![వామ్మో... కుక్కపిల్లతో కనిపిస్తే చాలు!](/styles/webp/s3/article_images/2017/09/2/51419530285_625x300.jpg.webp?itok=M6SOmV7X)
వామ్మో... కుక్కపిల్లతో కనిపిస్తే చాలు!
న్యూ హాంప్‌షైర్(ఇంగ్లాండ్)లోని ఒక శునకకేంద్రం నుంచి 13 కుక్కపిల్లలు దొంగిలించబడ్డాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి చుట్టు పక్కల అనుమానితులను ప్రశ్నించారు. సుతిమెత్తగా కాకుండా కాస్త గట్టిగానే ప్రశ్నించారు. ఈ కేసు పుణ్యమా అని ఎవరైనా తమ కుక్క పిల్లలతో బయటికి రావడం కష్టంగా మారింది.
ఎందుకంటే... కుక్కపిల్ల కనబడితే చాలు పోలీసులు చుట్టు ముట్టి యజమానిపై ప్రశ్నల వర్షం కురిపించేవారు. కొందరు యజమానులైతే ‘‘మీకు దొంగలా కనబడుతున్నానా?’’ అని పోలీసులతో తగాదాలకు కూడా దిగారు. మరికొందరు మానవహక్కుల వేదికను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి ‘‘పోయేది దొరికేందుకే...దొరికేది పోయేందుకే’’ అని తత్వాలు పాడుతున్నారట!