రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు చేరే మార్కెట్‌ | Pet animal market will reach two thousand crore in two years | Sakshi
Sakshi News home page

Pet Animal Market: రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు..

Published Thu, Sep 12 2024 8:29 AM | Last Updated on Thu, Sep 12 2024 9:32 AM

Pet animal market will reach two thousand crore in two years

ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ప్రధానంగా చాలా ఇళ్లల్లో కుక్కలు పెంచుతుంటారు. పెట్‌డాగ్స్‌ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్‌, వాటికి వేసే బట్టలు, వాడే క్యాస్టుమ్స్‌, వైద్యం.. ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతోంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్‌ ద్వారా దేశంలో దాదాపు రూ.ఆరు వేలకోట్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్‌కు అవకాశమున్న కొన్ని విభాగాలు

  • పెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్‌ సర్వీస్‌ కిందకు వస్తాయి.

  • పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా  వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్‌ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి.

  • కొందరు ఆన్‌లైన్‌లో లేదా స్టోర్‌లో పెట్‌ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు.

  • స్టూడియోలో లేదా మంచి లొకేషన్‌లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు.

  • యజమానులు, ఇంటికి ఇతరులతో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

  • యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!

దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా ఆరు లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.రెండు వేలకోట్లుకు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 14% వృద్ధి చెందుతోంది. 2026 నాటికి దాదాపు రూ.ఆరు వేలకోట్లకు చేరుకుంటుందని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement