ఐసీయూకు వెళ్లి వైద్యుడికి తుపాకి గురిపెట్టి.. | Gang Points Gun At Doctor, Demands Immediate Treatment For Friend | Sakshi
Sakshi News home page

ఐసీయూకు వెళ్లి వైద్యుడికి తుపాకి గురిపెట్టి..

Published Sun, Oct 1 2017 5:20 PM | Last Updated on Sun, Oct 1 2017 5:21 PM

 Gang Points Gun At Doctor, Demands Immediate Treatment For Friend

ఆస్పత్రిలోకి చొరబడి గొడవ చేస్తున్న సాయుధులు (సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యం)

పశ్చిమ బెంగాల్‌ : పశ్చిమ బెంగాల్‌లో సాయుధులుగా వచ్చిన కొంతమంది వ్యక్తులు ఆస్పత్రిలోకి వెళ్లి గందరగోళం సృష్టించారు. తమలో గాయమైన ఓ వ్యక్తికి ఉన్నపలంగా వైద్యం చేయాలంటూ విధుల్లో ఉన్న వైద్యుడికి తుపాకీ ఎక్కుపెట్టారు. ప్రశ్నించబోయిన స్టాఫ్‌పై చేయి చేసుకున్నారు. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఈ మొత్తం దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఇందులో రికార్డయిన ప్రకారం బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాలో శ్రీరామ్‌పూర్‌లోగల పారామౌంట్‌ నర్సింగ్‌హోమ్‌కు ఆరు నుంచి ఏడుగురు సాయుధులు ఉదయం 6.30గంటలకు లోపలికి చొరబడ్డారు. వారిలో కొంతమంది బనియన్లతోనే వచ్చారు. వారిలో ఓ వ్యక్తికి గాయాలు అవగా అతడిని లోపలికి ఎత్తుకొచ్చి హల్‌చల్‌ చేశారు. నేరుగా ఐసీయూ వద్దకు వెళ్లి వైద్యుడిని బెదిరించి వైద్యం చేయమన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement