పాట్నా: బిహార్‌లో దారుణం జరిగింది. నలుగురు గుర్తు తెలియని దుండగులు ఓ జర్నలిస్టుని కిరాతకంగా హత్య చేశారు. రాణిగంజ్ ప్రాంతంలో ఉన్న జర్నలిస్టు ఇంటి ప్రాంగణంలోనే ఈ దాడి జరిగింది. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి.
జర్నలిస్టు విమల్ యాదవ్ దైనిక్ జాగరణ్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నలుగురు దుండగులు ఆయన తలుపుతట్టారు. విమల్ గుమ్మం వద్దకు రాగానే దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జర్నలిస్టు విమల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిపై ఆస్పత్రి వద్ధ భారీ సంఖ్యలో గుమికూడిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై లోక్ జన్‌శక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో జర్నలిస్టులు, పోలీసులకే రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటనపై స్పందించిన సీఎం నితీష్ కుమార్.. దుండగులను పట్టుకునేందుకు ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామని అన్నారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ నాయకుడిపై ప్రశంసలు.. కారణం ఏమై ఉంటుందంటారు?
Comments
Please login to add a commentAdd a comment