సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హెలికాప్టర్‌కు వర్షం దెబ్బ తగిలింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి బేగంపేట విమానాశ్రయ అధికారులో ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీనికి తోడు వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో మంత్రి హెలికాప్టర్ గాల్లోనే చాలాసేపు చక్కర్లు కొట్టింది. చివరకు హకీంపేటలో సురక్షితంగా ల్యాండైంది. ఖమ్మం పర్యటనలో భాగంగా హరీశ్‌రావు సోమవారం ఉదయం హెలికాప్టర్‌లో వెళ్లారు.