మాకు అంత కర్మ పట్టలేదు: మంత్రి రోజా | Minister RK Roja Comments On Chandrababu And Pawan | Sakshi
Sakshi News home page

మాకు అంత కర్మ పట్టలేదు: మంత్రి రోజా

Published Fri, Jan 12 2024 3:14 PM | Last Updated on Fri, Jan 12 2024 4:33 PM

Minister Roja Comments On Chandrababu And Pawan - Sakshi

సాక్షి, విజయవాడ: డబ్బులకు సీట్లు అమ్ముకోవాల్సిన కర్మ తమకు పట్టలేదని.. చంద్రబాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయి మాట్లాడుతున్నారంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. కుప్పంలో గెలవలేనని చంద్రబాబు రెండో స్థానం వెతుక్కుంటున్నాడని, ఎన్నికల్లో నిలబెట్టడానికి ఆయనకు అభ్యర్థులు దొరకడం లేదంటూ ఆమె ఎద్దేవా చేశారు.

విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రంలో నేషనల్‌ యూత్‌ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న మంత్రి రోజా..  అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకేష్‌పై సెటైర్లు వేశారు. మందలో ఒకరిగా ఉండకూడదని, మందలో ఒకరిగా ఉంటే మందలగిరి మొద్దులా ఉంటారంటూ మంత్రి చురకలు అంటించారు.

‘‘రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఉంది చంద్రబాబు వైఖరి. డబ్బులకు టికెట్లను అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు. సర్వేల తరువాత అభ్యర్థుల మార్పు జరిగింది. సంక్రాంతి లోపు టికెట్లు ప్రకటిస్తానన్న చంద్రబాబు.. ఎందుకు చేయలేదు? అభ్యర్థులు లేకే ఆయన పొత్తులు పెట్టుకొని వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా రెండు చోట్ల పోటీకి సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలతో  కలిసి చంద్రబాబు వచ్చినా  సీఎం జగన్‌ను ఏమి చేయలేరు. ఏపీలో లేని నాయకులంతా ఏకమై వస్తున్నారు. పవన్‌ను ప్రజలు రెండు చోట్ల ఓడించినప్పుడే పవన్ పరిస్థితి అర్థమయ్యింది’’ అని పేర్కొన్నారు.

‘‘వెన్నుపోటు రాజకీయం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. బీజేపీతో కలిసి పోటీ చేయనని చెప్పి 2014లో పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు పొద్దున్నే జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో ఉంటాడు. సొంత జెండా ఎజెండా చంద్రబాబుకు ఉందా?’’ అంటూ మంత్రి రోజా  ప్రశ్నించారు.

ఇదీ చదవండి: లోకేష్‌, చంద్రబాబుపై కేశినేని నాని ఆసక్తికర కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement