హీరోయిన్, నటి రేణుక దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. అయితే రేణు ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు.
ఇక సినిమాల విషయం పక్కనపెడితే రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలని అందరికీ తెలిసిందే. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూనే ఉంటుంది. అంతేకాదు.. క్యాట్స్, డాగ్స్ కోసం ప్రత్యేకంగా షెల్టర్ హోమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. వాటికోసం ప్రత్యేకంగా ఒక ఎన్‌జీవోను స్థాపించింది. తన పిల్లల పేరు మీదే షెల్టర్ హోమ్ ఏర్పాటు చేసిన రేణు దేశాయ్ ఆంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతలా మూగజీవాల కోసం తనవంతు కృషి చేస్తోంది.
మూగజీవాలంటే తన ప్రాణంగా భావించే రేణు దేశాయ్‌కి ఓ వ్యక్తి చేసిన పని విపరీతమైన కోపం తెప్పించింది. ఓ చిన్న కుక్క పిల్లను కాలితో తన్నుతో ఆ వ్యక్తి కనిపించాడు. అక్కడే దూరంగా ఉన్న కుక్క పిల్ల తల్లి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన తన బిడ్డను రక్షించుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన రేణు.. ఇలాంటి వాళ్లను ఏం చేయాలి ఫ్రెండ్స్? అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ చూస్తుంటే తనకు మూగజీవాలపై ఉన్న ప్రేమ ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment