Dogs Shelter
-
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి?: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
హీరోయిన్, నటి రేణుక దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అయితే రేణు ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.ఇక సినిమాల విషయం పక్కనపెడితే రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిందే. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. వాటికోసం ప్రత్యేకంగా ఒక ఎన్జీవోను స్థాపించింది. తన పిల్లల పేరు మీదే షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసిన రేణు దేశాయ్ ఆంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతలా మూగజీవాల కోసం తనవంతు కృషి చేస్తోంది.మూగజీవాలంటే తన ప్రాణంగా భావించే రేణు దేశాయ్‌కి ఓ వ్యక్తి చేసిన పని విపరీతమైన కోపం తెప్పించింది. ఓ చిన్న కుక్క పిల్లను కాలితో తన్నుతో ఆ వ్యక్తి కనిపించాడు. అక్కడే దూరంగా ఉన్న కుక్క పిల్ల తల్లి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన రేణు.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలి ఫ్రెండ్స్? అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తుంటే తనకు మూగజీవాలపై ఉన్న ప్రేమ ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది. -
ఆర్ట్‌తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!
’ది కైండ్ అవర్’ ఫౌండేషన్ ద్వారా రెండు వందల యాభైకి పైగా వీధి కుక్కలను కాపాడుతోంది లక్నో వాసి మౌలి మెహ్రోత్రా. కళ ద్వారా జంతువుల పట్ల ప్రేమను ప్రజలకు తెలియజేస్తుంది. వీధుల్లో సృజనాత్మక కుడ్యచిత్రాల ఏర్పాటు, కమ్యూనిటీ ఔట్‌రీచ్‌లు, వర్క్‌షాప్‌ల ద్వారా పిల్లలకు బాధ్యతను బోధిస్తోంది.‘జంతు హక్కుల‘ గురించి చెబుతున్నప్పుడు చాలామందిలో ‘ఇది అవసరమా?’ అన్నారు. కానీ, ఎవ్వరి మాటలను పట్టించుకోను అంటోంది మౌలి. నలుగురు తిరిగే వీధుల్లో మూగ జంతువులకు సంబంధించిన చిత్రాలను ఉంచుతుంది. తనలాగే ఆలోచించే శ్రేయోభిలాషుల బృందం నుంచి ఆలోచింపజేసే పెయింటింగ్ తెప్పించి, వీధుల్లో ఏర్పాటు చేస్తుంది.కళ– వృత్తి సమతుల్యత23 ఏళ్ల వయస్సులో మౌళి తన చుట్టూ ఉన్న కుక్కలకు ఆహారం ఇవ్వడం, రక్షించడం, సంరక్షణ చేయడం ప్రారంభించింది. ‘నేను దాదాపు 200 కుక్కల బాధ్యత తీసుకున్నాను. ఒక ఏడాది పాటు ప్రతిరోజూ వాటి సంరక్షణ చూశాను. కానీ ఒంటరిగా చేయలేమని గ్రహించాను. నేను ప్రయాణాలు చేయవలసి వస్తే,.. ఈ పని ఎలా కొనసాగుతుంది? నేను చని΄ోతే ఏమి జరుగుతుందో... అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. జంతు సంక్షేమం పట్ల తనలో పెరుగుతున్న నిబద్ధతతో కళలలో వృత్తిని సమతుల్యం చేసుకోవడంలో అన్నీ సవాళ్లే. అందుకే, ఈ అభిరుచిని ఒక సంస్థగా మార్చాలనుకున్నాను. అప్పుడే ప్రతి జంతువుకు మరింత ప్రేమను పంచవచ్చు అనుకున్నాను’ అని ఆమె వివరిస్తుంది.లోతైన అవగాహనమౌళి చేసే ప్రయాణంలో సంస్థను ఎలా నమోదు చేసుకోవాలో తెలియక΄ోయినప్పటికీ, చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం కోరింది. ‘నేను దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సొసైటీగానా, ట్రస్ట్గానా లేదా సెక్షన్ 8గా జాబితా చేయాలనుకుంటున్నారా అని అధికారులు అడిగారు. నాకు అవేవీ తెలియవు. కానీ, మెల్లగా అర్ధం చేసుకున్నాను. నల్సార్ యూనివ ర్శిటీ నుంచి లా లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు జంతు సంరక్షణ పట్ల అంకితభావం మరింత పెరిగింది. దీంతో వీటిలో శిక్షణ తీసు కున్నా. ఇది నాకు సబ్జెక్ట్‌లో చాలా లోతైన అవగాహనను ఇచ్చింది. ఈ విషయాలపై పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ఉన్న నేను ఎవరితోనైనా కూర్చున్నప్పుడు చేస్తున్న పని గురించి తప్పు పట్టాలని చూస్తుంటారు. కానీ, వారితో చర్చలు చేయను’ అని వివరిస్తుంది.గోడల నుంచి మనసుల వరకుకైండ్ అవర్ ఫౌండేషన్ పనుల్లో కళను చేర్చడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది మౌళి. అదే వీధి కళ. మౌళి చెబుతున్నట్టుగా వారు నివసించే వ్యక్తులకు విషయం చేరే శక్తివంతమైన వ్యక్తీకరణ ఇది. ‘వారు కుక్కను ఎందుకు చిత్రీకరిస్తున్నారు?‘ అని వీ«ధిలో ఎవరైనా అడుగుతారు. ‘అతను ఈ వీధిలో నివసిస్తున్నాడు కాబట్టి అని మేం చెబుతాం’ అని వివరిస్తుంది మౌళి. మౌళి చిత్రించిన కుక్కల వీధి కుడ్యచిత్రాలు లక్నో చుట్టూ, బయట గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. లక్నోలోని పాత పాడుబడిన ప్రభుత్వ భవనంపై కుక్కను చిత్రించడం ఆమె అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. దీనికి మంచి స్పందన లభించింది. చాలా మంది ప్రజలు పెయింటింగ్‌ను గమనించడం ప్రారంభించారు. రిషికేశ్‌లోని బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్లో మరొక కుడ్యచిత్రం ఏర్పాటు చేసింది.‘నాలుగేళ్ల క్రితం ఆ చిత్రం ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఆ పెయింటింగ్‌ను ప్రజలు ఇష్టపడతారు’ అని చెప్పే మౌళి కుడ్యచిత్రాలతో పాటు, ఫౌండేషన్ వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులతో కలిసి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ‘‘ఒక పాఠశాలలో మేం పిల్లలతో కలిసి గోడకు పెయింట్ చేశాం. వారు ఆ పనిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్‌లో ఉన్న జంతువుల గురించి మేం వారికి నేర్పించాం. వాటిని ఎలా చూసుకోవాలో చెబితే చాలా బాగా అర్ధం చేసుకున్నారు ’అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకుంటుంది. వీధి జంతువుల పట్ల బాధ్యతను ్ర΄ోత్సహించడానికి ఫౌండేషన్ స్థానిక సంఘాలతో కలిసి పనిచేస్తుంది. వారు స్థానిక పశువైద్యులతో కలిసి ఆహారం, రెస్క్యూ సేవలు, సంరక్షణనూ అందిస్తున్నారు.పంచుకునే వ్యక్తులతో కలిసి..బాలీవుడ్ నిర్మాత అమన్ విషేరాతో సహా మౌళి నిబద్ధత చాలా మందికి నచ్చింది. ‘ఎప్పటినుండో ఒక షోలో పాల్గొనాలని, జంతు సంక్షేమం కోసం పని చేయాలని ఉందని అడిగాను. అలా మేమిద్దరం కళాకారులం కాబట్టి, ఇతర జీవులు, జంతువుల గురించి పిల్లలకు నేర్పించడంలో కళ నిజంగా సహాయపడుతుందని, మనలాగే వాటికీ భావోద్వేగాలు, బాధలు ఎలా అనుభవిస్తాయో వాస్తవాన్ని గ్రహించాం. ఇప్పుడు పాఠ్యాంశాలు, స్టడీ మెటీరియల్స్, జంతు సంక్షేమం గురించి పిల్లలకు బోధించడానికి పంచుకునే కథలను రూపొందించడానికి కలిసి పని చేస్తున్నాం’ అని వివరించారు. టీమ్‌లోని మరొక సభ్యురాలు మేఘన మాట్లాడుతూ– ‘ఎవరో ఒక కుక్కపిల్లని నా ఇంటి బయట పడేశారు. ఏమి చేయాలో గుర్తించే ప్రయత్నంలో నేను మౌళి గురించి తెలుసుకున్నాను. నాకు ఆ సంస్థ పనులు చాలా బాగా నచ్చాయి. నేను కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని చెబుతుంది. (చదవండి: సోషల్ మీడియా గెలిపించింది..!) -
పెట్ పేరెంటింగ్.. నివాసంలో మూగజీవులతో సహవాసం
లేడికి లేచిందే పరుగు.. అన్నట్టు ఆలోచన వచి్చందే తడవు ఇంటికి తెచ్చేసుకుని మరీ భౌ¿ౌలూ, మ్యావ్ మ్యావ్లూ, కిచకిచలూ.. వింటూ ఆనందించేద్దాం అనుకుంటే సరిపోదు.. కొనడం నుంచి పెంచడం దాకా పెట్స్ పేరెంటింగ్ కూడా ఒక కళే అంటున్నారు నిపుణులు. దీంతో పాటు వాటికి అనువైన ప్రదేశం ఉండేలా చూసుకోవాలి. తరచూ వాటికి ఇవ్వాల్సిన టీకాలు ఇప్పించడం, వాటి నుంచి సంక్రమించే వ్యాధులకు తగిన చికిత్సలు తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.. నగరంలో పెంపుడు జీవులను మచ్చిక చేసుకోవడం... వాటి పెంపకం పట్ల హాబీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతోంది. అయితే ఏవి కొనాలి? ఎలా పెంచాలి? ఎలా ఉంచాలి? వంటి కీలక విషయాల పట్ల అవగాహన లేకుండానే ఇంటికి తెచ్చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నవారు తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో నిపుణులు అందిస్తున్న సూచనలివి... కొనేముందు.. పెంపుడు జీవిగా శునకమైనా, పిల్లులైనా, పక్షులైనా.. తెచ్చు‘కొనే’ముందు తమ ఇంటి పరిస్థితులను విశ్లేషించుకోవాలి. కుటుంబ జీవనశైలి, మనకు అందుబాటులో ఉన్న స్థలం వంటి అంశాలపై ఆధారపడి పెట్ని ఎంపిక చేసుకో వాలి. అలాగే సదరు జీవి స్వభావం, దాని శక్తి స్థాయిలు, దానికి అందించాల్సిన సంరక్షణ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోని పిల్లలు/వృద్ధుల వయస్సు, వారి ఆరోగ్య పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాగైతే బాగు ‘భౌగు’..శునకాలు, పిల్లులు, పక్షులకు సరిపడేలా, సౌకర్యవంతమైన స్థలాన్ని అందించాలి. అలాగే ఫుడ్‌కీ, ఆటలకీ తగిన టైమ్ కోసం షెడ్యూల్ సెట్ చేసుకోవాలి. వాటికి ఇవ్వాల్సిన ఆహారం తదితరాల గురించి అలాగే టీకాల షెడ్యూల్ గురించి డాక్టర్ నుంచి సరైన మార్గదర్శకాలు తీసుకోవాలి.. అలాగే జనన నియంత్రణ శస్త్రచికిత్స ఎప్పుడు నిర్వహించాలి వంటివి తెలుసుకోవాలి. శునకాలకు సోషల్ లైఫ్ ముఖ్యం. చుట్టుపక్కల వారితో, సాటి జీవులతో స్నేహపూర్వక బంధం ఏర్పడడం కోసం అవకాశం ఇవ్వాలి. శునకం 4–5 నెలలకు చేరుకున్నప్పుడు వాటికి పలు అంశాల్లో శిక్షణ ఇప్పించడం అవసరం. అదే విధంగా 3 నెలల వయసు వరకూ ఫోమ్ బాత్/డ్రై బాత్, 4–6 నెలల వయసులో 15 రోజులకు ఒకసారి, 6 నెలలు దాటిన తర్వాత వారానికోసారి స్నానం తప్పనిసరి. దాంతో పాటే హెయిర్ కోట్‌ను క్రమం తప్పకుండా బ్రష్ చేయడం ముఖ్యం. హెయిర్ కట్, గోర్లు కత్తిరించడం చెవి శుభ్రపరచడం ఆసన గ్రంథులు శుభ్రపరచడం అవసరమే. బ్రీడ్.. గుడ్.. శునకాలను కొనుగోలు చేసేముందు వాటి బ్రీడ్స్‌ను పరిశీలించడం మంచిది. సహనం, ఉల్లాసభరితమైన స్నేహపూర్వక స్వభావంతో పిల్లలున్న కుటుంబాలకు, లాబ్రడార్ రిట్రీవర్లు, గోల్డెన్ రిట్రీవర్లు బీగల్స్ వంటివి, అలాగే అపార్ట్‌మెంట్స్‌కు పగ్స్, షిహ్ త్జుస్ వంటి చిన్న బ్రీడ్స్ నప్పితే, ఫార్మ్ హౌస్‌ల కోసం డాబర్‌మ్యాన్, రోట్‌వెల్లర్.. ఇలా ప్రత్యేకించిన బ్రీడ్స్ కూడా ఉన్నాయి. ఇండియన్ పరియా డాగ్ వంటి స్థానిక భారతీయ జాతులు మన వాతావరణానికి బాగా సరిపోతాయి కావలీర్ కింగ్, చార్లెస్ స్పానియల్స్, బాక్సర్లు కూడా పిల్లలతో ఆప్యాయంగా ఉండడానికి పేరొందాయి.మ్యావ్.. మ్యాచ్.. ఇటీవల పిల్లులను పెంచుకుంటున్నవారు బాగా పెరుగుతున్నారు. పెట్స్‌గా పిల్లులను ఎంచుకున్నవారు వాటి కోసం ఇంట్లో సరైన ప్రదేశాన్ని కనుగొనాలి. నులిపురుగుల నివారణకు వైద్య సలహాలు తీసుకోవాలి. పిల్లులకు రెగ్యులర్‌గా టీకా వేయడం వల్ల దానికి మాత్రమే కాదు పెంచుకునే వారికీ మంచిది. పిల్లులకు మూత్ర, మల విసర్జనలకు ఉపయోగించేందుకు లిట్టర్ బాక్స్ తప్పనిసరి. వాటికి లిట్టర్ శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. సంవత్సరం కంటే తక్కువ వయసున్న పిల్లులుకు వైరల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వైరల్ సంక్రమణను నివారించడానికి ఇతర వీధి పిల్లులతో సంబంధాన్ని నివారించాలి. మగ ఆడ పిల్లుల హార్మోన్ల మార్పులు గురించి అవగాహన ఉండాలి. చాలా మంది పిల్లి యజమానులు ఈ సమయంలో వాటిని చూసి పిల్లికి ఏదో అనారోగ్యం ఉందని అనుకుంటారు. పిల్లులకు తరచూ వస్త్రధారణ అవసరం లేదు అలాగే పిల్లులు తమను తాము శుభ్రం చేసుకుంటాయి కానీ నెలకు ఒకసారి మాత్రం శుభ్రపరచడం తప్పనిసరి..వండని మాంసాన్ని ఇవ్వకూడదు.. పక్షులను పంజరంలో ఉంచవద్దు. వీలైనంత వరకూ పక్షులను బందిఖానాలో ఉంచడం వాటికి హానికరం. ఇది వాటికి తీవ్రమైన కఠినమైన పరిస్థితిగా మారుతుంది. పోషకాహార లోపం, సరిపడని వాతావరణం, ఒంటరితనం, నిర్బంధంలో ఉన్న ఒత్తిడి వంటి సమస్యలకు దారి తీస్తుంది. పక్షులు ఎగురుతూ ఇతర పక్షులతో కలిసి జీవించాలి. ఓపెన్ స్కై కింద. వాటిని చిన్న ప్రదేశాల్లో ఉంచినప్పుడు, స్వభావ ప్రకోపాలు మానసిక కల్లోలాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు.పెంపకంలో అలక్ష్యం వద్దు.. పెట్స్‌ని పెంచుకునేవారు నగరంలో బాగా పెరుగుతున్నారు. అలాగే ఏ మాత్రం అవగాహన లేకుండా వాటిని తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నవారూ పెరుగుతున్నారు. రకరకాల అనారోగ్యాలతో మా దగ్గరకు తమ పెట్స్‌ను తీసుకొచ్చే కేసుల్లో చాలా సందర్భాల్లో యజమానుల అవగాహన లోపమే కారణంగా తెలుస్తోంది. తరచూ వాటి బాగోగులు పర్యవేక్షించడం, నిరంతరం వైద్యులతో సంభాషించడం. చేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. –డా.బి.యమున, శునకాల, పిల్లుల వైద్య నిపుణులు -
రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు చేరే మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ప్రధానంగా చాలా ఇళ్లల్లో కుక్కలు పెంచుతుంటారు. పెట్‌డాగ్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్, వాటికి వేసే బట్టలు, వాడే క్యాస్టుమ్స్, వైద్యం.. ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతోంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్ ద్వారా దేశంలో దాదాపు రూ.ఆరు వేలకోట్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.మార్కెట్‌కు అవకాశమున్న కొన్ని విభాగాలుపెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి.పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి.కొందరు ఆన్లైన్లో లేదా స్టోర్‌లో పెట్ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు.స్టూడియోలో లేదా మంచి లొకేషన్లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు.యజమానులు, ఇంటికి ఇతరులతో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా ఆరు లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.రెండు వేలకోట్లుకు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 14% వృద్ధి చెందుతోంది. 2026 నాటికి దాదాపు రూ.ఆరు వేలకోట్లకు చేరుకుంటుందని అంచనా. -
కుక్క కోసం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్.. రతన్ టాటా మంచి మనసు
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఒక కుక్కకు రక్తదానం చేసేందుకు మరో ఆరోగ్యకరమైన కుక్కను కనుగొనాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబయి ప్రజలను కోరారు. రక్తదానం చేసే శునకానికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉండాలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. తన కోసం ఏదీ కోరని ఆయన ఒక కుక్క కోసం ఈ పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ముంబయిలో యానిమల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ఇటీవల ఏడు నెలల కుక్కను అడ్మిట్ చేశారు. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి వెంటనే రక్తం కావాలని కోరారు. ఆ విషయం రతన్ టాటా దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.‘ముంబయి..నాకు మీ సహాయం కావాలి. మా యానిమల్ ఆసుపత్రిలో ఉన్న ఏడు నెలల కుక్కకు అత్యవసరంగా రక్తమార్పిడి చేయాల్సి ఉంది. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. మాకు అత్యవసరంగా ముంబయిలో డాగ్ బ్లడ్ డోనర్ కావాలి. రక్తం ఇచ్చే కుక్క వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. 1 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 25 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండాలి. కనీసం గత ఆరు నెలలుగా కుక్కకు పూర్తిగా టీకాలు వేయాలి. డీవార్మింగ్(నులిపురుగులు) చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు’ అంటూ పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్‌కు స్పందిస్తూ చాలా మంది వ్యక్తులు కుక్క కోసం సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఆయన మంచి మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. ‘దేని కోసం పోస్ట్ చేయని లెజెండ్, తనది కాని కుక్క కోసం సహాయం కోరుతున్నారు. వినయం గురించి తెలిపే గొప్పపాఠం ఇది’ అని ఒకరు కామెంట్ చేశారు. అయితే రతన్ టాటా పోస్ట్ చూసి చాలామంది డాగ్ బ్లడ్ డోనార్లు సంప్రదించారని తెలిసింది. ‘సహాయం చేసిన వారికి నా అభినందనలు’ అంటూ రతన్ టాటా పోస్ట్‌లో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata)రతన్ టాటాకు మూగజీవులపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. వీలైతే ప్రతిఒక్కరు ఒక కుక్కను దత్తత తీసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూంటారు. టాటా గ్రూప్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రాంతం చుట్టూ నివసించే వీధికుక్కల కోసం ప్రత్యేక కెన్నెల్‌ను(సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేశారు. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించే స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 200 కంటే ఎక్కువ జీవులకు వైద్యం అందించేలా 5 అంతస్తుల్లో విస్తరించి ఉంది. -
వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మనుషులతో పాటు జంతువులు కూడా ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. వేసవిలో శునకాలు రెచ్చిపోతుండటాన్ని మనం చూస్తుంటాం. అవి ఎందుకు అలా ప్రవర్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.మనుషులకు మాదిరిగానే చలికాలం, వేసవి కాలం, వర్షాకాలం మొదలైనవి కుక్కల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం కుక్కలు చల్లని వాతావరణంలో ఉదాశీనంగా ఉంటాయి. అయితే వేసవికాలం రాగానే అవి హైపర్ యాక్టివ్‌గా మారిపోతాయి. వేసవిలో కుక్కలు మరింత దూకుడుగా మారుతాయని ఒక పరిశోధనలో వెల్లడయ్యింది.అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోస్ ఆర్చ్ తెలిపిన వివరాల ప్రకారం వేసవి కాలంలో శునకాలు మరింత వేడి అనుభూతికి లోనవుతాయి. వేసవికాలం మనుషులకు మించి శునకాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అధిక వేడి లేదా ఉష్ణోగ్రత శునకాలలోని థర్మోగ్రూలేషన్ను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కుక్కలు వేడిని తట్టుకోలేవు. ఇటువంటి పరిస్థితిలో కుక్కలు అసాధారణంగా ప్రవర్తిస్తాయి.వేసవి కాలంలో కుక్కలలో కార్టిసాల్ హార్మోన్ (స్ట్రెస్ హార్మోన్) పెరుగుతుందని పెన్ స్టేట్ యూనివర్శిటీ ఒక పరిశోధనలో కనుగొంది. దీని కారణంగా అవి అసాధారణంగా ప్రవర్తిస్తాయని గుర్తించారు. ఈ సమయంలో కుక్కలు ఆకస్మికంగా మొరగడం, మనుషులను చుట్టుముట్టడం, కరవడం, పరిగెత్తడం లాంటి చర్యలను చేస్తాయి.వేసవిలో పెంపుడు శునకాలు లేదా వీధి కుక్కలు ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అవి ఎప్పుడూ నీరసంగా పడుకున్నట్లు కనిపిస్తే, అవి వడ దెబ్బకు గురయ్యాయని గుర్తించాలి. అటువంటి స్థితిలో వాటికి వైద్య సహాయం అందించాలి. -
మూగ జీవుల సేవలో.. 'సారా అయ్యర్'!
'ఆశ్రయం కోరి వచ్చిన ప్రాణిని ఆదరించు.. అని చెప్పింది అమ్మ. ఒక మూగజీవి గాయాలతో రోదిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. ఒకప్రాణి కడుపులో కాళ్లు పెట్టుకుని ముడుచుకుని పడుకుంటే దాని ఆకలి తీర్చకుండా నా దారిన నేను వెళ్లలేను. ఒకరోజు గాయపడిన ఓ కుక్కపిల్ల ఏడుపు నాలోని తల్లి మనసును కదిలించింది. దాని బాధ చూసిన తర్వాత మనసు కలచివేసింది. ఆ కుక్కపిల్ల ఆరోగ్యం కుదుటపడే వరకు మా ఇంట్లోనే పెట్టుకున్నాను. అలా మొదలైన ఈ సేవ ఇప్పుడు దాదాపు నాలుగు వందల కుక్కలతో సాగుతోంది’ అన్నారు 58 ఏళ్ల సారా అయ్యర్.' చెన్నైకి చెందిన సారా అయ్యర్ స్పెషల్ ఎడ్యుకేటర్. స్పెషల్ చిల్డ్రన్ని సమాజంలో సాధారణ పౌరుల్లా తీర్చిదిద్దడంలో దాదాపు పాతికేళ్లు పని చేశారు. ఐదేళ్ల కిందట మూగజీవుల సేవ వైపు మలుపు తీసుకుందామె జీవితం. ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేకుండా జరిగిపోయిన మార్పులను ఇలా చెప్పారామె.. ‘‘మా అమ్మయి పై చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఆ పనుల కోసం నేను టీచింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. పిల్లలు దూరంగా వెళ్లిన తర్వాత ఇంట్లో ఏర్పడే వెలితి. ఎంప్టీనెస్ట్ సిండ్రోమ్ అనేటంత పెద్ద పదం చెప్పను కానీ కొంత మానసికమైన ఖాళీ ఏర్పడిందనే చెప్పాలి. జనవరి ఒకటో తేదీన నేను, నా భర్త గెర్రీ ఇద్దరం పీకే సినిమాకి వెళ్లి వస్తున్నాం. దాదాపుగా ఇంటికి దగ్గరకు వచ్చేశాం. ఎక్కడి నుంచో చిన్న కుక్కపిల్ల అరుపు వినిపిస్తోంది. క్షణాల్లోనే తెలిసింది అది అరుపు కాదు ఏడుపు అని. ఎవరో పెంచుకోవడానికి కుక్కపిల్లను తెచ్చుకున్నారు, అది బెంగతో ఏడుస్తుందేమో అనుకున్నాను. అది నిస్సహాయంగా ఏడుస్తోందని కొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇక ఊరుకోలేకపోయాను. దాని గొంతు వినవస్తున్న దిశగా వెళ్లాను. అది పార్కు చేసిన కారుకి గోడకు మధ్య ఇరుక్కు పోయి ఉంది. తీవ్రంగా గాయపడింది. బయటకు తీయడానికి దగ్గరకు వెళ్తున్నా రానివ్వలేదు. నేను దానిని ఊరడిస్తూ ఉంటే మా వారు మరో వైపు నుంచి వెళ్లి దానిని బయటకు తీశారు. అయితే... కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్లినిక్‌లన్నీ మూసేసి ఉన్నాయి. ఇంటికి తీసుకువెళ్లి మాకు చేతనైన చికిత్స చేసి ఆ మరునాడు దానికి వైద్యం చేయించాం. ఆ కుక్కపిల్ల మామూలయ్యే వరకు మాతోనే ఉంది. ఆ తర్వాత కూడా మాతోనే ఉండిపోయింది. అలా మొదలైన సేవ ఇది. ఓ రోజు.. ఒక ఇండియన్ బ్రీడ్ కుక్క నాలుగు పిల్లలను పెట్టి అలసటతో ఉంది. ఆ దారిన ఓ వ్యక్తి లాబ్రిడార్ను వాకింగ్‌కు తీసుకువెళ్తున్నాడు. వాళ్లను చూసి ఈ కుక్క అరవసాగింది. ఆ వ్యక్తికి కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తన చేతిలో ఉన్న కర్ర ఎత్తాడు. అతడు ఆ కుక్క నడవలేనంత తీవ్రంగా గాయపరిచాడని ఆ మరునాడు తెలిసింది. అప్పుడు ఆ కుక్కను, పిల్లలను ఇంటికి తెచ్చాను. నేను మా వారు ఇద్దరమూ వాటికి ఆహారం పెట్టడం, గాయపడిన వాటికి వైద్యం చేయడం, ఫిజియోథెరపీ చేయడం అన్నీ నేర్చుకున్నాం. మాకు తెలిసిన అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి ‘కుక్కలు, కుక్క పిల్లలు గాయపడి నిరాశ్రయంగా ఉన్నట్లు మీ దృష్టికి వస్తే మాకు తెచ్చివ్వండి, లేదా సమాచారం ఇవ్వండి, మేము సంరక్షిస్తాం’ అని మెసేజ్ పెట్టాం. మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ అలా ఏర్పడింది. ఇప్పుడు మా దగ్గర గాయపడినవి, చూపు కోల్పోయినవి, అనారోగ్యాలతో పుట్టినవి, ఆదరించే వాళ్లు లేక ఇక్కడే ఉండిపోయినవి అన్నీ కలిసి నాలుగు వందలకు పైగా ఉన్నాయి. మా సర్వీస్‌కి మెచ్చిన మా అమ్మ, అత్తమ్మ ఇద్దరూ తమ వంతుగా ఈ మూగజీవుల సంరక్షణకు అవసరమైన వస్తువులు, ఇతర అవసరాల కోసం డబ్బు ఇచ్చి అండగా నిలిచారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. ‘ఆశ్రయం కోసం వచ్చిన ఏప్రాణినీ నిర్లక్ష్యం చేయవద్దు’ అని వారు మాకు చెప్పిన మాట మాతోనే ఉంది. మేము స్థాపించిన మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ... తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డుతో కలిసి పని చేస్తోంది. ఈ మా ప్రయాణంలో ఇన్ని కుక్కలను సంరక్షించడానికి అవసరమైన విశాలమైన స్థలం పెద్ద సమస్య అయింది. చెన్నై నగర శివారు, మహాబలిపురం రూట్లో ఈస్ట్కోస్ట్రోడ్లో మా ఫ్రెండ్‌కి ఓ స్థలం ఖాళీగా ఉంది. దానిని అద్దెకు తీసుకుని కుక్క పిల్లలకు, గాయపడిన వాటికి, అనారోగ్యం పాలైన వాటికి వేరు వేరుగా కెన్నెల్స్ కట్టించి సంరక్షిస్తున్నాం. అవి మమ్మల్ని పేరెంట్స్‌గా ప్రేమిస్తాయి’’ అంటూ తనను ముద్దాడడానికి వచ్చిన పెట్‌ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు సారా అయ్యర్. తన సంరక్షణలో ఉన్న కుక్కలన్నింటికీ పేర్లు పెట్టారామె. వాటికి రిజిస్టర్ నిర్వహిస్తూ వాటికి ఎప్పుడు ఏ మందులు వేశారు, ఇంకా ఎప్పుడు ఏ ఇంజక్షన్లు వేయించాలి... వంటి వివరాలను నమోదు చేస్తారామె. ఇవి చదవండి: Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి -
శునకాల కోసం హైటెక్ ఏసీ
కుక్కలను పెంచుకోవడం చాలామందికి సరదా అయినా, కాలాలకు అనుగుణంగా వాటి సంరక్షణను చూసుకోవడం మాత్రం సమస్యగానే ఉంటుంది. వేసవి తాకిడికి మనుషులే అల్లాడిపోతారు. ఇక వేసవిలో శునకాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవిలో మనుషులకైతే ఏసీలు ఉన్నాయి గాని, పాపం పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటి? వాటికి మాత్రం ఏసీ సౌకర్యం ఉండొద్దా అనే ఆలోచనతో కొరియన్ డిజైనర్ స్యూంగ్మెన్ లీ ‘ఇగ్లూ’ తరహాలో పెంపుడు కుక్కల కోసం హైటెక్ ఏసీ ఇంటికి రూపకల్పన చేసింది. ఇది పూర్తిగా శునకాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. విశ్రాంతి సమయంలో ఇందులోకి వెళ్లేలా పెంపుడు శునకాలకు అలవాటు చేస్తే చాలు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. దీని ప్రవేశమార్గంలోని సెన్సర్లు శునకం లోపలకు ప్రవేశిస్తుండటాన్ని గుర్తించి, వెంటనే ఇందులోని ఏసీ పనిచేసేలా చేస్తాయి. శునకం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా చల్లదనం కలిగిస్తాయి. బయట వేసవి తాపం ఎంతలా ఉన్నా, ఇందులో శునకాలు చల్లగా సేదదీరవచ్చు. దీని ధర 160 డాలర్లు (రూ.13,221) మాత్రమే! -
కుక్కల గుంపులు.. ప్రజలకు తిప్పలు
ఖమ్మం: జిల్లా కేంద్రంలో కుక్కల బెడద తీవ్రంగా మారింది. వీధుల్లో ఎక్కడపడితే అక్కడ కుక్కలు సంచరిస్తుండటంతో పాదచారులు, వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ మనుషులను కరుస్తున్నాయి. పాదచారులు, వాహనచోదకుల వెంట పడుతుండటంతో వారు కంగారు పడుతున్నారు. ఖమ్మం నగరంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా ఇటీవల రోజుకు పదివరకు కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. -
విశ్వనగరానికి వీధికుక్కల బెడద.. మూడు రెట్లు పెరిగిన ఘటనలు
రాష్ట్రంలో వీధి కుక్కలు పేట్రేగిపోతున్నాయి. కాలనీలు, బస్తీల్లో స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. కొన్నిచోట్ల క్రూర మృగాల్లా రెచి్చపోతూ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనూ వీటి బెడద తప్పడం లేదు. సోమవారం బాగ్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో కూడా ఇద్దరు చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. 2022లో నవంబర్ నాటికే 80,281 కుక్కకాట్లు రాష్ట్రంలో కుక్కకాటు కేసులు ఏడాది కాలంలోనే గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం భారీగా ఉన్న కేసులు.. మరుసటి రెండేళ్లు తగ్గగా.. తర్వాత నాలుగో ఏడాది మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 24,124 కుక్క కాట్లు సంభవించగా, 2022లో నవంబర్ నాటికే ఏకంగా 80,281 మందిని కుక్కలు కరిచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక వెల్లడించింది. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడురెట్లకు పైగా కుక్కకాట్లు జరిగాయి. దేశంలో కుక్కకాట్లలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2019లో 1.67 లక్షల కాట్లు, 2020లో 66,782 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సమస్య తీవ్రం హైదరాబాద్‌లోని ఐపీఎంకు కుక్క కాట్లకు గురై చికిత్స కోసం వస్తున్నవారు నెలకు 2,000– 2,500కు పైగా ఉంటుండగా, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో నెలకు 400 వరకు కుక్కకాటు కేసులు నమోదు కావడం.. వాటి బెడద ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇక హైదరాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న జవహర్‌నగర్, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేటల్లో వీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్‌లో డంపింగ్ స్టేషన్ కుక్కలకు ప్రత్యేక ఆవాస కేంద్రంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్లలో వెటర్నరీ విభాగాలున్నా, అవి నామమాత్రంగా కొనసాగుతున్నాయి. వీధి కుక్కలు పెరిగిపోవడానికి, నగరాల్లో ఏటా వేల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవడానికి ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో అధికార యంత్రాంగాల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ వరంగల్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లలో వీధికుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తక్కువేనన్న విమర్శలూ ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో ఈ ఏడాది కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాలలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన మునిసిపల్ శాఖ స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ) చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక కుక్క, దాని పిల్లలు..పిల్లల పిల్లలు! ఒక కుక్క దాని పిల్లలు కలిపి ఏడాది కాలంలో దాదాపు 42 కుక్క పిల్లలను పెడతాయి. వాటి పిల్లలు.. పిల్లల పిల్లలు ఇలా మొత్తం ఏడేళ్ల కాలంలో దాదాపు 4 వేల కుక్కలు పుడతాయని అంచనా. ఇలా కుక్కల సంతతి అభివృద్ధి చెందుతున్నా వాటిని తగ్గించే కార్యక్రమాలు అంత చురుగ్గా సాగడం లేదు. దీంతో వీధికుక్కల సంఖ్య తగ్గడం లేదు. స్టెరిలైజేషన్తోనే నియంత్రణ.. వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ ఒక్కటే మార్గం. అంటే కుక్కల పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేలా శస్త్రచికిత్సలు చేయడం. మొత్తం కుక్కల్లో ఆడకుక్కలన్నింటికీ ఒకేసారి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరిగితేనే కుక్కల సంతతి తగ్గుతుంది. ఏటా వేలాది కుక్కలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆయా కార్పొరేషన్ల వెటర్నరీ విభాగాల అధికారులు చెపుతున్న మాటలన్నీ డొల్ల మాటలేనని కుక్కల సంఖ్య పెరిగిపోతున్న తీరు స్పష్టం చేస్తోంది. ఒక్క వరంగల్ కార్పొరేషన్లోనే సుమారు 60 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు లెక్కలేశారు. ఇక్కడ కుక్కల సంతాన నియంత్రణ కోసం ఓ ప్రైవేటు ఎన్జీవోకు శస్త్ర చికిత్సల బాధ్యత అప్పగించారు. ఒక కుక్కకు స్టెరిలైజేషన్ చేస్తే కార్పొరేషన్ రూ.750 చెల్లిస్తోంది. ప్రతిరోజు 20 కుక్కల వరకు పట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నట్లు ఎన్జీవో సంస్థ చెపుతున్నప్పటికీ, వేలల్లో ఉన్న కుక్కల సంతతి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు 20 నుంచి 30 కుక్క కాటు కేసులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, రామగుండంలలో కార్పొరేషన్ అధికారులే కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ చేపట్టినా, అవి ఎంతోకాలం సాగలేదు. కరీంనగర్లో స్టెరిలైజేషన్ పేరుతో కుక్కలను చంపుతున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ పేర్కొనడంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. రామగుండం పూర్తిగా కోల్‌బెల్ట్ ఏరియా కావడం, ఓపెన్ నాలాలు ఎక్కువగా ఉండడంతో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కొత్తవారు ఎవరు కనిపించినా పిక్కలు పీకేసే పరిస్థితి ఈ కాలరీస్‌లో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో ప్రతి నెల 400 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 2021లో కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేషన్ అధికారులు సుమారు 2,500 కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కానీ తర్వాత ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా వీధికుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. 29,789 కుక్కలకు స్టెరిలైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 20 జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాల్లో 29,789 కుక్కలకు సంతతి నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపింది. నగరాలు, మునిసిపాలిటీలలో ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలతో పాటు కోతులను కూడా ఈ సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపింది. కుక్కలకు ఆహారం దొరక్కే..: మేయర్ విజయలక్ష్మి గ్రేటర్ నగరంలో 2022 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 20 మధ్యకాలంలో 5,70,729 కుక్కలుండగా 4,01,089 కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసినట్లు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి చెప్పారు. అంబర్‌పేట ఘటనలో కుక్కలకు ప్రతిరోజూ ఆహారం వేసే వారు రెండురోజులుగా వేయనందునే ఆకలికి తట్టుకోలేక బాలునిపై దాడి చేసి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ కుక్కలకు మాంసం వేసే దుకాణాలు వారు దుకాణాలు మూసేసినా అలాగే వ్యవహరిస్తాయని చెప్పారు. ఇదొక ప్రమాదం మాత్రమేనంటూ.. బాలుడు మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నగరంలో మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహారం కోసం నగరాలకు.. గతంలో వీధి కుక్కలు గ్రామాల్లో ఎక్కువగా ఉండేవి. అయితే నగరాల్లో వాటికి ఆహారం ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుండడంతో వాటి సంఖ్య భారీగా పెరిగింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి వదిలేయకుండా.. వీధికుక్కల సమస్యపై కార్పొరేషన్లకు ప్రజలు ఫోన్లు చేసినప్పుడు స్పందించి ఆయా బస్తీలు, కాలనీల్లోని కుక్కలను తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేసి దూరంగా వదిలేస్తే ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని ప్రజలు అంటున్నారు. ఆడకుక్కలన్నిటికీ ఆపరేషన్లు చేయాలి హైదరాబాద్‌లో కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) కార్యక్రమాలు నిబంధనల కనుగుణంగా జరగడం లేవని, అవినీతి జరుగుతోందని జంతు ప్రేమికురాలు, సంబంధిత అంశాలపై అవగాహన ఉన్న డాక్టర్ శశికళ తెలిపారు. జైపూర్, గోవాల్లో ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలోనే (8–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తున్నారన్నారు. వీటితో పాటు ‘మిషన్ ర్యాబిస్’పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తారని, కుక్కల బారిన పడకుండా ఎలా వ్యవహరించాలి, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అసోంలోనూ కొన్ని సంస్థలు ఇలా పనిచేస్తున్నాయని వివరించారు. మాయమైన ‘మాఇంటి నేస్తం’.. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ లోపం వల్ల, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల కుక్కల సంచారం పెరుగుతోంది. వీటి సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు ఐదేళ్ల క్రితం వీధికుక్కలను పెంచుకునే పథకం ‘మా ఇంటి నేస్తం’ప్రారంభించారు. అప్పట్లో 3 వేల వీధికుక్కల్ని ఆసక్తి ఉన్నవారికి దత్తత ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆ పథకం కనుమరుగైంది. అది కొనసాగినా వీధికుక్కల సంఖ్య తగ్గి ఉండేదనే అభిప్రాయాలున్నాయి. హైదరాబాద్ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని దాదాపు 8 నెలల క్రితం హైకోర్టు ఆదేశించినప్పటికీ చర్యల్లేక పోవడం విచారకరం. హైదరాబాద్ ఐపీఎంలో 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు నమోదైన కుక్కకాటు కేసులు నెల కేసులు 2022 జనవరి 2,286 ఫిబ్రవరి 2,260 మార్చి 2,652 ఏప్రిల్ 2,540 మే 2,569 జూన్ 2,335 జూలై 2,201 ఆగస్టు 2,272 సెపె్టంబర్ 2,177 అక్టోబర్ 2,474 నవంబర్ 2,539 డిసెంబర్ 2,554 2023 జనవరి 2,580 ––––––––––––––––––––– హైదరాబాద్‌లో గతంలో... – 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో కుక్కలు దాడి చేయడంతో 8 ఏళ్ల బాలిక మృతి. – 2020లో అమీర్‌పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. – 2020 ఆగస్టులో లంగర్‌హౌస్‌లో నలుగురు చిన్నారులకు గాయాలు – 2022 డిసెంబర్ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు. – 2021 జనవరి 30న బహదూర్‌పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి. – 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు. ఇలా ఏటా కుక్కకాట్ల వల్ల మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. –––––––––––––––– ప్రతిసారీ 4–8 పిల్లలు – కుక్కల జీవిత కాలం 8–12 సంవత్సరాలు. – 8 నెలల వయసు నిండేటప్పటికి సంతానోత్పత్తి సామర్ధ్యం వస్తుంది. – కుక్కల గర్భధారణ సమయం 60–62 రోజులు – ఒక్కో కుక్క సంవత్సరానికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది. – సంతానోత్పత్తి జరిపిన ప్రతిసారీ 4–8 పిల్లలు పెడుతుంది. ––––––––––––––––––––– పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: కేటీఆర్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వీధికుక్కల దాడిలో గాయపడి మరణించిన బాలుడి కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కలు, కోతుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో ఈ నెల 23 న ఉదయం 11.00 గంటలకు మాసాబ్‌ట్యాంక్‌లోని తమ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు సుజాతనగర్: కుక్కల దాడిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, బేతంపూడి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. సుజాతనగర్‌లోని సుందరయ్యనగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఫజీమా మంగళవారం స్థానిక అంగన్వాడీ సెంటర్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఒక్కసారిగా వచి్చన కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఫజీమా చేతికి గాయాలు కాగా.. స్థానికులు కుక్కలను తరిమేశారు. బేతంపూడిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న యశ్వంత్ అనే బాలుడిపై అకస్మాత్తుగా వచి్చన వీధి కుక్కలు దాడి చేసి గొంతుపై కరిచాయి. కుక్కల నుంచి బాలుడిని విడిపించేందుకు వెళ్లిన గ్రామస్తుడు బానోత్ లాలుపై కూడా దాడి చేయగా స్థానికులు వాటిని తరిమేశారు. అసలేం జరిగింది.. హైదరాబాద్‌లో తండ్రితో కలిసి అతను పనిచేసే చోటుకు వెళ్లిన బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి భార్యాపిల్లలతో కలిసి బాగ్‌అంబర్‌పేటలో నివాసముంటున్నాడు. ఛే నంబర్లోని కార్ల సరీ్వసింగ్ సెంటర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 19న తన కుమారుడు ప్రదీప్ (4), కుమార్తెతో కలిసి కారు సరీ్వసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. పిల్లల్ని ఆడుకొమ్మనిచెప్పి విధుల్లో నిమగ్నమయ్యాడు. ప్రదీప్ అక్కడ ఆటవిడుపుగా ఒంటరిగా తిరుగుతున్న సమయంలో కుక్కల గుంపు ఒకటి అకస్మాత్తుగా దాడి చేసింది. బాలుని అక్క గమనించి కేకలు వేయడంతో గంగాధర్‌తో పాటు ఇతర సెక్యూరిటీ గార్డులు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. -
Heads Up For Tails: శునకాలకు కిరాణా స్టోర్
మనుషులకు కిరాణా దుకాణాలు ఉన్నాయి. శునకాలకు? పిల్లులకు? ఏవో నాలుగు రకాల తిండి, మెడ పట్టీలు, గొలుసులు... ఇవి అమ్మే పెట్ స్టోర్స్ కాకుండా వాటి ప్రతి అవసరాన్ని పట్టించుకుని వాటికి అవసరమైన టాప్ క్లాస్ వస్తువులను అమ్మే ఓ దుకాణం ఉండాలని భావించింది రాశి నారంగ్. పదేళ్ల నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి నేడు నంబర్ వన్ స్థాయికి చేరింది. ఆమె ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’ దేశవ్యాప్తంగా 75 రిటైల్ స్టోర్స్‌తో 30 పెట్ స్పాలతో సంవత్సరానికి 140 కోట్ల రూపాయల అమ్మకాలు సాగిస్తోంది. రాశి నారంగ్ పరిచయం. ఢిల్లీకి చెందిన రాశి నేడు దేశంలో అత్యధిక పెట్ స్టోర్లు కలిగిన సంస్థ ‘హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్’కు ఫౌండర్. పెంపుడు జంతువుల రంగంలో కోట్ల వ్యాపారానికి వీలుంది అని గ్రహించిన తెలివైన అంట్రప్రెన్యూర్. ‘మాది వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం. మా అత్తగారిది కూడా. మా ఇంట్లో చిన్నప్పుడు కుక్కల్ని పెంచేవాళ్లం. అయితే వాటి బాధ్యత మొత్తం కుటుంబం తీసుకునేది. కాని నాకు పెళ్లయిన కొత్తల్లో నాకంటూ ఒక కుక్క కావాలనుకుని ‘సారా’ అనే బుజ్జి కుక్కపిల్లను తెచ్చుకున్నాను. అదంటే చాలా ఇష్టం నాకు. దాని పుట్టినరోజుకు దానికేదైనా మంచి గిఫ్ట్ కొనిద్దామని ఢిల్లీ అంతా తిరిగాను. ఏవో కాలర్స్, గొలుసులు తప్ప దానికి తొడగడానికి మంచి డ్రస్సు గాని, కొత్త రకం ఆట వస్తువు గాని, మంచి ఫుడ్గాని ఏమీ దొరకలేదు. కుక్కలు పడుకునే బెడ్స్ కూడా ఎక్కడా దొరకలేదు. నేను చెబుతున్నది 2008 సంగతి. ఇంటికి ఖాళీ చేతులతో వచ్చి నా సారాను ఒళ్లో కూచోబెట్టుకుని ఆలోచించాక అర్థమైంది... నాలాగే కుక్కలను ప్రేమించేవారు ఎందరో ఉన్నారు. వారు కూడా ఇలాగే ఫీలవుతూ ఉంటారు. నేనే కుక్కలకు అవసరమైన ప్రాడక్ట్స్ ఎందుకు తయారు చేయించి అమ్మకూడదు అనుకున్నాను. అలా నా యాత్ర మొదలైంది’ అంటుంది రాశి. మొదటి స్టోర్ ఢిల్లీలో... అయితే ఆ ఆలోచన వచ్చాక పని మొదలెట్టడం అంత సులువు కాలేదు. రాశి హెచ్.ఆర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఉద్యోగం కూడా చేసింది. ‘అంత చదువు చదివి కుక్కల వస్తువులు అమ్ముతావా’ అని ఫ్రెండ్స్ అన్నారు. ‘ఏదో హాబీలాగా కాలక్షేపం చేస్తుందిలే’ అని భర్త, అత్తమామలు అనుకుని వదిలేశారు. కాని రాశి ఆలోచన వేరుగా ఉంది. కుక్క అంటే ఆమె దృష్టిలో మరో ఫ్యామిలీ మెంబరే. ‘శునకాల పట్ల మన భారతీయుల దృష్టి ఇటీవల మారింది. అంతకుముందు వాటిని ఇంటి బయట కట్టేసి వాచ్ డాగ్‌లుగా చూసుకునేవారు. ఇప్పుడు ఇంట్లోనే ఒక ఫ్యామిలీ మెంబర్‌గా చూసుకుంటున్నారు. వాటికి క్వాలిటీ ఆహారం వస్తువులు మందులు ఇవ్వడంతో వాటి ఆరోగ్యం, వాటితో ఆనందం పొందాలని అనుకుంటున్నారు. కాని అలాంటి వస్తువులు ప్రత్యేకంగా దొరకడం తక్కువ. నేను రంగంలో దిగాను’ అంటుంది రాశి. కుక్కల ఒంటి తీరు, బొచ్చును బట్టి బట్టలు కుట్టి దుస్తులు తయారు చేయడం రాశి చేసిన మొదటి పని. అవి పడుకునే తీరును బట్టి అందమైన బెడ్స్ తయారు చేయడం. అవి ఆడుకోవడానికి రకరకాల వస్తువులు. వాటి ముఖ్య ఆహారం, అల్పాహారం కోసం రకరకాల క్వాలిటీ పదార్థాలు, అందమైన మెడ పట్టీలు, ప్రమాదకర రసాయనాలు లేని షాంపూలు, డియోడరెంట్లు... ఇవన్నీ ఒకచోట చేర్చి వాటిని షాపులకిచ్చి అమ్మాలనుకుంది. ‘కాని పెట్ స్టోర్లు అమ్మే వ్యాపారులు సగటు వ్యాపారులు. నేను తీసుకెళ్లిన ప్రాడక్ట్లు చూసి ఇలాంటివి అమ్మం. ఇవి ఎవరూ కొనరు అని నన్ను వెనక్కు పంపించేసేవారు. ఇక చూసి చూసి నేనే ఒక షాపు తెరిచాను. అలా ఢిల్లీలో హెడ్స్ అప్ ఫర్ టెయిల్స్ మొదటి షాపు మొదలైంది’ అంటుంది రాశి. సుదీర్ఘ విరామం తర్వాత... ఢిల్లీలో షాపు నడుస్తుండగానే రాశి భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం వచ్చింది. అతనితో పాటు వెళ్లి అక్కడ 7 ఏళ్లు అక్కడే ఉండిపోయి 2015లో తిరిగి వచ్చింది రాశి. ‘అన్నాళ్లు నేను షాపును అక్కడి నుంచే నడిపాను. విస్తరించడం వీలు కాలేదు. కాని తిరిగి వచ్చాక ఈ ఐదారేళ్లలోనే ఇంత స్థాయికి తీసుకొచ్చాను’ అంటుంది రాశి. ఆమె దార్శనికతను గ్రహించిన సంస్థలు భారీగా ఫండింగ్ చేయడంతో రాశి తన స్టోర్స్‌ను పెంచుకుంటూ వెళ్లింది. అంతే కాదు కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, పిట్టలు... వీటి సంరక్షణకు స్పాలు కూడా మొదలెట్టింది. అన్నీ పెట్ ఫ్రెండ్లీ షాపులు. రాశి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ‘క్యాట్ ఓన్లీ స్టోర్’ కూడా తెరిచింది. అన్ని మెట్రో నగరాల్లో ‘హెడ్స్ ఫర్ టెయిల్స్’ షాపులు ఉన్నాయి. కుక్కలకు కావాల్సిన 100కు పైగా వస్తువులు, జాతిని బట్టి వాడాల్సిన వస్తువులు అమ్మడం ఈమె సక్సెస్‌కు కారణం. ఒక పనిలో పూర్తిగా శ్రద్ధతో నిమగ్నమైతే రాశిలా ఎవరైనా విజయం సాధించవచ్చు. -
నాగరక్ష.. కుక్కపిల్లలకు నాగుపాము కాపలా
తమిళనాడు: కడలూరులో ఓ పాము కుక్క పిల్లలతో ఉన్న ఫొటో వైరల్‌గా మారింది. వివరాలు.. కడలూరు సమీపంలోని బాలూరుకు చెందిన సామ్ భట్ ఇల్లు నిర్మిస్తున్నాడు. అక్కడ ఉన్న గుంతలో ఓ కుక్క 3 పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలను అక్కడే వదిలేసి ఆహారం వెతుక్కుంటూ తల్లి కుక్క వెళ్లింది. ఈ క్రమంలో అక్కడికి ఓ నాగు పాము వచ్చింది. కుక్క పిల్లలను ఏమీ చేయకుండా అక్కడే ఉంది. కొంత సమయం తర్వాత అక్కడికి వచ్చిన తల్లి కుక్క పిల్లల పక్కనే పామును చూసి అరిచింది. పాము మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా తల్లి కుక్కను సైతం పిల్లల దగ్గరికి రానివ్వలేదు. కుక్క అరుపులతో అక్కడున్న జనం అక్కడికి వెళ్లి పామును చూశారు. సమాచారం అందుకున్న కడలూరు ఫారెస్ట్ అధికారి సెల్లా సంఘటనా స్థలానికి వెళ్లి పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో కథ సుఖాంతమైంది. -
తమ బిడ్డను కరిచిందని ఏకంగా 29 కుక్కలని....
Barbaric Act": Killing Of 29 Dogs: ఖతర్‌లో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఖతర్‌లోని ఫెసిలిటీ అనే కుక్కల సంరక్షణ సంస్థలోని 29 కుక్కలపై సాయుధ బలగాల బృందం కాల్పులు జరిపి హతమార్చింది. ఆ కుక్కలలో ఒక కుక్క తమ బిడ్డను కరిచిందని ప్రతీకారంగా ఆ సంరక్షణ ప్రాంతంలోని కుక్కుల పై కాల్పులు జరిపారు. దోహాకు చెందిన రెస్క్యూ స్వచ్ఛంద సంస్థ పాస్ ప్యాక్టరీకి సమీపంలోని కుక్కుల ఫెసిలిటీలోకి సాయుధ బలగాల బృందం బలవంతంగా చోరబడ్డారని పేర్కొంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదరించి అక్కడున్న కుక్కలపై కాల్పులకు తెగబడినట్లు తెలిపింది. ఫెసిలిటీ అనే సంస్థ వీధి కుక్కులకు ఆహార, ఆరోగ్య సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థగా పేర్కొంది . ఈ ఘటనలో కుక్క పిల్లలతో సహా చాలామంది సిబ్బంది గాయప్డడారని తెలిపింది. తమ కొడుకుని కరిచినందుకే ఈ ఘటనకు పాల్లపడినట్లు వారు పేర్కొన్నారని వెల్లడించింది. ఈ భయానక ఘటనతో అక్కడ ఉన్న ప్రజలకి ఆగ్రహాం తోపాటుఆందోళనను రేకెత్తించింది. జంతు హక్కుల కార్యకర్త రోనీ హెలౌ ఈ హత్యను అనాగరిక చర్యగా అభివర్ణించాడు. ఇది ఖతర్ సమాజానికి కళంకం అని పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఈ హృదయ విదారక ఘటనపై విచారణ జరిపి ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరేమో గల్ఫ్ ప్రాంతం ఈ విషయంలో అభివృద్ధి చెందాలని, మరొకరు తపాకీలను ఇంట్లో పెట్టుకుని ఇలాంటికి వాడుతున్నారా! అంటూ ...విమర్శిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు) -
పెట్ ఈజ్ బ్యూటీఫుల్
సాక్షి, అమరావతి: పెంపుడు జంతువుల సౌందర్యం, ఆరోగ్య సంరక్షణలో పెట్ స్పాలు కొత్త ఒరవడి సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు కాస్మోపాలిటిన్ నగరాలకే పరిమితమైన పెట్ గ్రూమింగ్ సేవలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. విజయవాడ, గుం టూరు, విశాఖపట్నం వంటి నగరాల నుంచి వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు.. ఇంటివద్దకే గ్రూమింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సైజును బట్టి ఫీజు గతంలో ఇష్టంగా పెంచుకునే జంతువులకు ఆరో గ్యం బాగోకపోతే వెటర్నరీ ఆస్పత్రులకు పరుగెత్తే యజమానులు.. ఇప్పుడు అలాంటి సమస్యలు రా కుండా ముందస్తుగా పెట్ గ్రూమింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో పెట్ సైజును బట్టి ఫీజు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి మాత్రమే అయితే రూ.500 నుంచి రూ.1,900 వరకు, నెలవారీ ప్యా కేజీ రూ.1,500 నుంచి రూ.5 వేల వరకు రేట్లు నిర్ణయించారు. కేవలం బొచ్చు కత్తిరించేందుకే రూ.600 నుంచి రూ.1,900 తీసుకుంటున్నారు. రూ.4 వేల నుంచి రూ.30 వేల ఖర్చు దేశంలో సగటున యజమానులు ఒక్కో పెంపుడు జంతువుపై (జాతిని బట్టి) నెలకు రూ.4 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. వీటిలో షాంపూలు, కండిషనర్లు, అలంకరణ ఉత్పత్తులపై 50 శాతం ఖర్చు చేస్తుండగా మిగిలినది ఆహారం, దువ్వెనలు, బ్రష్‌లు, ట్రిమ్మింగ్ పరికరాల కోసం వెచ్చిస్తున్నారు. పెరుగుతున్న జంతు ప్రేమికులు పెరుగుతున్న చిన్న కుటుంబాలు, రెట్టింపు ఆదా యం, జీవనశైలి మార్పులతో ప్రతి ఒక్కరు జంతువుల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ప్రథమస్థానంలో శునకాలు ఉండగా తర్వాతి స్థా నంలో పిల్లులున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాలకు మాత్రమే పరిమితమైన పిల్లుల పెంపకం ఇక్కడ చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. ఓ సర్వే ప్రకారం దేశంలో దాదాపు మూడుకోట్ల పెంపుడు కుక్కలున్నాయి. ఏటా ఆరులక్షల కుక్కలను దత్తత తీసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్లో ప్రతి 10 మందిలో ఆరుగురు పెంపుడు జంతువుల యజమానులుగా ఉం టున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతా ల్లోనే 30 వేల పెంపుడు కుక్కలుండటం గమనార్హం. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి పెట్ గ్రూమింగ్ సేవలకు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. మాకు రాష్ట్రవ్యాప్తంగా 12 వరకు పెట్ కేర్ స్టోర్స్ ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు, న గరాల్లో పెట్ గ్రూమింగ్ తెలిసిన వారికి మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో గ్రూమింగ్ కోర్సు చేసేందుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. – మృణాళిని, పెట్ కేర్ సెంటర్ యజమాని -
మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు..
ఈయన పేరు హి జియాంగ్. చైనా షాంఘై నగరంలోని పురాతన బౌద్ధ మఠంలో ప్రధాన భిక్షువు. అంతే కాదు.. చైనాలో మూగజీవాలకు ఈయన దేవుడు. ఆయన చేతుల్లో ఉన్న కుక్కపిల్ల రోడ్డుపై దొరికినదే. దానిని సంరక్షించి, అమెరికాలోని ఓ వ్యక్తికి దత్తత ఇచ్చారు. ఆయనే స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి దానిని సాగనంపారు. ఆ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. జంతువులంటే ఆయనకి అంత ప్రీతి. 51 ఏళ్ల జియాంగ్ చైనాలోని వేలాది మూగ జీవాలకు సంరక్షకుడు. ఇందుకోసం తన మఠంలోనే మూగ జీవాల సంరక్షణాలయం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ రకాల జంతువులను, పక్షులను, వీధి శునకాలు వేలాదిగా ఉన్నాయి. శునకాలే 8 వేలు ఉన్నాయి. ఆయనే స్వయంగా వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒక్కోసారి పశువైద్యుడి అవతారం ఎత్తి ఆ మూగ జీవాలకు వ్యాక్సిన్లు కూడా వేస్తుంటారు. ఇన్ని వేల మూగజీవాలను సంరక్షించడం ప్రపంచంలోనే చాలా అరుదు. చదవండి: స్నేక్ అటెంప్ట్ మర్డర్ అంటే ఇదేనేమో? మొదట్లో ఆయన ప్రమాదాల్లో గాయపడ్డ మూగజీవాలకు వైద్య చికిత్స చేయించేవారు. 1994 నుంచి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రెండేళ్ల క్రితం చైనాలో సుమారు 5 కోట్ల మూగ జీవాలు వీధుల్లో ఉన్నాయని అంచనా. వీటి సంఖ్య ఏటా పెరుగుతోంది. ‘‘చైనా ప్రజలకు ఆదాయం పెరిగింది కానీ, మూగజీవాలను పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. అందుకే వారు తమ పెంపుడు జంతువులను వీధుల్లో వదిలేస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలకు కొత్త జీవితం షాంఘై పోలీసులు ఇటీవల ఇరుకుగా ఉన్న బోనుల్లో కొన్ని వీధి కుక్కలను బంధించి ఉంచారు. వాటిలో 20 వరకూ పిల్లలు కూడా ఉన్నాయి. ఈ విషయం జియాంగ్ చెవిన పడింది. వెంటనే ఆయన అక్కడకు చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడారు. కొద్ది సమయంలో ఆ శునకాలకు బోనుల నుంచి విముక్తి లభించింది. వాటిని తీసుకుని జియాంగ్ తన సంరక్షణాలయానికి చేరుకున్నారు. ఆ శునకాల్లో గాయపడ్డ వాటికి, జబ్బుతో ఇబ్బంది పడ్డవాటికి సపర్యలు చేశారు. ప్రేమగా లాలించారు. వాటిని రక్షించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘‘నేను వాటిని రక్షించక పోతే.. అవి చనిపోయి ఉండేవి’’ అని జియాంగ్ చెబుతారు. అప్పు చేసి ఆహారం కుక్కలతో పాటు పిల్లులు, కోళ్లు, బాతులు, నెమళ్లు కూడా జియాంగ్ మఠంలో ఆశ్రయం పొందుతున్నాయి. వీటన్నిటికీ ఆహారం పెట్టాలంటే ఓ భిక్షువుకు తలకు మించిన భారమే అవుతుంది. ఏటా వీటి ఆహారానికి సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చవుతోందట. ప్రభుత్వం నుంచి ఆయనకు ఏమాత్రం సహకారం అందదు. చందాలతోనూ, అప్పులతోనూ ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. అయితే ఇకపై అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఆయన ఇతర దేశాల్లోని సంరక్షకుల వద్దకు, దత్తత తీసుకునే వారికి ఆ శునకాలను ఆయన ఇచ్చేస్తున్నారు. ఇంగ్లీషు తెలిసిన తన వాలంటీర్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలకు సుమారు 300 కుక్కలను పంపారు. అలా పంపడం తనకు ఇష్టం లేదని, అయితే వాటికి కొత్త జీవితాలను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నానని ఆయన తెలిపారు. ఏదొక రోజు వెళ్లి వాటిని చూసి వస్తానని చెబుతున్నారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
250 కుక్కలకు చికెన్ బిర్యానీ; నెలకు రూ.60 వేల ఖర్చు
సాక్షి, హైదరాబాద్: సామాజికసేవ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ యానిమల్ సర్వీస్ చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్. సౌదీ అరేబియాలో జాబ్ చేసిన ఇతను భారత్‌కు తిరిగి వచ్చాక సమాజసేవ చెయ్యాలనుకున్నాడు. దీంతో ఘటకేసర్లో ఆర్ఫనేజ్ మొదలు పెట్టాడు. అయితే ల్యాండ్ సమస్య వల్ల అది మూసివేయాల్సి వచ్చింది. గత 12 సంవత్సరాల నుంచి మాత్రం ఈయన డాగ్ లవర్‌గా మారిపోయారు. ఎల్లారెడ్డిగూడ నుంచి ఎస్ఆర్నగర్ వరకు రోజూ 200 నుంచి 250 వీధి కుక్కలకు ఈయన భోజనం పెడుతుంటాడు. వివిధ ప్రమాదాల నుంచి కాపాడిన కుక్కలు కూడా ఈయన దగ్గర 10 వరకు ఉన్నాయి. రోజూ ఉదయం 4 గంటలకు లేచి కుక్కలకోసం వంట వండడం స్టార్ట్ చేస్తారు. ఉదయం దాదాపు 70 కుక్కలకు, సాయంత్రం 200 నుంచి 250 కుక్కలవరకు పోషిస్తున్నాడు. పైగా చికెన్ బిర్యానీ లాంటివి కూడా వండి పెడుతుంటాడు. వీటికి నెలకు 60 వేలు ఖర్చవుతుంది. అయినా కూడా ఈయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. స్నేహితులు, చుట్టాలు, యానిమల్ లవర్స్ సహాయంతో దీనిని నేటికి కొనసాగిస్తున్నాడు. ఆయన చేస్తున్న ఈ పనికి తన కుటుంబం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. -
మానవత్వం అంటే ఇదేనేమో
ఇతరులకు ఆపద సమయంలో మనకి చేతనైన సహాయాన్నిచేయడమే మానవత్వం. ప్రస్తుత ప్రపంచానికి పదం పెద్దగా పరిచయం ఉండక పోవచ్చేమో. ఎందుకంటే ఈ ఆన్లైన్ యుగంలో పక్కన వాళ్లనే పట్టించుకునే తీరిక లేకుండా గడుపుతుంటాం. కానీ ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి చేసిన పని చూస్తే మనుషుల్లో ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది. ఫుట్ పాత్ మీద జీవనం సాగించే ఇతను పార్క్ వెలుపల రెండు వీధి కుక్కలు చలికి వణుకుతుండడం చూసి చలించి పోయాడు. వాటిని రోడ్డు పక్కనే ఉన్న తన బెడ్ మీద పడుకోపెట్టాడు. వాటి కోసం ఆహారం, నీరు ఓ ప్లాస్టిక్ గిన్నెలలో ఏర్పాటు చేశాడు. అంతే గాక ఆ కుక్కలకు కాపలాగా పక్కనే కూర్చున్నాడు. సహాయం చేయాలంటే కావాల్సింది ఇతరులకు సహాయపడాలనే గుణం మాత్రమే.. డబ్బు, మరేదో కాదని ఇతన్ని చూస్తే అర్థమౌతుంది. దీనికి సంబంధించిన ఫొటోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుసంతా నందా ట్విటర్లో షేర్ చేశారు. ‘తక్కువ ఉన్నవారే ఎక్కువగా ఇస్తుంటారు’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ పోస్ట్‌కు ఎమోష్నల్ గా కనెక్ట్ అయ్యారు.‘ నిజంగా అతనిది చాలా పెద్ద మనసు’ అని కొందరు, ‘అతను చాలా గ్రేట్’ అంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ( చదవండి: రోడ్లపై చెత్త వేస్తున్నారా? సిగ్గు పడండి, కాకి వీడియో వైరల్ ) People those who have the least gives the mos💕 pic.twitter.com/6UqBNzpwxx — Susanta Nanda IFS (@susantananda3) March 30, 2021 -
స్టైలిష్ వాక్, లవ్లీ జంపింగ్స్... స్విమ్మింగ్‌తో డాగ్స్ సందడి
-
పాపం: ఇరుకింట్లో 164 కుక్కలు
టోక్కో : అనారోగ్యంతో అల్లాడుతున్న ఆ మూగ జీవాలు ఇరుకు గదుల్లో పడి మగ్గిపోయాయి. బయటికి వెళ్లలేక, ఉన్నచోట స్వేచ్ఛగా తిరగలేక నరకం అనుభవించాయి. చివరకు ప్రజా ఆరోగ్య శాఖ అధికారుల పుణ్యమా అని అక్కడి నుంచి బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని ఇజుమోలో ముగ్గురు సభ్యుల ఓ కుటుంబం అనారోగ్యంతో ఉన్న కుక్కలను చేరదీసి సాకుతోంది. అలా 164 కుక్కలను ఇంటికి తీసుకువచ్చి, వాటి బాగోగులను చూసుకుంటోంది. అయితే వారు ఉంటున్న ఇళ్లు చిన్నది కావటంతో అన్ని కుక్కలు అక్కడ జీవించటం కష్టంగా మారింది. చెక్క అరల్లో, టేబుళ్లు, కుర్చీల మీద, వాటి కింద ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుని పడుకునేవి. ( ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు! ) వాటి పరిస్థితి గమనించిన పొరుగింటి వారు ప్రజా ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన వారు కుక్కల్ని సాకుతున్న కుటుంబంతో మాట్లాడి వాటికి చికిత్స అందించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా, సదరు ఇంట్లోంచి దుర్వాసన, పెద్ద పెద్ద శబ్ధాలు వస్తున్నాయని ఏడు సంవత్సరాల క్రితం కూడా పొరుగిళ్ల వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు చర్యలు తీసుకోకుండా ఆ కుటుంబం అధికారులను అడ్డుకుంది. -
అసలైన జంతు ప్రేమికుడంటే ఇతనే!
మెక్సికో: నగరానికి చెందిన ఓ వ్యక్తి జంతువుల మీద తనకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి చాటాడు. ఏకంగా 300 కుక్కలకు పైగా తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చాడు. మెక్సికోలో ఉన్న యుకసాన్ పీఠభూమిని హరికేన్ కారణంగా మూసి వేశారు. దీంతో వేల సంఖ్యలో జంతువులు ఆశ్రయాన్ని కోల్పోయాయి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. రికార్డో పిమెంటల్ వాటన్నింటిని తన ఇంటికి తీసుకువచ్చి భద్రతను, ఆహారాన్ని అందిస్తున్నాడు. కేవలం కుక్కలు మాత్రమే కాకుండా వందల సంఖ్యలు పిల్లులు, పిట్టలు కూడా ఇంట్లో ఉన్నారు. తన కూతురి గదిని, కొడుకు గదిని కూడా ఈ జంతువులతో నింపేశాడు. దీని గురించి రికార్డో మాట్లాడుతూ, అవును, వీటి కారణంగా ఇళ్లంతా వాసన వస్తుంది. అయినప్పటికీ వీటి భద్రత ముందు నాకు అది పెద్ద విషయం అనిపించడం లేదు అని పేర్కొన్నాడు. ఇక వాటి పోషణ తనకు కష్టమవుతుందని, 10, 15 కుక్కలకు అయితే ఆహారాన్ని అందించగలను కానీ ఇన్ని జంతువులకు అంటే కష్టమని రికార్డో తెలిపారు. అందుకే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతూ కుక్కలతో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. దానిని చూసిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా వేల డాలర్లను పంపిస్తున్నారు. ఇలా జంతువులను ఆదుకోవడానికి సాయం చేస్తున్న వారందరికి రికార్డో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చదవండి: కుక్కల బోనులో బంధిస్తారు... చితకబాదుతారు! -
తమ పిల్లల విషయంలో ఇలా చేయగలరా?
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అనేక మంది పెంపుడు శునకాలను రోడ్లపై వదిలేస్తున్నారని, ఇది అమానవీయమైన చర్య అని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ఎవరైనా తమ పిల్లల విషయంలో ఇలా చేయగలరా? అంటూ ప్రశ్నించారు. తమను పెంచుకునే కుటుంబంపై ఆయా శునకాలు అన్ని విధాలా ఆధారపడి ఉంటాయని, వాటి విషయంలో అమానవీయంగా వ్యవహరించకూడదని సూచించారు. అలా చేయడం శునకాల పట్ల క్రూయల్‌గా వ్యవహరించడమేనని, ఇది చట్ట ప్రకారం నేరమని సీపీ తన ట్వీట్లో స్పష్టం చేశారు. Abandoning a pet dog on the street to fend for itself is a most inhuman act. Can you do that to your own child ? Such animal get dependent emotionally and physically on the family. For God's sake never abandon them. It also amounts to cruelty to animal and is punishable under law — Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) July 19, 2020 -
రిక్షాలో ఉన్నదెవరో చెప్పుకోండి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ చలికి వణుకుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న చలితో హస్తిన వాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చలి పులి మనుషులనే కాదు మూగ ప్రాణలను వణికిస్తోంది. వాటి బాధను అర్థం చేసుకున్న మంచి మనిషి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హయత్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఈ ఫొటో హృదయాలను కదిలిస్తోంది. రిక్షా నడిపే వ్యక్తి కుక్కను దుప్పటి చుట్టి తన రిక్షాలో కూర్చోబెట్టి తీసుకున్నపోతున్న దృశ్యం ఫొటోలో ఉంది. ఈ ఫొటోకు దాదాపు 4 వేల లైకులు వచ్చాయి. రిక్షా పుల్లర్‌ను ప్రశంసిస్తూ చాలా మంది ట్విటర్లో కామెంట్లు పెడుతున్నారు. వారిద్దరూ పరస్పర విశ్వాసం, నిజాయితీ, గౌరవం కలిగివున్నారడానికి ఈ ఫొటో అద్దం పడుతోందని ఒకరు పేర్కొన్నారు. భావోద్వేగ, స్ఫూర్తిదాయక చిత్రం అంటూ మరొకరు మెచ్చుకున్నారు. మౌలానా ఆజాద్ రోడ్‌లోని హోలీ ఆస్పత్రి సమీపంలోని ప్రతిరోజు రిక్షా పుల్లర్ కుక్కను ఇలాగే తన రిక్షాలో తీసుకెళతాడని, ఈ దృశ్యాన్ని చాలాసార్లు చూశానని అభిషేక్ షా అనే వ్యక్తి వెల్లడించారు. ఈరోజు ఇంటర్నెట్లో తాను చూసిన మంచి ఫొటో ఇదని ఇంకొందరు ప్రశంసించారు. zoom in on the rickshaw and thank the heavens later pic.twitter.com/PFDvrlwxGw — hayat ✨ (@sevdazola) January 2, 2020 -
పెంపుడు కుక్కలపై 50 లక్షల కోట్ల ఖర్చు!
న్యూఢిల్లీ : పెంపుడు కుక్కల విలువెంత? అని తెలివైన వారిని అడిగితే ఏమంటారు? వెలలేని అంత లేదా అమూల్యం అంటారు! మార్కెట్లో వాటి కొనుగోలు రేట్లడిగితే అందరు కాకపోయినా కొందరైతే చెబుతారు. వాటి జీవితం విలువను డబ్బుల్లో అంచనా వేస్తే ఎంత ? అప్పుడు వాటి కొన్న రేటునే కాకుండా వాటి ఆహారానికి, మందులకు ఎంత ఖర్చు పెడుతున్నారు? అవి ఎంత కాలం జీవిస్తున్నాయి? అన్న అంశాల ఆధారంగా వాటి జీవితాల విలువను ఆర్థికంగా అంచనా వేయవచ్చు. అయితే ఈ విలువ దేశాలనుబట్టి, ప్రాంతాలనుబట్టి మారిపోయే అవకాశం ఉంది. పెంపుడు కుక్కలకు అధిక ప్రాధాన్యమిస్తోన్న అమెరికాలో వాటిపై ఎటా 70 బిలియన్ డాలర్లు (దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు పెడుతున్నారు. అదే అమెరికన్లు పిజ్జాలపై ఏటా 32 బిలియన్ డాలర్లు (దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు), చట్టబద్ధంగా దొరికే గంజాయి కోసం వారు ఏడు బిలియన్ డాలర్లు (దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు) చేస్తున్నారు. పెంపుడు కుక్కల కోసం ఖర్చు చేస్తున్న మొత్తంలో ఎప్పటికప్పుడు పెంపుడు కుక్కలకు యాంటి వైరస్ ఇంజెక్షన్ల ఇవ్వడానికి వెటర్నరీ డాక్టర్లకు మొత్తం 20 బిలియన్ డాలర్లు (14.5 లక్షల కోట్ల రూపాయలు), ఇతర మందుల కోసం 16 లక్షల డాలర్లు (11.5 లక్షల కోట్ల రూపాయలు), వాటి ఆహారం కోసం 32 బిలియన్ డాలర్లు (దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేస్తున్నారు. పెంపుడు కుక్కల యజమానుల ఇంటింటి తిరగడంతోపాటు, వెటర్నరీ డాక్టర్లను సంప్రతించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాలను రూపొందించారు. వీటి ఆధారంగా సరాసరి ఓ పెంపుడు కుక్క జీవితం విలువను పదివేల డాలర్లు (దాదాపు 7.25 లక్షల రూపాయలు)గా నిర్ధారించారు. ఏటా అమెరికాలో రోడ్డు ప్రమాదాల కారణంగా పది లక్షల పెంపుడు కుక్కలు మరణిస్తున్నాయి. పెంపుడు కుక్కల కోసం వాటి యజమానులు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినప్పుడు అతి తక్కువగా నష్ట పరిహారం అభిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో ప్రస్తుతం పెంపుడు కుక్కల ధర ఎంత ఉందో అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తున్నారని, వాటి మందులకు, ఆహారానికి అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక యజమానులతో పెంపుడు కుక్కలకున్న అనుబంధాన్ని, ఆత్మీయతను ఎలా వెలగడతారని వారు ప్రశ్నించారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలోని పబ్లిక్ పాలసీ విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సైమన్ ఎఫ్ హీడర్, ఓక్లహామ యూనివర్శిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ డెవెన్ కార్ల్సన్, అదే యూనివర్శిటీ రీసర్చ్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ జో రిప్బెర్గర్లు సంయుక్త ఈ అధ్యయనం చేశారు. -
మార్జాల వైభోగం
అదో పిల్లుల డే కేర్ సెంటర్. కేవలం డే కేర్ మాత్రమే కాదు... బోర్డింగ్ కూడా ఉంది. బోర్డింగ్ హోమ్‌లతో పాటు వాటికి ప్రత్యేక డిష్‌లతో విందు చేసే కేఫ్‌లు, జలకాలాడించే స్పాలు ఎట్సెట్రాలున్నాయి. వీటికి తోడు బర్త్‌డే పార్టీలూ, రిటర్న్ గిఫ్ట్‌లు. అక్కడ వాటి వైభోగం చెప్పనలవి కాదు. కాబట్టి ఓసారి చూసొద్దాం రండి. శ్రేయ.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. యానిమల్ అండ్ బర్డ్స్ లవర్ అయిన ఆమెకు సోలో ట్రావెలింగ్ హాబీ. జాబ్ షెడ్యూల్లో ఏ కొంచెం సమయం దొరికినా వెంటనే ప్రయాణానికి ప్లాన్ చేసుకుంటుంది. కాని చిక్కంతా తను పెంచుకుంటున్న చిన్ని పిల్లి ‘బర్ఫీ’ దగ్గరే. దాన్నెక్కడ పెట్టాలి? డాగ్ స్టే హోమ్స్‌లా .. పిల్లికీ బోర్డింగ్ హోమ్స్ ఉంటాయా అని వెదికింది. దొరికింది. చక్కగా పిల్లిని తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టి నిశ్చింతగా ట్రైన్ ఎక్కింది. ఆమె వెళ్లిన దగ్గర్నుంచి బర్ఫీ అల్లరి, ఆగడాలు, సరదా, సంతోషాలు కొత్త పిల్లులతో స్నేహాలు.. శ్రేయకు వాట్సప్‌లో అప్డేట్ అవుతూనే ఉన్నాయి. పిల్లికింత వైభోగమా? పిల్లలకన్నా ఎక్కువ గారం అందుతున్నట్టుందే అంటూ విచిత్రపడకపోయినా విడ్డురమైతే చెంది ఉంటారు. పెంపుడు కుక్కల రాజసం పరిపాటే కాని పిల్లికైతే కొత్త. అదీగాక మన పనుల గురించి, మన షెడ్యూల్ గురించి ఇసుమంతైనా ఇన్ఫర్మేషన్ లేని ఆ అమాయక జీవి తనమానాన తాను వెళుతూ మన కంటపడితే అపశకునంగా లేబుల్ వేస్తాం. అలాంటి పిల్లిని కావాలని పెంచుకుంటారా? యెస్.. పెంచుకుంటున్నారు. పిల్లి ఎదురుపడితే అరిష్టమనే మూఢత్వాన్ని పటాపంచలు చేస్తూ శ్రేయనే కాదు అలాంటి యూత్ ఎందరో కుక్కలతోపాటు పిల్లుల్నీ పెంచుకుంటున్నారు. వాటి కోసం కేర్సెంటర్స్ వెలిశాయంటేనే అర్థం చేసుకోవచ్చు! ఎక్కడో ఢిల్లీ, ముంబైలాంటి మెట్రో నగరాల్లో కాదు.. అచ్చంగా హైదరాబాద్‌లోనే. పిల్లల కంటే ఎక్కువ.. హైదరాబాద్‌లోని క్యాట్ స్టే కేంద్రాల్లో ’బెంజి క్యాట్ బోర్డింగ్’ ఒకటి. దాన్ని నిర్వహిస్తున్నది మహిళే. పేరు అశ్విని. స్వస్థలం పాలక్కాడ్. మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన అశ్వినికి మొదటి నుంచీ జంతువులన్నా, పక్షులన్నా, ప్రకృతి అన్నా ప్రాణం. తన పెళ్లి చూపులప్పుడు కూడా చెప్పింది తనను చూడ్డానికి వచ్చిన అబ్బాయితో... తనకు యానిమల్స్ అంటే ఇష్టమని, పిల్లల కన్నా వీటినే ఎక్కువ ఇష్టపడ్తానని, పిల్లల్నీ వద్దనుకుంటున్నానని... అంతగా కావలనిపిస్తే అనాథ పిల్లను దత్తత తీసుకోవాలనుకుంటున్నాని.. ఇవన్నీ నచ్చితేనే ఓకే చెప్పమని. ఆమెతోపాటు ఆమె జీవకారుణ్యమూ నచ్చి ఓకే చెప్పాడు. ఆమెకు మాటిచ్చినట్టుగానే పెళ్లయ్యాక ఆమె ఇష్టాలకెప్పుడూ అడ్డుచెప్పలేదట భర్త. ‘‘నిజానికి మా ఆయనా యానిమల్ లవరే. ఇక్కడికి (హైదరాబాద్) రాకముందు చెన్నైలో ఉండేవాళ్లం. అక్కడే నేనొక డిజిటల్ యాడ్ ఏజెన్సీలో పనిచేసేదాన్ని. కొన్నాళ్లకు మానేసి నిర్మిత, ప్రసన్న అనే ఇద్దరు మహిళలు రన్ చేస్తున్న బెంజి క్యాట్ బోర్డింగ్‌లో వాళ్లకు అవసరమున్నప్పుడు హెల్ప్ చేసేదాన్ని. ఆ తర్వాత మా ఆయనకి హైదరాబాద్‌లో మంచి ఆపర్చునిటీ రావడంతో ఇక్కడికి మకాం మార్చాం. ఇక్కడా పిల్లుల్ని పెంచుకునేవాళ్లుండడం, వాటికి కేర్ సెంటర్స్ పెద్దగా లేకపోవడంతో ఇక్కడ క్యాట్ బోర్డింగ్ స్టార్ట్ చేశాను. అల్కపురి టౌన్షిప్లో.. రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఇంకా చెప్పాలంటే మేము ఉండే ఫ్లాట్‌లోనే క్యాట్ బోర్డింగ్ పెట్టా. చుట్టుపక్కల వాళ్ల నుంచి నాకెలాంటి ఇబ్బంది లేదు. రావట్లేదు. దీన్ని బిజినెస్‌లా చేయట్లేదు. హాబీగా రన్ చేస్తున్నా. నాకు సొంతంగా ఓ పిల్లి, కుక్క, చిలక ఉన్నాయి. వాటిని పిల్లలకంటే ఎక్కువగా ప్రేమిస్తా. ‘‘పెట్స్ సరే పిల్లల్నెప్పుడు కంటారు?’’ అంటూ మా పేరెంట్స్, అత్తమామల కన్నా చుట్టాలే అడుగుతుంటారు! పెళ్లికిముందే మా అమ్మకూ చెప్పాను .. దేశంలో ఇంతమంది అనాథలున్నారు. వాళ్లలో ఒకర్ని చూసుకుంటా. పిల్లల్ని కనను అని. అదే విషయం మా ఆయనకూ చెప్పాను. మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకెవరికో ఆన్సర్ చేయాలనుకోను’’ అంటోంది అశ్విని. కేఫ్‌లు... హ్యాంగవుట్స్ కేర్ సెంటర్లు, బోర్డింగ్స్ సరే.. పెట్ యానిమల్స్ కోసం కేఫ్లూ ఉన్నాయి హైదరాబాద్‌లో. ఇందులో వాటికోసం కుకీస్, కేక్స్, పఫ్స్, కేక్స్ వగైరా దొరుకుతాయి. గచ్చిబౌలిలోని ‘కేఫ్ డి లోకో’ను ఓ సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని హేమంత్ నిర్వహిస్తున్నారు. ‘‘మా కేఫ్‌లో మనుషులకు, పెట్ యానిమల్స్‌కు వేరువేరు కిచెన్స్ ఉన్నాయి. ఈ కేఫ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వీథి కుక్కల ఆరోగ్యం, సంరక్షణ మీద ఖర్చు పెడ్తున్నాం. వీథి కుక్కల దత్తత బాధత్యనూ చేపట్టాం. అర్థం చేసుకుని, బిడ్డల్లా పెంచుకునే ఓపిక, ప్రేమ ఉన్నవాళ్లకు వాటిని దత్తతకిస్తున్నాం. ఈ కుక్కపిల్లలకు బర్త్‌డే పార్టీలు అరేంజ్ చేస్తాం. కుక్కపిల్లలకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తాం. పిల్లలకూ పర్యావరణం, జంతువులు, పక్షులు, ప్రకృతి మీద ప్రేమా పెరుగుతోంది. వాటిని కాపాడుకోవాలనే బాధ్యతా తెలుస్తోంది. అన్నిటికీ మించి మనం అనే భావన కలుగుతోంది’’ అంటారు హేమంత్. కొందరికి తమ జీవనశైలి చుట్టూ ఉన్న పరిసరాలపట్ల ఎంత స్పృహ లేకుండా ఉందోమరికొందరికి అంతే స్పృహ ఉందనడానికి ఇదే నిదర్శనమేమో! -
ఇంటికి చేరిన ‘టింగు’
కుషాయిగూడ: గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన పెంపుడు కుక్క (టింగు) ఎట్టకేలకు ఇంటికి చేరడంతో కథ సుఖాంతమయింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సైనిక్‌పురికి చెందిన వంశీధర్ పెంపుడు కుక్క అపహరణకు గురైన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బోయిన్‌పల్లిలో చెత్త కుప్పల వద్ద కనిపించిన టింగును జగదీష్, మహేశ్ ఇద్దరు యువకులు చేరదీసి ఇంటికి తీసుకెళ్లారు. దీనిని గుర్తించిన మరో వ్యక్తి ఈ కుక్క విషయమై దినపత్రికల్లో వార్త వచ్చినట్లు చెప్పాడు. దీంతో సదరు యువకులు నేరుగా వంశీధర్ ఇంటికి వెళ్లి కుక్కను అప్పగించారు. మీడియా, పోలీసుల చొరవతోనే టింగు తిరిగి వచ్చిందని వంశీధర్ ఆనందం వ్యక్తం చేశాడు.