రుషికొండ తీరంలో బ్లూ రింగ్‌ యాంగిల్‌ ఫిష్‌ | The Blue Ring Angle Fish on the Rishikonda coast | Sakshi
Sakshi News home page

రుషికొండ తీరంలో బ్లూ రింగ్‌ యాంగిల్‌ ఫిష్‌

Published Sun, Mar 18 2018 12:50 PM | Last Updated on Sun, Mar 18 2018 12:50 PM

The Blue Ring Angle Fish on the Rishikonda coast - Sakshi

రుషికొండ తీరంలో మత్స్యకారుల వలకు చిక్కిన బ్లూరింగ్‌ యాంగిల్‌ ఫిష్‌

సాగర్‌నగర్‌(విశాఖ తూర్పు) : ప్రకృతి సహజ అందాలకు నిలయమైన రుషికొండ సముద్ర తీరంలో శనివారం అరుదై న, అందమైన బ్లూ రింగ్‌ యాంగిల్‌ ఫిష్‌ మత్స్యకారులకు చి క్కింది. సాధారణంగా విదేశీ సముద్ర తీరాల్లో సముద్ర మట్టానికి వంద మీటర్లు లోతులో నాచురాళ్లు మధ్య విహరిం చే అందమైన ఈ చేప వాడపాలెం వాడబలిచి మత్స్యకారుల వలకు చిక్కింది. వారి వేటలో భాగంగా పడిన చేపల్లో బ్లూరింగ్‌ యాంగిల్‌ ఫిష్‌ ఆకర్షణీయంగా కన్పించడంతో స్థానిక మత్స్యకారులు, పర్యాటకులు వింతగా తిలకించారు.

సాధారణంగా ఇక్కడి రేవులకు ఈ తరహా చేపలు రావు. చేప శరీరమంతా తాబేలు ఆకారంలో ఉంది. దీని తోక తెల్లగా అందంగా కన్పిస్తోంది. శరీరంపై బ్లూ కలర్‌ చారలతో ఆకర్షణీయంగా, వింతగా కనిపిస్తోంది. పెద్ద కళ్లు కలిగిన చేప వలకు చిక్కిన వెంటనే చనిపోయిందని మత్స్యకారులు తెలిపారు. ఈ తరహా చేపలు విశాఖ తీరానికి రావడం చాలా అరుదని, ఎక్కువగా విదేశీ రేవుల్లో లభిస్తాయని మత్స్యకార శాఖ అధికారిణి విజయ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement