టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) హైదరాబాద్‌లోని.. దాని తయారీ కేంద్రం నుంచి 300వ ఏహెచ్-64 అపాచీ ఫ్యూజ్‌లేజ్ డెలివరీ చేసింది. ఈ ఫ్యూజ్‌లేజ్‌లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం తయారు చేస్తారు.
సుమారు 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో కంపెనీ AH-64 అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్‌లేజ్‌లతో పాటు.. సెకెండరీ స్ట్రక్చర్లను కూడా తయారు చేస్తోంది. భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ తయారీ నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి TBAL నిరంతర అంకితభావాన్ని ఇది నిదర్శనం.
భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. బోయింగ్ అండ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మధ్య ఉమ్మడి వెంచర్ 900 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను నియమించింది. ఏరో స్ట్రక్చర్‌లను అసెంబుల్ చేయడానికి ఉపయోగపడే విడి భాగాల్లో దాదాపు 90 శాతం వరకు దేశీయంగానే తయారవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment