సాక్షి,చెన్నై: బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో చెన్నైలోని పలుచోట్ల స్వల్పంగా భూమి కంపించింది. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పై భూకంపం ఎటువంటి ప్రభావం చూపలేదని రాష్ట్ర విపత్తులశాఖ తెలిపింది.
చదవండి:మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’
Earthquake of Magnitude:5.1, Occurred on 24-08-2021, 12:35:50 IST, Lat: 14.40 & Long: 82.91, Depth: 10 Km ,Location: 296km SSE of kakinada, Andhra Pradesh, India for more information download the BhooKamp App https://t.co/6qwi4D40KO @ndmaindia @Indiametdept pic.twitter.com/dLB55CDm36
— National Center for Seismology (@NCS_Earthquake) August 24, 2021
Comments
Please login to add a commentAdd a comment