సాక్షి, తిరుపతి: విశాఖను పాలనారాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు విషం చిమ్ముతున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తాజాగా విశాఖలో పవన్ పర్యటించడం, రుషికొండలో ఓవరాక్షన్ తదితరాలపై శనివారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు.
రుషికొండపై నిర్మాణాలు చేపట్టడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు నిబంధనలకు లోబడి నిర్మాణాలు కొనసాగిస్తున్నాం. పైగా నిర్ణీత విస్తీర్ణంలో కంటే తక్కువలోనే కట్టడాలు నిర్మిస్తున్నాం. 69 ఎకరాలు టూరిజం 9 ఎకరాల్లో నిర్మాణాలు, 159 చెట్లు తొలగించాము, 13 వేల చెట్లు నాటాం. అయినా పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి కట్టాడాలు కడుతుంటే ఎందుకు అంత బాధ?. కోర్టుల కంటే పవన్ గొప్పా?. పైగా కొండలపై ఏం కట్టొద్దని పవన్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండల మీద ఉన్నాయ్ కదా. అసలు రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పలేకపోయారు. బోడి వెధవలు.. బోడి ప్రచారం చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని మంత్రి రోజా అన్నారు.
సీఎం జగన్ గురించి ఎందుకు?
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్లపైనా పవన్ చేసిన కామెంట్లకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌కు ఏపీలో ఇల్లు ముందు నుంచే ఉంది. ఆయన తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. పవన్ చంద్రబాబుకు బానిస. బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేస్తుంటాడు. ఈ ఇద్దరికీ ఏపీలో కనీసం ఇల్లు లేనే లేదు అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. సీఎం జగన్ సంక్షేమాలు దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అసలు జగన్ గురించి మాట్లాడే అర్హత ఏం ఉంది? అని పవన్‌ను ప్రశ్నించారామె.
చంద్రబాబుది అవినీతి..
నిలదీయాలనుకుంటే చంద్రబాబు అవినీతి గురించి నిలదీయమని పవన్‌ను ఉద్దేశించి మంత్రి రోజా వ్యాఖ్యానించారు. కరకట్ట చంద్ర బాబు అక్రమ నిర్మాణం గురించి ఎందుకు మాట్లాడరు. మొత్తం187.58 కోట్లు మాజీ సీఎం చంద్రబాబు ఖర్చు చేస్తే పవన్ కల్యాణ్ నోరు మెదపలేదు. గీతం కబ్జాలు పవన్‌కు కనబడడం లేదా?. దమ్ము ధైర్యం ఉంటే.. ఈ విషయంలో పశ్నించాలని పవన్‌కు సవాల్ విసిరారు మంత్రి రోజా.
నువ్వొక ప్రతిపక్ష నేతవా?
పవర్‌స్టార్ కాదు.. ప్యాకేజీ స్టార్. నువ్వు.. చంద్రబాబు పనికిమాలిన పార్టీలకు అధ్యక్షులు. ఒక్క ఎమ్మెల్యే లేడు నువ్వేం ప్రతిపక్ష నేతవి. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. పక్క పార్టీ జెండాలు మోసే సంస్కృతి మీది. నిన్ను పవన్ కల్యాణ్ అనాలా.. పనికిమాలిన కళ్యాణ్ అనాలా అర్థం కావడం లేదు. ఆటలో అరటి పండు లాంటి వాడివి.. నువ్వు ప్యాకేజీ పడినప్పుడు ఒక వింత జీవిలా ప్రవర్తిస్తున్నావు. వాలంటీర్‌లపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తొలగించిన వాలంటీర్ హత్య చేస్తే.. బోడి గుండుకు మోకాలికి లింకు వేయడమేనా? అని పవన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైజాగ్ అభివృద్ధి ఓర్వలేకే..
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విశాఖను క్రైమ్ సిటీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని రాకూడదనే కుట్రతో ముందుకెళ్తున్నారు. టీడీపీ విశాఖలో కబ్జా చేసిన 450 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సీఎం జగనన్న విశాఖకు అదానీ డేటా సెంటర్ తెచ్చారు. ఆరు వేల కోట్లతో బీచ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. వెనుక బడిన ఉత్తరాంద్ర అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేస్తుంటే ఒర్వ లేక కుట్ర చేస్తున్నారు అని మంత్రి రోజా ప్రతిపక్షాల కుట్రకు ఏకేశారు.
Comments
Please login to add a commentAdd a comment