పవన్‌, చంద్రబాబును విశాఖ ప్రజలు తరిమి కొడతారు: మంత్రి రోజా | Minister RK Roja Key Comments On Visakhapatnam | Sakshi
Sakshi News home page

పవన్‌, చంద్రబాబును విశాఖ ప్రజలు తరిమి కొడతారు: మంత్రి రోజా

Aug 13 2023 6:41 PM | Updated on Aug 13 2023 6:54 PM

Minister RK Roja Key Comments On Visakhapatnam - Sakshi

సాక్షి, తిరుపతి: ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు నిజాలను ప్రజలకు చెప్పలేదు అంటూ మంత్రి రోజా సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. విశాఖ అభివృద్ధి చెందకూడదనే కడుపుమంటతో ఈనాడు విషపు రాతలు రాస్తోందని రోజా ఆరోపించారు. 

కాగా, రుషికొండ వద్ద నిర్మాణాలపై మంత్రి రోజా మరోసారి స్పష్టీకరణ చేశారు. ఈ క్రమంలో మంత్రి రోజా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని నిన్ననే వివరణ ఇచ్చాను. ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ప్రజలకు నిజాలను చెప్పలేదు. రుషికొండలో పర్యాటకశాఖకు ఉన్న 69 ఎకరాల్లో 9.17 ఎకరాల్లో అనుమతులు వస్తే 2.7 ఎకరాల్లో 4 నిర్మాణాలు చేస్తున్నాం. టూరిజం శాఖ తరఫున జీప్లస్‌ వన్‌ భవనాలు నిర్మిస్తున్నాం. 

ఇదీ మీ దిగజారుడు జర్నలిజం..
ప్రభుత్వం తరఫున ఎవరు ఎక్కడ ఉండాలో చెప్పడానికి మీరు ఎవరు?. వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్‌ కల్యాణ్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఎల్లో మీడియా మొదటిపేజీలో రాస్తారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా నేను నిన్న వాస్తవాలు మాట్లాడితే ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇదీ మీ దిగజారుడు జర్నలిజం. హైకోర్టు అనుమతితోనే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. మీరు ఎన్జీటీకి వెళ్లారు.. సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. మీరు సుప్రీంకోర్టు కంటే గొప్పవారు కాదు. పవన్‌, చంద్రబాబును విశాఖ ప్రజలు తరిమి కొడతారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చూసి ఓర్వలేక క్రైం సిటీగా భూతద్ధంలో చూపిస్తున్నారు. 

అప్పుడు హెరిటేజ్‌ ఐస్‌క్రీం తింటున్నావా పవన్‌..
రుషికొండ ఎదురుగా నారా లోకేశ్‌ తోడల్లుడు 40 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే పవన్‌, బాబుకు కనిపించదు. అప్పుడు పవన్‌ నోట్లో హెరిటేజ్‌ ఐస్‌క్రీం ఏమైనా పెట్టుకున్నాడా?. రియల్‌ ఎస్టేట్‌ లక్ష కోట్ల రాజధానిలో ధరలు పడిపోతాయని భయం అని ఎద్దేవా చేశారు. పవన్‌ ఊగిపోయి మాట్లాడుతున్నాడు. మెంటల్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అవుతాడనేది అర్ధం అవుతోంది. మీరు ఎంత విషం చిమ్మినా విశాఖ రాజధాని ఆపడం ఎవరి తరం కాదు. రుషికొండలో నిర్మాణాలను ఆపలేరు.. అన్ని చట్టబద్దంగా జరుగుతున్నాయి’ అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్ ‘చిరుత’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement