మిలియన్ యూనిట్లు షార్టేజ్ ఉండడంతోనే కోతలు తప్పడం లేదని స్పష్టం చేశారు. -
కొనసాగుతోన్న అల్పపీడనం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా భూతలం వైపు వచ్చి జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. ఇది ఉత్తర దిశగా నేపాల్ వైపు పయనిస్తూ క్రమేపీ బలహీనపడే అవకాశాలున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్టు పేర్కొంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై పెద్దగా లేదని, కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. బెంగళూరు, మద్రాస్‌పై మేఘాలు బాగా ఆవరించి ఉండటంతో నెల్లూరు జిల్లా, రాయలసీమలో కొద్దిగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు నిఫుణులు తెలిపారు. -
కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలి
కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలి రైల్వేకోడూరురూరల్ :కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి ధ్వజమొత్తారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినందుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపుమేరకు స్థానికంగా బుధవారం చేపట్టిన బంద్ విజయవంతం అయింది. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి కొల్లం స్థానిక వైఎస్‌ఆర్‌ఆర్ అతిథిగృహం నుంచి చేపట్టిన భారీ ర్యాలీ టోల్గేట్ వైఎస్ఆర్ సర్కిల్, శ్రీలక్ష్మీప్యారడైజ్ సినిమాహాలు మీదుగా తిరిగి టోల్గేట్ వరకు నిర్వహించారు. అనంతరం కడప- తిరుపతి జాతీయ రహదారిలో రాకపోకలను అడ్డుకున్నారు. కాంగ్రెస్, టీడీపీలో ఉన్న సమైక్యవాదులందురూ పార్టీలోకి రావాలని కొల్లం బ్రహ్మానందరెడ్డి కోరారు. తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయడానికి సోనియా ఇంత కుట్రలు పన్నిందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నాల్కలధోర ణి అవలంభిస్తున్నారని విమర్శించారు. మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ సీపీ అన్నారు. 4గంటలకు పైగా జరిగిన ఉద్యమంతో 8కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. పట్టణంలోని టోల్గేట్వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, పోలీసుస్టేషను ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు బుధవారం కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అన్వర్‌బాషా, పట్టణ కన్వీనర్ సిహెచ్ రమేష్, ఉప కన్వీనర్ రౌఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆర్వి రమణ, ఈ.మహేష్, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఏ.రంగారెడ్డి, టి.భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా మైనార్టీ నాయకుడు వైఎస్ కరీముల్లా, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, మాజీ జెడ్పీటీసీ సుభద్రమ్మ, టీడీయూ సెక్రటరీ సుబ్రమణ్యంరెడ్డి, వార్డు మెంబర్లు సుదర్శన్‌రాజు, నియోజకవర్గ విద్యార్థి కన్వీనర్ గురుక్రిష్ణ, నేతలు రామక్రిష్ణ, మారె వెంకటయ్య, రాజగోపాల్, కెవి రమణ, రంగమ్మ, ప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. చిట్వేలి, న్యూస్‌లైన్: మండలంలో, మండలకేంద్రంలో బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. మండలవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణించారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. వాహనాలు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
జిల్లాలో 3.38 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
సాక్షి, కొత్తగూడెం : అకాల వర్షం అన్నదాతలకు గుండె కోత మిగిల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లాలోని పంటలపై తీవ్రంగా పడింది. వారం రోజుల పాటు కురిసిన వర్షంతో జిల్లా వ్యాప్తంగా 3.38 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో అత్యధికంగా 2.54 లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. ‘న్యూస్‌లైన్’ క్షేత్ర స్థాయిలో చేసిన పరిశీలన ప్రకారం జిల్లా వ్యాప్తంగా రూ. 310.72 కోట్ల మేర రైతులు నష్టపోయినట్లు అంచనా. దెబ్బతిన్న పంటలు చూసి మనోవేదనకు గురైన రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. జిల్లాలో ఈనెల 21 నుంచి కురిసిన వర్షాలతో పత్తి 2.54 లక్షల ఎకరాలు, వరి 28 వేలు, మిర్చి 15 వేలు, మొక్కజొన్న 21,775 ఎకరాలు, పొగాకు, వేరుశనగ, ఇతర కూరగాయల పంటలు 18 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఇందులో పత్తిదే సింహభాగం కావడం గమనార్హం. ప్రధానంగా వైరా నియోజకవర్గంలో 70 వేల ఎకరాల్లో, మధిరలో 59 వేలు, పాలేరులో 30 వేల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతినడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో వరి నేలవాలడంతో పాటు పనలు పూర్తిగా నీట మునిగాయి. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. అశ్వారావుపేటలో వేరుశనగ, పొగాకు పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఈ ఆకాల వర్షం రైతులను నిండా ముంచినా జిల్లా యంత్రాంగం మాత్రం ఇంకా నిద్రావస్థలోనే ఉంది. కాగా, గతంలో మాదిరిగానే 50 శాతం లోపే నష్టాన్ని చూపించి రైతులకు పరిహారం ఇవ్వకుండా చూసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండడం బాధితులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆగిపోతున్న రైతుల గుండెలు.. రూ. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు కళ్ల ముందే వర్షార్పాణం అవుతుంటే మనోవేదనకు గురైన రైతులు గుండెపోటుతో మరణిస్తున్నారు. సింగరేణి (కారేపల్లి) మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన గద్దికొప్పుల రామయ్య (40) పత్తి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే కొత్తగూడెం మండలం బేతంపూడిలో శనివారం పత్తి చేలో నీరు తొలగించేందుకు వెళ్లి నష్టపోయిన పంటను చూసి తేజావాత్ రాజు అనే రైతు సొమ్మసిల్లి పడిపోయాడు. పెనుబల్లి మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన బొప్పిశెట్టి చెన్నారావు నాలుగు ఎకరాలలో పత్తి సాగు చేశారు. వర్షాలకు పంట దెబ్బతినడంతో మనోవేదనకు గురై గుండెపోటుతో శనివారం మృతి చెందారు. గతంలో జల్, లైలా, నీలం తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయినా జిల్లా యంత్రాంగం కాకి లెక్కలు వేసిందని, 50 శాతం లోపు నష్టపోయిన పంటలను కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.