Rishikonda
-
సిగ్గేస్తున్నది బాబూ!
అది మహారాజాధిరాజ రాజమార్తాండ రాజగండభేరుండ చక్రవర్తులు నివసించదగిన మహాప్రాసాదమట! ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లు దాని ముందు దిగదుడుపట! అంతోటి మహత్తరమైన ప్యాలెస్‌ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన నివాసం కోసం నిర్మించుకున్నారట! సామెతలు ఊరికే పుట్టవు. వినేవారు వెర్రివాళ్లయితే చెప్పేవారు చంద్రబాబు అనే నానుడి ఊరికే రాలేదు. చంద్రబాబు ఎప్పుడూ అబద్ధాలే చెబుతారు. ఎందుకంటే నిజం చెబితే ఆయన తల వెయ్యి వక్కలవుతుందనే ముని శాపం ఉన్నదని వైఎస్సార్ విమర్శిస్తుండేవారు. క్లాస్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ (’78) బ్యాచ్‌మేట్స్ కదా! పూర్తి అవగాహనతోనే మాట్లాడి ఉంటారు.రిషికొండలో గత ప్రభుత్వం హయాంలో టూరిజం శాఖ నిర్మించిన భవనాలను శనివారం నాడు చంద్రబాబు సందర్శించారు. ‘ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి కట్టడాలుంటాయా!’ అంటూ బోలెడంత ఆశ్చర్యాన్ని మీడియా ముందు ఆయన గుమ్మరించారు. ఆ నిర్మాణాలను చూసి దిగ్భ్రాంతికి గురయ్యామని కూడా ఆయన చెప్పారు. ఆయనే చెప్పిన లెక్క ప్రకారం ఆ నిర్మాణాలకయిన ఖర్చు రూ.430 కోట్లు. ఈ భవనాల నిర్మాణాని కంటే ఏడెనిమిదేళ్ల ముందు అమరావతిలో చంద్రబాబు కొన్ని ‘తాత్కాలిక’ భవనాలను నిర్మించారు. అందులో తాత్కాలిక సచివాలయానికే సుమారు వెయ్యి కోట్లు ఖర్చయింది. రిషికొండ నిర్మాణాల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ఖర్చు. ఈ లెక్కన ఆ తాత్కాలిక భవనం అంబర్ ప్యాలెసో, మైసూర్ ప్యాలెసో అయుండాలి.మరి వెయ్యి కోట్ల తాత్కాలిక ప్యాలెస్‌ను చూసినప్పుడు ఎందుకని దిగ్భ్రాంతి కలుగలేదు? నిర్మాణ సంస్థవారు దిగ్భ్రాంతి కలిగించే హంగూ ఆర్భాటాలను ఇక్కడి నుంచి వేరేచోటుకు తరలించి లెక్క తాత్కాలికంలో రాసేశారా? ఆ లెక్కతో ఏ జూబిలీ హిల్స్ ప్యాలెస్కో నగిషీలు చెక్కారా? ఎందుకని ఆ వెయ్యి కోట్ల తాత్కాలిక భవనం ఏపీ ముఖ్యమంత్రిని నివ్వెరపాటుకు గురి చేయలేకపోయింది? భవనం లోపలికి కూడా వానచినుకులు ప్రవేశించగలిగే వర్ష పారదర్శకత మినహా మరే ప్రత్యేకతా ఈ తాత్కాలిక సచివాలయంలో ప్రజలకు కనిపించలేదు.ముఖ్యమంత్రికి మనస్తాపం కలిగించిన మరో అంశం పర్యావరణ విధ్వంసమట! రుషి పుంగవులు తపస్సు చేసిన రుషికొండను ధ్వంసం చేసి జగన్ సర్కార్ ప్యాలెస్‌ను కట్టిందట! అసలు రుషికొండకు గుండుకొట్టి పర్యాటకం కోసం ‘హరిత రిసార్ట్స్’ నిర్మించిందే టీడీపీ సర్కార్. పాతబడిన ఆ భవనాలను తొలగించి వాటి స్థానంలో ఈ కొత్త భవనాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జగన్ సర్కార్ నిర్మించింది. ఈ భవనాలు తాత్కాలికం కాదు. శాశ్వత ప్రభుత్వ భవనాలు. అమరావతిలో ఐకానిక్ భవనాలు నిర్మించాలని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. అదిగో అటువంటి ఐకానిక్ భవనాన్నే విశాఖలో జగన్ సర్కార్ నిర్మించింది. అమరావతికి లేని హంగు విశాఖకు ఎందుకని ఆయన భావిస్తున్నారేమో!పాత నిర్మాణాల స్థానంలో కొత్తగా ఏయే భవనాలను నిర్మిస్తున్నారో, ఎందుకోసం నిర్మిస్తున్నారో తెలియజేస్తూ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు వివరాలు అందజేసింది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మాత్రం జగన్మోహన్రెడ్డి నివసించడం కోసమే ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టాయి. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ ధనంతో సొంత భవనాన్ని ఎవరైనా ఎట్లా నిర్మించుకుంటారు? కనీస ఇంగిత జ్ఞానం కదా! కానీ, గోబెల్స్ దుష్ప్రచారాలకు ఇంగితంతో పనిలేదు. అవసరార్థం ఏ ప్రచారమైనా చేస్తారు. ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అవసరం వచ్చిపడింది. కనుక చంద్రబాబు పనిగట్టుకొని అదే దుష్ప్రచారానికి రంగురంగుల రెక్కలు తొడిగి జనం మీదకు వదిలారు.అలవి కాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చారు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘హామీల అమలు ఇంకెప్పుడ’ని పబ్లిక్ వాయిస్ ప్రశ్నించడం మొదలైంది. ఈ వాయిస్ వినిపించగూడదు. అందుకోసం ఇంకెక్కడో ఓ కృత్రిమ వివాదం చిటపటలాడాలి. డైవర్షన్ స్కీమ్ పాహిమాం! అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట వైఎస్ విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదం ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చింది? తాయెత్తు మహిమ. షర్మిల ఆస్తుల వివాదం ఎందుకొచ్చింది? తిరుపతి లడ్డూలో కల్తీ ఆరోపణలు ఎందుకొచ్చాయి? కృష్ణా వరదల్లో బోట్ల వివాదం ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇలాంటివెన్నో తాయెత్తులు, ఎత్తులు ఈ ఐదు మాసాల్లో చూడవలసి వచ్చింది. టాపిక్ డైవర్షనే ఆ తాయెత్తు మంత్రం.పరిపాలన వైఫల్యాలనూ, వాగ్దాన భంగాలనూ ఈ ఎత్తులూ, తాయెత్తులూ ఎంతకాలం కప్పి ఉంచగలవు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన శాంతిభద్రతల పరిస్థితి ఎన్నడూ లేదన్న మాట జనం నోట వినబడుతున్నది. వాగ్దానాలు అటక మీద పడుకున్నాయి. నాణ్యమైన విద్యకు, వైద్యానికి పేద వర్గాలను దూరం చేశారు. మహిళా సాధికారత పథకాలను చాపచుట్టేశారు. ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టును బరాజ్ స్థాయికి కుదించాలన్న కేంద్ర ఆదేశాలకు డూడూ బసవన్నలా తలూపి వచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సుదూర స్వప్నంగా మిగిలిపోనున్నది. విశాఖ ఉక్కు భవిష్యత్తు దినదినగండంగా మార్చేస్తున్న కేంద్రం ముందు జోహుకుం అంటున్నారు. అవమాన గాయాలతో ఉత్తరాంధ్ర ప్రజల్లో సెగ రగులుతున్నది. అందుకే విశాఖలో ఈ సరికొత్త డైవర్షన్ తాయెత్తు ప్రయోగం. వెయ్యికోట్లు ఖర్చు పెట్టి నీళ్లుకారే తాత్కాలిక భవనాన్ని నిర్మించిన వ్యక్తి 430 కోట్ల ఖర్చుతో ఐకానిక్ కట్టడాన్ని కడితే ఔరా అని ముక్కున వేలేసుకోవడాన్ని చూసి సిగ్గేస్తున్నది బాబూ! ఏపీలో ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాద్ సెవెన్ స్టార్ హోటల్లో కొద్దిరోజులు సకుటుంబ సపరివారంగా గడపడానికి 30 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టిన వ్యక్తి, క్యాంపు కార్యాలయాలకు, వాటి సెక్యూరిటీ ఏర్పాట్లకూ 126 కోట్లు ఖర్చు చేసిన నాయకుని నోట వినిపించిన మాట – రిషికొండలో బాత్ టబ్లకూ, కమోడ్లకూ, ఫ్యాన్లకూ లక్షలు ఖర్చు చేశారని! చచ్చేంత సిగ్గేస్తున్నది బాబూ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆడుదాం ఆంధ్రాపై టీడీపీ దుష్ప్రచారం: మాజీ మంత్రి రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: విశాఖలోని రిషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతోందని విమర్శించారు మాజీమంత్రి ఆర్కో రోజా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలని హితవు పలికారు.కాగా, మాజీ మంత్రి రోజా గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించాం.టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు-నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా ఇలానే చూపించండి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం. గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా?. కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షతోనే నిర్మాణాలు చేపట్టాం.ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా అవుతుందా?. క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా?. అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదమే అవుతుంది. మళ్ళీ 2029లో జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం.రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?. చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని అనలేదా? అంటూ ప్రశ్నించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ‘చిల్లర రాజకీయాలు’ సహజమే!
కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది ఏపీలో తెలుగుదేశం తీరు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన రుషికొండపై గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన భవనాలపై వివాదం రేపుతున్న వైనం అల్ప బుద్ధిని చాటుతోంది తప్ప ఇంకొకటి కాదని చెప్పాలి. విశాఖపట్నానికి శిఖరాయమానమైన, బ్రహ్మండమైన భవంతులను నిర్మాణం అయినందుకు సంతోషించవలసిందిపోయి, ఈ రకంగా బురదచల్లడం ద్వారా ఏమి సాధిస్తారో అర్థం కాదు. అత్యంత నాణ్యమైన రీతిలో చక్కని భవంతిని నిర్మించడం కూడా తప్పేనని తెలుగుదేశం చెబుతోంది.రుషికొండపై నిర్మితమైన ఈ ప్రాజెక్టు, అక్కడ ఉన్న పార్కు ప్రదేశం తదితర విశేషాలను టీవీలలో చూస్తుంటేనే ఎంతో ముచ్చటగా కనిపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ముఖ్యమైన అతిధులు అక్కడకు వస్తే, వారు ఆ భవనాలలో బస చేస్తే ఎంతో గొప్ప పేరు వస్తుంది. ఎదురుగా సముద్రతీరం. కొండమీద సురక్షితమైన ప్రదేశంలో భవనాల నిర్మాణం వల్ల దేశం అంతటిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. విశాఖలో టూరిజం అభివృద్దికి కూడా ఇది మరింత దోహదపడుతుంది. ఇదే తరహాలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక భారీ భవనం నిర్మించి ఉంటే, అబ్బో ఎంత గొప్పగానో ప్రచారం చేసి ఉండేది. వారు అలా చేయలేకపోయారు కాబట్టి ప్రజలలోకి తప్పుడు సంకేతం తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ బురద చల్లుడు కార్యక్రమం జరిగింది. ఈ భవనం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికు సంబంధించిందేమో అనే అనుమానం కలిగేలా ప్రచారం చేశారు. నిజానికి అది టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణం. అక్కడ దానిని టూరిజం ప్రాజెక్టుగా వాడుకుంటారా? లేక ముఖ్యమంత్రి బసకు వాడుకుంటారా? అనేది ప్రభుత్వం ఇష్టం. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటివారు వచ్చినప్పుడు రుషికొండపై బస చేస్తే ఏపీకి ఎంతో గౌరవం దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఆ భవనాలను దేనికి వినియోగించుకుంటారో చెప్పాలి కదా! వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించింది కనుక తాము ఆ భవనాలను వాడబోమని అంటారా! వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ అక్కడ తాత్కాలిక భవనాలను నిర్మించలేదు. శాశ్వత ప్రయోజనాలకు ఉపయోగపడేలా నిర్మించారు.అదే అమరావతి రాజధాని ప్రాంతంలో 2014-2019 మధ్యచంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక భవనాలను నిర్మించి ఎన్ని వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిందన్న అంశం గురించి టీడీపీ నేతలు మాట్లాడే పరిస్థితి లేదు. సచివాలాయం, శాసనసభ భవనాలన్నిటిని తాత్కాలిక ప్రాతిపదికనే వందల కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆ భవనాల నిర్మాణంలోకానీ, ఇతరత్రా కానీ రెండువేల కోట్ల రూపాయల మేర ఆర్థిక అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీటీడీ ప్రకటించింది. దానిపై టీడీపీ నేతలు వివరణ ఇస్తే బాగుంటుంది. అధికారం వచ్చింది కనుక అన్నీ తూచ్ అని చెప్పవచ్చు. కేంద్రంలో తమ కూటమి పవర్ లో ఉంది కనుక అన్నిటినీ తప్పించుకోవచ్చు. కానీ చరిత్ర ఎప్పటికి కనుమరుగు కాదు కదా!దీని సంగతి పక్కనబెడితే ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం పలు గ్రాఫిక్స్ ను ప్రచారంలోకి తెచ్చింది. రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణం ఎలా జరుగుతుంది? శాసనసభ ఏ రూపంలో ఉంటుంది? సచివాలయం ఎన్ని అంతస్తుల టవర్ లో ఉంటుంది?మొదలైన వాటిపై తెలుగుదేశం మీడియాలో ఎన్నో కథనాలు వచ్చేవి. అవి చూస్తే ఇంత అధ్బుతంగా ఇక్కడ భవనాలు నిర్మించబోతున్నారా అనే చందంగా ప్రచారం జరిగేది. జపాన్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన డిజైనింగ్ నిపుణులతో ప్లానింగ్ చేశామని చెప్పేవారు. అసెంబ్లీ భవనం ఒకసారి ఇడ్లీ పాత్ర షేప్ లో ఉంటుందని, మరోసారి ఇంకో రకంగా ఉంటుందని రకరకాల డిజైన్ లను ప్రచారంలోకి తెచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హడావుడి చేసేవారు. వాటన్నిటిని ఏమని అంటారు. అవన్ని చంద్రబాబు నాయుడు సొంత భవనాలు కాదు కదా! రాజధాని కోసం ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టినవే కదా! అప్పుడేమని ప్రచారం చేశారు! చంద్రబాబు కాబట్టి అంత విజన్ తో మంచి డిజైన్లతో భారీ భవనాలను నిర్మిస్తున్నారని కదా చెప్పింది. అదే తరహాలో విశాఖలో మంచి ఆకృతితో కొన్ని భవనాలు నిర్మిస్తే టీడీపీ నేతలకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటో తెలియదు. అందులో అవకతవకలు జరిగాయని వారు చెప్పడం లేదు. భారీ వ్యయంతో నిర్మాణాలు జరిగాయని అంటున్నారు. విశాఖకు అది ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది వారు చూడడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు మంచి పేరు రావడం ఇష్టం లేదు కనుక వారు అదేదో కనిపెట్టినట్లు అక్కడ గదులు అలా ఉన్నాయి.. హాల్ అలా ఉంది.. ఇలా ఉంది.. అంటూ విమర్శలు చేశారు.ఇంతకీ ఆ భవనాలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వాడుకునేది మాత్రం చెప్పలేదు. రుషికొండపై నిర్మాణాలు చేస్తున్న సమయంలో దానికి అడ్డు తగలడానికి టీడీపీకానీ, ఆ పార్టీ మీడియా కానీ చేయని ప్రయత్నం లేదు. అయినా రాష్ట్రానికి ప్రయోజనం, విశాఖకు మకుటంలా ఉంటుందని పట్టుదలతో ఆ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేసేవారికి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లోని సచివాలయంలో తన చాంబర్ ను ఎన్ని కోట్లతో అభివృద్ది చేశారో చెప్పగలరా! దానిని మూడునాళ్ల ముచ్చటగా ఎందుకు మార్చారో వివరించగలరా! అదొక్కటే కాదు. వందల కోట్ల విలువైన హైదరాబాద్ లోని సచివాలయ భవనాలను ఎందుకు పాడుపెట్టారో తెలపగలరా?. అప్పట్లో జూబ్లిహిల్స్ లో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నందున వేరే ఇంటిలో ఉండడానికి ఎంత వ్యయం చేశారు. పార్క్ హయతోలో తన కుటుంబం కోసం తీసుకున్న సూట్ ల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయింది. దీనిపై అప్పటి బీజేపీ నేత, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఏమని ఆరోపించింది గుర్తు చేసుకోగలరా? ముప్పై కోట్ల ఇందుకు వ్యయం చేశారని ఆయన అనేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ రుషికొండ భవంతి విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారానికి బదులుగా వైఎస్సార్సీపీ అభిమానులు సోషల్ మీడియాలో టీడీపీ వారిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చారు కనుక మరింత బాధ్యతతో వ్యవహరించి పేరు తెచ్చుకుంటే మంచిది.తెలంగాణలో గత ప్రభుత్వ నేత కేసీఆర్ సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించారు. అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పించేవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవే సచివాలయ భవనాలను వాడుకుంటున్నారు. ఆ సదుపాయాలను వారు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ నిర్మించిన ప్రగతి భవన్ పై కూడా అప్పట్లో చాలా వ్యతిరేక ప్రచారం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లని, అదని ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దానిని ప్రజాభవన్ గా మార్చామన్నారు. అంతే తప్ప నిజంగానే బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లు ఉన్నాయో, లేదో ఇంతవరకు ప్రజలకు వివరించలేదు.ఆ రోజుల్లో కేసీఆర్ కు మద్దతు ఇచ్చిన ఈనాడు తెలంగాణ సచివాలయం అంత గొప్పగా ఉంది.. ఇంత గొప్పగా ఉంది అంటూ సచిత్ర కథనాలను ఇచ్చింది. విశాఖ భవనాలపై మాత్రం టీడీపీ మీడియా విషం చిమ్ముతోంది. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి పూనుకొన్నప్పుడు విపక్షాలు విమర్శలు చేశాయి. చివరికి కోర్టుకు కూడా వెళ్లాయి. కానీ ఆ భవనాన్ని భారీ ఖర్చుతో మోదీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ తర్వాత విమర్శలు ఆగిపోయాయి. రాజకీయాలలో ఇలాంటివి కామన్ గానే జరుగుతుంటాయి.అమరావతి రాజధానికోసం మూడు దశలలో లక్ష కోట్ల వ్యయం చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. తొలిదశలోనే నలభైఎనిమిదివేల కోట్లు పెడతామని అంటున్నారు. అంత వ్యయం ఓకే చోట పెట్టడం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ఊరుకునే పరిస్థితి లేదు. అదంతా రియల్ ఎస్టేట్ వెంచర్ అని విమర్శలు వచ్చేవి. అలాంటి చోట్ల లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న తెలుగుదేశం నేతలు, విశాఖపట్నం నగరానికి మరింత ఘనత తెచ్చేలా భవనాలు నిర్మిస్తే దుమారం లేవదీస్తున్నారు. ఇదేకాదు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో ప్రభుత్వ ఫర్నీచర్ పై కూడా వివాదం చేయడం పద్ధతిగా లేదు. అంతా కలిపి ప్రభుత్వం మారి వారం రోజులు కాలేదు.. అప్పుడే ఫర్నీచర్ అందచేయలేదని వీరు ఆరోపించారు.గతంలో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ లోని అసెంబ్లీ పర్నీచర్ ను తన కుమారుడి షాప్ లో పెట్టుకుంటే తప్పు కాదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఫర్నిచర్ కు ఎంత బిల్లు అవుతుందో చెబితే చెల్లిస్తామని లేఖ రాస్తే తప్పట. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏదో ఒక తప్పుడు ప్రచారం చేసి అప్రతిష్టపాలు చేయాలని టీడీపీ నిరంతరం పనిచేయడానికి పూనుకుంటున్నట్లుగా ఉంది. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం కష్టం కనుక ఏదో ఒక చిల్లర వివాదం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ నేతలు ఇలాంటివి చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. అందుకే కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని చెప్పాల్సి వస్తోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. రుషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు.. ‘‘వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టింది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విశాఖ వచ్చిన సందర్భంలో రుషికొండ భవనాలను వినియోగించుకోవాలి. రుషికొండపై కట్టిన భవనాల్లో వైఎస్ జగన్ ఏమీ ఉండరు. ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి... నాలుగు నెలలు క్రితమే రుషికొండ భవనాలను ప్రారంభించాం. విశాఖను రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత రుషికొండ నిర్మాణంపై ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశారు. కమిటీ ఒకే అన్న తరువాతే రుషికొండ భవనాలను నిర్మించారు. టీడీపీ నేతలు వైఎస్ జగన్ మీద, వారి కుటుంబం మీద బురద జల్లాలని చూడటం ఎంతవరకు సమంజసం? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్ కో..ఆక్రమణలు జరిగింది రుషికొండలో కాదు.. గీతం యూనివర్సిటీలో జరిగాయి. గీతం యూనివర్సిటీ భూ ఆక్రమణలను గంటా శ్రీనివాసరావు చూపిస్తే బాగుండేది. అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే, వైఎస్ జగన్ రుషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు. టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి. రుషికొండ భవనం గురించి మీడియోలు, ఫోటోలు తీసి చూపించారు. అదే సమయంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూపించండి. .. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి. వాటర్ ప్రాజెక్ట్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చూపించండి. .. అమరావతిలో తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆనాడు ప్రభుత్వధనం ఏమైంది?. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. టీడీపీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. అధికార పార్టీ ఇలాంటివి మానుకోవాలని కోరారు. రుషికొండపై ఉన్నవి ప్రభుత్వ భవనాలు అని టీడీపీ నేతలు గుర్తించాలి’ అంటూ గుడివాడ అమర్నాథ్ వైఎస్సార్సీపీ తరఫున ఎల్లో ముఠాకు కౌంటర్ ఇచ్చారు. -
విశాఖలో అధికారుల క్యాంప్ కార్యాలయాలు గుర్తింపు
సాక్షి, విజయవాడ: ఏపీలో విశాఖ నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలను కమిటీ గుర్తించింది. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై కమిటీ(ఆర్థిక శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి) నివేదిక మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలకు సంబంధించి స్థలాలను కమిటీ గుర్తించింది. సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనల సమయంలో వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కమిటీ నివేదిక మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శాఖల సొంత భవనాలు, స్థలాలను తొలి ప్రాధాన్యంగా వినియోగించాలని తెలిపారు. ఇక, వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పెస్‌ను గుర్తించారు. -
పవన్, చంద్రబాబును విశాఖ ప్రజలు తరిమి కొడతారు: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు నిజాలను ప్రజలకు చెప్పలేదు అంటూ మంత్రి రోజా సీరియస్ కామెంట్స్ చేశారు. విశాఖ అభివృద్ధి చెందకూడదనే కడుపుమంటతో ఈనాడు విషపు రాతలు రాస్తోందని రోజా ఆరోపించారు. కాగా, రుషికొండ వద్ద నిర్మాణాలపై మంత్రి రోజా మరోసారి స్పష్టీకరణ చేశారు. ఈ క్రమంలో మంత్రి రోజా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని నిన్ననే వివరణ ఇచ్చాను. ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ప్రజలకు నిజాలను చెప్పలేదు. రుషికొండలో పర్యాటకశాఖకు ఉన్న 69 ఎకరాల్లో 9.17 ఎకరాల్లో అనుమతులు వస్తే 2.7 ఎకరాల్లో 4 నిర్మాణాలు చేస్తున్నాం. టూరిజం శాఖ తరఫున జీప్లస్ వన్ భవనాలు నిర్మిస్తున్నాం. ఇదీ మీ దిగజారుడు జర్నలిజం.. ప్రభుత్వం తరఫున ఎవరు ఎక్కడ ఉండాలో చెప్పడానికి మీరు ఎవరు?. వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్ కల్యాణ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఎల్లో మీడియా మొదటిపేజీలో రాస్తారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా నేను నిన్న వాస్తవాలు మాట్లాడితే ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇదీ మీ దిగజారుడు జర్నలిజం. హైకోర్టు అనుమతితోనే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు ఎన్జీటీకి వెళ్లారు.. సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మీరు సుప్రీంకోర్టు కంటే గొప్పవారు కాదు. పవన్, చంద్రబాబును విశాఖ ప్రజలు తరిమి కొడతారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చూసి ఓర్వలేక క్రైం సిటీగా భూతద్ధంలో చూపిస్తున్నారు. అప్పుడు హెరిటేజ్ ఐస్‌క్రీం తింటున్నావా పవన్.. రుషికొండ ఎదురుగా నారా లోకేశ్ తోడల్లుడు 40 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే పవన్, బాబుకు కనిపించదు. అప్పుడు పవన్ నోట్లో హెరిటేజ్ ఐస్‌క్రీం ఏమైనా పెట్టుకున్నాడా?. రియల్ ఎస్టేట్ లక్ష కోట్ల రాజధానిలో ధరలు పడిపోతాయని భయం అని ఎద్దేవా చేశారు. పవన్ ఊగిపోయి మాట్లాడుతున్నాడు. మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అవుతాడనేది అర్ధం అవుతోంది. మీరు ఎంత విషం చిమ్మినా విశాఖ రాజధాని ఆపడం ఎవరి తరం కాదు. రుషికొండలో నిర్మాణాలను ఆపలేరు.. అన్ని చట్టబద్దంగా జరుగుతున్నాయి’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్ ‘చిరుత’ -
రిషికొండ తవ్వకాలపై కమిటీ
సాక్షి, అమరావతి: రిషికొండ తవ్వకాలపై సర్వే నిమిత్తం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్) కొత్త కమిటీని నియమించింది. గతంలో కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్థానం కల్పించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈసారి కేవలం కేంద్ర ప్రభుత్వ అధికారులకు మాత్రమే స్థానం కల్పించింది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యనిర్వాహక ఇంజనీర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.వి.ఎస్.ఎస్.శర్మ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాస్త్రవేత్త డి.సౌమ్య, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ శాస్త్రవేత్త డాక్టర్ మాణిక్ మహాపాత్రలకు ఈ కమిటీలో స్థానం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ కోర్టుకు నివేదించారు. ఈ వివరాలతో ఆయన ఓ మెమోను కోర్టు ముందుంచారు. సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు ఎనిమిది వారాల గడువు మంజూరు చేయాలని కోరారు. అయితే హైకోర్టు నాలుగు వారాల గడువు మంజూరు చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. రిషికొండ తవ్వకాలపై ఏదైనా సమాచారాన్ని డీఎస్జీ ద్వారా కమిటీకి అందచేసేందుకు పిటిషనర్లకు హైకోర్టు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. -
కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులా?
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, రిషికొండ రిసార్ట్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల విషయంలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ (ఎంవోఈఎఫ్) ఏర్పాటు చేసిన కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు స్థానం కల్పించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఒకపక్క రిషికొండను విచక్షణారహితంగా తవ్వేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటుంటే, మరోపక్క అదే ప్రభుత్వానికి చెందిన అధికారులకు కమిటీలో స్థానం కల్పించడం ఏమిటని ప్రశ్నించింది. కమిటీలో వారికి స్థానం కల్పించే విషయాన్ని పునఃపరిశీలించాలని ఎంవోఈఎఫ్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే)జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖపట్నం జిల్లా యందాడ గ్రామంలోని సర్వే నంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇవ్వడంపై జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ గత ఏడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారించిన సీజే ధర్మాసనం.. రిషికొండ తవ్వకాలపై సర్వేచేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించింది. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు రావడంతో.. ధర్మాసనం ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కె.ఎస్.మూర్తి స్పందిస్తూ.. ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముగ్గురు అధికారులున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కమిటీ కూర్పుపై పునఃపరిశీలించాలని ఎంవోఈఎఫ్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఎన్జీటీ ఉన్నది సామాన్యుల కోసం
సాక్షి, న్యూఢిల్లీ: ‘జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉన్నది న్యాయస్థానాన్ని ఆశ్రయించలేని సామాన్యుల కోసం. చట్టసభ సభ్యులకు కాదు’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభ సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలు కూడా ఎన్జీటీ విచారణకు స్వీకరిస్తోందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎన్జీటీ ప్రొసీడింగ్స్ ప్రారంభించడంపై అసహనం వ్యక్తం చేసింది. విశాఖలోని రిషికొండ నిర్మాణాలపై ఎన్జీటీ ఇచ్చిన స్టే ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ కమిటీ, కోస్టల్ జోన్ అథారిటీ, అటవీ శాఖ అనుమతులు వచ్చిన తర్వాతే రిషికొండపై నిర్మాణాలు ప్రారంభించామన్నారు. ప్రతివాది రాసిన లేఖపై ఎన్జీటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎలాంటి ఉల్లంఘనలు చేయలేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ దాన్ని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పర్యావరణ అనుమతులు సరైనవా కాదా అనేది పరిశీలించడానికి మరో కమిటీని నియమించిందన్నారు. ఆ తర్వాత కూడా ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండానే నిర్మాణాలపై ఎన్జీటీ ఏకపక్షంగా స్టే విధించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయని, స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ప్రతులు అందలేదని, అధ్యయనం చేయడానికి సమయం కావాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది కోరడంతో బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. రిషికొండ నిర్మాణాలపై హైకోర్టులో తదుపరి విచారణ ఎప్పుడో చెప్పాలని ఏపీ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. -
సాగర తీరం.. సుందర దృశ్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌లలో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని పెంపొందించి పర్యాటకులకు సమున్నతమైన ఆహ్లాదాన్ని పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తద్వారా విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించేలా ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ సాధించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే విశాఖలోని రిషికొండ బీచ్ ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ పొంది అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకోగా.. అదే జాబితాలో మరిన్ని బీచ్‌లను చేర్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ 21 బీచ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి అందులో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు అనుగుణంగా అభివృద్ధి చేసే వీలుగా ఉన్న తొమ్మిదింటిని గుర్తించింది. బ్లూ ఫ్లాగ్ అంటే..? స్వచ్ఛమైన నీరు, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లలో పొందవచ్చు. డెన్మార్క్‌కు చెందిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్’ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్స్ ఇస్తోంది. ఈ సర్టిఫికెట్ పొందిన బీచ్‌లు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనవిగా భావిస్తారు. వాటిలో అంతర్జాతీయ గుర్తింపునకు చిహ్నంగా నీలం రంగు జెండాను ఎగురవేస్తారు. పర్యాటకుల భద్రత, కాలుష్యరహిత పరిసరాలు, సముద్ర నీటి నాణ్యత, తీరంలోని ఇసుక వంటి 33 అంశాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ లభిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీటిని బీచ్‌లో కలవకుండా ఉండాలి. బీచ్‌లో సహజ శిలలు కూడా ఉండకూడదు. అలా ఉంటే పర్యాటకులు స్నానాలు చేసే సమయంలో గాయపడే అవకాశం ఉంటుంది. ఎన్నో సౌకర్యాలు బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ రావాలంటే.. వాటిలో వ్యాయామశాల, క్రీడా ప్రాంగణాలు, సౌర విద్యుత్, పర్యావరణ విద్య, పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు, స్నానం చేయడానికి వీలుగా షవర్స్, బయో టాయిలెట్స్, గ్రే వాటర్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, తాగునీటి ఆర్వో ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. సముద్ర తీరాలను ఆ మేరకు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్(ఐసీజెడ్‌ఎం)కు బాధ్యతలు అప్పగించింది. ఇందులోని పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన బీచ్‌లను పరిశీలించి బ్లూ ఫ్లాగ్‌కు అనుగుణంగా వాటిని కేంద్రానికి సిఫారసు చేస్తారు. అనంతరం ప్రపంచ బ్యాంకు నిధులతో వాటిని అభివృద్ధి చేస్తారు. అనంతరం వాటిని కేంద్రం అంతర్జాతీయ జ్యూరీకి ప్రతిపాదిస్తే.. ప్రత్యేక బృందం వచ్చి పరిశీలిస్తుంది. అక్కడి పరిస్థితులు, సౌకర్యాలు ప్రమాణాల మేరకు ఉంటేనే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఎంపిక చేసిన బీచ్‌లు ఇవీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కోసం విశాఖపట్నం జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు, గుంటూరు జిల్లాలోని సూర్యలంక, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, చింతలమోరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం, మోళ్లపర్రు, కృష్ణా జిల్లాలోని మంగినపూడి, ప్రకాశం జిల్లాలోని రామాపురం, నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్‌ల సుందరీకరణకు ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి దశలో భాగంగా కేంద్ర బృందం ఈ బీచ్‌లలో పరిసరాలు, రవాణా సౌకర్యం, మౌలిక వసతులను పరిశీలించింది. రెండో దశలో రెండేసి బీచ్‌లలో నీటి నాణ్యతను పరీక్షించనున్నారు. ఇప్పటికే సూర్యలంక, రామాపురంలో ఈ ప్రక్రియ పూర్తయింది. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి.. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని బీచ్‌లను సుందరీకరిస్తున్నాం. బ్లూ ఫ్లాగ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్ర బృందం పరిశీలన చేపడుతోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ -
టూరిజం బోటింగ్ పునఃప్రారంభం
సాక్షి, విశాఖ: టూరిజం బోటింగ్ పున:ప్రారంభం అయింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండ, హార్బర్ వద్ద నిర్వహిస్తున్న టూరిజం బోటింగ్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం రుషికొండ బీచ్ వద్ద బోటింగ్‌ను పునఃప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. పర్యాటకులకు స్వర్గధామమైన విశాఖలోని రిషికొండలో నాలుగు పర్యాటక బోట్లను మంత్రి ప్రారంభించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. పర్యాటక బోట్ల నిర్వాహకులు నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. స్పీడ్, జెట్ స్కీ బోట్లు, లైఫ్ గార్డుల శిక్షణ, పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు, బీమా సౌకర్యంతో జల విహారాన్ని ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు నేటి నుంచి జల విహారం అందుబాటులోకి వచ్చింది. కాగా తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు పడవ ప్రమాదం తర్వాత బోట్ల రాకపోకలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. -
బీచ్‌లో యువకుడిని రక్షించిన లైఫ్‌గార్డులు
సాక్షి, విశాఖపట్టణం : రుషికొండ బీచ్‌లో ప్రమాదవశాత్తు మునిగిపోతున్న ఓ యువకుడిని అక్కడే ఉన్న లైఫ్‌గార్డులు రక్షించారు. అనంతరం అరిలోవ బీచ్ మొబైల్ వాహనం ద్వారా యువకుడిని గీతం ఆసుపత్రికి తరలించారు. యువకుడిని విజయనగరం జిల్లా కొత్త అగ్రహారానికి చెందిన జల్లెపల్లి జగదీష్గా గుర్తించారు. కాగా, బాధితుడు జగదీష్ సహా 25 మంది మెడికల్ దుకాణాల సిబ్బంది సరదాగా ఎంజాయ్ చేద్దామని మంగళవారం బీచ్‌కు రాగా, ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగింది. బాధితుడిన రక్షించిన వారిలో పోలీస్ కానిస్టేబుళ్లు వాసు, మధు లైఫ్‌గార్డులు అప్పన్న, రమేశ్, రాజేశ్, రాజ్‌కుమార్ బివిజి గార్డులు దుర్గ, ఎల్లాజిలు ఉన్నారు. -
రుషికొండ తీరంలో మృత్యుఘోష
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): సహజ అందాలకు నిలయమైన రుషికొండ తీరంలో మృత్యఘోష వినిపిస్తోంది. అమాయకులైన విద్యార్థులు, పర్యాటకులను రాకాసి అలలు కాటేస్తున్నాయి. పోలీసుల వైఫల్యం... అధికారులు నిర్లక్ష్యం కారణంగా గడిచిన ఆరేళ్లలో పది మంది దుర్మరణం పాలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో విహార యాత్రకై వచ్చి సముద్రంలోకి దిగి భీకర అలల తాకిడితో మృత్యు ఒడికి చేరుతున్నారు. సముద్రంలో స్నానాలు చేయరాదంటూ పోలీసులు నామమాత్రంగా హెచ్చరిస్తుండడం ప్రమదాలకు కారణమవుతోంది. ప్రమాదాల నివారణకు పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు శాశ్వత చర్యలు నేటికీ చేపట్టకపోవడం శోచనీయం. తాజాగా ఆదివారం సాయంత్రం ఇద్దరు విద్యార్థులను అలలు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం సముద్రంలోకి దిగి స్నానాలు చేస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు పవన్‌కుమార్, హరికుమార్, వంశీని రాకాసి అలలు లాగేయగా... వీరిలో వంశీని లైఫ్‌గార్డులు జి.రాజేష్, కె.రాజు, జి.రాజ్‌కుమార్, సీహెచ్.మురళీ సకాలంలో కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాకాసి అలలకు బలైపోయిన పవన్‌కుమార్ మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలిస్తున్నట్టు పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. హరికుమార్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన స్థలానికి ఆరిలోవ సీఐ తిరుపతిరావు చేరుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే 2012లో సాయిప్రియ రిస్సార్ట్స్ వెనుక తీరంలో గీతం వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. 2014లో ఆరిలోవకు చెందిన ఇద్దరు విద్యార్థులు మునిగిపోయారు. 2016లో ద్వారకానగర్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్న ముగ్గురు యువకులు స్నానాలు చేస్తూ భీకర అలలకు గురై గల్లంతయ్యారు. అనంతరం మూడు రోజుల తర్వాత వీరి మృతదేహాలు తీరానికి చేరాయి. ఇలా ఏడాదికి కనీసం ఇద్దరు లేక ముగ్గురి ప్రాణాలు పోతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూరని మృతుల తల్లిదండ్రులు, పర్యాటకులు విమర్శిస్తున్నారు. గతంలో నగర పోలీస్ కమిషనర్‌గా జె.పూర్ణచంద్రరావు ఉన్న సమయంలో ఇక్కడ హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం పోలీసులు, మెరైన్ పోలీసులు, మరోవైపు లైఫగార్డుల పర్యవేక్షణ ఉండేది. ముఖ్యంగా సముద్రంలో దిగి స్నానం చేసే పర్యాటకులను పరిశీలిస్తూ లైఫ్‌గార్డులు హెచ్చరించేవారు. అనంతరకాలంలో వారికి నెలనెలా జీతాలు చెల్లించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాగే ఆరిలోవ, పీఎంపాలెం పోలీస్ స్టేషన్ల నుంచి ఒక్క కానిస్టేబుల్ కూడా తీరంలో పహారా కాయడం లేదు. నామమాత్రంగా మెరైన్ పోలీస్‌లు ఒకరిద్దరు వాచ్ టవర్ వద్ద కాలక్షేపంగా కూర్చుంటున్నారు. తీరంలో స్నానాలు చేసే పర్యాటకులను హెచ్చరించేవారే లేకుండాపోయారు. ఈ కారణంగానే విహారయాత్రకని వచ్చి రుషికొండ తీరానికి బలైపోతున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లోకేశా.. ఇది లోకల్ ప్రేమేనా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఔత్సాహికులు ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి విదేశీ సంస్థలకే విలువైన భూములు ఇస్తోందన్న విమర్శలపై ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనలు, ట్విట్టర్ వేదికగా ఇస్తున్న సమాధానాలు మరింత వివాదంగా మారుతున్నాయి. ఐటీ రంగంలో విశాఖలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించే వారికి ఎర్ర తివాచీ వేస్తామని, ఆ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ పారిశ్రామికవేత్త శ్రీనుబాబు.. పల్సస్ కంపెనీ పెట్టేందుకు వస్తే ప్రభుత్వం భూములు కేటాయించిందని లోకేష్ ఆర్భాటంగా ప్రకటించారు. వాస్తవానికి పల్సస్ కంపెనీకి ఇప్పటికీ గజం భూమి కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కూడా పొందిన పల్సస్ సంస్థ ఐటీ రంగంలో మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తామని దరఖాస్తు చేసి రెండేళ్లయినా ఇంకా పరిశీలనలోనే ఉంది. ఐదు నుంచి పది ఎకరాల్లోపు కేటాయించగలమని, ఎకరం ధర రూ.3 కోట్ల మేర ఉంటుందని సదరు పల్సస్ సంస్థకు సర్కారు చెబుతూ వస్తోంది. అయితే ఇప్పటికీ కేటాయింపుపై స్పష్టత లేకపోగా, నారా లోకేష్ మాత్రం పల్సస్ సంస్థకు కేటాయించేశామని చెప్పడం గమనార్హం. ఇదే విషయం ఇప్పుడు ఐటీరంగంలో చర్చనీయాంశమైంది. ప్రాంక్లిన్ టెంపుల్టన్కు అడ్డగోలు కేటాయింపులు ప్రాంక్లిన్ టెంపుల్టన్కు భూముల కేటాయింపులపై విమర్శలకు సమాధానంగానే లోకేష్ పల్సస్ ప్రస్తావన తెచ్చి.. మరిన్ని విమర్శలకు తావిచ్చారు. రూ.450 కోట్ల పెట్టుబడి పెట్టే టెంపుల్టన్ రెండువేల ఉద్యోగాలు కల్పిస్తుందని లోకేష్ చెప్పారు. అందుకే 40 ఎకరాల భూములు కట్టబెట్టామని పేర్కొన్నారు. కానీ వాస్తవానికి టెంపుల్టన్ 25 ఎకరాలే కోరితే.. అత్యంత ఉదారంగా 40ఎకరాలు కేటాయించడంపై ఇప్పటికీ వివాదం చెలరేగుతోంది. తొలుత మల్టీనేషనల్ కంపెనీ టెంపుల్టన్, దేశీయ సంస్థ ఇన్నోవా సొల్యూషన్స్‌కు కలిపి 40 ఎకరాలు కేటాయిస్తున్నట్టు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెండు సంస్థలు సంయుక్తంగా భూమిని అడగడంపై వివాదంతో పాటు.. ఇన్నోవా సొల్యూషన్స్ సంస్థ బాధ్యుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని బయటకు రావడంతో సర్కారు వెనక్కి తగ్గి జీవోలో మార్పులు చేసింది. ఇన్నోవా సొల్యూషన్స్‌ను తప్పించి మొత్తం 40ఎకరాలూ టెంపుల్టన్‌కే కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చింది. ఎకరానికి 40 రూ.లక్షలు చొప్పున రిషికొండలోని ఐటీ హిల్స్‌లో భూమి కేటాయిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ కేటాయింపుల్లోనూ అక్రమాలు దాగున్నాయి. 40 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నా..రెండున్నరవేల ఉద్యోగాలేనా? ఐటీ నిబంధనల ప్రకారం.. భూములు తీసుకున్న కంపెనీలు ఎకరానికి 500మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఆ మేరకు టెంపుల్టన్ 40ఎకరాలకు గానూ 20వేల మందికి ఉద్యోగాలివ్వాలి. కానీ లోకేష్ మాత్రం టెంపుల్టన్ కంపెనీ 2500 ఉద్యోగాలిస్తుందని గొప్పగా చెప్పారు. 20వేలమందికి ఇవ్వాల్సిన కంపెనీ 2,500మందికి ఇస్తామంటే సదరు మంత్రి ఘనంగా ప్రకటించడం విమర్శలపాలవుతోంది. మరోవైపు 3వేల ఉద్యోగాలు కచ్చితంగా కల్పిస్తామని చెబుతున్న శ్రీకాకుళం యువ పారిశ్రామికవేత్తకు చెందిన పల్సస్ కంపెనీకి ఐదు నుంచి పది ఎకరాల్లోపే ఇస్తామని చెబుతున్నా.. ఇంకా సాగదీస్తుండటం గమనార్హం. ఇక విదేశీ సంస్థ అయిన టెంపుల్టన్కు రిషికొండ ఐటీ హిల్స్‌లో ప్రైమ్ లొకేషన్లో ఎకరం రూ.40 లక్షలకు కట్టబెట్టిన సర్కారు.. పల్సస్‌కు మాత్రం ఎకరం రూ. 3కోట్ల ధర చెబుతోంది. ఇప్పుడు ఇదే విషయం ఐటీ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఇప్పటివరకు స్థానికులకు ఒక్కరికి కూడా భూములు కేటాయించకపోవడం కూడా చర్చకు తెరలేపింది. విశాఖ నగరానికే చెందిన 12మంది ఐటీ ప్రతినిధులు భూముల కోసం దరఖాస్తు చేసుకోగా, టీడీపీ సర్కారు కొలువుదీరిన నాలుగేళ్లలో ఒక్క దరఖాస్తుకు కూడా మోక్షం కలగలేదు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే లోకేష్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రకటనలు చేయడం నవ్వులపాలవుతోంది. -
రుషికొండ తీరంలో బ్లూ రింగ్ యాంగిల్ ఫిష్
సాగర్‌నగర్(విశాఖ తూర్పు) : ప్రకృతి సహజ అందాలకు నిలయమైన రుషికొండ సముద్ర తీరంలో శనివారం అరుదై న, అందమైన బ్లూ రింగ్ యాంగిల్ ఫిష్ మత్స్యకారులకు చి క్కింది. సాధారణంగా విదేశీ సముద్ర తీరాల్లో సముద్ర మట్టానికి వంద మీటర్లు లోతులో నాచురాళ్లు మధ్య విహరిం చే అందమైన ఈ చేప వాడపాలెం వాడబలిచి మత్స్యకారుల వలకు చిక్కింది. వారి వేటలో భాగంగా పడిన చేపల్లో బ్లూరింగ్ యాంగిల్ ఫిష్ ఆకర్షణీయంగా కన్పించడంతో స్థానిక మత్స్యకారులు, పర్యాటకులు వింతగా తిలకించారు. సాధారణంగా ఇక్కడి రేవులకు ఈ తరహా చేపలు రావు. చేప శరీరమంతా తాబేలు ఆకారంలో ఉంది. దీని తోక తెల్లగా అందంగా కన్పిస్తోంది. శరీరంపై బ్లూ కలర్ చారలతో ఆకర్షణీయంగా, వింతగా కనిపిస్తోంది. పెద్ద కళ్లు కలిగిన చేప వలకు చిక్కిన వెంటనే చనిపోయిందని మత్స్యకారులు తెలిపారు. ఈ తరహా చేపలు విశాఖ తీరానికి రావడం చాలా అరుదని, ఎక్కువగా విదేశీ రేవుల్లో లభిస్తాయని మత్స్యకార శాఖ అధికారిణి విజయ తెలిపారు. -
కబళించిన కడలి
► మరో ఇద్దరిని మింగేసిన కెరటాలు ► రుషికొండ వద్ద మళ్లీ విషాదం ► మృతులు హైదరాబాదీలు అలల నవ్వులతో అందంగా కనిపించే కడలి మళ్లీ పంజా విసిరింది. కెరటాల మాటున దాగిన మృత్యువు మరో ఇద్దరు యువకుల ప్రాణాలను మింగేసింది. సంద్రాన్ని చూసి ఉప్పొంగిన సంతోషంతో స్నానానికి వెళ్లిన వారిని ఆపద అమాంతం కబళించింది. ఆదివారం నాడు అందమైన రుషికొండ తీరంలో అలలతో ఆటలాడుదామనుకుంటే.. జీవితమే అర్థాంతరంగా ముగిసిపోయింది. హైదరాబాద్ నుంచి పని కోసం వచ్చి.. సెలవు రోజున సరదాగా గడుపుదామ నుకుంటే.. శాశ్వత విషాదం సంప్రాప్తమైంది. ఆరుగురు యువకులబృందంలో నలుగురు మత్స్యకారుల తెగువతో కెరటాల కాటు నుంచి బయటపడగా, ఇద్దరికి మాత్రం ఆపాటి అదృష్టం లేకుండా పోయింది. వారి కుటుంబ సభ్యుల జీవితాల్లో శోక సంద్రం ఉప్పొంగిపోయింది. సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) : రాకాసి అలలకు ఇద్దరు యువకులు బలైపోయారు. ఉపాధి కోసం హైదరాబాద్ నుంచి విశాఖ నగరానికి వచ్చిన రాహుల్ ఉపాధ్యాయ(33), నావల్పాండ్య (25) కెరటాలకు చిక్కి విగతజీవులయ్యారు. సరదాగా తీరంలో స్నానం చేసేందుకు వెళ్లిన ఆరుగురిలో ఐదుగురు తీరంలో గల్లంతవగా... ఒడ్డునే ఉన్న స్నేహితుడి సమాచారంతో స్థానిక మత్స్యకారులు ముగ్గురిని సురక్షితంగా రక్షించగలిగారు. వారంతా ప్రస్తుతం గీతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరూ విగత జీవులయ్యారు. వీరిలో నావల్ పాండ్య అనే యువకుడిని కొన ఊపిరితోనే ఒడ్డుకు చేర్చామని... ఆ క్షణంలో వైద్యం అందితే బతికేవాడని మత్స్యకార యువకులు ఆర్.పెదకొండ, టి.సతీష్, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖకు చెందిన యూషఫ్, హైదరాబాద్‌కు చెందిన అక్బర్, హుస్సేన్, మోహిజ్, రాహుల్ ఉపాధ్యాయ, నావల్ పాండ్య డైమాండ్ పార్కు సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన కరాచీ బేకరీలో పనిచేస్తున్నారు. వీరంతా కరాచీ బేకరీ రీ మోడలింగ్ చేస్తూ మురుళీనగర్లో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం 6.30 గంటలకు రుషికొండ బీచ్‌కు చేరుకున్నారు. సాయిప్రియ రెసిడెన్సీ వెనుక తీరంలో ఐదుగురు సముద్రంలో దిగి స్నానాలు చేస్తుండగా ఉధృతమైన అలలకు వారంతా గల్లంతయ్యారు. వెంటనే ఒడ్డున ఉన్న యూషఫ్ మెరైన్ టవర్ వద్ద ఉన్న మత్స్యకార యువకులకు సమాచారం అందించాడు. దాంతో ఆర్.పెదకొండ, టి.సతీష్, ఎద్దిపల్లి అప్పన్న, గద్దిపల్లి దుర్గ పరిగెత్తుకుంటూ వచ్చి మునిగిపోతున్న అక్బర్, హుస్సేన్, మోహిజ్‌లను రక్షించారు. అప్పటికే కనిపించకుండా పోయిన వారిలో నావల్ పాండ్యను కొన ఊపిరితో ఒడ్డుకు చేర్చినా ప్రయోజనం లేకపోయింది. మరోవైపు రాహుల్ ఉపాధ్యాయ చనిపోయి తేలడంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం తెల్లవారుజామునే జరగడంతో ఆ సమయంలో లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో మత్స్యకార యువకులే ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. ఆరిలోవ సీఐ సీహెచ్ తిరుపతిరావు, ఎస్ఐ సంతోష్, పీఎం పాలెం ఎస్ఐ కె.శ్యామ్‌సుందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. డేంజరస్ జోన్ రుషికొండ తీరం, సాయిప్రియ రెసిడెన్సీ వెనుక ప్రాంతాలు రిప్ కరెంట్ జోన్ (భయంకరమైన కెరటాలు వచ్చే జోన్)గా ప్రకటించినా సందర్శకులు వెనక్కు తగ్గడం లేదు. ఈ ప్రాంతంలో ఈత కొట్టడం ప్రమాదకరమని తెలిసినా స్నానాలకు దిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పహారా కాసే లైఫ్ గార్డులు, పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు రుషికొండ తీరంలో ఎక్కడా జీవీఎంసీ గాని, పోలీసులు గాని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు హుద్‌హుద్ తుఫాన్ సమయంలో కూలిపోయాయి. వాటి స్థానంలో మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయలేదు. దీంతో ఈ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని సందర్శకులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్, నవీన్ మంచి స్నేహితులు హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన రాహుల్ ఉపాధ్యాయ, నావల్ పాండ్య మంచి స్నేహితులు. వీరిద్దరూ కరాచీ బేకరీ రీ మేకింగ్ కోసం రెండేళ్ల కిందట విశాఖపట్నం వచ్చారు. ప్రతీ వారం రుషికొండ బీచ్‌కు వస్తుంటాం. ఈ వారం ఇలా జరిగింది. ఎంతో హుషారుగా అందరితో కలిసిపోయేవారు. వీరిలో నవీన్‌కు ఏడాది కిందటే వివాహం జరిగింది. – లోకేష్, కరాచీ బేకరీ ఉద్యోగి కళ్లెదుటే జరిగిపోయింది ఐదుగురు లోపలకు దిగి స్నానాలు చేస్తుండగా రాహుల్, నావల్ ఒక్కసారిగా కన్పించలేదు. మిగిలిన అక్బర్, హుస్సేన్, మోహిజ్ కంగారుపడిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించి వెంటనే మెరైన్ టవర్ వద్ద ఉన్న మత్స్యకారులను రక్షించమని వేడుకున్నాను. వారు ప్రయత్నించి ముగ్గురిని ప్రాణాలతో రక్షించారు. కొన ఊపిరితో నావల్ పాండ్యను ఒడ్డుకు చేర్చినా ఫలితం లేకపోయింది. –యూషఫ్, మృతుల సహ ఉద్యోగి వెళ్లొద్దని చెప్పినా వినలేదు స్నానాలు చేయడానికి ఆ తీరం వైపు వెళ్లవద్దని యువకులకు చెప్పినా వారు వినలేదు. సముద్రంలోకి దిగి కెరటాలు కబళిస్తుంటే వారిలో ఒకరు పరుగున వచ్చి రక్షించమని అడిగారు. వెంటనే వెళ్లి సాధ్యమైనంతవరకు ముగ్గురిని రక్షించాం. మిగితా ఇద్దరినీ రక్షించలేకపోయాం. – టి.సతీష్, రుషికొండ, మత్స్యకార యువకుడు