
సాక్షి, చెన్నై: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల గజ తుఫాన్ 759 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది. కావునా సముద్రంలోకి చేపల వేటగాళ్లు, జాలర్లు ఎవరు వేటకు వెళ్లకుడదని తీరంవెంబడి ఈదురుగాలులు వీచి అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడలురు రేవులలో మూడో నెంబర్ హెచ్చరికలు జారి చేసింది.