
చిన్న చిన్న కష్టాలకే చాలామంది దిగాలుగా జీవనం సాగిస్తుంటారు. అలాంటి వారందరూ ఒక్కసారి ఫొటోలో కనిపిస్తున్న ఈ చేపను చూస్తే, మీరు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. చివరి నిమిషం వరకు ప్రయత్నించాలి అని ఈ చేప బాగా నమ్మినట్లు ఉంది. అందుకే, సముద్రం నుంచి చేపల వలలో చిక్కినా; ఫిషింగ్ మార్కెట్‌కు తరలించినా; ఆఖరుకు తన శరీరంలోని సగభాగాన్ని కత్తిరించినా ఈ చేప తన జీవన పోరాటాన్ని సాగిస్తూనే ఉంది.
తోకతో పాటు తన శరీరంలో సగభాగం కోల్పోయినా, అది కుళ్లిపోయినా ఈ చేప సుమారు ఆరు నెలల పాటు సజీవంగానే ఉంది. ఇటీవలే థాయ్‌లాండ్ చేపల బజారులో కనిపించిన ఈ చేపను వాచారా చోటె అనే వ్యక్తి కొనుగోలు చేశాడు.
చేప ఆత్మవిశ్వాసాన్ని మెచ్చి, దానికి ‘ఐ హాఫ్’ అని పేరు పెట్టి, జాగ్రత్తగా ఈ చేపను పెంచుకుంటున్నాడు. ‘ప్రస్తుతం దానికి తగిన చికిత్స అందిస్తున్నాను. ఒకవేళ చేప మరణిస్తే, దానికి పూర్తి గౌరవ మర్యాదలతోనే అంత్యక్రియలు నిర్వర్తిస్తాను’ అని చోటె చెప్పాడు.
(చదవండి: శత్రువుని భయపెట్టబోయి భంగపడటం అంటే ఇదే..! ఇరాన్ అత్యుత్సాహం..)
Comments
Please login to add a commentAdd a comment