cyclone affected areas
-
దానా తుపాను : 86 రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు తిప్పలు (ఫొటోలు)
-
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
తుపాను, కరువు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం జగన్ విజ్ఞప్తి
-
ఎవరూ భయపడొద్దు, బాధపడొద్దు...ఈ ప్రభుత్వం మీది
-
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట నష్ట నివారణ చర్యలు
-
ఒక రైతు గా చెప్తున్నా.. ఎవరు బాధపడకండి..ఎమ్మెల్యే ఆర్కే భరోసా
-
మిగ్జామ్ తుపాను బాధితులకు భీమవరంలో పునరావాసకేంద్రం
-
కలెక్టర్లతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్
-
రాజమండ్రిలో భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం
-
వరద ప్రభావం నుంచి తేరుకుంటున్న చెన్నై
-
మిచౌంగ్ బీభత్సం: నా చెన్నై.. సేఫ్‌గా ఉండు: లంక యువ పేసర్
#Cyclone Michaung- #ChennaiFloods: ‘‘నా చెన్నై.. సురక్షితంగా ఉండు’’ అంటూ శ్రీలంక యువ క్రికెటర్ మతీశ పతిరణ తమిళనాడు పట్ల అభిమానం చాటుకున్నాడు. తుపాను ఎంతగా భయపెట్టినా.. తిరిగి కోలుకోగలమనే నమ్మకం కూడా అంతే బలంగా ఉండాలని ధైర్యం చెప్పాడు. కాగా తమిళనాడు రాజధాని చెన్నైని వరద నీరు ముంచెత్తుతోంది. మిచౌంగ్ తుపాను ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. వాన బీభత్సానికి చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి వరద నీరు చేరడంతో ఇప్పటికే పలు విమాన సర్వీసులను నిలిపివేశారు. అదే విధంగా ఇప్పటికే పదకొండు ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా రద్దు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి అవసరార్థులకు సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలో.. తుపాను ప్రభావం వల్ల రానున్న 24 గంటల పాటు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు చెన్నై ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మిచాంగ్ బీభత్సం.. స్పందించిన డీకే, అశూ టీమిండియా వెటరన్ బ్యాటర్, తమిళనాడు వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నా చెన్నై స్నేహితులారా.. సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. ఇలాంటి విపత్కర సమయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉంటూ... పరిస్థితులు చక్కదిద్దుతున్న అధికారులకు సెల్యూట్. ఇలాంటపుడే ప్రతి ఒక్కరం పరస్పరం సహాయం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరం బతకాలి’’ అని ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం.. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి విజ్ఞప్తి చేశాడు. వీరితో పాటు శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ కూడా చెన్నై ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ‘‘సురక్షితంగా ఉండు నా చెన్నై!! తుపాను భయంకరమైనదే కావొచ్చు.. కానీ మన మనోబలం అంతకంటే గొప్పది. పరిస్థితులు తప్పక చక్కబడతాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండిపోండి. ఒకరికొకరు సహాయంగా ఉండండి’’ అని పతిరణ చెన్నై వాసులకు విజ్ఞప్తి చేశాడు. ధోనికి ప్రియమైన బౌలర్ కాగా శ్రీలంకకు చెందిన రైటార్మ్ పేసర్ మతీశ పతిరణ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ ఆటగాడిగా 20 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్ పేరు సంపాదించాడు. ఐపీఎల్-2023 సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఎడిషన్‌కు గానూ.. పతిరణను సీఎస్కే రిటైన్ చేసుకుంది. Stay safe, my Chennai! The storm 🌪️ may be fierce, but our resilience is stronger. Better days are just around the corner. Take care, stay indoors, and look out for one another 💛💛💛 #yellove #ChennaiWeather #StaySafe #ChennaiRains #CycloneMichaung https://t.co/ovbsziy7gv — Matheesha Pathirana (@matheesha_9) December 4, 2023 #WATCH | Tamil Nadu: Trees uproot, rainwater enters the residential area as strong winds, accompanied by rainfall, lash parts of Chennai. (Visuals from Thirumullaivoyal-Annanur area) pic.twitter.com/LTGDKJZF4t — ANI (@ANI) December 4, 2023 -
తుఫాను ప్రభావంతో రెండు జిల్లాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవులు
-
అందరూ అలెర్ట్ గా ఉండాలి..తుఫానుపై కీలక ఆదేశాలు: వైఎస్ జగన్
-
తగ్గుముఖం పట్టిన వర్షం.. ముమ్మరంగా సహాయక చర్యలు
సాక్షి, అమరావతి: కుండపోత, భారీ వర్షాల నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తేరుకుంటున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వర్ష ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టడంతో భారీ నష్టాన్ని నివారించింది. వర్ష ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. అధికారులతో పాటు నాలుగు ఎస్డీఆర్ఎఫ్, ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సేవలందిస్తున్నాయి. వర్షాల వల్ల శిబిరాల్లో తల దాచుకున్న ఆరు జిల్లాలకు చెందిన వారికి తక్షణ సాయంగా రూ.1000, గరిష్టంగా కుటుంబానికి రూ.2 వేల చొప్పున అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మంచి భోజన, వసతి ఏర్పాటు చేశారు. కాగా, శనివారం కూడా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కొనసాగాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అధిక ప్రభావం తుపాను కారణంగా తిరుపతి జిల్లాలో 21 మండలాలు, చిత్తూరు జిల్లాలో 14 మండలాలు, ప్రకాశంలో 10, నెల్లూరులో 9, అన్నమయ్యలో 8 మండలాలు ప్రభావితమయ్యాయి. తిరుపతి జిల్లాలో 571 మందిని, చిత్తూరు జిల్లాలో 416, నెల్లూరు జిల్లాలో 208 మందిని.. మొత్తంగా 1,195 మందిని శిబిరాలకు తరలించారు. వర్షాలకు వైఎస్సార్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లాలో 55 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గత 24 గంటల్లో వర్షపాతం ఇలా.. శనివారం ఉదయం 8.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లిలో అత్యధికంగా 15.4 సె.మీ వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టెపాడులో 15.1 సెం.మీ, ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బల్లిపల్లిలో 14.4 సెం.మీ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం టి.ముస్తాపురంలో 12.37 సెం.మీ, చీపినపిలో 12.35 సెం.మీ, ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కోతపల్లిలో 11.9 సె.మీ వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు నెల్లూరు జిల్లా ఉలవపాడులో 8.6 సెం.మీ, కందుకూరులో 7.6 సెం.మీ, మన్నేటికోటలో 7.4 సెం.మీ, కందుకూరు దైవివారిపాలెంలో 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సహాయక చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష – తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వరద బాధితులకు చేపడుతున్న సహాయక చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మెరుగైన భోజన, వసతి సౌకర్యాలు కలి్పంచారు. – ఈ రెండు జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో వివిధ పంటలు నీట మునిగినట్లు అంచనా. శనివారం వేకువజామున భారీగా వీచిన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శిబిరాల నుంచి ఇళ్లకు వెళుతున్న కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.2 వేలు అందజేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం వర్షపు నీటిలోనే పర్యటించి, మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడా నీరు నిలవకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు – మాండూస్ తుపాన్ తీరం దాటినప్పటికీ ఆ ప్రభావంతో ఇంకా నెల్లూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల వాలడంతో ఆ శాఖకు నష్టం వాటిల్లింది. – నెల్లూరు నగరంతో పాటు లోతట్టు ప్రాంతాల కాలనీల్లో ఇంకా వర్షపు నీరు నిలబడిపోయింది. నెల్లూరు ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, చౌటమిట్ట కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న నీటిని అధికారులు జేసీబీల సాయంతో కాలువల్లోకి మళ్లిస్తున్నారు. నగర పంచాయతీ అయిన బుచి్చరెడ్డిపాళెంలో చెన్నకేశవ ఆలయం గర్భగుడిలోకి వర్షం నీరు చేరింది. వ్యవసాయ, విద్యుత్ శాఖాధికారులు నష్టం అంచనాకు ఉపక్రమించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు – ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేసిన పంటలు నీట మునిగాయి. దర్శి, కనిగిరి, కొండపి ప్రాంతాల్లో కొంత మేర పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అనేక ప్రాంతాల్లో వాగులు రోడ్లెక్కి ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు, వంకలు నిండటంతో జలకళ సంతరించుకుంది. – ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వరి కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వర్షాల ప్రభావం డెల్టా రైతులపై తీవ్రంగా ఉంది. భట్టిప్రోలులో వరి ఓదెలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంటలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలిస్తున్నారు. – తుపాను తీరం దాటి బలహీన పడినప్పటికీ కాకినాడ తీరంపై ఇంకా దాని ప్రభావం కనిపిస్తోంది. కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేటల్లో తీరానికి చేరువగా ఉన్న ఇళ్లు కోతకు గురవుతున్నాయి. ఉప్పాడ వద్ద తీర రక్షణకు వేసిన జియోట్యూబ్ గోడ ధ్వంసమైంది. – ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డ, పెడన, మైలవరం తదితర నియోజకవర్గాల్లో 7,500 ఎకరాల్లో పనలపై ఉన్న వరిపంట, కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలు నీటమునిగాయి. కంకిపాడు, గన్నవరం, ఉయ్యూరు, పామర్రు, పెనమలూరు పరిసరాల్లో ధాన్యం రాశులు వర్షానికి స్వల్పంగా తడిచాయి. -
మహాబలిపురం వద్ద తీరం దాటిన మాండూస్ తుపాను
-
ఈదురు గాలులతో ముంచుకొస్తున్న మాండూస్.. ఏపీలో ఆరు జిల్లాల్లో హై టెన్షన్!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఒంగోలు అర్బన్/తిరుపతి అర్బన్/సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను కలవరపెడుతోంది. శుక్రవారం తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినా, దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. తమిళనాడు రాష్ట్రంపై ఎక్కువగా ఉంది. 14 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి తమిళనాడులోని మహాబలిపురానికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద శనివారం ఉదయం లోపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేక బులెటిన్‌లో తెలిపింది. తీరం దాటిన తర్వాత శనివారం మధ్యాహ్నానికి క్రమంగా వాయుగుండంగా మారి బలహీనపడుతుందని వెల్లడించింది. తుపాను ప్రభావం తమిళనాడులోని 15 జిల్లాలపై పడింది. భారీ వర్షం కారణంగా చెన్నై నుంచి 21 విమాన సేవలను రద్దు చేశారు. 6 జిల్లాలపై ప్రభావం.. అప్రమత్తమైన ప్రభుత్వం ఈ తుపాను ఆంధ్రాలోని ఆరు జిల్లాలపై ప్రభావం చూçపనుంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే పరిస్థితి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. సీఎం వైఎస్ జగన్ రెండు సార్లు తుపాను ముందు జాగ్రత్త చర్యలపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తుపాను కదలికలను రెవెన్యూ, విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సమీక్షిస్తున్నారు. ఆరు జిల్లాల్లోని 210 మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 బృందాలను ఉంచామన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు తుపాను ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో తీరం వెంబడి 150 మీటర్ల మేరకు సముద్రం చొచ్చుకువచ్చింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 10.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ ఆరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలో టోల్‌ఫ్రీ నంబర్ 1077 నెల్లూరు జిల్లాలో తుపానుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ప్రజలకు సహాయం చేయడానికి జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూంలో టోల్ ప్రీ నంబరు 1077 ఏర్పాటు చేశారు. విద్యుత్ స్తంభాలు కూలినా, లైన్లు తెగినా.. టోల్ ఫ్రీ నంబరు 1912కు సమాచారం ఇవ్వాలి తుపాను నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీలు ఆదేశాలు జారీచేశారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చీఫ్ జనరల్ మేనేజర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. విద్యుత్ అంతరాయాలను పర్యవేక్షించేందుకు డివిజన్లు, సర్కిళ్ల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు. 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, లైన్లను వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, లైన్లు తెగిపోవడం లాంటి జరిగితే సమీపంలోని విద్యుత్ శాఖ సిబ్బందికి లేదా టోల్ ఫ్రీ నంబరు 1912కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. -
హై అలర్ట్‌గా ఉండాలి.. సీఎం జగన్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇప్పటికే మీకు నిధులు ఇచ్చామని, తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని’’ కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు. చదవండి: అసని తుపాను ఎఫెక్ట్.. 37 రైళ్లు రద్దు.. వివరాలు ఇవే.. ‘‘కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశం. అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలి. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను తెరవండి. సహాయ శిబిరాలకు తరలించిన ఒక వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఇవ్వండి. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయండి. జనరేటర్లు, జేసీబీలు.. ఇవన్నీకూడా సిద్ధంచేసుకోండి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని’’ సీఎం అన్నారు. ‘‘తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలి. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు. సెంట్రల్ హెల్ప్ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలి. వచ్చే కాల్స్ పట్ల వెంటనే స్పందించండి. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని’’ సీఎం పేర్కొన్నారు. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అసని తుపాను ప్రభావంతో విశాఖ, తుర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖపై అసని తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరోవైపు పలువురు మంత్రులు అసని తుపాను ప్రభారంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ‘అసని’ తుపాను తెచ్చిన ‘బంగారు’ మందిరం కంట్రోల్ రూమ్ నంబర్లు కాకినాడ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18004253077 కాకినాడ ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 0884-2368100 శ్రీకాకుళం: 08942-240557 తూర్పు గోదావరి: 8885425365 ఏలూరు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 18002331077 విజయనగరం: 08922-236947 పార్వతీపురం మన్యం: 7286881293 మచిలీపట్నం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252572 మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్ కంట్రోల్ రూమ్ నంబర్: 08672 252486 బాపట్ల కంట్రోల్ రూమ్ నంబర్: 8712655878, 8712655881 ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్: 90103 13920 విశాఖ: 0891-2590100,102 అనకాపల్లి: 7730939383 -
వైఎస్సార్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నివర్ తుపాను నష్టాన్ని జిల్లాలో కేంద్రం బృందం శుక్రవారం పరిశీలించింది. తుపాను నష్టంపై కేంద్ర బృందానికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివేదిక అందించారు. పూర్తి అంచనా వేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయం, ఉద్యానవన, మౌలిక రంగాల్లో భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వరి, వేరుశనగ సహా అన్ని పంటలూ దెబ్బతిన్నాయని వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని కేంద్రబృందానికి అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
సాక్షి, నెల్లూరు: జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. నాయుడుపేట, గూడూరు, కావలిలో నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది. గూడూరు వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించిన బృందానికి.. జేసీ హారేంద్ర ప్రసాద్ పరిస్థితిని వివరించారు. జిల్లాలో జరిగిన పంటల, ఆస్తి నష్ట వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ చక్రధర్ బాబు వివరించారు. జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు దెబ్బతిన్నాయని కలెక్టర్ బృందానికి తెలిపారు. నీటమునిగిన వరి పంటల చిత్రాల ప్రదర్శన ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. -
తిత్లీని మించిన విషాదం.. ప్రభుత్వ నిర్లక్ష్యం!
గత ఏడాది సంభవించిన తిత్లీ పెనుతుఫాన్లో లక్షలాది చెట్లు నేలకూలాయి. వేలాది కుటుంబాలు రోడ్డెక్కాయి. జీవనం భారమైంది. బతుకు దూరమైంది. తక్షణమే పరిహారం అందిస్తామంటూ అప్పటి ప్రభుత్వం నానా హడావిడీ చేసింది. నష్టాల అంచనాల్లో అన్యాయాలు, అవకతవకలను పక్కన పెడితే.. కనీసం బాధితులుగా గుర్తించిన వారికి సైతం పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడం దారుణం. జిల్లావ్యాప్తంగా 6 వేలమందికి ఇంకా నష్టపరిహారం అందాల్సివుందని అధికారులే చెబుతుండగా వాస్తవానికి ఆ సంఖ్య 10 వేల నుంచి 13 వేల వరకు ఉంటుందని రైతులు వాపోతున్నారు. కవిటి: నిబంధనల పేరుతో రైతుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. తిత్లీ మిగిల్చిన విషాదం కంటే అధికారులు అనుసరిస్తున్న విధానాలే విపత్తులా మారాయి. వాస్తవంగా జరిగిన నష్టానికి అధికారులు వేసిన కాకిలెక్కలకి పొంతన లేకుండా పోయింది. భారీ ఎత్తున నష్టపోయిన రైతులకు పైసా కూడా పరిహారం అందలేదు. ఎన్నికల ముందు వరకు రకరకాలుగా ఆశ చూపిన అధికార పార్టీ నేతలు చివరకు చేతులెత్తేశారు. తాజాగా ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి కలిగిన రైతులకు పరిహారం అందదని ఉన్నతాధికారులు చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వెబ్లాండ్ ఆధారంగా పరిహారం అందిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. వెబ్లాండ్ ఎంత సమర్ధంగా అమలైందీ తెలిసి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సబబని నిరసన వ్యక్తమవుతోంది. 1999 తుఫాన్ సమయంలో, ఆ తర్వాత రాష్ట్రంలో సంభవించిన విపత్తుల సందర్భంగా మినహాయింపులతో కూడిన పరిహారాన్ని అందించారు కానీ తిత్లీ విషయలో మాత్రం కొర్రీల మీద కొర్రీలు వేసి బాధిత రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. హేతుబద్ధత ఏదీ? తుఫాన్ నష్టపరిహారం నమోదుకు అధికారులు అవలంబించిన విధానం అశాస్త్రీయంగా ఉంది. రైతుల భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి.. పట్టాదార్ పాసుపుస్తకాల ఆధారంగా సర్వే నెంబర్లను ఆధార్ కార్డు నెంబర్‌ను అనుసంధానిస్తూ నష్టాలు నమోదు చేశారు. ఈ మేరకు కొంతమందికి పరిహారాలు చెల్లించేశారు. మిగిలిన రైతులకు తాజాగా కొత్త ఆంక్షలు విధించి వేదనకు గురిచేస్తున్నారు. వెబ్లాండ్ ఆధారంగా పరిహారం అందిస్తామని చెప్పడం విమర్శలపాలవుతోంది. వెబ్లాండ్లో ఎంత మేర భూములు నమోదు చేశారు.. అది ఎంత సవ్యంగా సాగిందీ అందరికీ తెలిసిందే. 1బీ అడంగల్‌కు వెబ్‌లాండ్‌లోని వివరాలకు రైతు దగ్గర ఉన్న పాస్‌పుస్తకాలకు ఎక్కడా పొంతనలేదు. ఇటీవల కాలంలో మ్యుటేషన్లు కూడా సకాలంలో చేయకపోవడం, సవాలక్ష తప్పులతో మమ అనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని పరిహారం అందిస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. -
ఎన్నికల కోడే కాపాడింది..
తుపానును ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు.. ప్రణాళిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్.. వర్షాలు వెలిశాక చకచకా పునరుద్ధరణ పనులు.. ఇదీ ఫొని తుపాను సందర్భంగా అధికారులు అనుసరించిన వ్యూహం. ‘తిత్లీ’ నాటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు సాధారణ పరిస్థితులు చాలా త్వరగా నెలకొన్నాయి. తుపాను తీవ్రతలో తేడా ఉన్నప్పటికీ.. అధికారుల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ప్రజలు అంటున్న మాట. మరి అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటి? ఎన్నికల కోడ్ కారణంగా ఈసారి సీఎం చంద్రబాబు అడుగుపెట్టకపోవడమే ఇందుకు కారణమా? అరసవల్లి:‘నేనొస్తేనే అంతా జరుగుతుంది... అంతా నేనే చేశాను... ప్రకృతిని ఎదిరించాను... సముద్రాన్ని ఆపేస్తాను...’ అనే ప్రకటనలే లేవు... అధికారుల్లో ఆందోళన, హడావుడి లేదు... ఆర్భాటం అస్సలే లేదు! ఒకటో రెండో ఉన్నత స్థాయి సమీక్షలు... క్షేత్ర స్థాయిలో పకడ్బందీ చర్యలు... అప్రమత్తత... తత్ఫలితంగా మన అధికారులు పెను తుపానునే జయించారు. తుపాన్ కారణంగా జిల్లాలో ఒక్క ప్రాణనష్టం లేకుండా, భారీగా ఆస్తినష్టం సంభవించకుండా జిల్లావాసులను గట్టెక్కించారు. గతంలో తుపాన్ల సమయాల్లో వారా ల తరబడి విద్యుత్ సరఫరా లేక, తాగునీరు లేక అల్లాడిపోయే పరిస్థితులు ఉండేవి. హుద్‌హుద్.. తిత్లీ.. తర్వాత ఫొని.. ఈ మూడు పెను తుపాన్లు జిల్లాలో తీర, ఉద్దాన ప్రాంతాన్నే కుదిపేసినప్పటికీ ఈసారి మాత్రం ప్రజలు అతి త్వరగానే సాధారణ స్థితికి చేరుకున్నారు. ఇదంతా ఆయన వస్తే సాధ్యమయ్యేనా...? అన్న విషయమై ఇప్పు డు జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఇదే విషయాన్ని ఓ ఉన్నతాధికారి వద్ద ‘సాక్షి’ ప్రస్తావిస్తే....‘నిజమే... వాళ్లంతా వస్తే వారికి మర్యాదలు చేసుకోవడానికి, వాళ్ల సమీక్షల్లో పాల్గొనడానికి గంటల కొద్దీ సమయం వృథా అయ్యేది.. మా విధులు సక్రమంగా చేయలేకపోయేవాళ్లం’ అని అంగీకరించారు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగుల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఏమేరకు ఒత్తిడి ఉండేదో అర్థమవుతోంది. విస్తృత పబ్లిసిటీ, ఆర్భాటాల కోసం రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపాలను కూడా వాడేసుకునే చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన జిల్లాకు వచ్చి వుంటే... ఫొని తుపాన్ బీభత్సం నుంచి జిల్లా వాసులు ఇంత త్వరగా కోలుకునేవారు కారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనతోపాటు రాష్ట్ర మంత్రుల గణం రాకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం మిగిలిందని, ఆ మొత్తంతో ప్రజా వసరాలు తీరే అవకాశముందని ఓ అధికారి ‘సాక్షి’ వద్ద వ్యాఖ్యానించారు. చంద్రబాబు వచ్చుంటే... ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో సీఎం చంద్రబాబు తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించడం కుదరలేదు. తర్వాత సిక్కోలు సహా నాలుగు జిల్లాలను కోడ్ నుంచి మినహాయించినప్పటికీ ఆ ప్రాంతాల్లో సహాయ చర్యలకు నిధులు విడుదల చేసేంతవరకే పరిమితం. ప్రజాప్రతినిధుల కదలికలపై కొంతమేర ఆంలు కొనసాగుతాయి. ఫొని తుపాను మరికొద్ది రోజుల్లో జిల్లాను అతలాకుతలం చేస్తుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం జిల్లా కలెక్టర్ జె.నివాస్ బృందానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. దీనిని తూచా తప్పకుండా పాటించడంతో పూర్తి స్థాయి రక్షణ చర్యలు, పునరావాస కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించివుంటే... ఇక్కడి పరిస్థితులు వేరేలా ఉండేవని చర్చ సాగుతోంది. ఆయన వచ్చుంటే... ప్రొటోకాల్ అంటూ జిల్లా కలెక్టర్ నుంచి తహశీల్దార్ వరకు ఉద్యోగులంతా ఆయన వెంటే పరుగులు పెట్టుండేవారు. ఇది చాలక ప్రతి రెండు మూడు గంటలకు ఓ సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి హడావుడి మొదలయ్యేది. దీనికితోడు ఈ ప్రాంతాల్లోనే పండుగలు, సంబరాలు చేసుకోవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం జరిగేది. ఇది చాలదన్నట్లుగా తిత్లీని జయించామంటూ విజయవాడలో ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకోవడం వంటి ప్రచారాలతో ఆయనకు కావాల్సిన ప్రచారం బాగా వచ్చేది కానీ బాధితులకు సాయం అందదు... ప్రణాళిక ప్రకారం ఆదుకునే పరిస్థితులుండవు. ఐదేళ్ల క్రితం చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే హుద్‌హుద్ విరుచుకుపడగా, గతేడాది తిత్లీ జిల్లాలో ఉద్దానం రూపురేఖలను ధ్వంసం చేసిన సంగతి విదితమే. ఈ రెండు తుపాన్లలో సీఎం తనదైన శైలిలో ప్రచార ఆర్భాటాలు ఎలా చేసారో ప్రజలందరికీ తెలిసిందే. తిత్లీ సమయంలో పలాస ప్రాంతంలో నాలుగైదు రోజులపాటు అక్కడే మకాం వేయడంతో పునరుద్ధరణ పనులన్నీ నిలిచిపోయాయి. సుమారు 15 రోజుల వరకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందించలేని పరిస్థితి ఎదురైంది. ఈసారి జిల్లా యంత్రాంగా నికి తోడుగా పనులను పర్యవేక్షించేందుకు సీఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారులు కె.ఎస్.జవహర్‌రెడ్డి, కె.ధనంజయరెడ్డి తదితరులను నియమించారు. విద్యుత్ శాఖ యుద్ధప్రాతిపదికన సుమారు 3 వేల మంది కార్మికులతో పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. 14 మండలాల్లోని 733 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, మర్నాడే పూర్తి స్థాయిలో విద్యుత్ అందించగలగడం విశేషం. ఒక్క విద్యుత్ శాఖ విషయంలోనే కాకుండా... నష్టం అంచనాలు, పారిశుద్ధ్యం, పునరావాసం, ఆహార సహాయ కార్యక్రమాలు కూడా చకచకా జరిగిపోయాయి. -
తీవ్రంగా మారనున్న ‘గజ’ తుఫాన్
సాక్షి, చెన్నై: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల గజ తుఫాన్ 759 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుందని తమిళనాడు వాతావరణ శాఖ తెలిపింది. కావునా సముద్రంలోకి చేపల వేటగాళ్లు, జాలర్లు ఎవరు వేటకు వెళ్లకుడదని తీరంవెంబడి ఈదురుగాలులు వీచి అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడలురు రేవులలో మూడో నెంబర్ హెచ్చరికలు జారి చేసింది. -
'దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తాం'
శ్రీకాకుళం: హుదూద్ తుపాను విపత్తుతో దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో పక్కా ఇళ్లు నిర్మిస్తామని కుందువాని పేట గ్రామస్తులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హమీ ఇచ్చారు. గురువారం శ్రీకాకుళంలో తుపాను దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుందువానిపేట గ్రామంలో పర్యటించారు. తుపాన్ ప్రభావిత జిల్లాలోని మత్స్యకార గ్రామాలను స్మార్ట్ విలేజ్‌లుగా మారుస్తామన్నారు. భూగర్భ కరెంట్, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్ని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు విజయనగరం పర్యటనకు బయల్దేరి వెళ్లారు. -
పునరావాస చర్యలు వేగవంతం: ఏపీ ప్రభుత్వం
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలను వేగవంతం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అందుకోసం 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాలో అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అందులోభాగంగా ప్రత్యేక వైద్య బృందాలను సదరు జిల్లాలకు తరలించినట్లు వెల్లడించింది. అదనంగా 10 అంబులెన్సులు, 100 వైద్య బృందాలతో గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలూ వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించింది. అలాగే విద్యుత్, టెలిఫోన్ లైన్ల పునరుద్దరణకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.