
సాక్షి, వైఎస్సార్ జిల్లా: నివర్ తుపాను నష్టాన్ని జిల్లాలో కేంద్రం బృందం శుక్రవారం పరిశీలించింది. తుపాను నష్టంపై కేంద్ర బృందానికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నివేదిక అందించారు. పూర్తి అంచనా వేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయం, ఉద్యానవన, మౌలిక రంగాల్లో భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వరి, వేరుశనగ సహా అన్ని పంటలూ దెబ్బతిన్నాయని వివరించారు. బాధితులకు న్యాయం చేయాలని కేంద్రబృందానికి అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment