New Hampshire
-
Latha Mangipudi: హ్యారిస్ గెలిచి మహిళాశక్తిని గెలిపిస్తుంది
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహ్యారిస్ గెలుస్తుంది. ఆమె గెలుపు మహిళాశక్తిని నిరూపిస్తుంది’ అంటున్నారు లత మంగిపూడి. అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌కు డెమోక్రటిక్ పార్టీ లెజిస్లేటర్‌గా ఉన్న లత ప్రస్తుతం కమలా హ్యారిస్ గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అమెరికా మహిళల గురించి స్త్రీలకు ఉండాల్సిన దృక్పథం గురించి ఆమె తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.‘ఒక విధంగా చె΄్పాలంటే అమెరికాలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. అమెరికన్స్ మరోసారి ట్రంప్ నియంతృత్వ పాలనను అంగీకరించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. కమలా హ్యారిస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. అందుకే ‘సేవ్ అవర్ డెమోక్రసీ’ అనే నినాదం తో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. కమలా హ్యారిస్ అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు లత మంగిపూడి. మైసూరుకు చెందిన లత రాజమండ్రికి చెందిన కృష్ణ మంగిపూడిని వివాహం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యారు. 1985లో యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అనంతరం యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ న్యూహ్యాంప్‌షైర్ చాప్టర్‌కు 2006 నుంచి 2013 వరకు చైర్పర్సన్ గా కొనసాగారు. అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి అధ్యక్షుడు ఒబామా, హిల్లరి క్లింటన్ వంటి ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత 2013 నుంచి ఇప్పటివరకు నాషువా నుంచి లెజిస్లేటర్‌గా గెలు΄÷ందుతూనే ఉన్నారు. కమలాహ్యారిస్ గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తూ పర్యటనలు చేస్తున్నారు.స్త్రీల హక్కులకు విఘాతం‘ప్రపంచంలో ఏ మహిళకైనా తన శరీరంపై తనకు పూర్తి హక్కు ఉండాలి. ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకొనే అవకాశం ఉండాలి కదా. కానీ అమెరికాలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యం గా పిల్లల్ని కనాలా, వద్దా అనే అత్యంత కీలకమైన అంశంపైన మహిళలు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గర్భం దాల్చిన తరువాత తప్పనిసరిగా బిడ్డను కనాల్సిందే. కానీ బిడ్డను కనేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యరీత్యా సంసిద్ధంగా ఉండాలి. ఇది బిడ్డను కనాల్సిన తల్లి, డాక్టర్ నిర్ణయించవలసిన విషయం. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. కానీ బలవంతంగానైనా పిల్లలను కనాల్సిందేననడం సరి కాదు. అత్యాచారానికి గురైన వారు, లైంగిక దాడుల వల్ల గర్భవతులైన వాళ్లు కూడా బిడ్డల్ని కనాలంటే ఎలా? అమెరికా మహిళలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై డెమోక్రటిక్ పార్టీ స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. మా పార్టీ గెలిస్తేనే మహిళల హక్కులకు రక్షణ లభిస్తుంది’ అన్నారామె.ఇంకా వివక్షేనా....‘విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు లభించడం లేదు. స్త్రీలు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నారు. చివరకు కొన్నిచోట్ల ఓటుహక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకొనే వాతావరణానికి రిపబ్లికన్ పార్టీ విఘాతం కలిగిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఓటుహక్కును ΄÷ందిన వాళ్లు, ఇమ్మిగ్రెంట్స్, కొన్నిచోట్ల మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం లేదు. ఆ పార్టీ మరోసారి గెలిస్తే ఓటుహక్కు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈసారి మహిళా గెలుపు ప్రజాస్వామిక గెలుపు’ అని ముగించారామె.– పగిడిపాల ఆంజనేయులుసాక్షి, హైదరాబాద్ -
తిమింగలానికి కోపమొస్తే.. చుక్కలే! ఈ వైరల్ వీడియో చూడండి!
అమెరికాలోని న్యూహాంప్‌షైర్ హార్బర్ సమీపంలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక భారీ తిమింగలం చిన్న బోటు మీదికి ఉన్నట్టుండి లంఘించింది. దీంతో నడి సముద్రంలో బోటు దాదాపు బోల్తా కొట్టడంతో అందులో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చివరికి ఏమైంది? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.కోలిన్, వ్యాట్ యాగర్ అనే ఇద్దరు సోదరులకు తమ తొలి ఫిషింగ్ ట్రిప్‌లోనే భయకరమైన అనుభవం ఎదురైంది. వీరు మంగళవారం ఉదయం న్యూ హాంప్‌షైర్ తీరంలో 23 అడుగు పొడవున్న ఓ బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. తీరా బోటు సముద్రంలోకి వెళ్లాక వారికి సమీపంలో ఒక భారీ తిమింగలం దర్శనమిచ్చింది. అది బోటు దగ్గరకు వచ్చీ రావడంతోనే బోట్‌పై ఎటాక్ చేసింది. ఒక్కసారిగా గాల్లోకి లేచి బోటుపై ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించింది. దీంతో నడి సంద్రంలో బోటు అతలాకుతలమై పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఇద్దరూ సముద్రంలోకి దూకేశారు. సముద్రంలో చుట్టు పక్కల బోట్లలో ఉన్నవారు వారిని కాపాడారు.Whale lands on boat 😮😱 pic.twitter.com/eIJPIsB8YO— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 24, 2024 ఉత్తర న్యూ ఇంగ్లండ్ కమాండ్ సెంటర్‌కు రెండుసార్లు మేడే సిగ్నల్ అందిందని యుఎస్ కోస్ట్ గార్డ్‌లోని ఒక అధికారి చెప్పారు. న్యూహంప్షైర్ కోస్ట్లోభారీ తిమింగలాలు కనిపిస్తూ ఉంటాయనీ, కానీ ఇలా ఎపుడూ దాడికి దిగలేదని అన్నారు. తిమింగలానికి సైతం ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. అయితే ఆ బోటుకు సమీపంలో ఉన్న మరో బోటు నుంచి ఎలియట్, మైనే సోదరులు దీనికి సంబంధించిన వీడియో తీశారు. ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
US presidential election 2024: ప్రైమరీలో ట్రంప్‌కు మరో గెలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెల్చిన ఆయన బుధవారం న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలోనూ నెగ్గారు. అయితే భారతీయ అమెరికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆయనకు గట్టిపోటీ ఇచ్చారు. ట్రంప్‌కు 55 శాతానికి పైగా ఓట్లు రాగా ఆమె 44 శాతం సాధించారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీని మూడుసార్లు గెలిచిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ అభ్యర్థిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ట్రంప్కిస్తే గెలుపు బైడెన్‌దే: హేలీ తాజా ఫలితాలపై నిక్కీ హేలీ మాట్లాడారు. ‘హ్యాంప్‌షైర్‌లో గెల్చిన ట్రంప్‌కు శుభాకాంక్షలు. అయినా ఇంకా డజన్ల కొద్దీ రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరగాల్సే ఉంది. పార్టీ ఓటర్ల అంతిమ తీర్పు వెలువడటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ పోటీలో నేను చిట్టచివరిదాకా పోరా డతా. రేస్‌లో కొనసాగుతా. ఈ పోరు మొదలైనప్పుడు రేసులో మొత్తం 14 మంది ఉండేవాళ్లం. నాకు రెండు శాతం ఓట్లు వచ్చేవి. ఇప్పుడు ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నది నేను మాత్రమే’ అని హేలీ ప్రసంగించారు. ‘‘ట్రంప్‌కు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. ట్రంప్‌ను అయి తే తేలిగ్గా ఓడించవచ్చని వారి ఆశ. నిజంగా ట్రంప్‌కు అభ్యర్థిత్వం దక్కి తే బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయం తథ్యం’’ అని హేలీ అన్నారు. మరోవైపు, ‘‘ఈ రోజు హేలీకి కాళరాత్రి. అయినా తానే గెల్చినట్లు ప్రసంగాలు దంచేస్తోంది’’ అని ట్రంప్ ఎద్దేవా చేశారు. సౌత్ కరోలినాలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో అధ్యక్షుడు బైడెన్ నెగ్గారు. -
‘నన్ను పెళ్లి చేసుకుంటావా’? అంటే.. ఓటేస్తావా అని అడిగింది. ఆ తరువాత...?
నిక్కీ హేలీ.. ఈ పేరు అందరికీ సుపరిచితమే.. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పోరులో బరిలో నిలిచింది. ఆఖరు వరకు పోరాడిన ఆమె చివరికి న్యూ హాంప్‌షైర్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిని చవిచూసింది. అయితే తాజాగా నిక్కీకి ఓ వింత అనుభవం ఎదురైంది. సోమవారం న్యూ హాంప్‌షైర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సాలేంలోని ఆర్టిసాన్ హోటల్లో ఆమె తన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగిస్తుండగా ట్రంప్ మద్దతుదారు ఆమెకు ప్రపోజ్ చేశాడు.. వారి మధ్య సాగిన సంభాషణ ఈ విధంగా ఉంది. ట్రంప్ మద్దతుదారు: నన్ను పెళ్లి చేసుకుంటారా?( గుంపులోంచి గట్టిగా అరవడంతో అందరూ ఒక్కసారిగా ఘోల్లుమన్నారు). నిక్కీ హేలీ: నాకు మద్దతుగా ఓటు వేస్తావా? (నవ్వుతూ) ట్రంప్ మద్దతుదారు: నేను ట్రంప్‌నకు ఓటు వేయబోతున్నాను. ( హేళనగా సమాధానమిచ్చాడు) నిక్కీ హేలీ:. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో. ఊహించని ఘటనతో హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. ఈ సంఘటన అనంతరం నిక్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక భారతీయ సంతతికి చెందిన దంపతులకు 1972లో జన్మించిన నిక్కీ ..1996లో మైఖేల్ హేలీని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రెనా, నలిన్. గతంలో ఆమె సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. ట్రంప్ అధ్యక్షడిగా ఉన్న సమయంలో ఐరాసలో అమెరికా రాయబారిగానూ వ్యవహరించారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసెడెంట్ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబడిన నిక్కీ...న్యూ హాంప్‌షైర్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ఓటమిని చవిచూశారు. ట్రంప్‌నకు మద్దతుగా 52 శాతం ఓట్లు రాగా, నిక్కీ హేలీకి 34శాతం ఓట్లు లభించాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో నిలిచే వ్యక్తిగా ట్రంప్ పేరు దాదాపు ఖరారైపోయింది. కాగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: USA: అధ్యక్ష రేసులో ట్రంప్ లైన్ క్లియర్! -
భారీ అగ్ని ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్లు పేలి..
న్యూయార్క్: అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడు ఆయిల్ ట్యాంకర్లు, ఓ ట్రాక్టర్ ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. నార్త్ అట్లాంటిక్ ఫ్యూయల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది Our firefighters have responded with mutual aid to this scene at 76 Depot Road in Epping involving multiple oil tankers reported on fire. pic.twitter.com/qCVVvZd7So — Exeter Fire Dept. (@ExeterFire) January 13, 2024 . ఆయిల్ ట్యాంకర్లు మంటల్లో చిక్కుకోవడంతో ప్రమాదం మరింత పెరిగింది. భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. Exeter firefighters along with crews from several communities continue to work the scene of a massive fire involving three oil tankers and a tractor-trailer at North Atlantic Fuels in Epping. pic.twitter.com/mrvIBLGRDc — Exeter Fire Dept. (@ExeterFire) January 13, 2024 ఇదీ చదవండి: అమెరికా, బ్రిటన్ దాడులు.. హౌతీల కీలక వ్యాఖ్యలు -
ఆస్పత్రి లాబీలో కాల్పులు.. ఇద్దరు మృతి
న్యూహాంప్‌షైర్: అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్ర రాజధాని కాంకార్డ్లోని సైకియాట్రిక్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు బలగాల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. కాల్పుల ఘటన ఆసుపత్రి లాబీ వరకే పరిమితం అయిందని, రోగులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామన్నారు. తమ ట్రూపర్ జరిపిన కాల్పుల్లో అనుమానితుడు చనిపోయాడన్నారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సుమారు 185 పడకలున్న న్యూహాంప్‌షైర్ సైకియాట్రిక్ ఆసుపత్రి రాష్ట్రంలోనే ఏకైక ఆస్పత్రి. -
మిడ్నైట్ ఓటింగ్‌లో ట్రంప్ దూకుడు!
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ప్రారంభమైంది. సంప్రదాయబద్ధంగా జరిగే మిడ్నైట్ ఓటింగ్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. న్యూహాంప్‌షైర్‌లోని మూడు చిన్న పట్టణాల్లో మిడ్నైట్ ఓటింగ్ నిర్వహించగా.. తన ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై ట్రంప్ పైచేయి సాధించినట్టు 'యూఎస్ఏ టుడే' మీడియా సంస్థ తెలిపింది. న్యూహాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నాట్చ్, హర్ట్జ్ లోకేషన్, మిల్స్‌ఫీల్డ్ తదితర మూడు పట్టణాల్లో సంప్రదాయ మిడ్నైట్ ఓటింగ్‌ను నిర్వహించారు. ఈ మూడు పట్టణాల్లోనూ జనాభా వందకులోపే ఉంటుంది. ఇక్కడ జరిగిన ఓటింగ్‌లో ట్రంప్‌కు 32 ఓట్లు రాగా, హిల్లరీకి 25 ఓట్లు వచ్చాయి. న్యూ హాంప్‌షైర్ చట్టం ప్రకారం 100లోపు ఓట్లు ఉన్న కమ్యూనిటీలు అర్ధరాత్రే ఓటింగ్‌లో పాల్గొని.. తమ ఫలితాన్ని వెల్లడించే వీలుంటుంది. మిగతా రిజిష్టర్డ్ ఓటర్లు తెల్లారి జరిగే ప్రధాన పోలింగ్‌లో పాల్గొంటారు. ఈ మిడ్నైట్ ఓటింగ్ జరిగే డిక్స్విల్లేలోనూ, హర్ట్స్ లోకేషన్లోనూ ట్రంప్‌పై క్లింటన్ వరుసగా 4-2, 17-14 ఓట్ల తేడాతో పైచేయి సాధించారు. అయితే, ఈ రెండింటికన్న అత్యధికంగా ఓట్లు ఉండే మిల్స్‌ఫీల్డ్‌లో మాత్రం క్లింటన్‌పై ట్రంప్ 16-4 ఓట్ల తేడాతో స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో మొత్తంగా ఈ మూడు పట్టణాల్లో ట్రంప్‌దే విజయంగా కనిపిస్తోంది. -
తొలి ఫలితం వెల్లడి, హిల్లరీ విజయం
న్యూయార్క్: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ తొలి విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లె నాచ్‌లో హిల్లరీ 4-2 తేడాతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం అమెరికా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి కౌంటింగ్ చేపడతారు. రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి ఓటింగ్ జరిగిన డిక్స్‌విల్లె నాచ్ ఫలితం వెలువడింది. ఇక్కడి నుంచి హిల్లరీ గెలవడంతో డెమొక్రటిక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆమెకు 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని తుది, తాజా రాయిటర్స్ సర్వేలో వెల్లడైంది. -
ట్రంప్ గెలిచాడు.. హిల్లరీ ఓడింది!
డొనాల్డ్ ట్రంప్ న్యూ హ్యంప్ షైర్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తద్వారా రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడంలో మరో ముందడుగు వేశారు. త్వరలో సౌత్ కరోలినా రాష్ట్రంలో జరిగే రిపబ్లికన్ ప్రాథమిక ఎన్నికల్లోనూ తనదే విజయమని, అమెరికా అధ్యక్ష బరిలోనూ గెలిచితీరుతానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న హిల్లరీ క్లింటన్ బెర్నీ సాండర్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. న్యూ హ్యాంప్ షైర్ డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో 60శాతం ఓట్లు సాధించి.. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో బెర్నీ సాండర్స్ దూసుకుపోతున్నారు. ఈ ఎన్నికల్లో 13 మంది పార్టీ ప్రతినిధులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. మరోవైపు 2008 అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల్లో న్యూ హ్యాంప్ షైర్ లో ఒబామాపై విజయం సాధించిన హిల్లరీ క్లింటన్ ఈసారి కేవలం 30శాతం ఓట్లు మాత్రమే సాధించారు. తొమ్మిది మంది పార్టీ ప్రతినిధులు మాత్రమే ఆమెకు అండగా నిలిచారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వం తనదేనని బెర్నీ సాండర్స్ ధీమా వ్యక్తం చేయగా.. మున్ముందు జరగబోయే ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించి రేసులో నిలుస్తానని హిల్లరీ విశ్వాసం వ్యక్తం చేసింది. మరోవైపు న్యూ హ్యాంప్ షైర్ లో ఘనవిజయం సాధించిన ట్రంప్ తన ప్రత్యర్థిగా డెమొక్రటిక్ పార్టీ నుంచి బెర్రీ సాండర్స్ నిలుస్తారని సంకేతాలు ఇచ్చారు. సాండర్స్ పై తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. ఆయన అమెరికా అధ్యక్షుడైతే దేశాన్ని అమ్మేస్తాడని విమర్శించారు. రిపబ్లికన్ ప్రైమరీలోనే కాదు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ తనదే విజయమని డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశాడు. -
వామ్మో... కుక్కపిల్లతో కనిపిస్తే చాలు!
న్యూ హాంప్‌షైర్(ఇంగ్లాండ్)లోని ఒక శునకకేంద్రం నుంచి 13 కుక్కపిల్లలు దొంగిలించబడ్డాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి చుట్టు పక్కల అనుమానితులను ప్రశ్నించారు. సుతిమెత్తగా కాకుండా కాస్త గట్టిగానే ప్రశ్నించారు. ఈ కేసు పుణ్యమా అని ఎవరైనా తమ కుక్క పిల్లలతో బయటికి రావడం కష్టంగా మారింది. ఎందుకంటే... కుక్కపిల్ల కనబడితే చాలు పోలీసులు చుట్టు ముట్టి యజమానిపై ప్రశ్నల వర్షం కురిపించేవారు. కొందరు యజమానులైతే ‘‘మీకు దొంగలా కనబడుతున్నానా?’’ అని పోలీసులతో తగాదాలకు కూడా దిగారు. మరికొందరు మానవహక్కుల వేదికను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి ‘‘పోయేది దొరికేందుకే...దొరికేది పోయేందుకే’’ అని తత్వాలు పాడుతున్నారట!