కుక్కలను పెంచుకోవడం చాలామందికి సరదా అయినా, కాలాలకు అనుగుణంగా వాటి సంరక్షణను చూసుకోవడం మాత్రం సమస్యగానే ఉంటుంది. వేసవి తాకిడికి మనుషులే అల్లాడిపోతారు. ఇక వేసవిలో శునకాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వేసవిలో మనుషులకైతే ఏసీలు ఉన్నాయి గాని, పాపం పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటి? వాటికి మాత్రం ఏసీ సౌకర్యం ఉండొద్దా అనే ఆలోచనతో కొరియన్ డిజైనర్ స్యూంగ్‌మెన్ లీ ‘ఇగ్లూ’ తరహాలో పెంపుడు కుక్కల కోసం హైటెక్ ఏసీ ఇంటికి రూపకల్పన చేసింది. ఇది పూర్తిగా శునకాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. విశ్రాంతి సమయంలో ఇందులోకి వెళ్లేలా పెంపుడు శునకాలకు అలవాటు చేస్తే చాలు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.
దీని ప్రవేశమార్గంలోని సెన్సర్లు శునకం లోపలకు ప్రవేశిస్తుండటాన్ని గుర్తించి, వెంటనే ఇందులోని ఏసీ పనిచేసేలా చేస్తాయి. శునకం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా చల్లదనం కలిగిస్తాయి. బయట వేసవి తాపం ఎంతలా ఉన్నా, ఇందులో శునకాలు చల్లగా సేదదీరవచ్చు. దీని ధర 160 డాలర్లు (రూ.13,221) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment