Animal rights
-
ఆర్ట్‌తో మూగ జీవుల సంక్షేమంపై అవగాహన..!
’ది కైండ్ అవర్’ ఫౌండేషన్ ద్వారా రెండు వందల యాభైకి పైగా వీధి కుక్కలను కాపాడుతోంది లక్నో వాసి మౌలి మెహ్రోత్రా. కళ ద్వారా జంతువుల పట్ల ప్రేమను ప్రజలకు తెలియజేస్తుంది. వీధుల్లో సృజనాత్మక కుడ్యచిత్రాల ఏర్పాటు, కమ్యూనిటీ ఔట్‌రీచ్‌లు, వర్క్‌షాప్‌ల ద్వారా పిల్లలకు బాధ్యతను బోధిస్తోంది.‘జంతు హక్కుల‘ గురించి చెబుతున్నప్పుడు చాలామందిలో ‘ఇది అవసరమా?’ అన్నారు. కానీ, ఎవ్వరి మాటలను పట్టించుకోను అంటోంది మౌలి. నలుగురు తిరిగే వీధుల్లో మూగ జంతువులకు సంబంధించిన చిత్రాలను ఉంచుతుంది. తనలాగే ఆలోచించే శ్రేయోభిలాషుల బృందం నుంచి ఆలోచింపజేసే పెయింటింగ్ తెప్పించి, వీధుల్లో ఏర్పాటు చేస్తుంది.కళ– వృత్తి సమతుల్యత23 ఏళ్ల వయస్సులో మౌళి తన చుట్టూ ఉన్న కుక్కలకు ఆహారం ఇవ్వడం, రక్షించడం, సంరక్షణ చేయడం ప్రారంభించింది. ‘నేను దాదాపు 200 కుక్కల బాధ్యత తీసుకున్నాను. ఒక ఏడాది పాటు ప్రతిరోజూ వాటి సంరక్షణ చూశాను. కానీ ఒంటరిగా చేయలేమని గ్రహించాను. నేను ప్రయాణాలు చేయవలసి వస్తే,.. ఈ పని ఎలా కొనసాగుతుంది? నేను చని΄ోతే ఏమి జరుగుతుందో... అని కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. జంతు సంక్షేమం పట్ల తనలో పెరుగుతున్న నిబద్ధతతో కళలలో వృత్తిని సమతుల్యం చేసుకోవడంలో అన్నీ సవాళ్లే. అందుకే, ఈ అభిరుచిని ఒక సంస్థగా మార్చాలనుకున్నాను. అప్పుడే ప్రతి జంతువుకు మరింత ప్రేమను పంచవచ్చు అనుకున్నాను’ అని ఆమె వివరిస్తుంది.లోతైన అవగాహనమౌళి చేసే ప్రయాణంలో సంస్థను ఎలా నమోదు చేసుకోవాలో తెలియక΄ోయినప్పటికీ, చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి సహాయం కోరింది. ‘నేను దీన్ని రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు సొసైటీగానా, ట్రస్ట్గానా లేదా సెక్షన్ 8గా జాబితా చేయాలనుకుంటున్నారా అని అధికారులు అడిగారు. నాకు అవేవీ తెలియవు. కానీ, మెల్లగా అర్ధం చేసుకున్నాను. నల్సార్ యూనివ ర్శిటీ నుంచి లా లో మాస్టర్స్ చదువుతున్నప్పుడు జంతు సంరక్షణ పట్ల అంకితభావం మరింత పెరిగింది. దీంతో వీటిలో శిక్షణ తీసు కున్నా. ఇది నాకు సబ్జెక్ట్‌లో చాలా లోతైన అవగాహనను ఇచ్చింది. ఈ విషయాలపై పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో ఉన్న నేను ఎవరితోనైనా కూర్చున్నప్పుడు చేస్తున్న పని గురించి తప్పు పట్టాలని చూస్తుంటారు. కానీ, వారితో చర్చలు చేయను’ అని వివరిస్తుంది.గోడల నుంచి మనసుల వరకుకైండ్ అవర్ ఫౌండేషన్ పనుల్లో కళను చేర్చడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది మౌళి. అదే వీధి కళ. మౌళి చెబుతున్నట్టుగా వారు నివసించే వ్యక్తులకు విషయం చేరే శక్తివంతమైన వ్యక్తీకరణ ఇది. ‘వారు కుక్కను ఎందుకు చిత్రీకరిస్తున్నారు?‘ అని వీ«ధిలో ఎవరైనా అడుగుతారు. ‘అతను ఈ వీధిలో నివసిస్తున్నాడు కాబట్టి అని మేం చెబుతాం’ అని వివరిస్తుంది మౌళి. మౌళి చిత్రించిన కుక్కల వీధి కుడ్యచిత్రాలు లక్నో చుట్టూ, బయట గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. లక్నోలోని పాత పాడుబడిన ప్రభుత్వ భవనంపై కుక్కను చిత్రించడం ఆమె అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. దీనికి మంచి స్పందన లభించింది. చాలా మంది ప్రజలు పెయింటింగ్‌ను గమనించడం ప్రారంభించారు. రిషికేశ్‌లోని బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్లో మరొక కుడ్యచిత్రం ఏర్పాటు చేసింది.‘నాలుగేళ్ల క్రితం ఆ చిత్రం ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఆ పెయింటింగ్‌ను ప్రజలు ఇష్టపడతారు’ అని చెప్పే మౌళి కుడ్యచిత్రాలతో పాటు, ఫౌండేషన్ వర్క్‌షాప్‌ల ద్వారా విద్యార్థులతో కలిసి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ‘‘ఒక పాఠశాలలో మేం పిల్లలతో కలిసి గోడకు పెయింట్ చేశాం. వారు ఆ పనిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పెయింటింగ్‌లో ఉన్న జంతువుల గురించి మేం వారికి నేర్పించాం. వాటిని ఎలా చూసుకోవాలో చెబితే చాలా బాగా అర్ధం చేసుకున్నారు ’అంటూ నాటి విషయాలను గుర్తుచేసుకుంటుంది. వీధి జంతువుల పట్ల బాధ్యతను ్ర΄ోత్సహించడానికి ఫౌండేషన్ స్థానిక సంఘాలతో కలిసి పనిచేస్తుంది. వారు స్థానిక పశువైద్యులతో కలిసి ఆహారం, రెస్క్యూ సేవలు, సంరక్షణనూ అందిస్తున్నారు.పంచుకునే వ్యక్తులతో కలిసి..బాలీవుడ్ నిర్మాత అమన్ విషేరాతో సహా మౌళి నిబద్ధత చాలా మందికి నచ్చింది. ‘ఎప్పటినుండో ఒక షోలో పాల్గొనాలని, జంతు సంక్షేమం కోసం పని చేయాలని ఉందని అడిగాను. అలా మేమిద్దరం కళాకారులం కాబట్టి, ఇతర జీవులు, జంతువుల గురించి పిల్లలకు నేర్పించడంలో కళ నిజంగా సహాయపడుతుందని, మనలాగే వాటికీ భావోద్వేగాలు, బాధలు ఎలా అనుభవిస్తాయో వాస్తవాన్ని గ్రహించాం. ఇప్పుడు పాఠ్యాంశాలు, స్టడీ మెటీరియల్స్, జంతు సంక్షేమం గురించి పిల్లలకు బోధించడానికి పంచుకునే కథలను రూపొందించడానికి కలిసి పని చేస్తున్నాం’ అని వివరించారు. టీమ్‌లోని మరొక సభ్యురాలు మేఘన మాట్లాడుతూ– ‘ఎవరో ఒక కుక్కపిల్లని నా ఇంటి బయట పడేశారు. ఏమి చేయాలో గుర్తించే ప్రయత్నంలో నేను మౌళి గురించి తెలుసుకున్నాను. నాకు ఆ సంస్థ పనులు చాలా బాగా నచ్చాయి. నేను కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాను’ అని చెబుతుంది. (చదవండి: సోషల్ మీడియా గెలిపించింది..!) -
షాకింగ్.. ఇంట్లో 1,000 కుక్కలు మృతి.. ఆకలితో కడుపు మాడ్చి!
సియోల్: దక్షిణ కొరియాలోని ఓ వ్యక్తి ఇంట్లో 1,000 శునకాలు చనిపోవడం కలకలం రేపింది. ఇతడు కుక్కలకు ఆహారం పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేసి అవి చనిపోయేలా చేశాడు. తమ కుక్క తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన యజమాని ఒకరు ఓ ఇంట్లో శునకాలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడ్ని గ్యాంగి ప్రావిన్స్‌లోని యంగ్‌ప్యోంగ్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. వెంటనే అతడ్ని అరెస్టు చేశారు. అయితే శునకాల మృతికి తానే కారణమని నిందితుడు అంగీకరించాడు. యజమానులు వదిలేసిన, జీవితకాలం పూర్తయిన శునకాలను సేకరించి వాటి కడుపుమాడ్చి చనిపోయేలా చేసినట్లు వివరించాడు. ఇందుకు గాను ఒక్కో శునకానికి వాటి యజమానులు తనకు రూ.623 ఇచ్చినట్లు వెల్లడించాడు. జంతు హక్కులు ఉల్లంఘించినందుకు ఇతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అధికారులు. స్థానిక చట్టాల ప్రకారం ఇతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది. చదవండి: లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్ -
జంతువుల హక్కులు ఎవరికీ పట్టడం లేదు
సాక్షి, హైదరాబాద్: జంతువుల హక్కుల గురించి పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మానవుడి వల్ల ఈ భూమి మీద ఉన్న ప్రతీ జంతువు ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉందని పేర్కొంది. కొన్ని జంతువులను వాహనాల్లో కుక్కి అక్రమంగా తరలిస్తున్నారని, ఈ సమయంలో ఆ జంతువులు కాళ్లు, నడుము విరిగి వర్ణించలేనంత బాధను అనుభవిస్తున్నాయని వ్యాఖ్యానించింది. చనిపోయే సమయంలో కూడా అంత బాధను అనుభవించవని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. జంతువుల హక్కులు, వాటి సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టుకు సహకరించేందుకు కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ)గా కొవుటూరు పవన్ కుమార్‌ను నియమించింది. జంతు హక్కుల చట్టా లు, వాటి సంరక్షణ చట్టాలు, ఆయా దేశాల్లో చట్టాలు అమలవుతున్న తీరు తదితర విషయాలన్నింటిపై తగిన అధ్యయనం చేసి తమకు సహకరించాలని పవన్‌ను కోర్టు కోరింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మతపరమైన వ్యవహారంగా భావించవద్దు.. ఇటీవల తుర్కపల్లి నుంచి షామీర్పేట వైపు వెళుతున్న డీసీఎంలో 63 గోవులు, దూడలను తరలిస్తుండగా గో సంరక్షణదళ్ సభ్యులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, తాము కేవలం గోవులను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాజ్యంపై విచారణ జరపడం లేదని స్పష్టం చేసింది. దీనిని మతపరమైన వ్యవహారంగా భావించరాదని వ్యాఖ్యానించింది. ప్రతీ జంతువు హక్కుల పరిరక్షణ కోసం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది. జంతువులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయంది. ఈ మొత్తం వ్యవహారంలో తగిన అధ్యయనం చేసి కోర్టుకు సహకరించేందుకు ఓ యువ న్యాయవాది అవసరమని ధర్మాసనం చెప్పగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ స్పందిస్తూ.. కొవులూరి పవన్ పేరును ప్రతిపాదించారు. ధర్మాసనం కూడా పవన్ పట్ల సానుకూలంగా స్పందించింది. జంతువుల హక్కులకు సంబంధించిన చట్టాల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి తమకు సహకరించాలని పవన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
గోమాత కోసం ప్రాణత్యాగం
దేశమాతగా ప్రకటించాలని డిమాండ్ రాజ్‌కోట్: ఆవును దేశమాతగా ప్రకటించాలంటూ గుజరాత్‌లోని రాజ్‌కోట్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఎనిమిది మంది విషం తాగారు. వీరిలో ఒకరు మరణించగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గోవును దేశమాతగా ప్రకటించడంతో పాటు బీఫ్‌ను దేశమంతా పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ జంతు హక్కు సంఘానికి చెందిన 8 మంది విషం తాగేందుకు ప్రయత్నించారు. విషయం తెలియగానే సంఘటనా ప్రాంతానికి వెళ్లామని, భారీగా పోలీసు బలగాల్ని నియమించామని ఏసీపీ కల్పేష్ చావ్డా తెలిపారు. పోలీస్ రక్షణ చేధించుకుని వారు విషం తాగడంతో దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ హిండాభాయ్ వాంబాడియా(35) మరణించాడని, పోలీసు వలయం చేధించుకుని విషం ఎలా తాగారన్నదానిపై విచారణ జరుపుతున్నామని ఏసీపీ చెప్పారు. రాజ్‌కోట్ మాజీ ఎంపీ కున్వర్జీ బవాలియా, ‘గో సేవా ఆయోగ్’ చైర్మన్ వల్లబ్‌భాయ్ కథిరియాలు ఆస్పత్రికి వెళ్లగా వారిని గో సంరక్షణ కార్యకర్తలు అడ్డుకున్నారు.