![A Man from Mexico Gives Shelter To 300 Dogs - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/16/dog.gif.webp?itok=k1BpOdAn)
మెక్సికో: నగరానికి చెందిన ఓ వ్యక్తి జంతువుల మీద తనకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి చాటాడు. ఏకంగా 300 కుక్కలకు పైగా తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చాడు. మెక్సికోలో ఉన్న యుకసాన్ పీఠభూమిని హరికేన్ కారణంగా మూసి వేశారు. దీంతో వేల సంఖ్యలో జంతువులు ఆశ్రయాన్ని కోల్పోయాయి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. రికార్డో పిమెంటల్ వాటన్నింటిని తన ఇంటికి తీసుకువచ్చి భద్రతను, ఆహారాన్ని అందిస్తున్నాడు. కేవలం కుక్కలు మాత్రమే కాకుండా వందల సంఖ్యలు పిల్లులు, పిట్టలు కూడా ఇంట్లో ఉన్నారు. తన కూతురి గదిని, కొడుకు గదిని కూడా ఈ జంతువులతో నింపేశాడు. దీని గురించి రికార్డో మాట్లాడుతూ, అవును, వీటి కారణంగా ఇళ్లంతా వాసన వస్తుంది. అయినప్పటికీ వీటి భద్రత ముందు నాకు అది పెద్ద విషయం అనిపించడం లేదు అని పేర్కొన్నాడు.
ఇక వాటి పోషణ తనకు కష్టమవుతుందని, 10, 15 కుక్కలకు అయితే ఆహారాన్ని అందించగలను కానీ ఇన్ని జంతువులకు అంటే కష్టమని రికార్డో తెలిపారు. అందుకే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతూ కుక్కలతో ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. దానిని చూసిన వారందరూ ప్రపంచవ్యాప్తంగా వేల డాలర్లను పంపిస్తున్నారు. ఇలా జంతువులను ఆదుకోవడానికి సాయం చేస్తున్న వారందరికి రికార్డో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment