Dog Center
-
10 వేల కోట్ల ఆస్తి..వీలునామాలో.. బయటపడ్డ షాకింగ్ సీక్రెట్
-
రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు చేరే మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ప్రధానంగా చాలా ఇళ్లల్లో కుక్కలు పెంచుతుంటారు. పెట్‌డాగ్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్, వాటికి వేసే బట్టలు, వాడే క్యాస్టుమ్స్, వైద్యం.. ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతోంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్ ద్వారా దేశంలో దాదాపు రూ.ఆరు వేలకోట్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.మార్కెట్‌కు అవకాశమున్న కొన్ని విభాగాలుపెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి.పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి.కొందరు ఆన్లైన్లో లేదా స్టోర్‌లో పెట్ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు.స్టూడియోలో లేదా మంచి లొకేషన్లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు.యజమానులు, ఇంటికి ఇతరులతో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా ఆరు లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.రెండు వేలకోట్లుకు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 14% వృద్ధి చెందుతోంది. 2026 నాటికి దాదాపు రూ.ఆరు వేలకోట్లకు చేరుకుంటుందని అంచనా. -
దురుసుగా ప్రవర్తించేవాడు! కొట్టేవాడు..
మిచిగాన్ : ఎంతో ఆప్యాయంగా తను పెంచుకుంటున్న కుక్కపిల్లను తండ్రి దురుసు ప్రవర్తన కారణంగా దూరంచేసుకున్నాడో బాలుడు. దాన్ని ఓ సంరక్షణాలయం దగ్గర వదిలేసి తాను కుక్కపిల్లను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో తెలుపుతూ ఓ లేఖ పెట్టాడు. ఆ లేఖను చదివిన అక్కడివారి మనసు కదిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని మిచావోకాన్కు చెందిన 12 ఏళ్ల ఆండ్రూ అనే బాలుడు ఓ పిట్‌బుల్ డాగ్‌ను పెంచుకుంటున్నాడు. అయితే అతడి తండ్రికి ఆ కుక్క ఇంట్లో ఉండటం నచ్చలేదు. ప్రతిరోజూ దాన్ని హింసించేవాడు.. దురుసుగా ప్రవర్తించేవాడు, ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు. తండ్రి తన ప్రియమైన కుక్కతో దురుసుగా ప్రవర్తించటం ఆండ్రూకు నచ్చేది కాదు. తండ్రి కుక్కను అమ్మేయాలనుకున్న నేపథ్యంలో ఆండ్రూ మనసు కలత చెందింది. ఎలాగైనా తన కుక్కను రక్షించాలనుకున్నాడు. ఫిబ్రవరి 13న దాన్ని ఓ అట్టపెట్టెలో ఉంచి అక్కడికి దగ్గరలోని మెక్సికన్ సంరక్షణాలయం ముందు వదిలేశాడు. అక్కడ బాక్సులో కుక్కపిల్ల ఉండటం గమనించిన సంరక్షణాలయం వారు దాన్ని బయటకు తీశారు. అందులో కుక్కతో పాటు ఓ లేఖ ఉండటం గమనించారు. ఆ లేఖలో ... ‘‘ నా పేరు ఆండ్రూ. నా వయసు 12 సంవత్సరాలు. నేను, మా అమ్మ ఈ కుక్కపిల్లను మీ చేతుల్లో వదిలిపెట్టాలని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే మా నాన్ననుంచి దీన్ని రక్షించాలని. మా నాన్న దీన్ని అమ్మేయాలనుకుంటున్నాడు. ప్రతిరోజూ దాంతో దురుసుగా ప్రవర్తించేవాడు, కొట్టేవాడు. ఓ రోజు దాన్ని కాలుతో చాలా గట్టిగా తన్నాడు. దీంతో దాని తోకకు గాయమైంది. మీరు దీనికి సహాయం చేస్తారనుకుంటున్నాను. ఇది నన్ను మర్చిపోదని నా నమ్మకం’’. ఆ సంరక్షణాలయం వారు ఆ లేఖను ఫేస్బుక్లో ఉంచటంతో కుక్కపిల్ల ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో 300మందికిపైగా దాన్ని దత్తత తీసుకోవటానికి ముందుకొచ్చారు. సంరక్షణాలయం సిబ్బంది దానికి రిని అని పేరు కూడా పెట్టారు. -
దేశంలో తొలిసారి: కుక్కకు పేస్‌మేకర్
న్యూఢిల్లీ: భారత్‌లో తొలిసారి ఓ కుక్కకు పేస్‌మేకర్ విజయవంతంగా అమర్చారు. కాకర్ స్పేనియల్ జాతికి చెందిన కుక్క ఖుషి (7.5 ఏళ్లు)కి ఢిల్లీలోని మాక్స్ వెటర్నరీ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్‌కు ముందు కుక్క గుండె వేగం నిమిషానికి 20కి పడిపోయిందని, కుక్కల సాధారణ గుండె వేగం నిమిషానికి 60–120 సార్లు ఉంటుందని వైద్యులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 15న దాదాపు గంటన్నర పాటు ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ శునకం పరిస్థితి సాధారణంగా ఉందని దాని యజమాని మను మీడియాకు తెలిపారు. -
హైదరాబాద్‌లో డాగ్ పార్క్ ప్రారంభం
-
వామ్మో... కుక్కపిల్లతో కనిపిస్తే చాలు!
న్యూ హాంప్‌షైర్(ఇంగ్లాండ్)లోని ఒక శునకకేంద్రం నుంచి 13 కుక్కపిల్లలు దొంగిలించబడ్డాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి చుట్టు పక్కల అనుమానితులను ప్రశ్నించారు. సుతిమెత్తగా కాకుండా కాస్త గట్టిగానే ప్రశ్నించారు. ఈ కేసు పుణ్యమా అని ఎవరైనా తమ కుక్క పిల్లలతో బయటికి రావడం కష్టంగా మారింది. ఎందుకంటే... కుక్కపిల్ల కనబడితే చాలు పోలీసులు చుట్టు ముట్టి యజమానిపై ప్రశ్నల వర్షం కురిపించేవారు. కొందరు యజమానులైతే ‘‘మీకు దొంగలా కనబడుతున్నానా?’’ అని పోలీసులతో తగాదాలకు కూడా దిగారు. మరికొందరు మానవహక్కుల వేదికను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి ‘‘పోయేది దొరికేందుకే...దొరికేది పోయేందుకే’’ అని తత్వాలు పాడుతున్నారట!