
Barbaric Act": Killing Of 29 Dogs: ఖతర్‌లో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఖతర్‌లోని ఫెసిలిటీ అనే కుక్కల సంరక్షణ సంస్థలోని 29 కుక్కలపై సాయుధ బలగాల బృందం కాల్పులు జరిపి హతమార్చింది. ఆ కుక్కలలో ఒక కుక్క తమ బిడ్డను కరిచిందని ప్రతీకారంగా ఆ సంరక్షణ ప్రాంతంలోని కుక్కుల పై కాల్పులు జరిపారు. దోహాకు చెందిన రెస్క్యూ స్వచ్ఛంద సంస్థ పాస్ ప్యాక్టరీకి సమీపంలోని కుక్కుల ఫెసిలిటీలోకి సాయుధ బలగాల బృందం బలవంతంగా చోరబడ్డారని పేర్కొంది.
అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదరించి అక్కడున్న కుక్కలపై కాల్పులకు తెగబడినట్లు తెలిపింది. ఫెసిలిటీ అనే సంస్థ వీధి కుక్కులకు ఆహార, ఆరోగ్య సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థగా పేర్కొంది . ఈ ఘటనలో కుక్క పిల్లలతో సహా చాలామంది సిబ్బంది గాయప్డడారని తెలిపింది. తమ కొడుకుని కరిచినందుకే ఈ ఘటనకు పాల్లపడినట్లు వారు పేర్కొన్నారని వెల్లడించింది. ఈ భయానక ఘటనతో అక్కడ ఉన్న ప్రజలకి ఆగ్రహాం తోపాటుఆందోళనను రేకెత్తించింది.
జంతు హక్కుల కార్యకర్త రోనీ హెలౌ ఈ హత్యను అనాగరిక చర్యగా అభివర్ణించాడు. ఇది ఖతర్ సమాజానికి కళంకం అని పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఈ హృదయ విదారక ఘటనపై విచారణ జరిపి ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరేమో గల్ఫ్ ప్రాంతం ఈ విషయంలో అభివృద్ధి చెందాలని, మరొకరు తపాకీలను ఇంట్లో పెట్టుకుని ఇలాంటికి వాడుతున్నారా! అంటూ ...విమర్శిస్తూ ట్వీట్ చేశారు.