’ది కైండ్ అవర్’ ఫౌండేషన్ ద్వారా రెండు వందల యాభైకి పైగా వీధి కుక్కలను కాపాడుతోంది లక్నో వాసి మౌలి మెహ్రోత్రా. కళ ద్వారా జంతువుల పట్ల ప్రేమను ప్రజలకు తెలియజేస్తుంది. వీధుల్లో సృజనాత్మక కుడ్యచిత్రాల ఏర్పాటు, కమ్యూనిటీ ఔట్రీచ్‌లు, వర్క్‌షాప్‌ల ద్వారా పిల్లలకు బాధ్యతను బోధిస్తోంది.
‘జంతు హక్కుల‘ గురించి చెబుతున్నప్పుడు చాలామందిలో ‘ఇది అవసరమా?’ అన్నారు. కానీ, ఎవ్వరి మాటలను పట్టించుకోను అంటోంది మౌలి. నలుగురు తిరిగే వీధుల్లో మూగ జంతువులకు సంబంధించిన చిత్రాలను ఉంచుతుంది. తనలాగే ఆలోచించే శ్రేయోభిలాషుల బృందం నుంచి ఆలోచింపజేసే పెయింటింగ్ తెప్పించి, వీధుల్లో ఏర్పాటు చేస్తుంది.
కళ– వృత్తి సమతుల్యత
23 ఏళ్ల వయస్సులో మౌళి తన చుట్టూ ఉన్న కుక్కలకు ఆహారం ఇవ్వడం, రక్షించడం, సంరక్షణ చేయడం ప్రారంభించింది. ‘నేను దాదాపు 200 కుక్కల బాధ్యత తీసుకున్నాను. ఒక ఏడాది పాటు ప్రతిరోజూ వాటి సంరక్షణ చూశాను. కానీ ఒంటరిగా చేయలేమని గ్రహించాను. నేను ప్రయాణాలు చేయవలసి వస్తే,.. ఈ పని ఎలా కొనసాగుతుంది? నేను చని΄ోతే ఏమి జరుగుతుందో... అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. జంతు సంక్షేమం పట్ల తనలో పెరుగుతున్న నిబద్ధతతో కళలలో వృత్తిని సమతుల్యం చేసుకోవడంలో అన్నీ సవాళ్లే. అందుకే, ఈ అభిరుచిని ఒక సంస్థగా మార్చాలనుకున్నాను. అప్పుడే ప్రతి జంతువుకు మరింత ప్రేమను పంచవచ్చు అనుకున్నాను’ అని ఆమె వివరిస్తుంది.
లోతైన అవగాహన
మౌళి చేసే ప్రయాణంలో సంస్థను ఎలా నమోదు చేసుకోవాలో తెలియక΄ోయినప్పటికీ, చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం కోరింది. ‘నేను దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సొసైటీగానా, ట్రస్ట్‌గానా లేదా సెక్షన్ 8గా జాబితా చేయాలనుకుంటున్నారా అని అధికారులు అడిగారు.
నాకు అవేవీ తెలియవు. కానీ, మెల్లగా అర్ధం చేసుకున్నాను. నల్సార్ యూనివ ర్శిటీ నుంచి లా లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు జంతు సంరక్షణ పట్ల అంకితభావం మరింత పెరిగింది. దీంతో వీటిలో శిక్షణ తీసు కున్నా. ఇది నాకు సబ్జెక్ట్‌లో చాలా లోతైన అవగాహనను ఇచ్చింది. ఈ విషయాలపై పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ఉన్న నేను ఎవరితోనైనా కూర్చున్నప్పుడు చేస్తున్న పని గురించి తప్పు పట్టాలని చూస్తుంటారు. కానీ, వారితో చర్చలు చేయను’ అని వివరిస్తుంది.
గోడల నుంచి మనసుల వరకు
కైండ్ అవర్ ఫౌండేషన్ పనుల్లో కళను చేర్చడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది మౌళి. అదే వీధి కళ. మౌళి చెబుతున్నట్టుగా వారు నివసించే వ్యక్తులకు విషయం చేరే శక్తివంతమైన వ్యక్తీకరణ ఇది. ‘వారు కుక్కను ఎందుకు చిత్రీకరిస్తున్నారు?‘ అని వీ«ధిలో ఎవరైనా అడుగుతారు. ‘అతను ఈ వీధిలో నివసిస్తున్నాడు కాబట్టి అని మేం చెబుతాం’ అని వివరిస్తుంది మౌళి.
మౌళి చిత్రించిన కుక్కల వీధి కుడ్యచిత్రాలు లక్నో చుట్టూ, బయట గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. లక్నోలోని పాత పాడుబడిన ప్రభుత్వ భవనంపై కుక్కను చిత్రించడం ఆమె అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. దీనికి మంచి స్పందన లభించింది. చాలా మంది ప్రజలు పెయింటింగ్‌ను గమనించడం ప్రారంభించారు. రిషికేశ్‌లోని బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్‌లో మరొక కుడ్యచిత్రం ఏర్పాటు చేసింది.
‘నాలుగేళ్ల క్రితం ఆ చిత్రం ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఆ పెయింటింగ్‌ను ప్రజలు ఇష్టపడతారు’ అని చెప్పే మౌళి కుడ్యచిత్రాలతో పాటు, ఫౌండేషన్ వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులతో కలిసి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ‘‘ఒక పాఠశాలలో మేం పిల్లలతో కలిసి గోడకు పెయింట్ చేశాం. వారు ఆ పనిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్‌లో ఉన్న జంతువుల గురించి మేం వారికి నేర్పించాం.
వాటిని ఎలా చూసుకోవాలో చెబితే చాలా బాగా అర్ధం చేసుకున్నారు ’అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకుంటుంది. వీధి జంతువుల పట్ల బాధ్యతను ్ర΄ోత్సహించడానికి ఫౌండేషన్ స్థానిక సంఘాలతో కలిసి పనిచేస్తుంది. వారు స్థానిక పశువైద్యులతో కలిసి ఆహారం, రెస్క్యూ సేవలు, సంరక్షణనూ అందిస్తున్నారు.
పంచుకునే వ్యక్తులతో కలిసి..
బాలీవుడ్ నిర్మాత అమన్ విషేరాతో సహా మౌళి నిబద్ధత చాలా మందికి నచ్చింది. ‘ఎప్పటినుండో ఒక షోలో పాల్గొనాలని, జంతు సంక్షేమం కోసం పని చేయాలని ఉందని అడిగాను. అలా మేమిద్దరం కళాకారులం కాబట్టి, ఇతర జీవులు, జంతువుల గురించి పిల్లలకు నేర్పించడంలో కళ నిజంగా సహాయపడుతుందని, మనలాగే వాటికీ భావోద్వేగాలు, బాధలు ఎలా అనుభవిస్తాయో వాస్తవాన్ని గ్రహించాం.
ఇప్పుడు పాఠ్యాంశాలు, స్టడీ మెటీరియల్స్, జంతు సంక్షేమం గురించి పిల్లలకు బోధించడానికి పంచుకునే కథలను రూపొందించడానికి కలిసి పని చేస్తున్నాం’ అని వివరించారు. టీమ్‌లోని మరొక సభ్యురాలు మేఘన మాట్లాడుతూ– ‘ఎవరో ఒక కుక్కపిల్లని నా ఇంటి బయట పడేశారు. ఏమి చేయాలో గుర్తించే ప్రయత్నంలో నేను మౌళి గురించి తెలుసుకున్నాను. నాకు ఆ సంస్థ పనులు చాలా బాగా నచ్చాయి. నేను కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని చెబుతుంది.
(చదవండి: సోషల్ మీడియా గెలిపించింది..!)
Comments
Please login to add a commentAdd a comment