heaavy rains
-
తిరుమలలో భారీ వర్షం.. సీమకు ఎల్లో అలర్ట్
సాక్షి, తిరుమల/విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఒకవైపు వర్షం.. పెరిగిన చలి తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డుల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండటంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, గోగర్భం, పాపవినాశనం జలాశయాలలో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. వర్షం కారణంగా తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోసా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.#tirupati #tirumala #HeavyRain pic.twitter.com/8uN6R5FHr4— tirupati weatherman (@TPTweatherman) December 12, 2024ఇదిలా ఉండగా.. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కోర్లగుంట, సత్యనారాయణ పురం, లక్ష్మి పురం సర్కిల్లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుకుంది. వెస్ట్ చర్చి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరుకుంది. దీంతో, వన్ వేలోనే వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు. -
నెల్లూరు వైపు దూసుకొస్తున్న వాయుగుండం
సాక్షి,నెల్లూరు:చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.గురువారం(అక్టోబర్17) వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.తీరందాటే సమయంలో60- 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గూడూరు, మనుబోలు, కావలి, నెల్లూరు సమీప ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి.ఇప్పటికే నెల్లూరుతో పాటు కావలిలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఇదీ చదవండి: వాయుగుండం ముప్పు -
ఉత్తర భారతాన్ని వదలని వానలు
డెహ్రాడూన్: రుతుపవనాలు మొదలైంది మొదలు దేశవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వానలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దక్షిణాదిన వరుణుడు కాస్త కనికరించినా ఉత్తరాదిన మాత్రం ఇప్పటికీ అలజడి సృష్టిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీలో రాష్ట్రాల్లో అయితే ఈ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రోజులకు రోజలు జనం ఎటూ కదలడానికి లేకుండా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వర్షాల ఉధృతి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా తాకింది. ఆ రాష్ట్రంలో వరణుడు మరోసారి సృష్టించిన బీభత్సానికి ఎటు చూసినా భీతావాహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది ప్రవాహానికి తెగిపోయిన వంతెనలు, కూలిపోయిన ఇళ్ళే దర్శనమిస్తున్నాయి. మరోపక్క భారీ వర్షాల తాకిడికి గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్దాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 19 మంది గల్లంతయ్యారని, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేశామని అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరినీ బయటకు రావొద్దంటూ ప్రకటనలు జారీ చేశామన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది! -
అనంత వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. 2వేల తక్షణ సాయం
సాక్షి, తాడేపల్లి: అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
తెలంగాణలో జోరువానలు
-
భారీ వర్షాలకు కాలువ రహదారిపై గండి
-
అతి భారీ వర్షాలు.. 23 వరకు ఇదే పరిస్థితి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసిన వరదనీరే కనిపిస్తుంది. ఢిల్లీ, నోయిడా, గురుగావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ ప్రాంతాలలో బుధవారం మొదలైన భారీ వర్షాలు గురువారం కూడా కొనసాగాయి. దీనితో ప్రధాన రహదారులు అన్ని చేరువులను తలపించాయి. ఇక పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా సాకేత్ ఏరియాలోని జే బ్లాక్‌లో ఓ గోడ కూలింది. పక్కనే ఉన్న వాహనాలపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన గురుగావ్‌లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 23 వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని జనాలను కోరారు. (11 రాష్టాల్లో వరదలు.. 868 మంది మృతి) దేశంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల అనేక నగరాల్లో నీరు నిండిపోయింది. రాబోయే ఐదు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో బుధవారం ఒడిశాలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఇక ఉత్తరాఖండ్‌లో రాత్రిపూట కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. హిమాలయ దేవాలయాలు అయిన కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే రోడ్లు కూడా జలమయమయినట్లు అధికారులు తెలిపారు. -
భారీ వర్షాలు; కొట్టుకుపోయిన బైకులు
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ, వరి పంటలు నీట మునిగాయి. గుత్తిలో కుండపోత వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పట్టణంలోని డ్రైనేజీలు పొంగిపోర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని విడపనకల్లు, బెలుగుప్ప, వజ్రకరూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. 15 సంవత్సరాలుగా పారని ఉప్పు వంక, పెద్ద వంకలు పొంగిపొర్లాయి. కొండ ప్రాంతం నుంచి పెద్ద కొండచిలువ కొట్టుకు రావడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద 63 జాతీయ రహదారిపై వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బళ్లారి-గుంతకల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వజ్రకరూరు మండలంలోని ఛాయాపురంలో వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డోనేకల్ వంకకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ముఖ్యంగా తాడిపత్రి, గుంతకల్లు, మడకశిర, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కుండపోత వర్షం కురిసింది. గుత్తిలో 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పిన్నెపల్లి చెరువుకు గండి పడింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిట్టగోడ కూలి బాలిక మృతి అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం వెంకటాపల్లిలో ఇంటి పిట్టగోడ కూలి వైష్ణవి అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఆదినారాయణ,రాధా దంపతుల కుమార్తె వైష్ణవి. భారీ వర్షాలకు తడిసిన పిట్టగోడ నిద్రిస్తున్న వైష్ణవిపై పడింది. ఈ ఘటనలో వైష్ణవి మృతి చెందటంతో - తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొట్టుకుపోయిన ఇళ్లు, బైకులు కళ్యాణదుర్గం: పార్వతి నగర్లో పాత ఇళ్లు వంకలో కొట్టుకుపోగా అందులో నివసించేవారు సురక్షితంగా బయటపడ్డారు. పట్టణంలోని మారంపల్లి కాలనీలో వంక పారడంతో రెండు ఇళ్లు పూర్తిగా కూలిపోగా, మరో రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు చెరువులకు నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిపత్రిలోని పిన్నెపల్లి చెరువుకు గండి పడి యాడికి మండల కేంద్రంలోకి వరద నీరు ప్రవేశించగా బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. వేములపాడు వద్ద వరద నీటిలో వంద గొర్రెలు, యాభై పశువులు కొట్టుకుపోయాయి. -
భారీ వర్షాలు: పొంగుతున్న నదులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం స్తంభించింది. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో రాకపోకలను అంతరాయం ఏర్పడింది. అనంతపురం, వైఎస్ఆర్ , కర్నూలు జిల్లాలలో మంగళవారం భారీగా వర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెరువులు నిండి ప్రమాదక స్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్రావతికి భారీగా వరద అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కారణంగా చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చిత్రావతి నదికి భారీగా వరద నీరు వస్తోంది. ఉధృతంగా పాపాగ్ని, పెన్నా.. వైఎస్సార్ జిల్లాలో గల పాపాగ్ని, పెన్నా, చెయ్యేరు, మాండవ్య నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి వైఎస్సార్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. పులివెందుల, జమ్మలమడుగు, కొండాపురం, ప్రొద్దుటూరు, సింహాద్రిపురం, ముద్దనూరు తదితర మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. గంగాదేవిపల్లె చెరువు నిండి ప్రమాదకరస్థాయిలో ఉండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే సింహాద్రిపురం మండలం బీసీ కాలనీలోకి వరద నీరు చేరింది. కొండాపురం మండలం చిన్నపల్లెలోకి తిమ్మాపురం చెరువు వరద నీరు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక కొండాపురంలో భారీగా కురుస్తున్న వర్షాలకు పాతభవనం ఒకటి కూలిపోయింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో పాపాగ్ని, పెన్నా, చెయ్యేరు, మాండవ్య నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాపాగ్ని నది ఉధృతికి అలిరెడ్డిపల్లె గ్రామం వద్దగల కాజ్వే కొట్టుకుపోయింది. అలాగే రాయచోటి మూసాపేట వద్ద మాండవ్య నది పొంగిపొర్లుతోంది. -
హారీష్ రావు హెలికాప్టర్ గాల్లో చక్కర్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెలికాప్టర్‌కు వర్షం దెబ్బ తగిలింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి బేగంపేట విమానాశ్రయ అధికారులో ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీనికి తోడు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో మంత్రి హెలికాప్టర్ గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టింది. చివరకు హకీంపేటలో సురక్షితంగా ల్యాండైంది. ఖమ్మం పర్యటనలో భాగంగా హరీశ్‌రావు సోమవారం ఉదయం హెలికాప్టర్లో వెళ్లారు. -
కొత్తగా అల్పపీడనం.. మరో ఐదురోజులు వర్షాలు!
-
కొత్తగా అల్పపీడనం.. మరో ఐదురోజులు వర్షాలు!
జంటనగరాలను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే నాలుగు రోజులుగా సిటీ మొత్తం కుంభవృష్టి కురుస్తుంటే.. అది చాలదన్నట్లు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు పడతాయట. వర్షాల కథ ఇంకా ముగిసిపోలేదని, దాదాపు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ వైకే రెడ్డి చెప్పారు. మధ్యలో ఒక్కరోజు పగటిపూట కాస్త తెరిపి ఇవ్వడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చి, తమకు కావల్సిన కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుక్కోగలిగారు. కొంచెం వెలుగు ముఖం చూశామని సంబరపడ్డారు. అయితే ఆ సంబరం ఎంతోసేపు నిలవలేదు. మళ్లీ రాత్రి నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మరోసారి నగరంలో భారీ వర్షాలు తప్పకపోవచ్చని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా చెబుతోంది. వాయవ్య భారతం నుంచి కొత్తగా వస్తున్న పరిస్థితుల వల్ల విదర్భ, తెలంగాణలపై బలమైన అల్పపీడనం ఏర్పడిందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. గత నాలుగు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితి ఇప్పటికీ అదుపులోకి రాలేదు. లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో మరోసారి వర్షాలంటే నగరవాసులు ఉలిక్కిపడుతున్నారు.