
సాక్షి, తాడేపల్లి: అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున తక్షణ సహాయం అందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment