
సాక్షి,నెల్లూరు:చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.గురువారం(అక్టోబర్17) వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తీరందాటే సమయంలో60- 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గూడూరు, మనుబోలు, కావలి, నెల్లూరు సమీప ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి.
ఇప్పటికే నెల్లూరుతో పాటు కావలిలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: వాయుగుండం ముప్పు