![Whale attack on Boat New Hampshire Coast Video Goes Viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/24/whale-Boat.jpg.webp?itok=lpTZNG-3)
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ హార్బర్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భారీ తిమింగలం చిన్న బోటు మీదికి ఉన్నట్టుండి లంఘించింది. దీంతో నడి సముద్రంలో బోటు దాదాపు బోల్తా కొట్టడంతో అందులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చివరికి ఏమైంది? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
కోలిన్, వ్యాట్ యాగర్ అనే ఇద్దరు సోదరులకు తమ తొలి ఫిషింగ్ ట్రిప్‌లోనే భయకరమైన అనుభవం ఎదురైంది. వీరు మంగళవారం ఉదయం న్యూ హాంప్‌షైర్ తీరంలో 23 అడుగు పొడవున్న ఓ బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. తీరా బోటు సముద్రంలోకి వెళ్లాక వారికి సమీపంలో ఒక భారీ తిమింగలం దర్శనమిచ్చింది. అది బోటు దగ్గరకు వచ్చీ రావడంతోనే బోట్‌పై ఎటాక్ చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించింది. దీంతో నడి సంద్రంలో బోటు అతలాకుతలమై పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరూ సముద్రంలోకి దూకేశారు. సముద్రంలో చుట్టు పక్కల బోట్లలో ఉన్నవారు వారిని కాపాడారు.
Whale lands on boat 😮😱 pic.twitter.com/eIJPIsB8YO
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 24, 2024
ఉత్తర న్యూ ఇంగ్లండ్ కమాండ్ సెంటర్‌కు రెండుసార్లు మేడే సిగ్నల్ అందిందని యుఎస్ కోస్ట్ గార్డ్‌లోని ఒక అధికారి చెప్పారు. న్యూహంప్‌షైర్ కోస్ట్‌లోభారీ తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయనీ, కానీ ఇలా ఎపుడూ దాడికి దిగలేదని అన్నారు. తిమింగలానికి సైతం ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ఆ బోటుకు సమీపంలో ఉన్న మరో బోటు నుంచి ఎలియట్, మైనే సోదరులు దీనికి సంబంధించిన వీడియో తీశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment