డెహ్రాడూన్: రుతుపవనాలు మొదలైంది మొదలు దేశవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వానలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దక్షిణాదిన వరుణుడు కాస్త కనికరించినా ఉత్తరాదిన మాత్రం ఇప్పటికీ అలజడి సృష్టిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీలో రాష్ట్రాల్లో అయితే ఈ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రోజులకు రోజలు జనం ఎటూ కదలడానికి లేకుండా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా ఈ వర్షాల ఉధృతి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా తాకింది. ఆ రాష్ట్రంలో వరణుడు మరోసారి సృష్టించిన బీభత్సానికి ఎటు చూసినా భీతావాహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది ప్రవాహానికి తెగిపోయిన వంతెనలు, కూలిపోయిన ఇళ్ళే దర్శనమిస్తున్నాయి. మరోపక్క భారీ వర్షాల తాకిడికి గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్దాయి.
ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 19 మంది గల్లంతయ్యారని, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేశామని అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరినీ బయటకు రావొద్దంటూ ప్రకటనలు జారీ చేశామన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది!
Comments
Please login to add a commentAdd a comment