కడప అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన నాడా తుపాను వల్ల జిల్లాలో రెండు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్నాయి. జిల్లాలోని 13 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు సరాసరి 6.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రైల్వేకోడూరులో అత్యధికంగా 51.2 మిల్లీ మీటర్లు, ఓబులవారిపల్లెలో 32.2, పుల్లంపేటలో 41.8, చిట్వేలులో 42.2, రాజంపేట 21.2,రాయచోటి 15.6, చిన్నమండెం 14.0, సంబేపల్లెలో 14.4, వీరబల్లిలో 8.4, టి సుండుపల్లిలో 19.4, లక్కిరెడ్డిపల్లెలో 11.8, ఒంటిమిట్టలో 7.2, మైదుకూరులో 7.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.