armed men
-
జైలుపై డ్రగ్స్ ముఠా కాల్పులు..10 మంది పోలీసులు మృతి!
మెక్సికన్ సిటీ: సరిహద్దు జైలుపై దుండగులు ఆయుధాలతో విరుచుకుపడి జరిపిన కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటన మెక్సికోలోని జుయారెజ్ నగరంలో ఆదివారం జరిగింది. మృతుల్లో 10 మంది భద్రతా సిబ్బంది కాగా.. నలుగురు ఖైదీలు ఉన్నట్లు మెక్సిన్ అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని, 24 మంది తప్పించుకోగలిగారని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది డ్రగ్స్ ముఠాగా అనుమానిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఆయుధాలతో వచ్చిన దుండగులు జైలుపై కాల్పులు జరిపారు. సమచారం అందుకున్న బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితులను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, ఈ దాడికి పాల్పడింది ఎవరనే విషయంపై స్పష్టత లేదని వెల్లడించారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు మెక్సికో సరిహద్దు జైళ్లలో జరిగాయి. పలు కారాగారాల వద్ద భద్రత తక్కువ గా ఉండటం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డ్రగ్స్ ముఠాల సభ్యులు ఖైదీలుగా ఉండటం వల్ల వారి మధ్య ప్రతీకార దాడులే ప్రధానంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ -
తమ బిడ్డను కరిచిందని ఏకంగా 29 కుక్కలని....
Barbaric Act": Killing Of 29 Dogs: ఖతర్‌లో ఒక భయానక సంఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు ఖతర్‌లోని ఫెసిలిటీ అనే కుక్కల సంరక్షణ సంస్థలోని 29 కుక్కలపై సాయుధ బలగాల బృందం కాల్పులు జరిపి హతమార్చింది. ఆ కుక్కలలో ఒక కుక్క తమ బిడ్డను కరిచిందని ప్రతీకారంగా ఆ సంరక్షణ ప్రాంతంలోని కుక్కుల పై కాల్పులు జరిపారు. దోహాకు చెందిన రెస్క్యూ స్వచ్ఛంద సంస్థ పాస్ ప్యాక్టరీకి సమీపంలోని కుక్కుల ఫెసిలిటీలోకి సాయుధ బలగాల బృందం బలవంతంగా చోరబడ్డారని పేర్కొంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తుపాకీలతో బెదరించి అక్కడున్న కుక్కలపై కాల్పులకు తెగబడినట్లు తెలిపింది. ఫెసిలిటీ అనే సంస్థ వీధి కుక్కులకు ఆహార, ఆరోగ్య సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థగా పేర్కొంది . ఈ ఘటనలో కుక్క పిల్లలతో సహా చాలామంది సిబ్బంది గాయప్డడారని తెలిపింది. తమ కొడుకుని కరిచినందుకే ఈ ఘటనకు పాల్లపడినట్లు వారు పేర్కొన్నారని వెల్లడించింది. ఈ భయానక ఘటనతో అక్కడ ఉన్న ప్రజలకి ఆగ్రహాం తోపాటుఆందోళనను రేకెత్తించింది. జంతు హక్కుల కార్యకర్త రోనీ హెలౌ ఈ హత్యను అనాగరిక చర్యగా అభివర్ణించాడు. ఇది ఖతర్ సమాజానికి కళంకం అని పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. ఈ హృదయ విదారక ఘటనపై విచారణ జరిపి ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరేమో గల్ఫ్ ప్రాంతం ఈ విషయంలో అభివృద్ధి చెందాలని, మరొకరు తపాకీలను ఇంట్లో పెట్టుకుని ఇలాంటికి వాడుతున్నారా! అంటూ ...విమర్శిస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు) -
ఐసీయూకు వెళ్లి వైద్యుడికి తుపాకి గురిపెట్టి..
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్లో సాయుధులుగా వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆస్పత్రిలోకి వెళ్లి గందరగోళం సృష్టించారు. తమలో గాయమైన ఓ వ్యక్తికి ఉన్నపలంగా వైద్యం చేయాలంటూ విధుల్లో ఉన్న వైద్యుడికి తుపాకీ ఎక్కుపెట్టారు. ప్రశ్నించబోయిన స్టాఫ్‌పై చేయి చేసుకున్నారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ మొత్తం దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఇందులో రికార్డయిన ప్రకారం బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో శ్రీరామ్పూర్లోగల పారామౌంట్ నర్సింగ్‌హోమ్‌కు ఆరు నుంచి ఏడుగురు సాయుధులు ఉదయం 6.30గంటలకు లోపలికి చొరబడ్డారు. వారిలో కొంతమంది బనియన్లతోనే వచ్చారు. వారిలో ఓ వ్యక్తికి గాయాలు అవగా అతడిని లోపలికి ఎత్తుకొచ్చి హల్చల్ చేశారు. నేరుగా ఐసీయూ వద్దకు వెళ్లి వైద్యుడిని బెదిరించి వైద్యం చేయమన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
తుపాకీతో బెదిరించి...పాత నోట్ల చోరీ
గయా(బిహార్): బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు బ్యాంకులో చొరబడి తుపాకీతో బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బుతో ఉడాయించారు. ఈ సంఘటన గయాజిల్లాలోని గ్రామీణ్ బ్యాంక్ ఆఫ్ బిహార్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. తుపాకీతో బ్యాంకు మేనేజర్‌ను బెదిరించి రూ.21.30 లక్షలు దోచుకెళ్లారు. చోరీ చేసిన మొత్తంలో కేవలం 1.20 లక్షలు మాత్రమే కొత్త కరెన్సీ ఉందని, మిగతా 20.10 లక్షలు రద్దైన పాత 500, 1000రూపాయల నోట్లు ఉన్నట్టు గయా డీఎస్పీ అలోక్ కుమార్ తెలిపారు. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో మేనేజర్‌తో పాటూ కేవలం ఇద్దరు కస్టమర్లు మాత్రమే బ్యాంకులో ఉన్నట్టు ఆయన చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ పేర్కొన్నారు. సీనియర్ ఎస్పీ గరిమా మల్లిక్, అడిషనల్ ఎస్పీ బలరామ్ కుమార్ చౌదరిలతో పాటూ మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
పట్టపగలే భారీ దోపిడి
నాగ్‌పూర్ : పట్టపగలే ఓ ఫైనాన్స్ కంపెనీలో భారీ దోపిడి జరిగింది. ఐదుగురు సాయుధ దుండగులు ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడి స్థానిక ప్రజలు తాకట్టుపెట్టిన మూడు లక్షల నగదు, 9.3 కోట్ల విలువచేసే 30.9 కేజీ బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన నగరంలోని ఉత్తరప్రాంతంలో గల ఝరిపట్కా పోలీసు సమీపంలో భీమ్ చౌక్ మణపురం ఫైనాన్స్ బ్రాంచ్‌లో జరిగింది. కస్టమర్లలాగా ఓ ఐదుగురు వ్యక్తులు ఫైనాన్స్ కంపెనీలోకి ప్రవేశించారు. ఆ ఫైనాన్స్ సంస్థకు చెందిన ఓ మహిళా ఉద్యోగిని ద్వారా వీరు లోపలికి ప్రవేశించారు. మొదట సంస్థలోకి వచ్చిన వ్యక్తి ముఖానికి ముసుగేసుకుని వచ్చినట్టు తెలుస్తోంది. ముఖంపై ఉన్న ముసుగుని తొలగించమని అడగగానే ఉద్యోగులను, కస్టమర్లను బందీగా తీసుకొని తుపాకీతో బెదిరించినట్టు పోలీసులు చెప్పారు. వారి దగ్గరున్న మొబైల్ ఫోన్లను కూడా లాక్కున్నట్టు తెలిపారు. మొత్తం తొమ్మిది మంది వ్యక్తులను ఈ తుపాకీలతో బెదిరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఈ దుండగులు సీసీటీవీ కెమెరాలను, వైర్లను ధ్వంసం చేశారు. లాకర్ వైపుకు వెళ్లిన దుండగులు అక్కడి ఉద్యోగులను బెదిరించి లాకర్ తెరిపించారు. వారు తెచ్చుకున్న రెండు సంచుల్లో లాకర్లోని నగదును, బంగారాన్ని నింపుకున్నారు. మొత్తం 20 నిమిషాలు వారు ఈ దొంగతనాన్ని ముగించుకుని అక్కడి నుంచి పారిపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ దుండగులు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. ఈ దుండగుల కోసం పోలీసులు ఫైనాన్స్ కంపెనీ సమీపంలోని దుకాణాల సీసీటీవీ ఫుటేజ్‌లను, స్థానిక ప్రాంత వ్యక్తులను విచారిస్తున్నారు. అంతరాష్ట్ర దొంగల ముఠానే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కంపెనీ దగ్గర సెక్యురిటీ గార్డ్ లేకపోవడంతో దొంగలు ఈ ఫైనాన్స్ కంపెనీలోకి చొరబడటానికి తేలికైందని పోలీసులు పేర్కొంటున్నారు. -
ఈ ఆరేళ్ల చిన్నారి ధైర్యం చూశారో అవాక్కే..
-
ఈ ఆరేళ్ల చిన్నారి ధైర్యం చూశారో అవాక్కే..
మెల్బోర్న్: న్యూజిలాండ్‌లోని ఓ స్టోర్‌లో ఓ భారతీయ బాలిక గొప్ప సాహసం చేసింది. పట్టుమని ఆరేళ్లు కూడా ఉండని ఆ బాలిక ఏకంగా గొడ్డలితో తమ సంస్థలోని ఉద్యోగిపై దాడికి వచ్చిన దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దాడి చేయబోతున్న అతడిని కాలుపట్టి లాగి కిందపడేయబోయింది. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యం ఇప్పుడు పెద్ద వైరల్‌గా మారింది. ఆ పాప తల్లిదండ్రులు తమ కూతురు గొప్ప సాహసం చేసిందని మురిసిపోతూ ఆ సంఘటనకు సంబంధించి ఆమెలో పేరుకుపోయిన భయాన్ని తగ్గిస్తున్నారు. న్యూజిలాండ్‌లోని అక్లాండ్లో ఓ ఇండియన్ దంపతులకు ఎలక్ట్రికల్ షాపు ఉంది. అందులో కొంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అనుకోకుండా ఓ ఆరుగురు దోపిడీ దారులు ముఖాలకు ముసుగులు వేసుకొని చేతుల్లో గొడ్డళ్లతో దాడి చేసేందుకు వచ్చారు. ఆ క్రమంలో అందులో పనిచేసే ఉద్యోగులను గొడ్డల్లతో నరికేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో తన తల్లిదండ్రులతోపాటే ఆ షాపులో ఉన్న సారా పటేల్ అనే ఆరేళ్ల చిన్నారి తన తండ్రి కంగారు పడుతూ అటుఇటు పరుగెడుతున్నప్పటికీ ఏమాత్రం జంకకుండా నేరుగా ఆ దొంగ కాలుపట్టి కిందపడేసేందుకు యత్నించింది. అనంతరం పోలీసులు రాక గమనించి వారంతా పరారయ్యారు. పోతూపోతూ వేల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎత్తుకెళ్లారు. కొన్నింటిని ధ్వంసం చేశారు. అయితే, వీరిని కుటుంబ సభ్యులు కార్లో వెంబడించడంతోపాటు పోలీసులు కూడా వెంటపడి అదుపులోకి తీసుకున్నారు. -
అచ్చం బిల్లా సినిమాలో చేసినట్లే దాడి
రియో డిజనిరో: అచ్చం సినిమాలోలాగే.. బిల్లా సినిమా చూశారుగా.. అందులో గాయాలపాలయి పోలీసుల అదుపులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ డాన్(ప్రభాస్)ను తీసుకొచ్చేందుకు అనుష్క బృందం ఓ ఆస్పత్రిపై దాడికి దిగి అతడిని విడిపించుకునే తీరుగా బ్రెజిల్ రాజధాని రియో డిజనిరోలోని ఓ ఆస్పత్రిపై కొంతమంది సాయుధులు దాడికి దిగారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్తుపదార్థాల చేరవేత దారుడిని విడిపించేందుకు పోలీసులతో తలపడ్డారు. ఈ క్రమంలో ఓ రోగి ప్రాణాలుకోల్పోగా మరొకరు గాయపడ్డారు. ఎట్టకేలకు తమ వాడిని ఆ సాయుధులు విడిపించుకుని వెళ్లారు. రియోడిజనిరోలో సౌజా అగ్విర్ అనే ఆస్ప్రత్రిలో ఓ డ్రగ్స్ రవాణా దారు బుల్లెట్ గాయంతో చికిత్స పొందుతున్నాడు. అతడు ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడికి చెందిన ఓ 20మంది ముఠా ఆయుధాలతో దిగారు. బయట పదిహేనుమంది కాపలా ఉండగా మరో ఐదుగురు ఆస్పత్రిలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒకరు చనిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే త్వరలో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్‌లో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు ఈ ఆస్పత్రిని కూడా ఎంపిక చేశారు. అలాంటి ఆస్పత్రిపై సాయుధులు దాడి చేయడాన్ని, ఆ దాడిని పోలీసులు కనిపెట్టలేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.