కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలి | bangalakatham | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలి

Published Thu, Feb 20 2014 1:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలి - Sakshi

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలి

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలి
 
 రైల్వేకోడూరురూరల్  :కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి ధ్వజమొత్తారు.
 రాష్ట్రాన్ని ముక్కలుచేసిన
 తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినందుకు నిరసనగా వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపుమేరకు స్థానికంగా బుధవారం చేపట్టిన బంద్ విజయవంతం అయింది.
  పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి కొల్లం స్థానిక వైఎస్‌ఆర్‌ఆర్ అతిథిగృహం నుంచి చేపట్టిన భారీ ర్యాలీ టోల్‌గేట్ వైఎస్‌ఆర్ సర్కిల్, శ్రీలక్ష్మీప్యారడైజ్ సినిమాహాలు మీదుగా తిరిగి టోల్‌గేట్ వరకు నిర్వహించారు. అనంతరం కడప- తిరుపతి జాతీయ రహదారిలో రాకపోకలను అడ్డుకున్నారు.
 కాంగ్రెస్, టీడీపీలో ఉన్న సమైక్యవాదులందురూ పార్టీలోకి రావాలని కొల్లం బ్రహ్మానందరెడ్డి కోరారు.  తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేయడానికి సోనియా ఇంత కుట్రలు పన్నిందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు నాల్కలధోర ణి అవలంభిస్తున్నారని విమర్శించారు. మొదటి నుంచి సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ సీపీ అన్నారు.  4గంటలకు పైగా జరిగిన ఉద్యమంతో 8కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
 పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. పట్టణంలోని టోల్‌గేట్‌వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి, పోలీసుస్టేషను ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైఎస్‌ఆర్ సీపీ నాయకులు బుధవారం కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపారు.
 వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు అన్వర్‌బాషా, పట్టణ కన్వీనర్ సిహెచ్ రమేష్, ఉప కన్వీనర్ రౌఫ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆర్‌వి రమణ, ఈ.మహేష్, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఏ.రంగారెడ్డి, టి.భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా మైనార్టీ నాయకుడు వైఎస్ కరీముల్లా, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, మాజీ జెడ్పీటీసీ సుభద్రమ్మ, టీడీయూ సెక్రటరీ సుబ్రమణ్యంరెడ్డి, వార్డు మెంబర్లు సుదర్శన్‌రాజు, నియోజకవర్గ విద్యార్థి కన్వీనర్ గురుక్రిష్ణ, నేతలు రామక్రిష్ణ, మారె వెంకటయ్య, రాజగోపాల్, కెవి రమణ, రంగమ్మ, ప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
 
 చిట్వేలి, న్యూస్‌లైన్:  మండలంలో, మండలకేంద్రంలో బుధవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన  బంద్ ప్రశాంతంగా జరిగింది. మండలవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలన్నీ స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లోనే ప్రయాణించారు. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. వాహనాలు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement